
సాక్షి, పులివెందుల: పులివెందులను రూ.630 కోట్లతో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులలోని మోడల్ టౌన్, వాటర్ గ్రిడ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్రికెట్ స్టేడియం పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పులివెందులను రూ.630 కోట్లతో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతున్నామని, రోడ్లు, తాగునీరు, డ్రైనేజ్ కోసం రూ.154 కోట్లు కేటాయించామని తెలిపారు. పులివెందుల రోడ్డును ఫోర్‌లైన్ రోడ్డుగా మారుస్తున్నామని, రూ.30 కోట్లతో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. రూ.500 కోట్లతో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ చేరుకొని మహానేత వైఎస్ఆర్‌కు సీఎం జగన్ నివాళులర్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment