
మాట్లాడుతున్న కమిషనర్ నరసింహారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు
పులివెందుల రూరల్/టౌన్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి జూలైన 8న అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నట్లు మున్సిపల్ కమషనర్ నరసింహారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం వారు విలేకరులతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలను మంజూరు చేయాలని ఆదేశించారన్నారు. అర్హుల జాబితాను సచివాలయాల్లో పెట్టామన్నారు. అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని వారు ఈ నెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించేలా దుకాణణాలు, షాపులకు నంబర్లు ఇవ్వనున్నామని.. ఆ ప్రకారం వాటిని తెరుచుకోచ్చన్నారు. ముఖ్యంగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించి సరుకులు కొనుగోలు చేస్తే రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అలాగే జగనన్న చేదోడు, వాహనమిత్ర పథకాలకు ఈనెల 24 నుంచి 26 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.