హైదరాబాద్:పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి వారంలోగా టెండర్లు ఖరారు చేస్తానమి ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమ స్పష్టం చేశారు. రూ.1300 కోట్లతో ప్రాజెక్టును పూర్తిచేసి ఎనిమిదివేల క్యూసెక్కుల గోదావరి జలాలను కృష్ణానదిలో కలుపుతామన్నారు. దీనివల్ల కృష్ణా డెల్టా, రాయలసీమ ప్రాంతాలకు మేలు జరుగుతుందని ఉమ తెలిపారు.
12 అడుగుల మట్టం వరకూ మాత్రమే నీటిని నిల్వ చేస్తామని.. 50 టీఎంసీల నీటిని ఒకేసారి నిల్వచేయమని తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తామని ఉమ పేర్కొన్నారు.