house document distribution
-
'వెన్నుపోటుదారుడు' పేటెంట్ చంద్రబాబుకే
సాక్షి, విజయవాడ: లక్షలాది మంది పేదింటి కలలను సీఎం వైఎస్ జగన్ నిజం చేశారని మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా గొల్లపూడిలో మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఎవరూ ఊహించనంతగా సీఎం జగన్ అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట నిలబట్టుకోవడానికే సీఎం జగన్ పరితపిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే పట్టా అమ్ముకోకూడదని కోర్టులకు వెళ్లి 25 కోట్లు ఖర్చుపెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ధ్వజమెత్తారు. సొల్లు ఉమ, చంద్రబాబు కలిసి కోడిగుడ్డుకు ఈకలు పీకే పని మొదలెట్టారని అన్నారు. ప్రజలను వంచించడానికి చంద్రబాబు కులాలు, మతాల పేరుతో రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. (ఆనాడు బాబు మంగమ్మ శపథం చేశారు) సొల్లు ఉమ, చంద్రబాబు కలిసి కోడిగుడ్డుకు ఈకలు పీకే పని మొదలెట్టారని అన్నారు. ప్రజలను వంచించడానికి చంద్రబాబు కులాలు, మతాల పేరుతో రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో జేబుదోంగ, వెన్నుపోటుదారుడు అనే పదాలకు పేటెంట్ హక్కు ఉన్నది చంద్రబాబుకే అని, ఆయన మరణానికి కారకులైన దుర్మర్గుడే చంద్రబాబు అని కొడాలి నాని అన్నారు. 'వదినని చంపి శాసనసభ్యుడైన వ్యక్తి ఉమ అని తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అన్నారు. ఒక నిరుపేదకు కూడా పట్టా ఇవ్వలేని దౌర్భాగ్యం దేవినేనిది. చంద్రబాబు బూటు నాకే వ్యక్తి ఆయన. మీడియా ముందు పోసుకోలు కబుర్లు చెప్పే దేవినేని..ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే.. బడితపూజ చేస్తాం' అని కొడాలి నాని పేర్కొన్నారు. (ఎన్టీఆర్‌పై ఆ ఐదుగురి కుట్ర: సాక్ష్యం ఇదే! ) -
నిర్విఘ్నంగా పట్టాల పంపిణీ
సాక్షి నెట్వర్క్: పేదలకు విలువైన స్థిరాస్తిని ఇచ్చే మహాయజ్ఞాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించినప్పటి నుంచి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా 24వ రోజైన ఆదివారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కోలాహలంగా సాగింది. విశాలమైన లే–అవుట్లు, ఆహ్లాదకరమైన పరిసరాల మధ్య ఉన్న తమ ప్లాట్లను చూసి మహిళలు మురిసిపోతున్నారు. సొంతింటి కల సాకారం అవుతోందన్న ఆనందం అక్కచెల్లెమ్మల మోముల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. విశాఖ జిల్లాలో ఆదివారం ఒక్కరోజే 2,044 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో 1,551 మందికి ఇంటి పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. జిల్లాలో ఇప్పటివరకు 81,804 మంది లబ్ధిదారులు ఇంటిపట్టాలు అందుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం 1,813 మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ మార్గాని భరత్‌రామ్, ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 1,822 మందికి పట్టాలిచ్చారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం మేకవానిపాలెంలో 194 మందికి, తాళ్లపాలెంలో 417 మందికి రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పట్టాలు అందించారు. గుంటూరు జిల్లాలో 1,756 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నంబూరు శంకరరావు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఆదివారం ఒక్కరోజే 2,150 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.24 రోజుల్లో మొత్తం 65,510 మంది ఇంటి స్థలాలు పొందారు. 4,252 టిడ్కో ఇంటి పత్రాలు అందుకున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆదివారం 2,249 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఇళ్ల పట్టాల పంపిణీ గొప్ప యఙ్ఞం
-
వైఎస్ జయంతి రోజున ఇళ్ల పట్టాల పంపిణీ
పులివెందుల రూరల్/టౌన్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి జూలైన 8న అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నట్లు మున్సిపల్ కమషనర్ నరసింహారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం వారు విలేకరులతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలను మంజూరు చేయాలని ఆదేశించారన్నారు. అర్హుల జాబితాను సచివాలయాల్లో పెట్టామన్నారు. అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని వారు ఈ నెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. లాక్డౌన్ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించేలా దుకాణణాలు, షాపులకు నంబర్లు ఇవ్వనున్నామని.. ఆ ప్రకారం వాటిని తెరుచుకోచ్చన్నారు. ముఖ్యంగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించి సరుకులు కొనుగోలు చేస్తే రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అలాగే జగనన్న చేదోడు, వాహనమిత్ర పథకాలకు ఈనెల 24 నుంచి 26 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
ఇళ్ల పట్టాల పంపిణీ 14కు వాయిదా
సాక్షి, అమరావతి: పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14వ తేదీ అంబేడ్కర్ జయంతి రోజుకు వాయిదా వేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు చేపడుతున్నందున ఉగాది రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం లేదన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా ఇళ్ల స్థలాల పట్టాలు, ప్లాట్ల అభివృద్ధికి సంబంధించి కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. కరోనా వైరస్‌ను నియంత్రించడంలో భాగంగా లబ్ధిదారులు అందరికీ ఒకేసారి కాకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, జాగ్రత్తలు తీసుకుని వారికి స్థలాలను చూపించాలని ఆదేశించారు. పేదలకు మేలు చేస్తుంటే రాజకీయమా! - సుమారు 27 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తూ.. వారి కుటుంబాల్లో మార్పులు తీసుకు వస్తుంటే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి వారు మనుషులే కాదనిపిస్తోంది. - పేదలకు మంచి జరగకూడదనే ఒకే ఒక్క ఉద్దేశంతో కేసులు వేసి అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించాలి. - పేదలకు ఇస్తున్న ప్లాట్లు, వాటిని అభివృద్ధి చేసిన తీరును సవివరంగా తెలియజెప్పాలి. - ప్లాట్లను ముందుగానే అలాట్ చేస్తూ లాటరీ ప్రక్రియ పూర్తి చేయాలి. - వారి వారి ప్లాట్ల వద్ద లబ్ధిదారులను నిలుచోబెట్టి ఫొటో తీయాలి. జియో ట్యాగింగ్ చేయాలి. - నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ప్రతి నిరుపేదకు ఇంటి స్థలం కేటాయించాలి. - గత సమీక్షతో పోలిస్తే.. ఇళ్ల పట్టాల విషయంలో ఈసారి మంచి ప్రగతి కనిపిస్తోంది. -
ఏప్రిల్ 14న ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ
సాక్షి, తాడేపల్లి: పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీఎస్ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. జిల్లాల వారీగా ఇళ్ల పట్టాలు, ప్లాట్ల అభివృద్ధిపై సీఎం సమీక్షించారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్ నివారణకు చర్యలు చేపడుతున్నందున ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు సీఎం వివరించారు. లబ్ధిదారులు అందరికీ ఒకేసారి కాకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ జాగ్రత్తలు తీసుకొని వారికి ఇళ్ల సైట్లను చూపించాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. ఉగాది రోజున ఇళ్లపట్టాలను పంపిణీ చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నా, కరోనా వైరస్ ప్రమాదం నివారణ చర్యల్లో భాగంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. చదవండి: భయాన్ని కాదు.. ధైర్యాన్ని నింపండి -
ఉగాది రోజున ఇళ్ల పట్టాల పంపిణీ
విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయతలపెట్టిన ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని విజయనగరం నియోజకవర్గంలో ఈ నెల 25న ఉగాది రోజునే చేయనున్నట్టు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. బుధవారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉగాది రోజు ఇళ్ల పట్టాలు పంపిణీ జరగదని భావించినప్పటికీ ఎన్నికలు వాయిదా నేపథ్యంలో సుప్రీం కోర్టు కోడ్ అమలును ఎత్తివేయాలంటూ తీర్పునివ్వటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్ ఎత్తివేయటంతో రాష్ట్రంలో జిల్లాలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలకు అవకాశం ఉంటుందన్నారు. మరల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తమకు అభ్యంతరం లేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు మిన్నగా అధిక స్థానాలు కైవసం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మాదిరిలా కాకుండా లంచగొండితనానికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. నియోజకవర్గంలో రేపటి నుంచి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. నగరంలో మంచి నీటి కొరత లేకుండా చర్యలు చేపట్టామని పలు ప్రాంతాల్లో వేధిస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. కుటిల రాజకీయాలకు కేరాఫ్ చంద్రబాబు కుటిల రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా ప్రతిపక్ష నేత చంద్రబాబు నిలుస్తారని ఎమ్మెల్యే కోలగట్ల ధ్వజమెత్తారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎప్పుడు వెన్నుపోట్లు పొడవటం, ప్రజలను మోసగించే ధోరణిలో నడుచుకుంటారన్నారు. ప్రజల ఆమోదంతో ఏనాడూ గెలిచిన సందర్భాలు లేవన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలతో జత కట్టి ఎన్నికల్లో పని చేసిన చంద్రబాబు తీరును చూసి సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఆ పార్టీ అధినేతపై విశ్వాసం కోల్పోయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. రానున్న కాలంలో టీడీపీకి పుట్టగతులుండవన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ప్రస్తుతం జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను తన వ్యక్తిగత పరిచయాలు, సామాజిక వర్గాల పరిచయాలను అడ్డం పెట్టుకుని వాయిదా వేయించటం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తాయన్నారు. చంద్రబాబు తన దుర్నీతితో ఎన్నికలు వాయిదా వేయించాగలిగారే తప్పా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోలేరన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై పూర్తి విశ్వాసంతో ఉన్న ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ నడిపేన శ్రీనివాసరావు, వైస్‌చైర్మన్ రెడ్డి గురుమూర్తి, వైఎస్సార్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి కోలగట్ల తమ్మన్నశెట్టి, సీనియర్ సిటిజన్ విభాగం నాయకులు కోలగట్ల కృష్ణారావు, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, సీనియర్ మాజీ కౌన్సిలర్ ఎస్‌వివి.రాజేష్, నగర యువజన విభాగం అధ్యక్షుడు అల్లు చాణక్య, పార్టీ నాయకులు డాక్టర్ విఎస్.ప్రసాద్, కనకల ప్రసాదరావు, మామిడి అప్పలనాయుడు, సత్తరపు శంకరరావు, జివి.రంగారావు, పిన్నింటి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటింటినీ జల్లెడ పడుతున్న 35 బృందాలు
రైల్వే కోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండలం కొత్తకోడూరులో పేదలకు ఇళ్ల పట్టాల కేటాయింపుల్లో అవినీతి ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు 35 బృందాలు మంగళవారం సర్వే చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాల పంపిణీ జరగ్గా.. అనర్హులు కూడా వాటిని దక్కించుకున్నట్టు ఆరోపణలు రావడంతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రకాశ్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తూ జిల్లా కలెక్టర్ రమణ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రకాశ్ ఆధ్వర్యంలో 35 బృందాలు మంగళవారం కొత్తకోడూరులో ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారుల వద్దకు వెళ్లి రేషన్, ఆధార్ కార్డు తదితర వివరాలతో వారి అర్హతను పరిశీలిస్తున్నారు. అనంతరం కలెక్టర్‌కు నివేదిక ఇస్తారు.