ఈరోజు.. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాల రూపురేఖలు సమూలంగా మారాయి.
ఏ గ్రామంలో చూసినా సచివాలయం కనిపిస్తోంది.
ఏ గ్రామానికి వెళ్లినా కూడా 50 మందికి ఒక వాలంటీర్ కనిపిస్తాడు.
మరో నాలుగు అడుగులు వేస్తే నాడు నేడుతో రూపురేఖలు మారిపోయిన ఇంగ్లీష్ మీడియం బడులు కనిపిస్తున్నాయి..
ఇంకో నాలుగు అడులేస్తే.. విలేజ్ క్లినిక్ కనిపిస్తోంది..
ఆ విలేజ్ క్లినిక్‌లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఆధారంగా అన్ని రకాల జబ్బులకు వైద్యం అందించే డాక్టర్ కనిపిస్తున్నాడు..
దేశానికి రైతన్న వెన్నెముక అయితే.. ఆ రైతన్న చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న ఆర్బీకే వ్యవస్థకు పల్లెలే కేంద్రాలయ్యాయి
జగనన్న ప్రభుత్వం వేసే ప్రతీ అడుగుతోనూ పల్లె మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
నాడు జాతిపిత మహాత్మా గాంధీ.. మొన్న తండ్రి వైఎస్సార్ కలగంది.. నేడు జగనన్న సాధించిన గ్రామ స్వరాజ్యం ఇది!
‘‘గ్రామాలు అన్నింటా గణతంత్రంగా వ్యవహరించగలగాలి. సొంత అవసరాలకోసం ఇతరులపై ఆధారపడకూడదు. స్వావలంబన సాధించాలి. గ్రామాలు బావుంటేనే దేశం బాగుంటుంది’.. మహాత్ముడు చెప్పిన మాటల్ని ఆ మహానేత కలగన్నాడు. కానీ, అది పూర్తిస్థాయిలో జరగలేదు. అయితే ఆ గ్రామ స్వరాజ్యం ఇప్పుడు.. తన బిడ్డ పాలనలో కనిపిస్తోంది. అందుకే ఆ దివంగత నేత మురిసిపోతున్నారు!.
పల్లెలు దేశానికి పట్టుకోమ్మలు. గ్రామాలు బాగుంటేనే ఆ రాష్ట్రం.. దేశం బాగుంటాయి. అందుకే పల్లె ప్రగతి ప్రధానంగా ప్రతీ అడుగు వేయాలని మహానేత తలిచారు. గ్రామాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగారు. కానీ, గ్రామాల రూపురేఖల్ని సమూలంగా మార్చేయడం మాత్రం ఆ మహానేత బిడ్డ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనే సాధ్యమయ్యింది.
జులై 8వ తేదీన వైఎస్సార్ జయంతి. కానీ, అంతకంటే ముందుగానే అభిమానుల కోలాహలం నెట్టింట కనిపిస్తోంది. ఈ క్రమంలో ‘‘నేను కన్నకల.. నా బిడ్డ పాలనలో నెరవేరిన వేళ’’.. అంటూ దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరిట ఆ ఫొటో వైరల్ అవుతోంది.
పల్లె ప్రగతిని కోరుకున్న వైఎస్సార్‌కు గౌరవ సూచీగా.. ఆయన జయంతిని ‘గ్రామీణ స్వరాజ్య దినోత్సవం’గా ప్రకటిస్తే బాగుంటుంది కదా అంటూ కొందరు అభిమానులు ఏపీ ప్రభుత్వాన్ని కోరుతుండడం గమనార్హం.
అధికారంలోకి రాగానే గ్రామ స్థాయిలో సచివాలయం ఏర్పాటుకు చేస్తాను-వైఎస్ జగన్ #YSR8thVardanthi #YSRKutumbam
— YSR Congress Party (@YSRCParty) September 2, 2017
సీఎం వైఎస్ జగన్.. చెప్పాడంటే చేస్తాడంతే..
మాట ఇస్తే మడమ తప్పని నైజం.. పేరుతో పలకరింపు.. అన్నదాతల కోసం తాపత్రయం.. జనసంక్షేమమే ధ్యేయం.. ప్రాంతాలకతీతంగా అభివృద్ధి చెందాలనే తలంపు.. సాగునీటితోనే సమాగ్రాభివృద్ధి అనే ప్రగాఢ విశ్వాసం. ఇవన్నీ కలగలిపిన రూపం దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి. ఆయన గుణాలు పుణికిపుచ్చుకున్న బిడ్డ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇప్పుడు జనానికి పెద్ద బిడ్డ అయ్యాడు. జగనన్న సంక్షేమ పాలనలో ఆ మహానేత.. జనం చిరునవ్వు రూపంలో ఇంకా మనమధ్యే ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment