'కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్కు అనుమతి కోరాం'
న్యూఢిల్లీ: తెలంగాణలోని కొత్తగూడెంలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేసేందుకు అనుమతి మంజూరు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజును కలసి విజ్ఞప్తి చేసినట్లు ఆ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్రావు వెల్లడించారు. మంగళవారం న్యూఢిల్లీలో అశోక్ గజపతి రాజును టి.హరీష్ రావు కలిశారు. అనంతరం హరీష్ రావు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... త్వరలో సీఎం కేసీఆర్, అశోక్గజపతి రాజుతో అత్యున్నత స్థాయి సమావేశం ఉంటుందని చెప్పారు.
కల్వకుర్తి, కొమురం భీం, ప్రాణహితకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి జవదేకర్ను కలసి కోరినట్లు తెలిపారు. నదుల అనుసంధానంపై కేంద్ర జలవనరుల శాఖ సమావేశానికి హాజరువుతున్నట్లు చెప్పారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలకు సంబంధించి ఏర్పడిన వివాదాలను కేంద్ర మంత్రి ఉమాభారతి దృష్టికి తీసుకువెళ్తామని హరీష్రావు పేర్కొన్నారు.