ఇంటింటినీ జల్లెడ పడుతున్న 35 బృందాలు | 35 teams survey on house document distribution | Sakshi
Sakshi News home page

ఇంటింటినీ జల్లెడ పడుతున్న 35 బృందాలు

Published Tue, Apr 21 2015 8:23 AM | Last Updated on Sun, Sep 3 2017 12:38 AM

35 teams survey on house document distribution

రైల్వే కోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండలం కొత్తకోడూరులో పేదలకు ఇళ్ల పట్టాల కేటాయింపుల్లో అవినీతి ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు 35 బృందాలు మంగళవారం సర్వే చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాల పంపిణీ జరగ్గా..  అనర్హులు కూడా వాటిని దక్కించుకున్నట్టు ఆరోపణలు రావడంతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రకాశ్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తూ జిల్లా కలెక్టర్ రమణ ఆదేశాలు జారీ చేశారు.


దీంతో ప్రకాశ్ ఆధ్వర్యంలో 35 బృందాలు మంగళవారం కొత్తకోడూరులో ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారుల వద్దకు వెళ్లి రేషన్, ఆధార్ కార్డు తదితర వివరాలతో వారి అర్హతను పరిశీలిస్తున్నారు. అనంతరం కలెక్టర్‌కు నివేదిక ఇస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement