
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అంధ్రప్రదేశ్-అమరావతి ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు నీలకంఠారెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా సీఎం జగన్ ఆదేశిస్తే ఎక్కడికైనా వెళ్లి విధులు నిర్వర్తించేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నీలకంఠారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏసీబీ అధికారులకు భయపడి ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులపై దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ నేతలు బాధ్యతగా మాట్లాడాలని, ఇలా కించపరిచే వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అదేవిధంగా సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు నీలకంఠారెడ్డి మరోసారి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment