village development
-
గ్రామాలు కళకళలాడుతున్నాకంటగింపేనా?
సాక్షి, అమరావతి: ‘గ్రామ సీమలే దేశానికి పట్టుగొమ్మలు’ అన్న మహాత్మాగాంధీ సూక్తిని ఆచరణలో పెడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. ప్రజల ఇంటి ముంగిటకే ప్రభుత్వ సేవలన్నింటినీ తీసుకెళ్లారు. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో భారీ ఎత్తున గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీ భవనాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో ఇవి అందుబాటులోకి వచ్చాయి. ప్రజలకు విస్తృత సేవలందిస్తున్నాయి. మరికొన్ని నిర్మాణాలు తుది దశలో ఉన్నాయి. అయితే ప్రతి అంశంలోనూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈనాడు పత్రిక మరో అసత్య కథనానికి తెగబడింది. శుక్రవారం తన ప్రధాన సంచికలో ‘ఆరంభ శూరత్వం.. ఆపై అలసత్వం!’ అంటూ విషం చిమ్మింది. ఈ కథనానికి సంబంధించి అసలు వాస్తవాలివీ.. ఊరూరా గ్రామ సచివాలయాల నిర్మాణం.. రాష్ట్ర ప్రభుత్వం ఏటా వివిధ సంక్షేమ పథకాల రూపంలో లక్షల కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తోంది. ఇందులో ఎలాంటి వివక్ష, పక్షపాతం లేకుండా గ్రామ సచివాలయాల ద్వారా అర్హుల జాబితాను సిద్ధం చేయిస్తోంది. ఇందుకోసం దాదాపు ప్రతి గ్రామంలోనూ సచివాలయాలను నిర్మిస్తోంది. మొత్తం 10,893 గ్రామ సచివాలయాల భవనాలను మంజూరు చేసి.. ఇప్పటికే 6,800 భవనాలను పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కూడా చేసింది. మరో 2,784 పూర్తయ్యే దశలో ఉన్నాయి. అలాగే రైతులకు వారి స్వగ్రామాల్లోనే విత్తు నుంచి విక్రయం వరకు సేవలందజేయడానికి రైతు భరోసా కేంద్రాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 5,252 రైతు భరోసా కేంద్రాల భవనాలను ప్రారంభించింది. మరో 2,182 భవనాలు నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నాయి. అదేవిధంగా కుగ్రామాల్లో వైద్య సేవలను అందించడానికి ఇప్పటికే 3,017 విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణాలు పూర్తి చేసి వాటిని ప్రారంభించింది. మరో 2,395 నిర్మాణాలు పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఇవన్నీ పచ్చ పత్రిక ఈనాడుకు, దాని అధినేత రామోజీరావు కళ్లకు కనిపించడం లేదు. అందుకే యథేచ్ఛగా ప్రభుత్వంపై ఇష్టానుసారం విషం కక్కారు. చంద్రబాబు కనీస ఆలోచన అయినా చేశారా రామోజీ? వైఎస్ జగన్ ప్రభుత్వం ఒక్కోటి రూ.43.60 లక్షల చొప్పున ప్రతి ఊరిలో గ్రామ సచివాలయాలు నిర్మిస్తోంది. గత చంద్రబాబు ప్రభుత్వం సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీలు.. ఇలా ఏ ఒక్కదాని గురించి కనీస ఆలోచన కూడా చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.11,000 కోట్లతో నాడు– నేడు కింద పాఠశాలలను అభివృద్ధి చేస్తే ఇది ఈనాడు పత్రికకు అభివృద్ధిలా కనిపించలేదు. గత చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ.107 కోట్లతో పాఠశాలల చుట్టూ 98.98 కి.మీ మేర ప్రహరీ గోడలు కట్టారని తన కథనంలో మురిసిపోయింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.612 కోట్లతో 189 కిలోమీటర్లు పొడవునా ప్రహరీ గోడలు నిర్మించింది. అయినా సరే ఈనాడుకు ఇదంతా అభివృద్ధిలా కనిపిస్తే ఒట్టు! ఈనాడు ఆరోపణ: 36,749 కొత్త భవనాలకు ఆగమేఘాలపై అనుమతులిచ్చారు. 14,956 మాత్రమే పూర్తి చేశారు. అంటే 50 శాతం కూడ పూర్తి చేయలేకపోయారు. వాస్తవం: ప్రభుత్వం ఈ భవనాలను మంజూరు చేశాక, 2020, 2021ల్లో రెండేళ్లపాటు కరోనాతో ఏ ఒక్క పని పూర్తి స్థాయిలో చేపట్టలేని పరిస్థితి. అయినా, ఇప్పటికే ప్రారంభోత్సవం అయినవి, నిర్మాణం తుది దశలో ఉన్నవి అన్నీ కలిపితే 27,608 భవనాల నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. ఈనాడు ఆరోపణ: నిర్మాణంలో ఉపయోగించే స్టీల్, సిమెంట్ ధరలు పెరిగినా.. పనులు మంజూరు చేసినప్పటి ధరలే ఇప్పటికీ అమలులో ఉన్నాయి. గిట్టుబాటు కాక పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వాస్తవం: ఒక్కో గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి గతంలో రూ.40 లక్షల చొప్పున మంజూరు చేయగా, ఇప్పుడు దాని నిర్మాణ ధరను రూ.43.60 లక్షలకు పెంచారు. అప్పట్లో రూ. 21.80 లక్షల చొప్పున మంజూరు చేసిన ఒక్కో రైతు భరోసా కేంద్రం నిర్మాణాన్ని రూ. 23.94 లక్షలకు ప్రభుత్వం పెంచింది. అలాగే ఒక్కో విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి రూ.17.50 లక్షల చొప్పున కేటాయించగా దాన్ని రూ.20.80 లక్షలకు పెంచారు. -
గ్రామాల అభివృద్ధిని అడ్డుకోబోయి.. బోర్లాపడ్డ విపక్షాలు
సాక్షి, అమరావతి : ఎక్కడైనా ప్రతిపక్షాలు ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తిచూపుతాయి. ఇంకా వీలయితే ప్రజలకు ఏ విధంగా మరింత మంచి చేయవచ్చో సలహాలూ ఇస్తాయి. అంతేకానీ ప్రజలకు జరిగే మేలును, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవు. కానీ, రాష్ట్రంలోని ప్రతిపక్షాల తీరు ఇందుకు పూర్తి భిన్నం. ప్రజల మంచికంటే వారి వ్యక్తిగత ప్రయోజనాలు, అధికారమే పరమావధి. ఇందుకోసం ప్రజలకు అందాల్సిన నిధులను, రాష్ట్ర అభివృద్ధిని కూడా ఏమాత్రం సంకోచం లేకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం ఎక్కడా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కుంటుపడకుండా అత్యంత సమర్ధవంతంగా వ్యవహరిస్తోంది. దీంతో విపక్షాల ఆటలు సాగడంలేదు. ఇదే తీరులో తెలుగుదేశం, జనసేన పార్టీల నేతలు, బీజేపీలోని చంద్రబాబు తాబేదార్లు కేంద్ర నిధులను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నమూ విఫలమైంది. అదీ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకొనేందుకు కుటిల యత్నం చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులను విపక్ష నేతలు అడ్డుకోబోయారు. వీటిని ఆపితే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని, తద్వారా వారి రాజకీయ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లవచ్చన్నది వారి వ్యూహం. పుంఖానుపుంఖాలుగా వారు చేసిన ఫిర్యాదులతో 8 నెలలపాటు గ్రామీణ ప్రాంతాలకు కేంద్రం ఇచ్చే నిధులను ఆపగలిగారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని వివరాలను కేంద్రానికి అందించడంతో ఇప్పుడా నిధులన్నీ మళ్లీ రాష్ట్రానికి వస్తున్నాయి. ఇవీ ఆ నిధులు 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలన్నింటికీ కలిపి కేంద్ర ప్రభుత్వం ఏటా రూ. 2,000 కోట్లకు పైగా నిధులు ఇస్తుంది. కేంద్రం ఈ నిధులను రెండుగా వర్గీకరించింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సిఫారసుల మేరకు 40 శాతం నిధులు బేసిక్ గ్రాంట్‌గా ఇస్తుంది. మరో 60 శాతం కేంద్ర జలశక్తి శాఖ సిఫారులతో టైడ్ గ్రాంట్ పేరుతో విడుదల చేస్తుంది. ఇలా వచ్చిన నిధులను గ్రామ పంచాయతీలకు 70 శాతం, మండల, జిల్లా పరిషత్‌లకు 15 శాతం చొప్పున కేటాయిస్తారు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ల పరిధిలో జనాభా, ఆ ప్రాంత విస్తీర్ణం ప్రాతిపదికన ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామీణ స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేస్తుంది. తప్పుడు ఫిర్యాదులతో.. అయితే, సర్పంచుల సంఘాల ముసుగులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఒకరు, జనసేన నేతల ఆధ్వర్యంలోని వివిధ సంఘాలు రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తోందంటూ మూడేళ్లుగా తప్పుడు ఫిర్యాదులు చేయడమే పనిగా పెట్టుకున్నారు. అన్నింటా చంద్రబాబుకు వంతపాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఇటీవల ఇదే తీరులో కేంద్ర పంచాయతీరాజ్ శాఖకు ఫిర్యాదు చేశారు. దేశంలో చాలా రాష్ట్రాలకు ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత కూడా తర్వాతి ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులను రాష్ట్రాలకు విడుదల చేస్తుంటుంది. అదే విధంగా ఈ ఏడాది మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రూ. 2,010 కోట్లు గ్రామీణ స్థానిక సంస్థల నిధులు విడుదల చేయాల్సి ఉంది. తొలుత మొదటి విడతలో బేసిక్, టైడ్ గ్రాంట్ నిధులు రూ.988 కోట్లను రెండు దఫాలుగా విడుదల చేసింది. అనంతరం దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు ఫిర్యాదులతో గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు విడుదల చేయాల్సిన తదుపరి గ్రాంట్‌ను కేంద్రం 8 నెలల క్రితం తాత్కాలికంగా నిలిపివేసింది. కేంద్రం విచారణ.. నిధుల విడుదలకు అనుమతి పురందేశ్వరి తదితరుల ఫిర్యాదులపై పరిశీలనకు ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ రాష్ట్రంలో ప్రత్యేకంగా పర్యటించారు. విపక్షాల ఫిర్యాదులన్నింటిపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులతో చర్చించి, సమగ్ర వివరణ తీసుకున్నారు. ఆ ఫిర్యాదులన్నీ తప్పు అని తేలాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వడంతో కేంద్రం ఆ నిధుల విడుదలకు అనుమతించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో విడత బేసిక్ గ్రాంట్ రూ. 393.91 కోట్లను రాష్ట్రానికి విడుదల చేసేందుకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సిఫారసు చేసింది. ఈమేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి (అండర్ సెక్రటరీ) కేఎస్ పార్థసారధి రెండు రోజుల క్రితం కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాశారు. ఈ సమాచారాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేసింది. పంచాయతీరాజ్ శాఖ సిఫారసులతో ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయడం లాంఛనమేనని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల బకాయిలు దశలవారీగా రాష్ట్రానికి అందుతాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించి మరో రూ. 2031 కోట్లు కూడా విడుదల చేయాల్సి ఉందన్నారు. అంటే ఈ ఏడాది నిధులతో కలిపి రూ.3 వేల కోట్లకు పైగా విడుదల అవుతాయని అధికారులు చెబుతున్నారు. -
నెట్టింట అభిమానం.. మహానేత మురిసిపోయిన వేళ..
ఈరోజు.. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాల రూపురేఖలు సమూలంగా మారాయి. ఏ గ్రామంలో చూసినా సచివాలయం కనిపిస్తోంది. ఏ గ్రామానికి వెళ్లినా కూడా 50 మందికి ఒక వాలంటీర్ కనిపిస్తాడు. మరో నాలుగు అడుగులు వేస్తే నాడు నేడుతో రూపురేఖలు మారిపోయిన ఇంగ్లీష్ మీడియం బడులు కనిపిస్తున్నాయి.. ఇంకో నాలుగు అడులేస్తే.. విలేజ్ క్లినిక్ కనిపిస్తోంది.. ఆ విలేజ్ క్లినిక్‌లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఆధారంగా అన్ని రకాల జబ్బులకు వైద్యం అందించే డాక్టర్ కనిపిస్తున్నాడు.. దేశానికి రైతన్న వెన్నెముక అయితే.. ఆ రైతన్న చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న ఆర్బీకే వ్యవస్థకు పల్లెలే కేంద్రాలయ్యాయి జగనన్న ప్రభుత్వం వేసే ప్రతీ అడుగుతోనూ పల్లె మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నాడు జాతిపిత మహాత్మా గాంధీ.. మొన్న తండ్రి వైఎస్సార్ కలగంది.. నేడు జగనన్న సాధించిన గ్రామ స్వరాజ్యం ఇది! ‘‘గ్రామాలు అన్నింటా గణతంత్రంగా వ్యవహరించగలగాలి. సొంత అవసరాలకోసం ఇతరులపై ఆధారపడకూడదు. స్వావలంబన సాధించాలి. గ్రామాలు బావుంటేనే దేశం బాగుంటుంది’.. మహాత్ముడు చెప్పిన మాటల్ని ఆ మహానేత కలగన్నాడు. కానీ, అది పూర్తిస్థాయిలో జరగలేదు. అయితే ఆ గ్రామ స్వరాజ్యం ఇప్పుడు.. తన బిడ్డ పాలనలో కనిపిస్తోంది. అందుకే ఆ దివంగత నేత మురిసిపోతున్నారు!. పల్లెలు దేశానికి పట్టుకోమ్మలు. గ్రామాలు బాగుంటేనే ఆ రాష్ట్రం.. దేశం బాగుంటాయి. అందుకే పల్లె ప్రగతి ప్రధానంగా ప్రతీ అడుగు వేయాలని మహానేత తలిచారు. గ్రామాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగారు. కానీ, గ్రామాల రూపురేఖల్ని సమూలంగా మార్చేయడం మాత్రం ఆ మహానేత బిడ్డ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే సాధ్యమయ్యింది. జులై 8వ తేదీన వైఎస్సార్ జయంతి. కానీ, అంతకంటే ముందుగానే అభిమానుల కోలాహలం నెట్టింట కనిపిస్తోంది. ఈ క్రమంలో ‘‘నేను కన్నకల.. నా బిడ్డ పాలనలో నెరవేరిన వేళ’’.. అంటూ దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరిట ఆ ఫొటో వైరల్ అవుతోంది. పల్లె ప్రగతిని కోరుకున్న వైఎస్సార్‌కు గౌరవ సూచీగా.. ఆయన జయంతిని ‘గ్రామీణ స్వరాజ్య దినోత్సవం’గా ప్రకటిస్తే బాగుంటుంది కదా అంటూ కొందరు అభిమానులు ఏపీ ప్రభుత్వాన్ని కోరుతుండడం గమనార్హం. అధికారంలోకి రాగానే గ్రామ స్థాయిలో సచివాలయం ఏర్పాటుకు చేస్తాను-వైఎస్ జగన్ #YSR8thVardanthi #YSRKutumbam — YSR Congress Party (@YSRCParty) September 2, 2017 సీఎం వైఎస్ జగన్.. చెప్పాడంటే చేస్తాడంతే.. మాట ఇస్తే మడమ తప్పని నైజం.. పేరుతో పలకరింపు.. అన్నదాతల కోసం తాపత్రయం.. జనసంక్షేమమే ధ్యేయం.. ప్రాంతాలకతీతంగా అభివృద్ధి చెందాలనే తలంపు.. సాగునీటితోనే సమాగ్రాభివృద్ధి అనే ప్రగాఢ విశ్వాసం. ఇవన్నీ కలగలిపిన రూపం దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి. ఆయన గుణాలు పుణికిపుచ్చుకున్న బిడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇప్పుడు జనానికి పెద్ద బిడ్డ అయ్యాడు. జగనన్న సంక్షేమ పాలనలో ఆ మహానేత.. జనం చిరునవ్వు రూపంలో ఇంకా మనమధ్యే ఉన్నాడు. -
‘గ్రామదర్శిని’ ప్రారంభించిన సీఎం
సాక్షి, మచిలీపట్నం: గ్రామాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామదర్శిని కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం కృష్ణా జిల్లా పెడనలో లాంఛనంగా ప్రారంభించారు. పల్లెల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా గ్రామదర్శిని కార్యక్రమాన్ని రూపొందించినట్లు కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. వారంలో ఒకరోజు ఎంపిక చేసిన గ్రామాల్లో అధికారులు పర్యటించి సమస్యలను నిర్దిష్ట కాల వ్యవధిలో పరిష్కరించనున్నారు. పెడనకు పండుగ జగనన్న రాకతో పెడన నియోజకవర్గానికి ఈ రోజు పండుగ వచ్చింది. మాది పేదలుండే తీర ప్రాంత నియోజకవర్గం. చినగొల్లపాలెంలో వంతెన కడతామంటే ఎవరూ నమ్మలేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రెండు బ్రిడ్జిలు కట్టించటమే కాకుండా మెగా వాటర్ స్కీంతో దాహార్తిని తీర్చారు. వైఎస్సార్ హయాంలో రెండు పంటలకు నీరిస్తే చంద్రబాబు ఒక పంటకు కూడా ఇవ్వలేకపోయారు. – జోగి రమేష్, గృహ నిర్మాణశాఖ మంత్రి మల్లన్నకు పాగా.. అమ్మవారికి చీర 15 ఏళ్లుగా చేనేత వృత్తిలో ఉన్నా. శ్రీశైలం మల్లిఖార్జునస్వామికి పాగా నేసి స్వయంగా అందజేస్తాం. అమ్మవారి ఉత్సవాలకు కూడా మా నేతన్న చీరలే అందచేస్తాం. నేతన్న నేస్తమే కాకుండా అమ్మఒడి, సున్నావడ్డీ కూడా అందాయి. – సజ్జా కుమారి, లబ్ధిదారు, బ్రహ్మపురం, పెడన రూ.100 కోట్లు వ్యాపారం లక్ష్యం నేతన్నలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పాదయాత్ర హామీకి కట్టుబడి సీఎం జగన్ నేతన్నలను ఆదుకుంటున్నారు. ఈ– కామర్స్, ఆప్కో ద్వారా ఈ ఆర్థ్ధిక సంవత్సరంలో రూ.100 కోట్లు వ్యాపారం చేయాలని లక్ష్యంగా నిర్ణయించాం. – గుడివాడ అమర్నాథ్, చేనేత, జౌళి, పరిశ్రమలశాఖ మంత్రి మగ్గాన్ని ఆధునికీకరించుకున్నా 20 ఏళ్లుగా చేనేత వృత్తిలో ఉన్నా. నేతన్న నేస్తం డబ్బులతో గోతిలో ఉన్న మగ్గాన్ని స్టాండ్ మగ్గంగా మార్చుకోవటమే కాకుండా మరింత ఆధునికీకరించుకున్నా. నాకు ఇద్దరు పిల్లలున్నారు. అమ్మఒడి, విద్యా కానుక కిట్లు అందాయి. ఇంగ్లీష్ మీడియం విద్యతో మా పిల్లలకు ఎంతో మేలు చేస్తున్నారు. – కొసనం వాసు, లబ్ధిదారు, పోలవరం, గూడూరు మండలం -
Andhra Pradesh: పల్లె పటిష్టం
కళ్లెదుటే గ్రామ సచివాలయం.. కళకళలాడుతున్న స్కూలు భవనాలు ఓ వైపు.. రైతుల సేవకు వెలసిన రైతు భరోసా కేంద్రం మరో వైపు.. ఆపద వేళ ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్న హెల్త్ క్లినిక్ ఇంకో వైపు.. అక్కడి నుంచి నాలుగడుగులు ముందుకేస్తే డిజిటల్ లైబ్రరీ భవనం.. ఇంకో నాలుగడుగులు వేస్తే పాల సేకరణ కేంద్రం.. సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం ఇదీ సీఎం వైఎస్ జగన్ కల. ఈ కలను సాకారం చేసేందుకు ఆయన వేసిన విత్తు మొక్కగా మొలిచి.. వృక్షంగా ఎదుగుతోంది. కళ్లెదుటే ఫలాలూ కనిపిస్తున్నాయి. భవిష్యత్‌లో ఈ ఫలాల విలువ లక్షల కోట్లలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. సాక్షి నెట్వర్క్,ఆంధ్రప్రదేశ్: గ్రామాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్నన్ని చర్యలు ఇదివరకెన్నడూ ఏ ప్రభుత్వం తీసుకోలేదని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన రైతు ప్రగడ రాంబాబు చెబుతున్నారు. 5400 మంది జనాభా గల తమ ఊళ్లో రెండు చొప్పున గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణాలు పూర్తి అయ్యాయని చెప్పారు. గతంలో ఏమ్మెల్యేను అడిగినా, ఏ భవనం మంజూరు చేసే వారు కాదని.. ఇప్పుడు అడగకుండానే రూ.2 కోట్లకు పైగా వ్యయంతో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారని చెప్పారు. పురుగు మందులు, ఎరువులు అన్నీ ఉన్న ఊళ్లోనే ఇస్తున్నారని.. ఏ సర్టిఫికెట్ కావాలన్నా, ఏ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా సచివాలయానికి వెళితే చాలని చెబుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు ఇంకా చాలానే ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వం పుణ్యమా అని తమ గ్రామం కొత్త శోభను సంతరించుకుందని, గ్రామాలకు పెద్ద ఎత్తున ఆస్తులు సమకూరాయని తెలిపారు. తనకు ఊహ తెలిశాక ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరగడం ఇదే ప్రథమం అని సంతోషం వ్యక్తం చేశారు. ఇలా రాష్ట్రంలో ఏ పల్లెకు వెళ్లి ఎవరిని కదిపినా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో అభివృద్ధి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కొన్ని ఊళ్లలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణాలు పూర్తి కావడంతో గ్రామాలు కొత్త శోభను సంతరించుకోగా, మరి కొన్ని ఊళ్లలో ఈ భవనాల నిర్మాణాలతో సందడి నెలకొంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే తొలి సారిగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని, జరుగుతున్నాయని జనం చెబుతున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా గ్రామాల్లో మౌలిక వసతుల కోసం ఇంత పెద్దఎత్తున నిధులు వెచ్చించలేదని ప్రజలు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రభుత్వం తక్కువలో తక్కువ ఒక్కో ఊరికి రూ.కోటికి పైగా వ్యయం చేస్తోందని చెబుతున్నారు. పెద్ద పెద్ద ఊళ్లలో రూ.రెండు కోట్ల నుంచి రెండున్నర కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా నరేంద్రపురంలో గ్రామ సచివాలయం, ఆర్బీకే రూ.12,510 కోట్లతో మౌలిక వసతుల కల్పన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామాల్లోని ప్రజలకు సంక్షేమంతో పాటు అవసరమైన మౌలిక వసతులను ఆయా గ్రామాల్లోనే కల్పించేందుకు పెద్ద పీట వేశారు. గత 29 నెలల పాలనలోనే గ్రామాల్లో స్పష్టమైన అభివృద్ధి కన్పించేలా పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. సింహ భాగం పనులు పూర్తి అయ్యాయి. మిగతా పనులు కొనసాగుతున్నాయి. ఆయా గ్రామ ప్రజల అవసరాలను తీర్చే గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్, బల్క్‌మిల్క్ యూనిట్లు, వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలతో పాటు నాడు–నేడు కింద పాఠశాలలను బాగు చేయడం తదితర పనులు చేపట్టారు. రూ.12,510 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టారు. ఇందులో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రూ.3,400 కోట్ల వ్యయంతో 15,000 స్కూల్స్ రూపు రేఖలు మార్చారు. దీంతో పాటు గ్రామాల్లో అంతర్గత రహదారులు, డ్రైనేజీ నిర్మాణ పనులు, మంచి నీటి వసతి పనులు కొనసాగుతున్నాయి. మండల, జిల్లా, నియోజకవర్గ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్థాయిలో జరిగే అభివృద్ధి పనులు వీటికి అదనం. గ్రామాల్లో మౌలిక సదుపాయాల పనులు ఇలా.. ► రూ.4,199.70 కోట్లతో 10,929 గ్రామ సచివాలయాల నిర్మాణం. ఇందులో ఇప్పటికే 3,273 పూర్తి. మరో 2,683 పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఇంకా 1,840 సచివాలయాలు రెండవ అంతస్తు దశలో ఉన్నాయి. ► రూ.2,303.47 కోట్లతో 10,408 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) ఏర్పాటు. ఇందులో ఇప్పటికే 1,746 పూర్తి. మరో 2,860 గ్రౌండ్ ఫ్లోర్ స్లాబుతో పాటు పూర్తి అయ్యే దశలో ఉన్నాయి. ఇంకా 5,803 బేస్మెంట్ స్థాయి నుంచి గ్రౌండ్ ఫ్లోర్ దశలో ఉన్నాయి. ► రూ.1,475.50 కోట్లతో 8,585 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు. ఇందులో 702 క్లినిక్స్ నిర్మాణం పూర్తి. మరో 2,008 గ్రౌండ్ ఫ్లోర్ ఫినిషింగ్ స్థాయిలో ఉన్నాయి. ఇంకా 5,875 బేస్మెంట్ స్థాయి దాటి గ్రౌండ్ ఫ్లోర్ దశలో ఉన్నాయి. ► పాడి రైతుల కోసం తొలి దశలో రూ.416.23 కోట్ల వ్యయంతో 2,541 బల్క్ మిల్స్ యూనిట్ల నిర్మాణం మొదలైంది. వివిధ దశల్లో ఉన్నాయి. ► రూ.724.80 కోట్లతో 4,530 వైఎస్సార్ విలేజ్ డిజిటల్ ల్రైబరీల పనులు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. ► నాడు–నాడు తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లోని రూ.3,400 కోట్లతో 15,000 స్కూల్స్‌లో మరమ్మత్తులు, మౌలిక సదుపాయాల కల్పన పూర్తయింది. అభివృద్ధి కళ్లెదుటే కనిపిస్తోంది మా ఊళ్లో రూ.40 లక్షలతో గ్రామ సచివాలయ భవనం నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. రూ.25 లక్షలతో రైతు భరోసా కేంద్రం నిర్మిస్తున్నారు. రూ.14.95 లక్షలతో విలేజ్ క్లినిక్ భవనం నిర్మాణంలో ఉంది. విద్యార్థుల కోసం రూ.15 లక్షలతో డిజిటల్ లైబ్రరీ నిర్మాణం పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. బల్క్ మిల్క్ సెంటర్ కోసం రూ.17.67 లక్షలు మంజూరు చేసింది. నాడు–నేడు పథకం ద్వారా స్కూల్లో రూ.18 లక్షలతో పనులు చేపట్టారు. పెయింటింగ్, ప్రహరీ గోడ నిర్మాణం, టైల్స్, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యార్థులు కూర్చునేందుకు బెంచీలు, క్లాసు రూములో లైటింగ్, ఫ్యాన్లు ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సచివాలయం వల్ల మండల కేంద్రానికి వెళ్లే బాధ తప్పింది. గ్రామ స్థాయిలోనే అన్ని రకాల సేవలు అందించేందుకు కోట్ల రూపాయలు వెచ్చించి అవసరమైన భవనాలు నిర్మించడం సంతోషంగా ఉంది. సంక్షేమంతో పాటు ప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తుంది. – చిటికెల జగదీష్, భీమ బోయిన పాలెం, మాకవరపాలెం మండలం, విశాఖ జిల్లా ఊహించలేదు.. కలలా ఉంది నల్లమల అడవికి సమీపంలోని మా ఊరు మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. 800 జనాభా. పక్కనే ఉన్న కొత్తూరును కలుపుకుని సచివాలయం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అధికారులు మా ఊళ్లోనే మాకు అందుబాటులో ఉంటున్నారు. పనుల కోసం మేము ఏ ఊరికీ పోనవసరం లేదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ పథకం కావాలన్నా అర్హత ఉంటే చాలు వెంటనే అందిస్తున్నారు. వలంటీర్ల తోడుతో చదువురాని వారు సైతం పథకాలను అందిపుచ్చుకొని అభివృద్ధి చెందుతున్నారు. రూ.40 లక్షలతో సచివాలయం, రూ.21.80 లక్షలతో ఆర్బీకే, 17.50 లక్షలతో హెల్త్ క్లినిక్ భవనం, రూ.36 లక్షలతో సిమెంట్ రోడ్లు, స్కూల్లో అదనపు గదుల కోసం రూ.11 లక్షలు, ఇళ్లకు కుళాయిల కోసం రూ.15 లక్షలు ఖర్చు చేశారు. ఇలా చకచకా అన్నీ కళ్లెదుటే ఏర్పాటై పోతున్నాయి. అంతా కలగా ఉంది. ఇంత త్వరగా ఇంత అభివృద్ధి జరుగుతుందని మేమెవ్వరమూ ఊహించలేదు. – షేక్ పెద్ద దాదావలి, ఆరవీటికోట, రాచర్ల మండలం, ప్రకాశం జిల్లా విశాఖ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సచివాలయ భవనం -
కర్నూలు పల్లెల్లో పనుల సందడి
సీ బెళగల్ మండలం పోలకల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మన బడి నాడు–నేడు కింద కార్పొరేట్ స్కూలు రూపు సంతరించుకుంది. ఇప్పటివరకు ప్రహరీ లేకపోవడంతో ఆవరణలో పశువులు, పందుల సంచారం కనిపించేది. పైకప్పు పాడవడంతో నాలుగు చినుకులు పడినా తరగతి గదుల్లోకి నీరు వచ్చేది. ప్రభుత్వం ఈ పాఠశాల అభివృద్ధికి రూ.98 లక్షలు కేటాయించింది. ప్రహరీ, తరగతి గదులు నిర్మించారు. బల్లలు, టేబుళ్లు, సమకూర్చారు. ఆటస్థలం, పార్కు, అనేక ఆటవస్తువులు ఏర్పాటు చేయడంతో ఈ పాఠశాల అందరినీ ఆకట్టుకుంటోంది. కోసిగి మండలం దుద్ది గ్రామంలోని బీసీ కాలనీలోకి గతంలో అడుగుపెట్టాలంటేనే భయం వేసేది. కాలనీలో డ్రైనేజీ సౌకర్యం లేక మురుగు నీరంతా రోడ్లపై పారి వీధులన్ని దుర్గంధంగా తయారయ్యేవి. ఆ దారిలో వెళ్లేవాళ్లు ముక్కు మూసుకోవాల్సిందే. మురుగునీరు వీధుల్లో చేరడంతో స్థానికులు తరచు అనారోగ్యాలకు గురయ్యేవారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం ప్రతి నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయించడంతో బీసీ కాలనీలోని రోడ్లు, డ్రైనేజీకి మోక్షం లభించింది. ప్రస్తుతం ఈ కాలనీల్లో రూ.15 లక్షలు వెచ్చించి సీసీ రోడ్లు వేశారు. కర్నూలు (అర్బన్): రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కర్నూలు జిల్లాలోని పల్లెపల్లెలో అభివృద్ధి కుసుమాలు వికసిస్తున్నాయి. దశాబ్దాలుగా ఎవరికీ పట్టని గ్రామసీమలు ప్రగతిపథంలో సాగుతున్నాయి. గ్రామ సచివాలయ, వలంటీరు వ్యవస్థలతో ప్రజల సమస్యలన్నీ వెంటనే తీరుతున్నాయి. గ్రామాల్లో రూ.779.42 కోట్లతో కార్యాలయాల భవనాల నిర్మాణం జరుగుతోంది. దీన్లో రూ.350 కోట్లతో చేపట్టిన 876 గ్రామ సచివాలయ భవన నిర్మాణాల్లో 343 భవనాలు పూర్తయ్యాయి. రూ.184.42 కోట్లతో చేపట్టిన 845 రైతుభరోసా కేంద్ర భవనాల్లో 53 నిర్మాణాలు పూర్తవగా 81 శ్లాబ్ దశకు చేరుకున్నాయి. రూ.110 కోట్లతో 634 వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం ప్రారంభించగా 56 పూర్తయ్యాయి. రూ.135 కోట్లతో 823 పాలశీతల కేంద్ర భవనాలు నిర్మించనున్నారు. ఒక్కో నియోజకవర్గంలో రూ.15 కోట్ల వంతున కర్నూలు మినహా మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో మొత్తం రూ.195 కోట్లతో సీసీ రోడ్లు వేస్తున్నారు. అన్ని గ్రామాల్లోను పనులు సాగుతుండటంతో అందరికీ పనులు లభిస్తున్నాయి. కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) పరిధిలోని 611 వైఎస్సార్ జగనన్న లేఅవుట్లలో 75,774 ఇళ్లు నిర్మించనున్నారు. రూ.325.14 కోట్లతో పాఠశాలల్లో అభివృద్ధి పనులు జిల్లాలోని 1,080 ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి విడతగా రూ.325.14 కోట్లతో 9 రకాల అభివృద్ధి పనులు చేపట్టారు. తాగునీరు, మరుగుదొడ్లు, పెయింటింగ్స్, ఇంగ్లిష్ ల్యాబ్ తదితర 7,827 పనులు చేపట్టారు. ఇప్పటివరకు రూ.72.23 కోట్లు వ్యయం కాగా 2,243 పనులు పూర్తయ్యాయి. 261 పాఠశాలల్లో రూ.100 కోట్లతో ప్రహరీల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికి 100 పాఠశాలల ప్రహరీ పనులు పూర్తయ్యాయి. మిగిలిన పాఠశాలల్లో పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పాఠశాల రూపురేఖలు మారిపోయాయి రాష్ట్ర ప్రభుత్వం మనబడి నాడు–నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిధులు విడుదల చేయడం వల్ల మా ఊళ్లో పాఠశాల అభివృద్ధి సాధ్యమైంది. దశాబ్దాల కిందట నిర్మించిన పాఠశాలలోని పలు గదులు కూలిపోయేందుకు సిద్ధంగా ఉండేవి. ప్రభుత్వం రూ.98 లక్షలు నిధులు విడుదల చేయడంతో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలతో పాఠశాలను ఆధునికీకరించారు. ప్రస్తుతం ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన సాగుతోంది. – గోవిందు, పాఠశాల కమిటీ చైర్మన్, పోలకల్, సీ బెళగల్ మండలం సీసీ రోడ్డు వేయడం సంతోషంగా ఉంది ఆరునెలల కిందటి వరకు బీసీ కాలనీలోని వీధులు పూర్తి అపరిశుభ్రంగా ఉండేవి. మురికినీరంతా వీధుల్లో ప్రవహించడం వల్ల దుర్గంధభరితంగా మారి.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఇతోధికంగా నిధులు విడుదల చేయడం వల్ల మురికికూపాలుగా ఉన్న వీధులన్నీ నేడు సీసీ రోడ్లతో కళకళలాడుతున్నాయి. బీసీ కాలనీలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు వేయడంతో కాలనీ ప్రజలు సంతోíÙస్తున్నారు. – నాగరాజు, దుద్ది గ్రామం, కోసిగి మండలం మార్చి నాటికి పూర్తిచేసేలా చర్యలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలను మార్చి చివరి నాటికి దాదాపు పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాం. ఎన్నికల నియమావళి ఉన్న కారణంగా పాలశీతల కేంద్ర భవన నిర్మాణాలను కోడ్ ముగిసిన అనంతరం చేపడతాం. మార్చి నాటికి రూ.300 కోట్లు వ్యయం చేసేందుకు అనుగుణంగా పనులను వేగవంతం చేస్తున్నాం. – కె.సుబ్రమణ్యం, పంచాయతీరాజ్ ఎస్ఈ -
గ్రామాలకు నవోదయం
సాక్షి, అమరావతి: అవినీతికి తావు లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ద్వారా పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి అన్ని సేవలను ప్రజల ముంగిటకే తీసుకెళ్లింది. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఏకంగా రూ.12 వేల కోట్ల విలువ చేసే పనులను కేవలం 16 నెలల పాలన కాలంలోనే మొదలుపెట్టింది. ఐదు కేటగిరీల్లో పనులు ► అన్ని గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు, అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం పూనుకుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తోంది. ► ఈ ఐదు కేటగిరీల పనులను ఫ్లాగ్షిప్ కార్యక్రమాలుగా గుర్తించి గత ఏడాదే రూ.7,846 కోట్లు విలువ చేసే 52,606 పనులను మంజూరు చేసింది. వీటిలో రూ.1,081.68 కోట్ల విలువ చేసే పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ► ఇవి కాకుండా పలు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, సిమెంట్ మురుగు కాల్వలు, కొన్ని చోట్ల కంకర రోడ్ల నిర్మాణానికి మరో రూ.2,091 కోట్ల విలువ చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ► వీటికి తోడు గ్రామాల్లో అన్నిచోట్లా రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, కొత్తగా వివిధ అభివృద్ధి పనులకు ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్లు చొప్పున కేటాయించిన మొత్తం కలుపుకుంటే గ్రామాల్లో దాదాపు రూ.12 వేల కోట్ల విలువ చేసే పనులు కొనసాగుతున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అదనంగా మరో రూ.5 కోట్లు ► గతేడాది కాలంలో మంజూరు చేసిన గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలు నిర్ణీత గడువులోగా పూర్తయిన నియోజకవర్గాల్లో అదనంగా మరో రూ.5 కోట్లు చొప్పున విడుదల చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ► గ్రామీణ మౌలిక వసతుల కల్పనపై గత నెలలో అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు. ► ఇందుకు సంబంధించి పనుల ప్రతిపాదనలు పంపాలంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యేందరికీ లేఖలు రాశారు. నిధుల ఖర్చుకు పకడ్బందీ ప్రణాళిక ► పనులను చేపట్టేందుకు అవసరమైన నిధుల విడుదలకు అధికారులు పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేశారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ విభాగం నిధులను ఈ పనుల కోసం వినియోగించుకోవాలని నిర్ణయించారు. ► ఉపాధి హామీ పథకంలో కూలీల ద్వారా చేపట్టిన పనులకు 60–40 విధానంలో 40 శాతం మొత్తాన్ని మెటీరియల్ నిధులుగా మౌలికవసతుల కల్పనకు ఖర్చు చేసుకోవచ్చు. ► ఈ ఏడాది ఈ పథకం కింద జరిగిన పనులకు ఇప్పటికే ఖర్చు చేసిన మొత్తం కాకుండా మరో రూ.2,867 కోట్లు వినియోగించుకోవడానికి వీలుంది. ఆర్థిక ఏడాది చివరి నాటికి ఈ మొత్తం రూ.3,500 కోట్లకు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క పథకం ద్వారానే ఏటా రూ.4 వేల కోట్లకు పైగా మెటీరియల్ నిధులను గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేసుకోవచ్చు. -
పల్లె ప్రగతిలో ‘వీడియో షూట్’
సాక్షి, హైదరాబాద్: పల్లె ప్రగతి కార్యక్రమ అమలు, పర్యవేక్షణ విషయంలో ఉన్నతాధికారులు, పంచాయతీ సిబ్బంది మధ్య పొసగడంలేదు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కొందరు జిల్లా కలెక్టర్లు తీసుకుంటున్న నిర్ణయాలు ఇబ్బందిగా మారాయని పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాలంటున్నాయి. ఉదయం 6 గంటలకే గ్రామాల్లో పర్యటించాలని, విధిగా వాట్సాప్ కాల్ చేయాలని, ప్రతి 2 గంటలకు వీడియో ఫుటేజీని పోస్ట్ చేయా లనే షరతులు విధించడం పట్ల ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. వర్క్ టు రూల్ నిబంధనకు విరుద్ధంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు పనిచేయాలని ఒత్తిడి చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కామారెడ్డి మొదలు భూపాలపల్లి వరకు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకోసారి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే రెండు విడతల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, మురుగు కాల్వల్లో పూడిక తీత, పాత బావులు, బోరుబావుల పూడ్చివేత తదితర చర్యలు తీసుకోవాల ని ప్రభుత్వం నిర్దేశించింది. ఆ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని గ్రామ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులను ఆదేశించింది. పల్లె ప్రగతి పనుల్లో వేగం పెంచేందుకు కలెక్టర్లు/అదనపు కలెక్టర్లు కొందరు.. గ్రామ కార్యదర్శులు ప్రభాతవేళ పంచాయతీల్లో సందర్శించాలని ఆదేశించారు. ఉదయం 8 గంటలకు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఏ వీధిలో పర్యటిస్తున్నారో తెలపాలని కామారెడ్డి కలెక్టర్ ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణ తీరును 30 సెకన్ల నిడివి గల వీడియో చిత్రీకరించి.. ప్రతి 2 గంటల కోసారి పోస్టు చేయాలని భూపాలపల్లి కలెక్టర్ నిర్దేశించారు. ఉదయం 6 మొదలు సాయంత్రం 6 గంటలకు చివరిసారిగా ఈ వీడియో పోస్టు చేయాలన్నారు. పల్లె నిద్రలు చేయాలని, గ్రామస్తులతో మమేకం కావాలని మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగం ఆదేశించింది. అయితే, ఈ నిర్ణయం పట్ల ఉద్యోగసంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అవమానించేలా చర్యలు పంచాయతీ కార్యదర్శుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సమర్థనీయం కాదు. 12 గంటలపాటు విధులు నిర్వర్తించాలనే ఆదేశాలు ఉపసంహరించుకోవాలి. అత్యవసరవేళల్లో పనులు చేసేందుకు అభ్యంతరంలేదు. పారిశుద్ధ్య నిర్వహణ, పల్లె ప్రగతి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. కానీ, తమను అవమాన పరిచేలా వీడియో కాల్, ఫుటేజీ పంపాలనడం సరికాదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వర్క్ టు రూల్ పాటిస్తామని ఆయన హెచ్చరించారు. – మధుసూదన్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
పల్లెకు ప్రగతి శోభ
సాక్షి, ఆదిలాబాద్: ‘ముప్పై రోజుల ప్రణాళిక కార్యక్రమం’ ద్వారా గ్రామాల్లో చేపట్టిన పనులు గడిచిన ఐదేళ్లలో కంటే ఇప్పుడు ఫర్వాలేదనిపిస్తోంది. పారిశుధ్యం.. పచ్చదనం.. మురికినీరు, పవర్‌వీక్ సమస్యలు కొంత మేరకు తొలగిపోయాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం, సర్పంచ్, గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు ప్రణాళికలో భాగస్వాములు కావడంతో గ్రామాలు కొంత ప్రగతి సాధించాయి. ప్రతీరోజు గ్రామాల్లో తిరుగుతూ ఎక్కడ పరిశుభ్రత ఉంది.. ఎక్కడ పారిశుధ్యం చేపట్టాలి.. ఏ మురికి కాలువ పారుతుంది.. శ్రమదానం ఎక్కడెక్కడ చేపట్టాలి. ఎన్ని రోడ్లు బాగున్నాయి.. ఏ రోడ్డుకు మరమ్మతు చేయాలని స్పష్టంగా తెలుసుకొని పనులు చేపట్టడంతో పల్లెల్లోని సమస్యలు కొంత మేరకు దూరమయ్యాయి. గత నెల 6న ప్రారంభమైన ‘30 రోజుల ప్రణాళిక’ కార్యక్రమం జిల్లాలో నెల రోజుల పాటు కొనసాగి శనివారంతో ముగిసింది. దీని ద్వారా జిల్లాలోని 467 గ్రామ పంచాయతీలు 81 శాతం పరిశుభ్రతను సాధిస్తే.. 49 శాతం మేర నర్సరీలు, మొక్కలు నాటడం సాధ్యమైంది. ఇక పల్లెల్లో పవర్‌వీక్ సమస్యలు 40 శాతం వరకు పరిష్కారమయ్యాయి. ఇప్పుడు చేయగా మిగిలిన పనులను ప్రణాళికలో భాగంగా రూపొందించిన ‘వార్షిక ప్రణాళిక’లో చేర్చి ఆ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు 466 గ్రామ పంచాయతీల్లో 1,398 మంది కో–ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. 28,045 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎంపిక చేశారు. ఇందులో 13,214 మంది మహిళా సభ్యులు ఉన్నారు. ఫర్వాలేదనిపించిన పారిశుధ్య పనులు ప్రణాళిక కార్యక్రమం గ్రామాల్లోని చాలా సమస్యలను దూరం చేసింది. పారిశుధ్య పనులు చేపట్టి గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. గ్రామాల్లోని సీసీ రోడ్లపై గుంతలు, మురికి కాలువల్లో పూడికతీత, బుదరమయంగా ఉన్న రోడ్లపై మోరం వేసి మరమ్మతు చేపట్టారు. సమస్య గుర్తించిన వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో జిల్లాలో శానిటేషన్ పనులు 81 శాతం పూర్తయ్యాయి. ఇందులో భాగంగా గడ్డి, ముళ్ల పొదలు తొలగించడం, పాడుబడిన, ఓపెన్ బోరు బావులను పూడ్చడం, శిథిలాలను కూల్చివేయడం, లోతట్టు ప్రాంతాలను గుర్తించి సరిసమానం చేయడం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచడం, మురికి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం, విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు, ఖాళీ స్థలాలు, మార్కెట్ స్థలాలు శుభ్రపర్చడం లాంటి పనులు చేశారు. దీంతో పాటు పారిశుధ్య పనుల్లో భాగంగా ఇంటికో చెత్త బుట్టను పంపిణీ చేపట్టారు. నెల రోజుల పాటు గ్రామాల్లో తిరిగినా అధికారులు 1,04,580 నివాస గృహాల్లో చెత్త బుట్టలు లేవని గుర్తించి ఇప్పటి వరకు 31,633 గృహాలకు బుట్టలను అందజేశారు. ఇంటిని శుభ్రం చేయగా వచ్చిన చెత్తను ఈ బుట్టలో వేసుకొని ఉంచాలి. పారిశుధ్య కార్మికులు వచ్చినప్పుడు ఆ చెత్తను వారికి అప్పగించాలి. కాని ఈ బుట్టలను కొంత మంది ఇంటి అవసరాల కోసం వాడే నీటికి ఉపయోగించడం గమనార్హం. వెనుకబడిన విద్యుత్ సమస్యల పరిష్కారం గ్రామాల్లోని ప్రతీ వార్డుల్లో ఉన్న విద్యుత్ సమస్య ప్రణాళికతో బయటపడింది. జిల్లాలోని 17 గ్రామీణ మండలాల్లో మొత్తం విద్యుత్ సమస్యలు 45,547 ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికీ వరకు 18,342 సమస్యలు మాత్రమే పరిష్కరించి 40 శాతం లక్ష్యం సాధించారు. మిగతా 27,205 సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. అయితే ఈ సమస్యలు పరిష్కరించేందుకు కావాల్సిన బడ్జెట్ పంచాయతీ కార్యాలయం నుంచి చెల్లిస్తారా..? లేక ప్రభుత్వం చెల్లిస్తుందా.? అనేదానిపై అధికారులు లెక్కేసేకుంటున్నారు. ఒక వేళ పంచాయతే చెల్లిస్తే.. గుర్తించిన సమస్యలకు సరిపడా బడ్జెట్ ఉందా? లేదా? అనే దానిపై సమాలోచన చేస్తున్నారు. అయితే గ్రామాల్లో ఇప్పటి వరకు ఉన్న స్తంభాలను సరిచేయడం, వీధిలైట్లను అమర్చడం, వేలాడుతున్న వైర్లను గుర్తించడం లాంటి పనులు చేపట్టారు. జిల్లాలో 375 శ్మశాన వాటికలు.. 390 యార్డులు అవసరం జిల్లాలో ప్రస్తుతం 92 గ్రామాల్లో వైకుంఠ ధామాలు ఉన్నాయి. ఇంకా 375 అవసరం. ప్రణాళిక ద్వారా 338 వైకుంఠ ధామాలు కొత్తవి ఏర్పాటు చేయాలని అధికారులు గుర్తించారు. మిగతా 37 చోట్ల స్థలాలను గుర్తించలేదు. కాగా, జిల్లాలో ప్రస్తుతం 37 డంపింగ్ యార్డులు ఉన్నాయి. ఇంకా 390 యార్డులు అవసరం. అయితే నెల రోజుల్లో 355 యార్డులు కొత్తగా నిర్మించాలని, మిగతా 35 చోట్ల ఏర్పాటుకు అవకాశం ఉందని అధికారులు గుర్తించాల్సి ఉంది. కొంత వరకు నయమే.. గ్రామాల్లో గత ఐదేళ్లుగా జరిగిన పనుల కంటే ఈ నెలలో జరిగిన పనులు కొంత నయమనిపిస్తోంది. ఎప్పుడో ఓసారి నాళీలను శుభ్రం చేసేవారు. కానీ ఇప్పుడు మురికికాలువలు, బురద, గుంతలు లేని రోడ్లు, మోరం వేసిన రోడ్లు కన్పిస్తున్నాయి. ఊరికి పక్కన ఉన్న పెంటకుప్పలతో ఇబ్బందులు పడ్డారు. ఆ సమస్య ఇప్పుడు లేదు. – కుమ్మరి కల్యాణ్‌కుమార్, తాంసి(బి) ప్రణాళికతో ప్రగతి గత నెలలో ప్రారంభమైన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంతో పల్లెల్లో ప్రగతి కని పిస్తోంది. జిల్లాలో ని అన్ని పంచాయతీలు పారిశుధ్యం, పరిశుభ్రతతో కనిపిస్తున్నా యి. వీటితో పాటు గ్రామాల్లోని చాలా స మస్యలు దూరమయ్యాయి. ప్రభుత్వం ప ల్లెలపై దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమైంది. ఈ పనులను పరిశీలించేందుకు రాష్ట్ర పరిశీలన బృందాలు జిల్లాకు రానున్నాయి. – సాయిబాబా, జిల్లా పంచాయతీ అధికారి -
30 రోజుల్లో మళ్లీ వస్తా
యాదగిరిగుట్ట (ఆలేరు) : ‘గ్రామాల ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో రోజుకో గ్రామాన్ని సందర్శిస్తున్నా...ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామాన్ని ఎంపిక చేశారు... కానీ అనుకున్న రీతిలో సర్పంచ్, ఎంపీటీసీ పని చేయలేదు....కలెక్టర్, ఎమ్మెల్యే ఈ గ్రామాన్ని ఎందుకు ఎంచుకున్నారో నాకు అర్ధం కావడం లేదు...30 రోజుల్లో మళ్లీ వస్తా...అప్పటిలోగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి’ అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మాసాయిపేటలో రూ.రెండు కోట్ల లక్షా 60 వేలతో నిర్మించనున్న 40 డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన చేసి, 30 రోజుల ప్రణాళికలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఆలేరు నియోజకవర్గంలోని గుండాల మండలానికి దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఆదివారం నీళ్లు విడుదల చేస్తానని తెలిపారు. గ్రామాభివృద్ధికి కేసీఆర్ సంవత్సరానికి రూ.39లక్షలు విడుదల చేస్తున్నారని, ప్రస్తుతం రూ.5 లక్షలు వచ్చాయని పేర్కొన్నారు. గ్రామంలో ప్రతి కార్యక్రమం సర్పంచ్ ఆధ్వర్యంలోనే జరగాలని, ప్రతి మూడు నెలలకోసారి గ్రామసభలు నిర్వహించుకోవాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కనూ రక్షించాలని కోరారు. గ్రామాభివృద్ధికి సహకరించిన వారికే ప్రశ్నించే హక్కు ఉందన్నారు. ఇంటి ముందు చెత్త వేస్తే రూ. 500, బహిరంగ మలవిసర్జన చేస్తే రూ.1000, ఇంటి వద్ద, బావి వద్ద అనుమతి లేకుండా చెట్లు నరికితే రూ.3 వేలు, మొక్కను నాటిన తర్వాత సంరక్షణ లేకుంటే రూ.200 జరిమానా విధిస్తామన్నారు. ప్రతి ఇంటికీ తడి, పొడి చెత్తకు సంబంధించిన బుట్టలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒక్క రోజు శ్రమదానంలో పాల్గొన్న 54 మంది మహిళలకు శ్రీనిధి రుణాల ద్వారా రూ.50 వేల నుంచి రూ.3లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని జిల్లా అధికారులకు సూచించారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సర్పంచ్‌లకు దేశంలోనే గొప్ప అవకాశాలు కల్పించారని తెలిపారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి మాట్లాడుతూ 30 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో ప్రతి రోజూ పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ అనితారాంచంద్రన్, జేసీ రమేష్, డీఆర్డీఓ ఉపేందర్‌రెడ్డి, ఆర్టీఓ వెంకటేశ్వర్లు, జెడ్పీ వైస్ చైర్మన్ బీకూనాయక్, ఎంపీపీ చీర శ్రీశైలం, జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, వైస్ ఎంపీపీ ననబోలు ప్రసన్నరెడ్డి, సర్పంచ్ వంటేరు సువర్ణ ఇంద్రారెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఖలీల్, మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్ ఎంపీడీఓ పైళ్ల జయప్రకాష్‌రెడ్డి, ఉపసర్పంచ్ వాకిటి అమృత, కో ఆప్షన్ సభ్యులు యాకూబ్, టీఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు భారతమ్మ, వ్యాపారవేత్త వంటేరు సురేష్‌రెడ్డి పాల్గొన్నారు. -
అర్హులను గుర్తిస్తున్నాం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ ఇస్తామన్న హామీ అమలులో భాగం గా అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఇప్పటివరకు 6 లక్షల మంది అర్హులను గుర్తించామని, హైదరాబాద్ తదితర పట్టణ ప్రాంతాల్లో సర్వే జరుగుతోందన్నారు. ఆయా ప్రాంతాల్లో కూడా సమాచారం సేకరించాక అమలు చేస్తామని తెలిపారు. బుధవారం అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పద్దులపై ఎర్రబెల్లి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల అభివృద్ధికి, వాటి బలోపేతానికి సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి పని చేస్తున్నారన్నారు. 8,690 ఉన్న గ్రామ పంచా యతీలను 12,750కి పెంచారని, వాటిల్లో ఖాళీలను భర్తీ చేశారన్నారు. అర్హులకు పదోన్నతులు ఇచ్చామని పేర్కొన్నారు. సఫాయి కార్మికుల వేతనాలను రూ.8,500కు పెంచామని తెలిపారు. ఉప సర్పంచ్‌కి చెక్ పవర్ ఇస్తే తప్పేంటి? గ్రామాల్లో సర్పంచ్‌తోపాటు ఉప సర్పంచ్‌కి చెక్ పవర్ ఇస్తే ఇబ్బంది ఏంటని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ప్రజల ఓట్లతోనే గెలిచిన ఉప సర్పంచ్‌కి చెక్ పవర్ ఇవ్వడం వల్ల జరిగే నష్టం ఏంటని పేర్కొన్నారు. ఈ విషయంలో కొంతమంది కావాలనే రాజకీయాలు చేస్తున్నారని, వాటిని ఎమ్మెల్యేలు పట్టించుకోవద్దని సూచించారు. -
పుట్టిన ఊరు కన్నతల్లితో సమానం
సాక్షి, కాటారం: మనం పుట్టి, పెరిగిన ఊరు కన్నతల్లితో సమానమని, గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం కాటారం మండల కేంద్రంలోని అయ్యప్ప కల్యాణ మండపంలో సర్పంచ్ తోట రాధమ్మ అధ్యక్షతన గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి దయాకర్‌రావు, మంథని, భూపాలపల్లి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్లు జక్కు శ్రీహర్షిణి, పుట్ట మధు హాజరయ్యారు. మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. గ్రామాలను స్వచ్ఛత దిశగా తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. శ్రమదానాలు నిర్వహించడం, మొక్కలను నాటడం వంటి కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు. గ్రామాభివృద్ధికి తోడ్పడిన వారికే గ్రామ అవసరాలు, ప్రభుత్వ పథకాల గురించి గ్రామసభలో ప్రశ్నించే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటే వ్యాధులు బాధ ఉండదని, బహిరంగ మలమూత్ర విసర్జన చేసేవారికి జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. ప్రకృతిని నాశనం చేసే వారికి ఎంత ఫైన్ విధిస్తే బాగుంటుందని మంత్రి సభలో గ్రామస్తులను అడుగగా వారు రూ.500 అని అనడంతో అమలు చేయండి అని కలెక్టర్ వెంకటేశ్వర్లుకు సూచించారు. ప్రత్యేక కార్యచరణలో భాగంగా ప్రతి గ్రామం ఓ గంగదేవిపల్లిని మించిపోవాలని మంత్రి అన్నారు. 30 రోజుల ప్రణాళికను గ్రామంలో విజయవంతం చేసుకుంటే ఎన్ని నిధులు అడిగిన కేటాయించే బాధ్యత తనదని మంత్రి హామీ ఇచ్చారు. నిధుల కేటాయింపులో వెనకాడేది లేదన్నారు. ప్రతి ఏటా కాటారం గ్రామపంచాయతీకి 1.20కోట్లకు పైగా నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. రానున్న రోజుల్లో మహిళా సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికీ ఎలాంటి పూచికత్తు లేకుండా రూ.3లక్షల మేర రుణం ఇచ్చేలా ముఖ్యమంత్రి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోని గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర వాటాలతో పాటు మరిన్ని నిధులు సమకూర్చేలా మంత్రి చొరవ చూపాలన్నారు. చెక్‌పవర్‌పై సర్పంచ్‌ల్లో ఇంకా స్పష్టత రాలేదని ఆ అంశాన్ని పునఃపరిశీలించి అధికారాలు ఇస్తే గ్రామపంచాయతీలు మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్లే అవకాశం ఉందన్నారు. గ్రామసభలో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ శిరీష, ఆర్డీఓ వెంకటాచారి, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, డీఆర్డీఓ సుమతి, ఎంపీడీఓ శంకర్, తహసీల్దార్ అశోక్‌కుమార్, ఎంపీటీసీలు తోట జనార్దన్, జాడి మహేశ్వరి, ఉడుముల విజయరెడ్డి, మహదేవపూర్ జడ్పీటీసీ గుడాల అరుణ, ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ కాటారం: కాటారం గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భూమి పూజ చేశారు. వేదమంత్రోచ్ఛరణల మధ్య ప్రతిష్టాపన రాయి వేశారు. కాగా కాటారం గ్రామపంచాయతీ భవనం గత కొంత కాలం క్రితం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో నూతన పాలకవర్గం గత కొన్ని నెలలుగా కార్యాలయ నిర్వాహాణ అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. దీంతో నూతన భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఇటీవల మండల పర్యటనకు వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును సర్పంచ్ తోట రాధమ్మ, పాలకవర్గం సభ్యులు కోరారు. మంత్రి నిధుల మంజూరుకు సూచనాప్రాయంగా అంగీకరించడంతో గురువారం మండల పర్యటనకు వచ్చిన మంత్రి చేతుల మీదుగా భవన నిర్మాణం కోసం భూమి పూజ గావించారు. అనంతరం 30 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిన భవన నిర్మాణం కూల్చివేతలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి స్వయంగా జేసీబీ నడిపి పాత భవనాన్ని కూల్చివేసి పారతో మట్టి ఎత్తి ట్రాక్టర్లో పోశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోట రాధమ్మ, మంథని, భూపాలపల్లి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, జయశంకర్భూపాలపల్లి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్లు జక్కు శ్రీహర్షిణిరాకేశ్, పుట్ట మధు, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ శిరీష, ఆర్డీఓ వెంకటాచారి, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, డీఆర్డీఓ సుమతి, ఎంపీడీఓ శంకర్, తహసీల్దార్ అశోక్‌కుమార్, ఎంపీటీసీలు తోట జనార్దన్, జాడి మహేశ్వరి, ఉడుముల విజయరెడ్డి, ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్, జక్కు రాకేశ్, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
పల్లెల అభివృద్ధికి కమిటీలు
సాక్షి, నల్లగొండ : ప్రభుత్వం జిల్లా పరిషత్ తరహా లోనే గ్రామ పంచాయతీల్లోనూ స్టాండింగ్ కమిటీలు, కోఆప్షన్లు అమలు చేస్తోంది. వాటి ద్వారా గ్రామాల అభివృద్ధికి మరింత కృషి చేయవచ్చన్న భావంతో ఈ సంవత్సరం అమలుకు శ్రీ కారం చుట్టింది. గ్రామాల అభివృద్ధికి ఈనెల 6 నుంచి 30 రోజుల ప్రణాళికను ప్రారంభించిం ది. అందులో భాగంగా ఈనెల 7వ తేదీన గ్రామపంచాయతీల్లో కోఆప్షన్, స్టాండింగ్ కమిటీలను ఎన్నుకోవాలని నిర్ణయించింది. అందుకు సం బంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసి జిల్లా డీపీఓ ద్వారా ఆయా ఎంపీడీఓలకు, సర్పంచ్‌లకు పంపించింది. ఈ మేరకు జిల్లాలో కమిటీల నియామకాలు చేపట్టింది. జిల్లావ్యాప్తంగా 844 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అందులో ఇప్పటికే 842 గ్రామపంచాయతీల్లో కోఆప్షన్‌సభ్యుల ఎంపిక పూర్తయింది. స్టాండింగ్ కమిటీలను కూడా ఎన్నుకున్నారు. ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం ఒక్కో గ్రామపంచాయతీలో ముగ్గురు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. అదే విధంగా నాలుగు స్టాండింగ్ కమిటీలు, అందులో ఒక్కో స్టాండింగ్ కమిటీకి 15మంది సభ్యులు ఉంటారు. అందులోనే ఒకరు చైర్మన్‌గా ఎన్నికవుతారు. ఈ కార్యక్రమం అంతా దాదాపు పూర్తి కావస్తోంది. అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధి విషయంలో అందరినీ ఏకాభిప్రాయానికి తీసుకొచ్చి కమిటీలను పూర్తి చేయడంలో సక్సెస్ అయ్యారు. ఆయా గ్రామాల్లో కమిటీలు పూర్తయ్యాయంటే ప్రస్తుతం జరిగే 30 రోజుల ప్రణాళికలో పనులన్నింటినీ గుర్తించి అదే తరహాలో గ్రామాభివృద్ధిలో పాలుపంచుకోనున్నారు. 2 పంచాయతీల్లోనే వాయిదా పడిన ఎంపిక జిల్లాలో మొత్తం 844 పంచాయతీలు ఉంటే 842 పంచాయతీల్లో కోఆప్షన్, స్టాండింగ్ కమి టీల ఎంపిక పూర్తయింది. కేవలం 2 పంచాయతీల్లో నిలిచిపోయింది. దేవరకొండ మండలం లో తెలుగుపల్లి గ్రామంలో కోఆప్షన్ సభ్యులు, కనగల్ మండల కేంద్రంలో కూడా కోఆప్షన్, స్టాండింగ్ కమిటీల ఎంపిక వాయిదా పడింది. ఇప్పటికే రూ.20 కోట్ల నిధులు మంజూరు ప్రభుత్వం ఇప్పటికే పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ నిధులు రూ.20కోట్లు మంజూరు చేసింది. నిధులు కూడా జిల్లాకు ఇప్పటికే చేరాయి. వాటన్నింటినీ జిల్లా పంచాయతీ అధికారి ఆయా గ్రామాల జనాభా ప్రాతిపదికన వారి అకౌంట్లలో జమచేసే పనిలో ఉన్నారు. పనుల గుర్తింపు అనంతరం ప్రాధాన్యతా క్రమంలో ఖర్చు చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్ ‘మన ఊరిని మనమే బాగు చేసుకుందాం. ఏ ఊరి ప్రజలు ఆఊరి కథానాయకులు కావాలి’ అన్న నినాదంతో పంచాయతీల అభివృద్ధికి తీసుకున్న 30రోజుల ప్రణాళిక విజయవంతంగా ముందుకు సాగుతోంది. -
‘పనిచేయని సర్పంచ్‌కు చెత్తబుట్ట సన్మానం’
గీసుకొండ/కాటారం: పని చేయని సర్పంచ్‌లకు చెత్తబుట్ట ఇచ్చి సన్మానిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అయినా వారిలో మార్పు రాకపోతే ఇంటికి సాగనంపుతామని చెప్పారు. గ్రామ సీమలు బాగు పడాలంటే కఠిన నిర్ణయాలు కచ్చితంగా అమలు చేసినప్పుడే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం మరియపురం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంల్లో 30 రోజుల ప్రణాళికపై గురువారం జరిగిన అవగాహన సదస్సుల్లో మంత్రి మాట్లాడారు. క్రమశిక్షణతో గ్రామస్తులు మెలిగేలా కచి్చతంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తే మార్పు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. సర్పంచ్‌లు సేవాభావంతో పని చేయాలే తప్ప ఖర్చు పెట్టి గెలిచాం కదా అని సొంత లాభానికి పోతే వారికే చెడ్డ పేరు వస్తుందని మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో గ్రామాల్లో పాలన కఠినతరంగా ఉండబోతోందని, గ్రామ సభలో పాల్గొన్న వారికే గ్రామం గురించి మాట్లాడే అర్హత ఉంటుందని, ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా శ్రమదానం చేయాలన్నారు. ప్రతీ మండలంలో గ్రామాలను ఆదర్శంగా తీర్చి దిద్దే ఇద్దరు సర్పంచ్‌లను సన్మానిస్తామని చెప్పారు. -
తెలంగాణ పల్లెలకు నిధులు
సాక్షి, భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి నిధులు ఇవ్వడంతో పాటు అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని చెబుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పంచాయతీకలు 14 ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. నెలనెలా పంచాయతీలకు నిధులు ఇస్తామని బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం ప్రకటించారు. అయితే నిధులతో పాటు అధికారులు విధులను కూడా సక్రమంగా నిర్వర్తించాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. దీనికోసం రోజువారీ గ్రామాభివృద్ధి కార్యక్రమాలను ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయడం, రోజూ వారీగా పంచాయతీల్లో చేసిన పనులకు సంబంధించిన ఫొటోలను కంప్యూటర్లో అప్లోడ్ చేయనున్నారు. వీటితో పాటు రానున్న రోజుల్లో ప్రతీ గ్రామ పంచాయతీపై ఫ్లయింగ్ స్క్వాడ్ పర్యవేక్షణ ఉండబోతోంది. నెలనెలా నిధులు జిల్లాలోని 241 గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టనుంది. ఇన్నాళ్లు సమస్యల వలయంలో ఉన్న జీపీలకు బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు కలిపి నెలకు రూ. 339 కోట్లు కేటాయిస్తామని ప్రతిపాదించారు. దీంతో జిల్లాలోని 241 పంచాయతీలకు నిధుల కొరత తీరనుంది. ఇప్పటికే సెప్టెంబర్ నెలకు సంబంధించి 14వ ఆర్థిక సంఘం నుంచి రూ. 3,59,16,700 తో పాటు రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి 2,40,62,400 నిధులను మొత్తంగా రూ. 5,99,79,100లను ఇటీవల ప్రభుత్వం జిల్లాకు కేటాయించింది. ఇకపై ఇలాగే పంచాయతీలకు ప్రతీనెల నిధులు రానున్నాయి. దీంతోఅన్ని పంచాయతీల్లో 30 రోజుల ప్రణాళికలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యే అవకాశం ఉంది. ఇన్నాళ్లు నిధుల లేకుండా సతమతమవుతున్న పంచాయతీలకు ఈనిధులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే 14 ఆర్థికసంఘం నిధులు వచ్చి ఉన్నా సర్పంచ్, ఉపసర్పంచ్ జాయంట్ చెక్ పవర్‌పై అభ్యంతరాలు, డిజిటల్ సైన్ విధానంతో కాలయాపన జరిగింది. ఇకపై నెలనెలా నిధులు రానుండడంతో పంచాయతీల అభివృద్ధికి నిధుల లోటుండదు. ఆన్లైన్లో రిపోర్టింగ్ 30 రోజుల యాక్షన్ ప్లాన్‌లో అధికారుల అలసత్వానికి ఎలాంటి తావివ్వకుండా ఏరోజుకారోజు పనుల వివరాలను ఆన్లైన్లో రిపోర్టింగ్ చేసే వ్యవస్థను తీసుకువచ్చారు. దీంతో ప్రతీ గ్రామ పంచాయతీలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనుల పురోగతిపై స్పష్టమైన వివరాలు వచ్చే వీలుంటుంది. ఈనెల 6 నుంచి ఇప్పటి వరకు ప్రతీ గ్రామంలో జరిగిన కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, నివేదికలు సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీల స్పెషల్ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లు ప్రతీరోజు కంప్యూటర్లో తప్పనిసరిగా పొందుపరచాల్సి ఉంటుంది. గ్రామాల్లో యాక్షన్ ప్లాన్‌కు సంబంధించి ఉన్నతాధికారులు ఏరోజైనా వీడియోకాల్ చేసే అవకాశం ఉంది. ఆరోజు కనుక పంచాయతీ అధికారులు ఆ గ్రామపంచాయతీ పరిధిలో లేనట్లయితే, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనున్నారు. వీటితో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ల నియామకం కూడా పూర్తయింది. తనిఖీల్లో పంచాయతీల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటే చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ముమ్మరంగా యాక్షన్ ప్లాన్ జిల్లాలో 30 రోజుల యాక్షన్ ప్లాన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రతీ గ్రామ పంచాయతీల్లోని పల్లెలను అభివృద్ధి బాట పట్టించే విధంగా అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. ప్రతీ మండలానికి జిల్లాస్థాయి అధికారిని నియమించారు. దీంతో ప్రతీ గ్రామంలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ లైన్ల మరమ్మతులు, వదులుగా ఉన్న విద్యుత్ లైన్లను సరిచేస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లోని మురుగునీటి వ్యవస్థను బాగు చేస్తున్నారు. -
గ్రామీణం 2.0
బంపర్ విజయంతో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన మోదీ సర్కారు.. రెట్టించిన ఉత్సాహంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టిపెట్టింది. పల్లెవాసులకు ఇళ్లు, రోడ్లు ఇతరత్రా మౌలిక వసతులను కల్పించే లక్ష్యంతో మొదలైన ప్రతిష్టాత్మక పథకాల్లో కొన్నింటి లక్ష్యాలు సాకారమయ్యాయి. దీంతో వీటి ప్రాధాన్యాలను పెంచి తాజా బడ్జెట్లో కొత్త లక్ష్యాలను నిర్దేశించారు. గ్రామీణాభివృద్ధికి గేరు మార్చినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన గత లక్ష్యం అనుకున్నదానికంటే మూడేళ్లు ముందే నెరవేరడంతో మూడో దశ కింద 1,25,000 కిలోమీటర్ల పల్లె రహదారులను మెరుగుపరచనున్నారు. ఇందుకు రూ.80వేల కోట్లకుపైగానే వెచ్చించనున్నారు. ఇక గ్రామీణ ఇళ్ల నిర్మాణంలో కూడా కొత్తగా వచ్చే మూడేళ్లలో 1.95 లక్షల గృహాలను నిర్మించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. మొత్తంమీద మోదీ సర్కారు.. గ్రామీణాభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు ఫ్లాగ్షిప్ 2.0 వెర్షన్‌ను పట్టాలెక్కించిందని పరిశీలకులు భావిస్తున్నారు. – న్యూఢిల్లీ అంచనాలకు మించి ఉపాధి హామీ 2019–20 కేటాయింపు: రూ. 60,000 కోట్లు 2018–19 కేటాయింపులు (సవరించిన అంచనా): రూ.61,084 కోట్లు - 2005లో ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గతేడాది బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఈ దఫా 11% పెరిగింది. అయితే, సవరించిన అంచనాలతో పోలిస్తే కాస్త తగ్గింది. - దీనికి ప్రధాన కారణం చాలా రాష్ట్రాల్లో లక్ష్యాలను మించి ఉపాధి పనులను కల్పించడంతోపాటు నిధులను కూడా అవసరాన్ని మించి ఖర్చుచేశారు. - అవసరమైతే డిమాండ్ మేరకు తాజా కేటాయింపులు మరింత పెంచుతారు. స్వచ్ఛ భారత్ సాకారం 2019–20 కేటాయింపు: రూ. 12644 కోట్లు. 2018–19 కేటాయింపులు (సవరించిన అంచనా): రూ.16,978కోట్లు - 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున మొదలైన ఈ పథకం కింద ఇప్పటివరకు దాదాపు 9.6 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశారు. - బహిరంగ మలవిసర్జన (ఓడీఎఫ్) అలవాటు దాదాపు కనుమరుగైంది. - ఓడీఎఫ్ రహిత గ్రామాల సంఖ్య 5.6 లక్షలకు చేరింది. - గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 98% పారిశుద్ధ్య లక్ష్యాల్లో విజయం. - ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి భారత్‌ను ఓడీఎఫ్ రహిత దేశంగా ప్రకటించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. - ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాజ్‌ఘాట్ వద్దనున్న గాంధీ దర్శన్ ప్రాంగణంలో ‘రాష్ట్రీయ స్వచ్ఛత కేంద్రం’ను నెలకొల్పనున్నామని వెల్లడించారు. దేశమంతా విద్యుత్ వెలుగులు 2019–20 కేటాయింపు: రూ.4,066 కోట్లు. 2018–19 కేటాయింపు (సవరించిన అంచనా): రూ.3,800 కోట్లు. - దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్జ్యోతి యోజనలో భాగంగా 2017లో ఆరంభించిన సౌభాగ్య పథకం కింద 2.5 కోట్ల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈ లక్ష్యం ఇటీవలే సాకారమైనట్లు కేంద్ర ప్రకటించింది. - దీనికోసం ఇప్పటివరకూ రూ. 16,320 కోట్ల వినియోగం. - ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్‌కు కేటాయింపులు రూ.3,970 కోట్ల నుంచి రూ.5,280 కోట్లకు పెంచారు. - ఉజాల స్కీమ్ కింద పేద, మధ్యతరహా కుటుంబాలకు ఉచితంగా 143 కోట్ల ఎల్ఈడీ బల్బులను అందజేయాలని లక్ష్యం. - ఎల్ఈడీ బల్బులతో ఏటా రూ.18,341 కోట్ల మేర విద్యుత్ బిల్లులు ఆదా - సోలార్ స్టవ్‌లు, బ్యాటరీ చార్జర్లను ప్రోత్సహిచేందుకు కూడా ఈ ఎల్ఈడీ బల్బుల అమలు విధానాన్ని ఉపయోగించుకోనున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ రోడ్లకు ఇక మహర్దశ 2019–20 కేటాయింపు:రూ.19,000 కోట్లు 2018–19 కేటాయింపులు (సవరించిన అంచనా): రూ.15,500 కోట్లు - ముందుగా అనుకున్నట్లు 2022 నాటి లక్ష్యం కంటే ముందే.. 2019 మార్చినాటికే దాదాపు 97% ఆవాసాలను రోడ్లతో అనుసంధానించారు. - మొత్తం 17.84 లక్షల ఆవాసాల్లో 15.8 లక్షల ఆవాసాలకు పక్కా రోడ్లు వచ్చాయి. - గడిచిన 1,000 రోజుల్లో సగటున రోజుకు 130–135 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగినట్లు అంచనా. - ఇందులో 30,000 కిలోమీటర్ల రోడ్లను పర్యావరణ అనుకూల (గ్రీన్) సాంకేతికతతో నిర్మించడం విశేషం. - పీఎంజీఎస్‌వై ఫేజ్–3ను ఇప్పుడు అమలు చేయనున్నారు. - ఇందులో భాగంగా వచ్చే ఐదేళ్లలో 1,25,000 కిలోమీటర్ల రోడ్లను అప్‌గ్రేడ్ చేయనున్నారు. దీనికి రూ.80,250 కోట్లు ఖర్చవుతుందని తాజా బడ్జెట్లో అంచనా వేశారు. గ్రామీణ ఇళ్ల నిర్మాణానికి కొత్త జోష్ 2019–20 కేటాయింపులు: రూ.25,853 కోట్లు 2018–19 కేటాయింపులు (సవరించిన అంచనా): రూ.26,405 కోట్లు - ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)లో భాగంగా 2022 కల్లా దేశవ్యాప్తంగా ఇళ్లు లేని బలహీనవర్గాలకు పక్కా ఇళ్లను కట్టిఇవ్వడమే కేంద్రం లక్ష్యం. - పీఎంఏవై తొలి దశను 2016–17 నుంచి 2018–19 వరకూ మూడేళ్లపాటు అమలుచేశారు. దీనికింద గ్రామాల్లో కొత్తగా కోటి ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇందుకు రూ.81,975 కోట్లు ఖర్చయింది. గడిచిన ఐదేళ్లలో 1.54 కోట్ల ఇళ్లను నిర్మించారు. - ఇప్పుడు రెండో దశ కింద 2019–20 నుంచి 2021–22 మధ్య 1.95 కోట్ల ఇళ్లను నిర్మించనున్నారు. - అంతేకాదు ఈ ఇళ్లకు మరుగుదొడ్లు, విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు కూడా ఉచితంగా కల్పించనున్నారు. - ఇక పట్టణ ప్రాంతాలకొస్తే 81 లక్షల ఇళ్లను మంజూరు చేయగా, 47 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. ఇందులో 26 లక్షలు పూర్తయ్యాయి. 24 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించారు. - ఒక్కో ఇంటి నిర్మాణానికి 2015–16లో 314 రోజులు పట్టగా.. 2017–18 నాటికి ఇది 114 రోజులకు తగ్గిందని కేంద్రం వెల్లడించింది. తాగునీటికి ‘జల్ జీవన్’ 2019–20 కేటాయింపులు: రూ.10,001 కోట్లు 2018–19 కేటాయింపులు (సవరించిన అంచనా): రూ.5,500 కోట్లు - వర్షాభావ పరిస్థితుల కారణంగా తాగునీటి కష్టాల నేపథ్యంలో జాతీయ గ్రామీణ తాగునీటి పథకానికి (ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ) మరింతగా నిధుల పెంపు. - తాజాగా జల్ జీవన్ మిషన్‌ను బడ్జెట్లో ప్రకటించారు. దీనికింద 2024 నాటికి గ్రామీణ కుటుంబాలన్నింటికీ (హర్ ఘర్ జల్) తాగునీటిని అందించడమే లక్ష్యం. - వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు తగిన మౌలిక వసతుల కల్పన, భూగర్భజలాల పెంపు, మురుగునీటి నిర్వహణ కూడా జల్‌జీవన్ మిషన్‌లో భాగమే. గ్రామీణ టెలిఫోన్ 2019–20 కేటాయింపు: రూ.8,350 కోట్లు. 2018–19 కేటాయింపులు (సవరించిన అంచనా): రూ.5,000 కోట్లు. - భారత్ నెట్ ఫేజ్–1 కింద 1,21,652 గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కనెక్టివిటీ పూర్తి. 1.16లక్షల పంచాయతీల్లో అందుబాటులో సర్వీసులు. - దీంతో 2.5 లక్షల గ్రామాల్లోని దాదాపు 20 కోట్ల మంది గ్రామీణవాసులకు బ్రాడ్‌బ్యాంక్ యాక్సెస్ లభించింది. మరింత వేగం పెంచేందుకు పీపీపీ పద్ధతిలో పనులు. - 39,359 పంచాయతీల్లో వైఫై హాట్‌స్పాట్స్ ఇన్స్టలేషన్ పూర్తి. -
గ్రామ కార్యదర్శులకు కొత్త బాధ్యతలు
సాక్షి, ఇల్లందకుంట: గ్రామపంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం మరో 30 కొత్త బాధ్యతలను అప్పగించింది. ఇప్పటికే 6 బాధ్యతలను నిర్వహిస్తున్న గ్రామ కార్యదర్శులకు ప్రభుత్వం మరో 30 అదనపు బాధ్యతలను వీరిపై పెట్టింది. గ్రామ పంచాయతీ కార్యదర్శులు అసలే కొరతగా ఉన్నారు. ఒక్కో గ్రామ కార్యదర్శి రెండు మూడు గ్రామాలకు ఇన్‌చార్జీలుగా నెట్టుకొస్తున్నారు. ఆ బాధ్యతలనే మోయలేకుండా ఉన్న గ్రామ కార్యదర్శులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్త బాధ్యతలను అప్పగించింది. ప్రతీ గ్రామపంచాయతీకి ఒక కార్యదర్శిని నియమిస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రామ కార్యదర్శుల పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి ఎంపిక ప్రకియ కూడా పూర్తయినా కొంతమంది ఎంపికలో తప్పులు దొర్లాయని కోర్టుకు వెళ్లడంతో గ్రామ కార్యదర్శుల నియామకానికి బ్రేక్ పడింది. 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కార్యదర్శి గ్రామంలో పాలన బాధ్యతలను చూసుకోవడంతో పాటు సర్పంచ్‌కు సబార్డినేట్‌గా వ్యవహరించాలని సూచించింది. పంచాయతీల్లో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, నిర్వహణ, తాగునీరు, వీధిదీపాలు, రోడ్లు, డ్రెయినేజీలు మొక్కలు నాటడం, పారిశుధ్య కార్యక్రమాలు అమలు చేయాలని కోరింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్–42, సెక్షన్–286, సెక్షన్–43 ప్రకారం అప్పగించిన అన్ని బాధ్యతలు విధులు నిర్వర్తించాలని తెలిపింది. సెక్షన్ 6(8) ప్రకారం పంచాయతీ ఎజెండా రూపకల్పన బాధ్యత కా>ర్యదర్శిదేనని గ్రామ పాలకవర్గం అమోదంతో వీటిని అమలు చేయాలని సూచించింది. 24 గంటల్లో అనుమతులు.. భవన నిర్మాణాలకు 24 గంటల్లోనే అనుమతి ఇవ్వాలని సూచించింది. అంతేకాకుండా లేఅవుట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 7 రోజుల్లో అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. లేఅవుట్ల అనుమతితో పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రతీ లే అవుట్లో 15శాతం భూభాగాన్ని తనఖా చేయాలని కోరింది. గ్రామంలో తీసుకునే నిర్ణయాలు అభివృద్ధి కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు గ్రామస్తులకు సమాచారం అందించాలని సూచించింది. జనన, మరణాలతో పాటు వివాహా రిజిస్ట్రేషన్ల నిర్వహణ గ్రామ కార్యదర్శి చేయాల్సి ఉంటుంది. ఇవీ మార్గదర్శకాలు కార్యదర్శి ప్రభుత్వానికి సబార్బినేట్గా వ్యవహరించాలి గ్రామసభకు ఎజెండా తయారు చేసి అందులోని అంశాలు సభ్యులందరికి తెలిసేలా ప్రచారం చేయాలి. ప్రతీ మూడు నెలలకొకసారి ఖర్చుకు సంబంధించి లెక్కలను పంచాయతీ అమోదానికి సమర్పించాలి. వరదలు, తుఫాన్లు, అగ్ని, రోడ్లు ప్రమాదాలు సంభవించిన సందార్భాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలి. గ్రామంలో వ్యాధులు ప్రబలినప్పుడు అధికారులకు సమాచారమివ్వాలి. గ్రామాల్లోని అవసరాలను గుర్తించి గ్రామ అభివృద్ధి ప్రణాళిక తయారీలో పాలు పంచుకోవాలి. అలాగే ఎంపీపీ, ఎంపీడీవో, ఈవోపీఆర్డీ నిర్వహించే నెలవారి సమావేశాలకు హాజరు కావాలి. గ్రామసభలో లబ్ధిదారుల గుర్తింపు, వారికి రుణ పంపిణీ, రుణాల వసూళ్లకు సహకరించాలి. అంశాల వారీగా ఎజెండాలను సిద్ధం చేసి గ్రామపంచాయతీ అమోదం పొందాలి. ఎజెండాను ప్రదర్శించడం దండోరా వేయించడం, గ్రామాల్లోని పలు ప్రాంతాల్లో నోటీసులను అంటించి ప్రజలకు సమాచార చేరేలా చూడటం. బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీ వాడల్లో పర్యటించి ప్రభుత్వ పథకాల పంచాయతీ ఫలాలు అందేలా చూడాలి. వార్షిక పరిపాలన నివేదికను రూపొందించి గ్రామ పంచాయతీ అమోదం తీసుకోవడం. నెలవారీ సమీక్షలు, ప్రగతి నివేదికల రూపకల్పన ఉన్నతాధికారులకు నివేదికను అందించడం. మూడు నెలలకు ఒకసారి ఆర్థిక వ్యవస్థ అమోదించడంతో పాటు ఈవోపీఆర్డీలకు సమాచారం ఇవ్వడం. సమస్యలతో బాధపడుతున్నాం మూడు నుంచి నాలుగేసి గ్రామాలకు ఇన్‌చార్జీలుగా పని చేయడం ద్వారా పనిభారం పెరుగుతోంది. వారంలో నాలుగు గ్రామాల్లో పర్యటించి ప్రణాళికలు రూపొందించాలంటే ఇబ్బందవుతుంది. జిల్లా కేంద్రాల్లో అనుకోకుండా నిర్వహించే మీటింగ్‌లకు హడావిడిగా వెళ్లాల్సి వస్తోంది. – వాణి, కార్యదర్శి, శ్రీరాములపల్లి పాలనాపరమైన బాధ్యత తప్పదు కార్యదర్శులు తమ బాధ్యతలను నేరవేర్చాలి ఉంటుంది. పాలనపరమైన బాధ్యతలను చూసుకోవడంతో పాటు సర్పంచ్‌కు సబార్డినేట్‌గా వ్యవహరించాలని ప్రభుత్వం సూచించింది. త్వరలోనే కార్యదర్శుల నియామకం జరుగుతుంది. – జయశ్రీ, ఎంపీడీవో -
గ్రామాల్లో అభివృద్ధి పనుల ‘పవర్’ ఎవరికి..?
సాక్షి, మెదక్ అర్బన్ : గ్రామల్లో కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్‌లతో పాటు ఉపసర్పంచ్‌లకు ప్రాధాన్యత పెరిగింది. అదే సమయంలో చెక్‌పవర్ విషయంలో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు సమష్టి అధికారాన్ని కొత్త చట్టం కల్పించింది. ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీరాజ్ చట్టాన్ని అమలు చేయగా సర్పంచ్, ఉపసర్పంచ్‌ల జాయింట్ చెక్‌పవర్ అంశాన్ని ప్రభుత్వం ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా హోల్డ్‌లో పెట్టింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో కొత్త పంచాయతీలకు సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు తమ అధికార బాధ్యతలను గత నెల (ఫిబ్రవరి) 2వ తేదీన స్వీకరించారు. అలాగే తొలి పంచాయతీ గ్రామసభ, సమావేశాలను కూడా నిర్వహించడం జరిగింది. స్పష్టత కరవు.. అధికారుల బదలాయింపు జరుగుతుండగా ఆర్థిక లావాదేవీల బదలాయింపులు కూడా జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. కానీ జాయింట్ చెక్‌పవర్ అంశంపై స్పష్టత లేకపోవడంతో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొంది. జాయింట్ చెక్‌పవర్‌కు సంబంధించి చట్టంలో నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం త్వరలోనే ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను జారీ చేస్తుందని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకోసం కొత్తగా ఎన్నికైన ఉపసర్పంచ్లు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం స్పందించి జాయింట్ చెక్‌పవర్ ఉత్తర్వులను జారీ చేయాలని కోరుతున్నారు. తప్పని తిప్పలు... చెక్‌పవర్‌పై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో జిల్లాలోని గ్రామపంచాయతీ సర్పంచ్‌లు, పాలకవర్గాలకు తిప్పలు తప్పడంలేదు. గ్రామాల్లో మురుగు కాలువలు శుభ్రం చేయడం, పారిశుద్ధ్యం, వీధిదీపాలు ఏర్పాటు చేయడం వంటివి ఎప్పటికప్పుడూ చేయాల్సిన పనులు. అయితే వీటికి వెచ్చించాల్సిన నిధులకు ఎలాంటి ఆర్థిక వనరులు లేకపోవడంతో నూతనంగా ఎంపికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు తమ సొంత ఖర్చులతో కొన్ని పనులు చేయిస్తున్నామని చెబుతున్నారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో నీటి కోసం కొత్తగా మోటార్ల కొనుగోలు, పాత మోటార్లు రిపేరింగ్ చేయించడం, వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయడం వంటి వాటికి వేల రూపాయల్లో ఖర్చులు చేయాల్సి వస్తోంది. అలాగే గ్రామపంచాయతీల్లో పనిచేసే కార్మికులకు జీతాలు చెల్లించాడానికి కూడా నిధులు లేకపోవడం, వీరికి చెక్‌పవర్ రాకపోవడం చాలా ఇబ్బందికరంగా మారింది. జిల్లాలో 469 సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు.. జిల్లావ్యాప్తంగా మొత్తం 469 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామపంచాయతీల్లో 469 మంది సర్పంచ్‌లు, 469మంది ఉపసర్పంచ్లు ఎన్నికయ్యారు. ప్రస్తుతం వీరి అధ్యక్షతన పంచాయతీల్లో గ్రామసభలు జరిగాయి. లావాదేవీలన్నీ ఇద్దరితోనే... పంచాయతీ ఆర్థిక లావాదేవీలన్నీ కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ల ద్వారానే కొనసాగనున్నాయి. ఆర్థిక లావాదేవీల అధికారం బదలాయింపు జరుగుతుండటంతో చెక్‌పవర్ అంశం ప్రస్తుతం గ్రామాల్లో చర్చనీయాంశమైంది. జాయింట్ చెక్‌పవర్ అంశాన్ని హోల్డ్‌లో పెట్టిన ప్రభుత్వం ప్రస్తుతం కొత్తగా ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంటుందని పంచాయతీరాజ్ అధికారులు పేర్కొంటున్నారు. గ్రామ పంచాయతీ మొదటివిడత గ్రామసభ, సమావేశాలు ఆయా గ్రామాల్లో ఇప్పటికే నిర్వహించారు. జాయింట్ చెక్‌పవర్‌కు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం ఎప్పుడు జారీచేస్తుందోనని విషయాలు అధికారులు చెప్పలేకపోతున్నారు. సొంత డబ్బులతో పనులు.. గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగి సర్పంచ్‌గా ఎన్నికైనా ఇంతవరకు చెక్‌పవర్ రాకపోవడంతో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఇబ్బందులు తప్పడంలేదు. నేను సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత గ్రామంలో చాలా అభివృద్ధి పనులను చేపట్టాను. గ్రామాభివృద్ధికోసం ఇప్పటి వరకు సుమారు రూ.2 లక్షల వరకు సొంత డబ్బుల.ు ఖర్చు చేశాను. గ్రామంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాను. సర్పంచ్ల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని చెక్‌పవర్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – పరశురామ్రెడ్డి, సర్పంచ్, అజ్జిమర్రి, చిలిప్‌చెడ్ మండలం త్వరగా నిర్ణయం తీసుకోవాలి.. తాము సర్పంచ్‌లుగా బాధ్యతలు స్వీకరించి రెండునెలలు కావస్తున్నా ఇప్పటి వరకు చెక్‌పవర్ రాకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు సొంత డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ప్రస్తుతం వేసవికాలం కావడంతో గ్రామంలోని అన్ని చోట్ల నీటి ఎద్దడి నివారణకు పాత బోరు మోటార్లు రిపేరు చేయించడం జరిగింది. అలాగే కొత్తవి కొనుగోలు చేశాము. ఇవన్నీ సొంత డబ్బులతో చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం చెక్‌పవర్ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. – మహిపాల్‌రెడ్డి, సర్పంచ్, లింగ్సాన్‌పల్లి, హవేళిఘణపూర్ మండలం -
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
సాక్షి,నాంపల్లి: బీజేపీతోనే గ్రామాల అబివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన నివాసంలో మర్రిగూడెం మండలంలోని లెంకలపల్లి గ్రామానికి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. భావి తరాల అభివృద్ధికి బీజేపీ పాటుపడుతుందని తెలిపారు.యువత బీజేపీ వెంటే ఉందన్నారు. పార్టీలో చేరిన వారిలో బి.వెంకన్న, ఐతగోని నర్సింహ, దేవేందర్, వరుకుప్పల అనిల్, ఏర్పుల శ్రీశైలం, బరిగెల నాగరాజు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రావు, చాపల వెంకన్న తదితరులున్నారు. -
ఏ ఊరికెంత?
సాక్షి, హైదరాబాద్: గ్రామాల అభివృద్ధికి నిధుల కేటాయింపుపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. వరుసగా మూడేళ్లపాటు గ్రామాలకు కేటాయించే నిధులపై ప్రణాళిక రూపొందిస్తోంది. 2017–18, 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాల్లో కేటాయించిన, కేటాయించాల్సిన నిధుల వివరాలను ఇవ్వాలని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం అన్ని జిల్లాల పంచాయతీ అధికారులను ఆదేశించింది. పంచాయతీ ఎల్జీడీ కోడ్‌తోపాటు ఆర్థిక సంవత్సరాల వారీగా కేటాయింపులను పొందుపరచాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు మంజూరయ్యే నిధుల వివరాలను పేర్కొనాలని ఆదేశించింది. గ్రామ పంచాయతీ పాలకవర్గాల గడువు ఈ ఏడాది జూలై 31తో ముగుస్తున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ కొత్త చట్టం అమల్లోకి తెచ్చిన తర్వాతే వీటికి ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయిస్తామని సీఎం కేసీఆర్ పలుసార్లు ప్రకటించారు. దీంతో కొత్త పంచాయతీల ఏర్పాటు తర్వాత ప్రత్యేక అభివృద్ధి నిధులను కేటాయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల నుంచి గ్రామ పంచాయతీలకు రూ.1500 కోట్లతో పాటు ఇవి కాకుండా ఇతర సాధారణ అభివృద్ధి నిధులను మంజూరు చేస్తారు. ఏ గ్రామానికి ఎన్ని నిధులు కేటాయించాలనే అంచనా కోసం ప్రస్తుత కేటాయింపు వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. -
సమగ్ర గ్రామీణాభివృద్ధిలో తెల్లాపూర్ టాప్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సమగ్ర గ్రామాభివృద్ధిలో జాతీయస్థాయిలో తెలం గాణలోని తెల్లాపూర్ మొదటి ర్యాంకు సాధిం చింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని తెల్లపూర్ కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ నిర్వహించిన బేస్‌లైన్ సర్వేలో వందకు 92 మార్కులు సాధించింది. ‘అంత్యోదయ’ పథకం కింద పేదరికం లేని, సమగ్ర అభివృద్ధి సాధించిన గ్రామ పంచా యతీలకు ర్యాంకులు ఇచ్చేందుకు దేశ వ్యా ప్తంగా 41,617 గ్రామ పంచాయితీల్లో ‘బేస్ లైన్ సర్వే’ నిర్వహిం చింది. తొలి విడతలో ఒకటి నుంచి 10 ర్యాం కులు సాధించిన 83 పంచాయతీల జాబితాను వెల్లడించింది. ఇం దులో తెలంగాణలోని తెల్లాపూర్ పంచాయతీ జాతీయ స్థాయిలో ఒక టో ర్యాంకు పొందింది. వ్యవసాయం, అక్షరాస్యత, ఆర్థిక వనరు లతోపాటు మౌలిక వసతులలో దశాబ్ధాల క్రితమే అభివృద్ధి చెం దిన కోస్తా తీరం పరిధిలోని 33 గ్రామాలతో ఆంధ్రప్రదేశ్‌కు జాతీయస్థాయిలో మొదటి స్థానం దక్కింది. 10 ర్యాంకులు పొందిన 83 గ్రామాల్లో 33 గ్రామాలు కోస్తా తీరానికి చెందినవే కావడం గమనార్హం. అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న గుజరాత్ చెందిన ఒక్క గ్రామానికి కూడా తొలి పది ర్యాంకుల్లో చోటు దక్కలేదు. వ్యవ సాయంలో అగ్రగామిగా పేరు న్న పంజాబ్‌లో ఐదు, హర్యానా, బీహార్‌లోని వంటి రాష్ట్రా లకు ఒక్కో గ్రామానికి మాత్రమే ర్యాంకులు వచ్చాయి. వివరాలను మిషన్ అంత్యోదయ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు. తెలంగాణలో ఐదు జీపీలు జాతీయస్థాయి సర్వేలో 10 ర్యాం కుల వరకు సాధించిన గ్రామ పంచాయతీల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలి చింది. మొదటి స్థానంలో 33 గ్రామ పంచాయ తీలతో ఏపీ ఉండగా, రెండో స్థానంలో 21 జీపీలతో తమిళనాడు నిలిచింది. ఆరు పంచాయతీలతో కేరళ మూడో స్థానం లో, ఐదేసి గ్రామ పంచాయతీలతో తెలంగా ణ నాలుగో స్థానంలో నిలిచింది. తెల్లాపూర్ ఒకటో ర్యాంకును కైవసం చేసు కుంటే, 7వ ర్యాంకులో వరంగల్ జిల్లాలోని కొనైమాకుల, 8వ ర్యాంకు గడ్డమల్లయ్య గూడ (రంగారెడ్డి), 9వ ర్యాంకులను యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కొండమడుగు, రంగారెడ్డికి చెందిన చౌదర్ పల్లి గ్రామాలు సాధించాయి. -
53 మండలాలు.. 93 పంచాయతీలు
పల్లె పిలుపునకు శ్రీకారం - జిల్లా వ్యాప్తంగా గ్రామాభివృద్ధికి బాటలు - వెల్దుర్తి మండలం మల్లేపల్లె, కృష్ణగిరిలో పాల్గొన్న కలెక్టర్ - పల్లె బాట పట్టిన జిల్లా అధికారులు - నీటి సమస్యపై వినతుల వెల్లువ కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పిలుపు కార్యక్రమం బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. 53 మండలాల్లోని 93 గ్రామ పంచాయతీల్లో కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల్లో వర్షాలు కురవడంతో ఉష్ణోగ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ కారణంగా మొదటి రోజు అధికారులంతా ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. అన్ని శాఖల అధికారులు మండలాలకు స్పెషల్ ఆఫీసర్లుగా హాజరయ్యారు. నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా నియమితులైన డిప్యూటీ కలెక్టర్లు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. వెల్దుర్తి మండలం మల్లేపల్లెలో కలెక్టర్ సత్యనారాయణ పల్లె పిలుపును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామం మొత్తాన్ని కలియ తిరగడంతో పాటు ఎన్ఆర్జీఎస్ పనులను, గ్రామ స్థాయిలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేశారు. గ్రామంలో నెలకొన్న పారిశుద్ధ్య లోపంపై కలెక్టర్ పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యలో బడి మానేసిన విద్యార్థుల గురించి ఆరా తీశారు. గ్రామంలో డ్రాప్ అవుట్స్ ఎవరూ లేరని ఎంఈఓ కలెక్టర్‌కు వివరించారు. అయితే కలెక్టర్ గ్రామంలో తిరుగుతూ మధ్యలో బడి మానేసిన ఒక బాలుడిని గుర్తించి తప్పడు సమాచారం ఇచ్చినందుకు ఎంఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మండల కేంద్రమైన క్రిష్ణగిరికి చేరుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు మెడికల్ ఆఫీసర్ సరిగ్గా సమాధానాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహించారు. పీహెచ్సీ నిర్వహణలో లోపాలను గుర్తించారు. ఈ కార్యక్రమాల్లో పల్లె పిలుపు కార్యక్రమ ఉద్దేశాలను జిల్లా కలెక్టర్ వివరించారు. ఇదిలాఉండగా జిల్లా కలెక్టర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమాన్ని కల్లూరుతో పాటు వివిధ మండలాల్లో అధికారులు తూతూ మంత్రంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. మండల స్థాయిలో ఎంపీడీఓ, తహసీల్దారు ఆధ్వర్యంలో రెండు టీములు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉండగా.. మొదటి రోజు పలు మండలాల్లో ఎంపీడీఓ, తహసీల్దారు కలసి ఒకే టీముగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పల్లెపిలుపు కార్యక్రమంలో భాగంగా ప్రజలు అధికారులకు తమ సమస్యలపై భారీగా వినతిపత్రాలను అందించారు. ప్రధానంగా నీటి సమస్యపై వినతులు వెల్లువెత్తాయి. -
తీరు మారకుంటే చర్యలు
- అధికారులకు కలెక్టర్ సత్య నారాయణ హెచ్చరిక - ఆలూరు, దేవనకొండ ఆస్పరి మండలాల్లో సుడిగాలి పర్యటన ఆలూరు: ‘పల్లెప్రగతి కోసం పని చేయాలనే తపన ఉండాలి.. అలాంటి అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా గురిస్తారు’ అని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. అలా కాకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు ఇప్పటికైనా పనితీరు మార్చుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. పల్లె పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గురువారం ఆలూరు నియోజకవర్గ పరిధిలోని ఆలూరుతోపాటు దేవనకొండ మండలం కరివేముల, ఆస్పరి మండలం వెంగళాయిదొడ్డి గ్రామాల్లో పరర్యటించారు. చెరువుల పూడిక తీత, కాల్వ మరమ్మతు పనులను ప్రారంభించారు. ఆలూరులోని జీన్స్ ప్యాంట్ కుట్టుశిక్షణ కేంద్రం, ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను సక్రమంగా వినియోగిస్తే పల్లె ప్రగతికి డోకా ఉండదన్నారు. నిధులు మంజూరైనా పనుల్లో జాప్యం జరిగితే అధికారులపై చర్యలు తప్పవన్నారు. పల్లెపిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ప్రతి పంచాయతీని వారంలో రెండు, మూడుసార్లు సందర్శించి అభివృద్ధి పనులపై ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. వైద్యుల నియామకానికి హామీ .. ఆలూరు ప్రభుత్వాసుపత్రిని జిల్లా కలెక్టర్ తనికీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఏఎన్ఎంల పనితీరు ఇంత దారుణంగా ఉందేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని డాక్టర్లకు సూచించారు. ఎల్లార్తి రోడ్డులోని జీన్స్‌ప్యాంట్ కుట్టు శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. శిక్షణ కేంద్రంలో మహిళలకు పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని డీఆర్డీఏ పీడీ రామకృష్ణను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో డ్వామా పీడీ పుల్లారెడ్డి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ రామచంద్రరావు, ఆదోని ఆర్డీఓ ఓబులేసు, రాష్ట్ర జల వనరుల అపెక్స్ కమిటీ సభ్యుడు కుమార్‌గౌడు, వెంగళాయిదొడ్డి చెరువు నీటి సంఘం అధ్యక్షుడు మల్లికార్జునగౌడు, ఆయా మండలాల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నేలకొరిగిన విద్యుత్ స్తంబాలు చీకట్లోనే సమీక్ష.. పత్తికొండ రూరల్: మండల పరిధిలోని దూదేకొండ శివారులో గురువారం సాయంత్రం పెనుగాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు నేలకూలడం, చెట్లు కూలి తీగలపై పడడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో పత్తికొండ ఎంపీడీఓ కార్యాలయంలో కలెక్టర్ సి.సత్యనారాయణ చీకటీలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. -
పల్లె పిలుపుతో గ్రామీణాభివృద్ధి
ఎంపీడీఓ, తహశీల్దార్ల ఆధ్వర్యంలో రెండు టీమ్‌ల ఏర్పాటు – ప్రతి వారం రెండు గ్రామాలకు వెళ్లి అధ్యయనం – మూడు నెలల్లో అన్ని గ్రామాల్లో పర్యటన – వర్క్‌షాప్‌లో కలెక్టర్ సత్యనారాయణ కర్నూలు(అగ్రికల్చర్): గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా పల్లె పిలుపు కార్యక్రమం చేపట్టాలని.. అన్ని శాఖల అధికారులు జవాబుదారీ తనంతో గ్రామీణ ప్రగతికి బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో పల్లె పిలుపు కార్యక్రమంపై మండల స్థాయి అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఏఈలు తదితరులతో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనెల 17 నుంచి ప్రారంభించనున్న పల్లె పిలుపు కార్యక్రమంపై కలెక్టర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామ పరిపాలన పటిష్టమైతే ప్రజా సమస్యలు గ్రామ స్థాయిలోనే చాలా వరకు పరిష్కారమవుతాయన్నారు. గ్రామ స్థాయి పరిపాలనను మెరుగు పరిచేందుకు తహసీల్దార్, ఎంపీడీఓల ఆధ్వర్యంలో రెండు టీమ్‌లు ఏర్పాటు చేశామని, ప్రతి వారం ఈ టీమ్‌లు రెండు గ్రామాలను విధిగా కవర్ చేయాలని తెలిపారు. గ్రామాలకు వెళ్లే ఈ టీమ్‌లు గ్రామ స్థాయిలో ఉన్న పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్ సబ్ సెంటర్లు, చౌక దుకాణాలు తదితరాలను తనిఖీ చేసి లోపాలను గుర్తించాలన్నారు. ఇలా మూడు నెలలకు మండలంలోని అన్ని గ్రామాలను కవర్ చేయాలని ఆదేశించారు. పిల్లె పిలుపు కార్యక్రమాన్ని నోడల్ ఆఫీసర్లు పర్యవేక్షించాలని సూచించారు. ఈ ఏడాది 400 గ్రామాలను బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి హైస్కూల్‌కు ప్లే గ్రౌండ్ ఉండాలని, లేని పాఠశాలలకు ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.5 లక్షలతో ప్లే గ్రౌండ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. నీటి సమస్య పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని.. సమస్య ఎక్కువగా ఉంటే తక్షణం ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని ఆదేశించారు. సమావేశంలో సీపీఓ ఆనంద్‌నాయక్, జడ్పీ సీఈఓ ఈశ్వర్, అన్ని మండలాల నోడల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. -
జగదూర్తి శ్రీమంతుడు
- సొంతూరులో పర్యటించిన తమిళనాడు ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ మధుసుదన్ రెడ్డి - ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు - వివిధ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష డోన్ టౌన్ : జగదూర్తి గ్రామంలో పుట్టిపెరిగిన ఆ యువకుడు 2011లో ఐఏఎస్‌కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం తమిళనాడు ల్యాండ్ రెవెన్యూ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. తాను పుట్టిన ఊరి రుణం తీర్చుకోవాలని భావించి శనివారం గ్రామానికి వచ్చాడు మధుసూదన్‌రెడ్డి. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆనందంతో అతడికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మధుసూదన్‌రెడ్డి మండల అధికారులను వెంటబెట్టుకొని ఊరంతా కలియ తిరిగాడు. గ్రామ సభ నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. తర్వాత చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అక్కడే అధికారులతో సమీక్ష జరిపారు. శాశ్వత అభివృద్ధి పనులకే ప్రాధాన్యత భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో గ్రామసమీపంలోని వంకలో రెండు పెద్ద చెక్ డ్యాంల నిర్మాణం, బలహీనంగా ఉన్న చెరువుకట్టను పటిష్ట పరిచి, అందులోని పూడిక తొలగింపుపై దృష్టిసారించారు. ఇందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఐఏఎస్ మధుసుదన్ రెడ్డి స్థానిక అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ విజయమోహన్ సూచనల మేరకే గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపై క్షేత్రస్థాయి పర్యటన జరుపుతున్నట్లు వెల్లడించారు. గ్రామంలో మంచినీరు, సీసీరోడ్లతో పాటు 44వ నంబర్ జాతీయ రహదారి నుంచి ఊరికి రోడ్డు వేయడం తన ముందున్న లక్ష్యమన్నారు. ఇందుకు అధికారులు, గ్రామస్తుల సహకారం కావాలని కోరారు. ఆయన వెంట జిల్లా భూగర్భ జల శాఖ ఏడీ రవీంద్రరావు, తహసీల్దార్ మునికృష్ణయ్య, ఎంపీడీఓ క్యాథరిన్, ఈఓఆర్డీ మణిమంజరి, ఏపీడీ పద్మావతి, ఏపీఓ మద్దేశ్వరి, మైనర్ ఇరిగేషన్ ఏఈ నారాయణ, పీఆర్ఏఈ నారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శివకుమార్, గ్రామసర్పంచ్ సుంకులమ్మ , గ్రామ పెద్దలు ప్రతాప్ రెడ్డి, మోహన్ రెడ్డి, రంగారెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
గ్రామాలతోనే 'బంగారు'బాట
-
గ్రామాలతోనే 'బంగారు'బాట
పల్లెలను పటిష్టపర్చడమే బంగారు తెలంగాణ: సీఎం కేసీఆర్ - అద్భుత మానవ వనరులే మన అసలైన సంపద - దూరదృష్టితో వృత్తి పనులకు చేయూతనిస్తున్నాం - రాజకీయ అవినీతిని 95 శాతం తగ్గించాం - రాష్ట్రాన్ని దేశంలోనే గొప్పగా తీర్చిదిద్దడం నా లక్ష్యం - 4 లక్షల యాదవ కుటుంబాలకు సబ్సిడీపై 88 లక్షల గొర్రెలిస్తాం.. - గొల్ల కురుమలు లక్షాధికారులు, కోటీశ్వరులు కాబోతున్నారు - ‘జనహిత’ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేసీఆర్ సాక్షి, హైదరాబాద్ దేశంలో ఏ రాష్ట్రం లేనంత గొప్పగా తెలంగాణను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. బంగారు తెలంగాణ ఎక్కడో లేదని, గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేయడంలోనే ఉందని చెప్పారు. అపార నైపుణ్యమున్న మానవ వనరులే అసలైన సంపద అని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ కొత్త రాష్ట్రం. కొందరికి ఎప్పుడెప్పుడు అధికారంలోకి రావాలా అన్న ఆలోచన ఉంటుంది. నా ఆలోచన వేరు. ప్రజలకు అధికారం రావాలి. అదే నాకు ప్రాధాన్యం. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపూర్ణంగా బలోపేతం చేసే కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇవి చిల్లర మల్లర రాజకీయాల కోసం చేసేటివి కావు. మంచి ఉద్దేశంతో ముందుకుపోతున్నా. భవిష్యత్తును దర్శించి పేదరిక నిర్మూలనకు, వృత్తి పనివాళ్ల కోసం కార్యక్రమాలు చేపడుతున్నాం..’’అని చెప్పారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో జనహిత కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘‘ఆర్థిక పురోగతిలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలోని ఆర్థిక వనరులతో వచ్చే ఆదాయంలో 19.5 శాతం వృద్ధి సాధించింది. దేశంలో తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా ముందుకెళుతోంది. రాష్ట్రంలో రాజకీయ అవినీతిని 95 శాతం తగ్గించాం. గతంలో ఉన్న అరాచకల్లేవు. రాష్ట్ర ఆర్థిక పురోగతి అద్భుతంగా ఉంది. రాష్ట్రం ఏర్పాటై మూడేళ్లు కావొస్తుంది. దేశంలో ఇప్పుడు ధనిక రాష్ట్రం మనదే’’అని అన్నారు. సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే... ఏడాదిన్నర తర్వాత అవగాహన వచ్చింది రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలినాళ్లలో పరిస్థితి అంతా గందరగోళంగా ఉండేది. ఏడాదిన్నర తర్వాత ఒక అవగాహన వచ్చింది. ఆ తర్వాత ఒక్కో కార్యక్రమాన్ని చేపడుతూ ముందుకెళుతున్నాం. టీఎస్ఐపాస్ పెట్టుకున్నాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరిచేందుకు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాం. తాగునీటి సమస్య శాశ్వతంగా దూరం చేసేందుకు మిషన్ భగీరథ అమలు చేశాం. ఇంటింటికీ మంచినీటిని అందిస్తే ప్రజారోగ్యం బాగుపడుతుంది. రోగాలు దరిచేరవు. ఆ నీరు వచ్చాక ఇప్పుడున్న భోజనం, కూరల రుచి మారుతుందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టానికి సాగునీటి వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. ఇప్పటికే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. రైతులకు కులం లేదు. భూమి ఉన్న వారందరూ రైతులే. సాగునీరుంటేనే రైతులు బాగుపడుతారు. ఇప్పుడు కరెంటు పోతే వార్త తెలంగాణ వస్తే ఆగమై పోతారు.. కరెంటు ఉండదు.. అంధకారమేనని ఆఖరి సీఎం కట్టె పట్టుకుని చెప్పిండు. కానీ ఇప్పడు కరెంటు పుష్కలంగా ఉంది. ఇప్పుడు తెలంగాణలో కరెంటు ఉంటే కాదు.. కరెంటు పోతే వార్త. విద్యుత్ సమస్యను సంపూర్ణంగా పరిష్కరించుకున్నాం. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ట పర్చేందుకు కొత్త కార్యక్రమాలు చేపడుతున్నాం. జిల్లాల వారీగా మానవ వనరులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వమని కలెక్టర్లకు చెప్పా. కానీ చాలా మంది కలెక్టర్లకు అది అర్థమైనట్లు లేదు. సీనియర్ ఐఏఎస్ అధికారులకు సైతం అర్థం కాలేదు. నా లెక్క ప్రకారం మానవ వనరులంటే మన వృత్తి పనివాళ్లు. అద్భుతమైన నైపుణ్యమైన తెలంగాణ బిడ్డలు. గతంలో చేపల ఉత్పత్తిపై దృష్టి పెట్టలేదు తెలంగాణలో మత్స్య కార్మికులు 40 లక్షల మంది ఉన్నారు. వారితో చేపల పరిశ్రమను అభివృద్ధి చేయాలి. చేపల ఉత్పత్తి పెంచి మార్కెట్ చేయగలిగితే అదే తెలంగాణ మానవ వనరుగా నా లెక్క. అసెంబ్లీలో చేపల గురించి నేను మాట్లాడినందుకు ఏపీకి చెందిన నేతలు సైతం అభినందనలు తెలిపారు. గతంలో చేపల ఉత్పత్తిపై దృష్టి పెట్టలేదు. అలాగే రాష్ట్రంలో 25.50 లక్షల మంది యాదవులున్నారు. ఇంతమంది ఉన్నా సమైక్య పాలనలో వీళ్లను పట్టించుకోలేదు. వీరికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు రోజూ 600 గొర్రెల లారీలు వస్తున్నాయి. రామ్‌నగర్ చేపల మార్కెట్‌కు 35 నుంచి 40 లారీల్లో చేపలు దిగుమతి అవుతున్నాయి. యాదవ, ముదిరాజ్ సోదరులను అద్భుత నైపుణ్యమైన, గొçప్పగా పని చేసే జాతి రత్నాలుగా వీరిని నేను గుర్తిస్తా. తెలంగాణ సంపద అంటే వీళ్లే. 4 లక్షల యాదవ కుటుంబాలకు దేశంలో ఎక్కడా లేని విధంగా 75 శాతం సబ్సిడీపై 88 లక్షల గొర్రెలు సరఫరా చేస్తాం. అంతకంతకు ఆ సంపద రెట్టింపవుతుంది. దిసీజ్ బంగారు తెలంగాణ.. ఇప్పుడున్న 50 లక్షల గొర్రెలు కాకుండా.. రెండేళ్లలో దాదాపు 4 కోట్ల గొర్రెలు తయారవుతాయి. ఒక్కో గొర్రెకు రూ.5 వేలు లెక్కేసినా.. ఒక తెలంగాణ యాదవ కులం దగ్గర రూ.20 వేల కోట్ల సంపద సమకూరుతుంది. దిసీజ్ తెలంగాణ. ఇదీ బంగారు తెలంగాణ. ఆ దార్శనికత కావాలి. కాల్పనికత కావాలి. చేరుకునే ధృతి ఉధృతి కావాలి. ఆ ఉధృతితో చేరుకుంటే నూరు శాతం ఫలితం వస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా గొల్ల కురుమలు లక్షాధికారులు, కోటీశ్వరులు కాబోతున్నారు. నేను బతికున్న కాలంలోనే ఇది సాధించి చూపిస్తా. అదేవిధంగా కుమ్మరులు, నాయి బ్రాహ్మణులు ఉన్నారు. ఆధునిక పద్ధతుల్లో కుండలు తయారు చేసే కార్యక్రమాలపై ఆలోచిస్తున్నాం. అనాగరిక పద్ధతులకు భిన్నంగా ప్రతి గ్రామంలో నవీన క్షౌ రశాలలు( హైజెనిక్ సెలూన్) పెట్టించే ప్రయత్నం చేస్తున్నాం. ధనిక రాష్ట్రంలో పేదరికం ఎందుకుండాలె? గుడ్డి లెక్కన చెప్పాలంటే.. తెలంగాణ ఆదాయంలో ఏటా రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల నగదు పెరుగుదల ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్రానికి ఇంత ఆదాయం లేదు. ఇంత డబ్బున్నప్పుడు పేదరికమెందుకుండాలె? ఇక్కడ వృత్తి పనివాళ్లు ఎందుకు చిన్నబోవాలె? అలా ఉండటానికి వీల్లేదు. అదే దిశగా కార్యచరణ చేపడుతున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర అవగాహన వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలతో అద్భుతంగా పురోగమిస్తాం. ఎర్రవల్లి ఆదర్శం నోట్ల రద్దు తర్వాత నేను దత్తత తీసుకున్న ఎర్రవల్లి గ్రామంలో ఒక బ్యాంకు ఏర్పాటు చేస్తే.. అక్కడ ప్రజలు రూ.75 లక్షలు డిపాజిట్ చేశారు. ఇంత డబ్బు ఎక్కడిదని ఒక ముసలావిడను నేను అడిగినా.. ‘పించన్ డబ్బులు మొత్తం ఖర్చు చేస్తలేం.. దాచుకుంటున్నాం..’అని నాతో చెప్పింది. గ్రామీణ ప్రాంతాల ఆదాయం విస్తరిస్తే.. అన్ని వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అందరికీ పని దొరుకుతుంది. డబ్బు సర్క్యులేట్ అవుతుంది. ఇది గ్రామ సంపద. గామీణ వృత్తులు.. గ్రామీణ ఆదాయం పెరిగితే ప్రతి గ్రామం ధనిక గ్రామం అవుతుంది. ఆపదలు ఎదుర్కొనే స్తోమత సమకూరుతుంది. -
గ్రామాల అభివృద్ధిలో యువత పాత్ర కీలకం
స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు ఆదిలాబాద్ రూరల్ : గ్రామాల అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని యువజన సర్వీసుల శాఖ స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు అన్నారు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని యాపల్‌గూడ గ్రామంలో యువదర్శిని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ శాఖ ఆధ్వర్యంలో యువతను చైతన్యవంతం చేసేందుకు యువదర్శిని కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. యువజన సంఘాలు పొదుపు చేసుకుంటే రుణాలు ఇస్తామని తెలిపారు. అలాగే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై యువత స్పందించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కొడప ఇస్రూబాయి, ఎంపీటీసీ శ్రీవాణి, పంచాయతీ కార్యదర్శి అనిల్‌కుమార్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తూరాటి గంగన్న, గ్రామ యువజన సంఘం అధ్యక్షుడు రోషన్, స్వామి, స్టెప్ సిబ్బంది దశరథ్, మసూద్ పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి
మంచాల: గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటు పడాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం మంచాల మండల పరిధిలోని లింగంపల్లి, తాళ్లపల్లి గూడ గ్రామాల్లో హరితాహారం పథకం కింద మొక్కలు నాటారు, అదే విధంగా ఆయా గ్రామాల్లో సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడన్నాకి ప్రతి ఒక్కరు బాధ్యతగా బావించి ముందుకు రావాలన్నారు. గ్రామాల్లో ప్రజలందరికి మౌలిక వసతుల కల్పన కోసం తన వంతు సహాకారం ఎల్లప్పుడు ఉంటుందన్నారు.ప్రధానంగా పారిశుద్ధ్యం, తాగునీరు, విధి లైట్లు, వంటి సమస్యలను పరిష్కారించుకోవాలన్నారు. అదే విధంగా గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం కూడా చాలా అవసరమన్నారు. గ్రామాల అభివృద్ధికి విడుతల వారిగా నిధులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చె నిధులను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు కూడా పేదలకు అందించే విధంగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అన్నారు. బంగారు తెలంగాణ రాష్ర్ట సాధనలో బాగంగా ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, షాధిముభారక్, వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు ,రవాణా సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల రోడ్ల అభివృద్ధికి కోట్లాది రూపాయాలు కేటాయించడం జరిగిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలు గుర్తించుకోవాలన్నారు. లింగంపల్లిలో రూ.5లక్షలతో సీసీ రోడ్డు, మరో రూ.5లక్షలతో అండర్ డ్రైనేజీ పనులు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా తాళ్లపల్లి గూడ గ్రామంలో రూ.5లక్షలతో సీసీ రోడ్డు, రూ.3లక్షలతో అండర డ్రైనేజీ పనులు ప్రారంభం చేయడం జరిగింది. హరితాహారం..... హరితాహారం పథకంలో బాగంగా లింగంపల్లి, తాళ్లపల్లి గూడ గ్రామాల్లో 5వేల మొక్కలు నాటడం జరిగింది. నాటిన ప్రతి మొక్కను కాపాడాలని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో హరితాహారం పథకం అమలు చేయడం జరుగుతుందన్నారు. నాటిన మొక్కలను కాపాడినప్పుడే ఆ పథకాన్నికి సార్ధకత చేకూరుతుందన్నారు.గ్రామాల్లో పాఠశాల స్థాయి నుండి రైతు వరకు కచ్చితంగా మొక్కలు నాటాలి. వాటిని పెంచాలన్నారు. ప్రకృతి వైఫరిత్యాలను అడ్డుకోవాలంటే కచ్చితంగా మొక్కలను నాటాలన్నారు. పచ్చధనం ద్వారా ప్రకృత్తి బాగుంటుందన్నారు.ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలి, రైతులు బాగుండాలి అంటే కచ్చితంగా మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో మంచాల ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ సభ్యుడు భూపతిగళ్లమహిపాల్, వైస్ ఎంపీపీ భాషయ్య, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దండేటికార్ రవి, డైరెక్టర్ కిషన్‌రెడ్డి, లింగంపల్లి సర్పంచ్ రాచకొండ వాసవి, తాళ్లపల్లిగూడ సర్పంచ్ యాదయ్య, ఎంపీటీసీ సభ్యురాలు మంజుల, ఉప సర్పంచ్ మహేంధర్, వార్డు సభ్యులు, ఎంపీడీఓ నాగమణి, తహసీల్దార్ శ్యాంప్రకాశ్, మాజీమార్కెట్ కమిటీ చైర్మన్ అంజిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిందం రఘుపతి, నాయకులు పరమేష్, శ్రీరాంలు, జానీ పాష, యాదయ్య, సీఐ గంగాధర్, ఎస్సైలు కె.యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ ఉపాధికి పరిశ్రమల స్థాపన
ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ పటేల్ కడియం : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన లక్ష్యంగా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఏవీ పటేల్ చెప్పారు. ఆయన సారథ్యంలోని పలువురు అధికారుల బృందం మండలంలోని జేగురుపాడు పంచాయతీ పరిధిలోని పాములమెట్ట కాలనీ వద్ద గల స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పటేల్ మాట్లాడుతూ నియోజకవర్గానికి ఒక్కొక్కటి చొప్పున ది మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందుకోసం జేగురుపాడు పంచాయతీ పరిధిలోని, మండపేట మండలం వేములపల్లిలోని, రాజానగరం మండలం కొండ గుంటూరుల్లోని స్థలాలను పరిశీలించినట్టు వివరించారు. పాములమెట్ట వద్ద గన్న 38.67 ఎకరాల స్థలంఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఈ నెల 15న పార్కు నిర్మాణ చర్యలు ప్రారంభమవుతాయన్నారు. ఈ బృందంలో పటేల్‌తోపాటు ఏపీఐఐసీ జీఎం పి. నాగేశ్వరరావు, మేనేజర్ జ్యోత్సS్న, డిప్యూటీ డైరెక్టర్ డేవిడ్ సుందర్‌కుమార్, రిటైర్డ్ ఏడీ ఆఫ్ సర్వేస్ వి. సోమరాజు తదితరులు ఉన్నారు. కాగా వైస్ ఎంపీపీ వెలుగుబంటి రఘురామ్ ఈ బృందాన్ని కలిసి భూములను గురించి వివరించారు. స్థానిక నాయకులు కూడా ఉన్నారు. -
విద్యాభ్యాసంతోనే గ్రామాభివృద్ధి
టీడీపల్లి(మడకశిర రూరల్): విద్యాభ్యాసంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని స్పెయిన్ దేశస్థులు పేర్కొన్నారు. మండల పరిధిలోని టీడీపల్లి ఎస్సీ కాలనీలో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ట్యూషన్ చెప్పడానికి నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని ఆదివారం ఆర్డీటీ ఆర్డీ కృష్ణవేణి, స్పెయిన్ దేశస్తులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ గాయత్రీమంజునాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్పెయిన్ దేశస్తులు పారాదాన్, షబ్బీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోడానికి తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. అదేవిధంగా హరిజన కాలనీలో విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని కాలనీలోని పాఠశాల భవనం నిర్మించి వారికి ఉదయం సాయంత్రం విద్యను బోధించడానికి ఉపాధ్యాయుడిని నియమించామన్నారు. ఆర్డీ కృష్ణవేణి మాట్లాడుతూ దళిత కాలనీలో విద్యార్థుల విద్యాభివృద్ధే ధ్యేయంగా సంస్థ కృషి చేస్తోందని, అదేవిధంగా ఇళ్లులేని నిరుపేదలను గుర్తించి వారికి ఇళ్ల సౌకర్యం కల్పిస్తామన్నారు. సర్పంచ్ మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.అనంతరం సర్పంచ్ ఆర్డీ, స్పెయిన్ దేశస్తులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ ఏరియా టీఎం లీడరు వన్నూరుస్వామి, ఎస్టీఎల్ తిప్పమయ్య, మధుసూధన్, కోఆర్డినేటర్ సత్యనారాయణరెడ్డి, ఇంజినీరు రాజశేఖర్, టీటీ మేఘనాథ్, సీడీసీ సభ్యులు రంగనాథ్, రంగప్ప, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ గారూ.. దత్తత గ్రామాన్ని చూడరూ..!
