సాక్షి, గుంటూరు: తెలంగాణ మంత్రి హరీష్ రావుకు మంత్రి జోగి రమేష్ కీలక సూచన చేశారు. అలాగే, నారా లోకేష్ మాటలకు త్వరలోనే ప్రజలు సమాధానం చెప్తారు. ప్రభుత్వం మంచి చేస్తుంటే చంద్రబాబు అండ్ కో అడ్డుపడుతున్నారు అంటూ కామెంట్స్ చేశారు.
కాగా, మంత్రి జోగి రమేష్.. బుధవారం గుంటూరు కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ పథకం సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. మేము అధికారంలోకి రాగానే 30లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. వారికి శాశ్వతంగా ఇల్లు నిర్మిస్తున్నాం. ఇళ్ల నిర్మాణాలతోపాటుగా మౌలిక వసతులు కూడా కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం మంచి చేస్తుంటే చంద్రబాబు అడ్డుపడుతున్నారు. ఇళ్ల స్థలాల పంపిణీపై కోర్టులకు వెళ్తున్నారు. సెల్ఫీలు దిగుతూ.. అవి వారు నిర్మించినవే అంటూ కలరింగ్ ఇస్తున్నారు. 175 నియోజకవర్గాలలో అభ్యర్థులను చంద్రబాబు నిలబెట్టగలరా? అని ప్రశ్నించారు.
ఇదే సమయంలో తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏపీకి వస్తే అభివృద్ధి కనపడుతుందన్నారు. లోకేష్ మాటలకు ప్రజలు త్వరలోనే సమాధాని చెబుతారు. ప్రజల దెబ్బకు 23 సీట్లతో చంద్రబాబు గూబ గుబేలు అయ్యింది. లోకేష్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment