మాజీ మంత్రి దేవినేని ఉమాకు షాక్ | Shock To Former Minister Devineni Uma In Gollapudi | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి దేవినేని ఉమాకు షాక్

Mar 28 2021 8:00 PM | Updated on Mar 28 2021 8:13 PM

Shock To Former Minister Devineni Uma In Gollapudi - Sakshi

గొల్లపూడిలో టీడీపీ కోట  బీటలు వారుతుంది. టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. సీఎం పోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి రామ్మోహనరావు చేరారు. టీడీపీ కార్యకర్తలు, మండలస్థాయి నేతలు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు

సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమాకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. గొల్లపూడిలో టీడీపీ కోట  బీటలు వారుతుంది. టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. సీఎం పోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి రామ్మోహనరావు చేరారు. టీడీపీ కార్యకర్తలు, మండలస్థాయి నేతలు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు.

వారికి సీఎం పోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మేరుగ నాగార్జున, ఎంపీ నందిగామ సురేష్‌లు పార్డీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే వైఎస్సార్‌సీపీలోకి ఆరుగురు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు, జడ్పీటీసీ అభ్యర్థి చేరారు. తాజాగా ఉమా అనుచరుడు, టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కోమటి రామ్మోహనరావు వైఎస్ఆర్‌సీపీలోకి చేరారు. వైఎస్సార్‌సీపీలోకి టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు వరుస చేరికలతో గొల్లపూడిలో టీడీపీ  జవసత్వాలు కోల్పోతుంది.
చదవండి:
నమ్మించి నట్టేట ముంచారు.. టీడీపీ ఎమ్మెల్యేపై గుస్సా
ఏపీ: బడ్జెట్ ఆర్డినెన్స్‌ను ఆమోదించిన గవర్నర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement