'వెన్నుపోటుదారుడు' పేటెంట్‌ చంద్రబాబుకే | Minister Kodali Nani Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

'వెన్నుపోటుదారుడు' పేటెంట్‌ చంద్రబాబుకే

Published Mon, Jan 18 2021 5:06 PM | Last Updated on Mon, Jan 18 2021 5:53 PM

Minister Kodali Nani Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ: లక్షలాది మంది పేదింటి కలలను సీఎం వైఎస్‌ జగన్‌ నిజం చేశారని మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా గొల్లపూడిలో మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఎవరూ ఊహించనంతగా సీఎం జగన్‌ అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట నిలబట్టుకోవడానికే సీఎం జగన్‌ పరితపిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం​ ఇచ్చే పట్టా అమ్ముకోకూడదని కోర్టులకు వెళ్లి 25 కోట్లు ఖర్చుపెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ధ్వజమెత్తారు. సొల్లు ఉమ, చంద్రబాబు కలిసి కోడిగుడ్డుకు ఈకలు పీకే పని మొదలెట్టారని అన్నారు. ప్రజలను వంచించడానికి చంద్రబాబు కులాలు, మతాల పేరుతో రెచ్చగొడుతున్నారని ఫైర్‌ అయ్యారు. (ఆనాడు బాబు మంగమ్మ శపథం చేశారు)

సొల్లు ఉమ, చంద్రబాబు కలిసి కోడిగుడ్డుకు ఈకలు పీకే పని మొదలెట్టారని అన్నారు. ప్రజలను వంచించడానికి చంద్రబాబు కులాలు, మతాల పేరుతో రెచ్చగొడుతున్నారని ఫైర్‌ అయ్యారు. రాష్ట్రంలో జేబుదోంగ, వెన్నుపోటుదారుడు అనే పదాలకు పేటెంట్ హక్కు ఉన్నది చంద్రబాబుకే అని, ఆయన మరణానికి కారకులైన దుర్మర్గుడే చంద్రబాబు అని కొడాలి నాని అన్నారు. 'వదినని చంపి శాసనసభ్యుడైన వ్యక్తి ఉమ అని తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అన్నారు. ఒక నిరుపేదకు కూడా పట్టా ఇవ్వలేని దౌర్భాగ్యం దేవినేనిది. చంద్రబాబు బూటు నాకే వ్యక్తి ఆయన. మీడియా ముందు పోసుకోలు కబుర్లు చెప్పే దేవినేని..ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే.. బడితపూజ చేస్తాం' అని కొడాలి నాని పేర్కొన్నారు. (ఎన్టీఆర్‌పై ఆ ఐదుగురి కుట్ర:  సాక్ష్యం ఇదే! )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement