
వైఎస్ విజయమ్మ, షర్మిలను గజమాలతో సత్కరిస్తున్న అభిమానులు
ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించడంతోపాటు ప్రత్యేక ప్రార్థనల్లో వీరు పాల్గొంటారు. వీరికి జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కడప నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి సాదర స్వాగతం పలికారు.
సాక్షి, కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని గురువారం కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిలకు ఘన స్వాగతం లభించింది. శుక్రవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించడంతోపాటు ప్రత్యేక ప్రార్థనల్లో వీరు పాల్గొంటారు. వీరికి జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కడప నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి సాదర స్వాగతం పలికారు. కొంత మంది అభిమానులు వారితో సెల్ఫీలు దిగారు. అనంతరం గజమాలతో సత్కరించారు. తరువాత వారు రోడ్డు మార్గాన ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు.
ఇడుపులపాయకు చేరుకున్న వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు
వేంపల్లె : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లెలు షర్మిల సాయంత్రం ఇడుపులపాయకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇడుపులపాయ ఎస్టేట్ ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
చదవండి: (వైఎస్సార్‌సీపీ శ్రేణులకు సీఎం జగన్ ఆప్యాయ పలకరింపు)