వైఎస్సార్ జిల్లా: స్వచ్ఛభారత్‌లో భాగంగా జిల్లాస్థాయి నుంచి మండల స్థాయి అధికారుల వరకు ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మండలంలోని మల్లెపల్లె గ్రామ పంచాయతీని అప్పటి కలెక్టర్ కేవీ రమణ దత్తత తీసుకున్నారు. ఏడాది క్రితం ఆయన దత్తత తీసుకున్న పంచాయతీని ఓ ఒక్కసారి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి కనీస వసతులపై సర్పంచి నాగిపోగు పెంచలయ్య, ఎంపీటీసీ సభ్యురాలు చిలేకాంపల్లె ఉమాదేవి ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. పంచాయతీ పరిధిలో లింగాలదిన్నెపల్లె, చెంచయ్యగారిపల్లె, ఎద్దులాయపల్లె, మల్లేపల్లె, శ్రీరాంనగర్, ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ ఉన్నాయి. తాగునీరు, విద్యుత్, రోడ్లు, మరుగుదొడ్లు తదితర సమస్యలు నెలకొన్నాయి. వీటి పరిష్కారానికి నివేదికలు తయారు చేసివ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆయన బదిలీపై వెళ్లడంతో కొత్త కలెక్టర్ సత్యనారాయణ దత్తత గ్రామంపై దృష్టిపెట్టాలని పంచాయతీ ప్రజలు కోరుతున్నారు. -
సార్లొచ్చె... సందడి తెచ్చె!
స్పెషల్ స్టోరీ జిల్లా కేంద్రానికి దూరంగా అక్కడక్కడా విసిరేసినట్టున్న మారుమూల పల్లెలు అవి. పొద్దంతా కాయకష్టం చేసుకొని... పొద్దు గూకిన వేళ గూటికి చేరే పక్షుల్లాంటి పల్లె జనం. అలాంటి పల్లెలకు ఓరోజు అను కోని అతిథులు వచ్చారు. వారం రోజుల పాటు పల్లెల్లో సందడి చేశారు. పల్లె తల్లి ఒడిలో నిద్రపోయారు. ఊరు జనం ప్రేమలో స్వచ్ఛతను చూసి మురిశారు. వాళ్లంతా ఆలిండియా సర్వీసెస్ శిక్షణలో ఉన్నవారు. పల్లెల పరిస్థితుల్ని, సాధించిన సాధించాల్సిన ప్రగతిని అంచనా వేయడానికి వచ్చారు. పల్లె వాకిట పండుగ వాతావరణాన్ని సృష్టించి వెళ్లారు! ఇటీవల హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రానికి 104 మంది ఆలిండియా సర్వీసెస్ ట్రెయినీలు వచ్చారు. వీరిని తెలంగాణ లోని కొన్ని జిల్లాలకు గ్రామస్థాయి అధ్యయనం కోసం పంపించారు. ఆ సందర్భంగా మెదక్ జిల్లాకు 27 మంది వచ్చారు. గ్రామాల స్వరూపం దగ్గర్నుంచి అన్ని విషయాలనూ అధ్యయనం చేసి వెళ్లారు. నులక మంచంలోనే నిద్ర.... ఐఏఎస్, ఐపీఎస్ అన్న మాటలు వింటేనే... అత్యున్నత స్థాయి అధికారులుగా వారి స్థాయి గుర్తొచ్చి అందరి మనసుల్లో గౌరవం పొంగుకొస్తుంది. అందుకే కాబోయే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు తమ ఊరిని వెతుక్కుంటూ వచ్చేసరికి తెలంగాణ జిల్లాల్లోని పలు పల్లెల ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఘనంగా స్వాగతాలు పలికారు. ఆప్యాయంగా అతిథి మర్యాదలు చేశారు. ట్రెయినీలు కూడా ఎటువంటి భేషజం లేకుండా అందరితోనూ కలిసిపోయారు. మీలో మేమూ ఒకళ్లం అన్నట్టుగా కలివిడిగా కలియతిరిగారు. పల్లె జనం ఇచ్చిన నులక మంచం, పాఠశాలల బెంచీల మీదే పడుకున్నారు. రక్తం పీల్చే దోమల దాడికి తట్టుకున్నారు. కలత నిద్రకు అర్థం తెలుసుకున్నారు. అపరిచిత వ్యక్తులు వచ్చారనే హెచ్చరికలు జారీ చేసే కుక్కల అరుపుల్ని కూడా సంగీతంలా ఆస్వాదించారు. పల్లె ప్రజల జీవనం ఎలా ఉంటుందో క్షణక్షణం పరిశీలించి అవగాహన చేసుకున్నారు. ఆశ్చర్యపర్చిన అభివృద్ధి... పల్లె అనగానే వెలగని దీపాలు, గుంతలు పడ్డ రోడ్లు, నిలిచిపోయిన వాన నీళ్లు, ఎండిన పొలాలు, పూరి గుడిసెలు... ఇలా అన్నీ వెనుకబడిన ఆలోచనలే వస్తుంటాయి. కానీ వాటిలో కూడా అభివృద్ధి పీట వేసుకుని కూర్చుందన్న విషయం స్వయంగా చూసిన సివిల్స్ ట్రెయినీలు ఆశ్చర్యపోయారు. ఇబ్రహీం పూర్ గ్రామంలో ఎక్కడా దోమ అన్నదే లేదు. దేశంలో దోమలు లేని పల్లె ఇదొక్కటే కావచ్చేమో అన్నారు. అలాగే కొన్ని గ్రామాల్లో ఉన్న పారిశుద్ధ్యం చూసి పరవశించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో కూడా 24 గంటల విద్యుత్తు సరఫరా ఉండటం చూసి వాళ్ల కళ్లల్లో లైట్లు వెలి గాయి. వెనుకబడిన ప్రాంతాలు అనుకున్న చోట్ల కూడా రైతులు సరికొత్త విధానాల్లో వ్యవసాయం చేయడం చూసి ఔరా అనకుండా ఉండలేకపోయారు. సిద్దిపేటకు నీరందించే మానేరు నీటి సరఫరా విధానం అడిగి తెలుసుకుంది ఆ యువసేన. సదరు ప్రాజెక్టు వల్ల 122 గ్రామాలకు మంచినీటి సమస్య తీరిందని గ్రామస్తులు చెబుతుంటే నమ్మలేనట్టుగా చూశారు. నది నుంచి నీటిని తోడి ఎతై్తన ప్రాంతం మీదకు తీసుకుపోయి అక్కడే వాటర్ ట్యాంకర్లో నిల్వ చేసి, అక్కడి నుంచి అధిక సామర్థ్యంతో గ్రామాల్లో ఇంటింటికీ నల్లా ద్వారా నీళ్లు పంపే విధానం వాళ్లను ముగ్ధుల్ని చేసింది. ఇలా గ్రామాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలు వారికి తెలిసి వచ్చాయి. సరైన ప్రణాళికతో వెళ్తే పల్లెలు సైతం అభివృద్ధి విషయంలో పట్టణాలతో పోటీ పడగలవు అన్న అవగాహన వారిలో కలిగింది. పల్లెల్ని అభివృద్ధి చేయాలంటే ఎలాంటి విధానాలు అవలంబించాలో కూడా అవగతమయ్యింది. రైతన్న జీవితాన్ని చదివారు... గ్రామాలకు వచ్చిన ట్రెయినీలు మన దేశానికి వెన్నెముక అయిన రైతుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వ్యవసాయ విధానాలపై అధ్యయనం చేశారు. వ్యవసాయ క్షేత్రాన్ని చదును చేయడం, భూసార పరీక్షలు, విత్తనాలు వేయడం, పంట సంరక్షణ, ఎరువులు, పెట్టుబడులు, దిగుబడి, మార్కెటింగ్, గిట్టుబాటు ధర తదితర వివరాలను సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రుణమాఫీ, అన్నదాతలు అప్పుల పాలు కావడం, ఆత్మహత్యలు తదితర అంశాలకు కారణాలనూ అన్వేషించారు. సాంప్రదాయ పంటల్ని వదిలేసి పత్తి పంట వైపుకు అడుగులు వేయడానికి దారితీసిన విషయాలను అధ్యయనం చేశారు. హత్నూరా మండలం నవాబుపేట గ్రామ శివారులోని మంజీర పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించేందుకు ట్రాక్టర్లో వెళ్లారు. దారికి ఇరు వైపులా ఉన్న రకరకాల పంటలను, డొంకదారిని పరిశీలిస్తూ... రైతుకు అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలను గమనించారు. చెరువుల్లో భూగర్భజలాలు లేకపోవడం, వ్యవసాయ సాగుకు ఇబ్బందికర పరిస్థితు లను అధిగమించేందుకు భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలను గూర్చి రైతులను అడిగి తెలుసుకున్నారు. రాణాపూర్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిజన తండాకు కాలి నడకన వెళ్లి... అక్కడి సోలార్, బయో గ్యాస్ ప్లాంట్లను పరిశీలించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. తండాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశ మయ్యారు. ఆర్థిక వనరులు, ప్రభుత్వ సహకారం, ఇప్పటి వరకు సాధించిన ప్రగతి, కుటుంబ నేపథ్యం, పిల్లల చదువులు వంటి అంశాలన్నీ ఆరా తీశారు. అనుబంధాలకు కొత్త అర్థం తెలిసింది... ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎన్నో బంధాలు, అనుబంధాలు ఉంటాయి. అయితే అవి పల్లెల్లో మరింత ధృడంగా ఉంటాయని అర్థమవుతోంది అని ఓ ట్రెయినీ కామెంట్ చేయడం చూస్తే, వాళ్లు ఇక్కడకు వచ్చి అనుబంధాలకు కొత్త అర్థం తెలుసుకున్నారని అనకుండా ఉండలేం. ఈ సందర్భంలో వారికో విచిత్రమైన అనుభవం కూడా ఎదురైంది. రాణాపూర్ దళిత కాలనీలో యువ అధికారులంతా గ్రౌండ్ వర్క్‌లో నిమగ్నమై ఉంటే... ఓ ఇంటిలోంచి కేకలు, అరుపులు వినిపించాయి. ఏమిటా అని ఆరా తీస్తే భార్యాభర్తల గొడవని చెప్పారు అక్కడున్నవాళ్లు. వెంటనే అందరూ ఆ ఇంటికి వెళ్లారు. యాకూబ్ అన్న వ్యక్తి తన భార్య శారద వైపు ఆవేశంగా వెళ్తున్నాడు. ఓ ట్రెయినీ అడ్డం వెళ్లి ఆపారు. భర్త రోజూ తాగి వచ్చి గొడవ పడుతున్నాడని, కొడు తున్నాడని శారద ఫిర్యాదు చేసింది. దాంతో అందరూ కలిసి భార్యాభర్తల గొడవను సర్ధుబాటు చేశారు, భార్య గొప్ప తనం వివరించారు. బాధ్యతాయుతంగా చూసుకోవాలని భర్తకు నచ్చజెప్పారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి శిక్షణలో భాగంగా ఇక్కడికొచ్చారు. మన పల్లెల పైరగాలిని పీలుస్తూ, గ్రామస్తుల ప్రేమాభి మానాలకు పరవశిస్తూ ప్రతి క్షణాన్నీ ఆనందంగా గడిపారు. ఉన్నవాటిని చూసి సంతోషించారు. లేనివాటిని సాధించా లంటే ఏం చేయాలో ప్రణాళికలు వేశారు. ఈ అనుభవం వాళ్లను తప్పకుండా గొప్ప అధికారుల్ని చేస్తుంది. పల్లెసీమల్ని పసిడి సీమల్ని చేసేలా వాళ్లను ప్రోత్సహిస్తుంది. - వర్ధెల్లి వెంకటేశ్వర్లు సాక్షి ప్రతినిధి, మెదక్ స్థానిక వనరులను వినియోగించుకోవాలి! కొన్ని చోట్ల గ్రామీణ జీవనం కష్టంగా, సంక్లిష్టంగా ఉంది. ప్రజలు కష్టాల్లోనే జీవితాన్ని సాగదీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్రణాళికల్లో గ్రామాల అభివృద్ధి ఎంతో ముఖ్యమైంది. గ్రామాలపై మరింత దృష్టి పెడితే గ్రామాల రూపురేఖలు మారే అవకాశం ఉంది. అలాగే ప్రజలు కూడా స్థానిక వనరుల్ని విని యోగించుకుని అభివృద్ధి సాధించడం అలవర్చుకోవాలి. - తనూసింగ్, (ఇండియన్ ట్రేడ్ సర్వీసెస్) న్యూఢిల్లీ పూర్తి అభివృద్ధి అప్పుడే సాధ్యం! నిజానికి గ్రామాలు కూడా అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయని ఒప్పుకోవాలి. నేను చూసిన ఓ గ్రామంలో శానిటేషన్, మరుగు దొడ్ల నిర్మాణం, సోలార్ లైట్లు, బయోగ్యాస్ ప్లాంట్లు వంటి అంశాలు నన్ను ఆకర్షించాయి. అయితే ఎవ్వరూ ఎవరిపైనా ఆధారపడకూడదు. ప్రతి ఒక్కరూ పొదుపు చేసుకుని ఆర్థికంగా మరింత ఎదగాలి. అప్పుడే పూర్తి అభివృద్ధి సాధ్యపడుతుంది - బి.జీవా (ఐఒఎఫ్ఎస్), తమిళనాడు జనంలో అవేర్నెస్ బాగుంది! గ్రామ సమస్యలను నేను దగ్గర నుండి చూడటం, గ్రామస్తులతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడూ పుస్తకాలలో చదివేవాళ్లం కాని పుస్తకాలకు బదులుగా ప్రాక్టిల్ వర్క్ చేయడం బాగా అనిపించింది. శానిటేషన్, పారిశుద్ధ్యం బాగుంది. వాటి గురించి జనంలో మంచి అవేర్నెస్ ఉంది. అయితే విద్యార్థులు కూడా అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని అనిపించింది. - సుకృతీవర్మ (ఇండియన్ ఎకానమీ సోర్స్), లక్నో నేరుగా ప్రజలతో మాట్లాడా! ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు, విద్యావకాశాలపై అవగాహన కల్పిస్తే మరింత బాగుంటుంది. మా రాష్ట్రంలో ప్రతి గ్రామానికీ రోడ్డు సౌకర్యం ఉంది. ఇక్కడ కొన్ని గ్రామాల్లో మరింత అభివృద్ధి అవసరం అనిపించింది. అయితే మా గ్రామాల్లో జనం తక్కువ, ఇక్కడ గ్రామాలలో జనం ఎక్కువగా కనిపిస్తున్నారు. - అశుతోష్ (ఐపీఎస్), ఛత్తీస్‌ఘడ్ -
సమష్టి కృషితో గ్రామాభివృద్ధి
తుళ్లూరు : గ్రామాభివృద్ధికి అంతా సమష్టిగా కృషి చేయాలని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ పిలుపునిచ్చారు. రాజధాని పరిధిలోని తుళ్లూరులో శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నిర్వహించారు. స్థానిక మేరీమాత హైస్కూల్ జరిగిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన స్పీకర్ కోడెల మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పారిశుద్ధ్య లేమి కారణంగా అనారోగ్యం బారినపడి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రతివ్యక్తి ఏటా రూ.6,500 ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాకముందు స్థానిక సంస్థలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతుండేవన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 13వ ఆర్థిక సంఘం నిధులు వచ్చాయన్నారు. ప్రతిపైసాను ప్రణాళికాబద్ధంగా వ్యయం చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీలకు సూచించారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.ఐదువేల కోట్లు అభివృద్ధికి వెచ్చించేలా ప్రణాళికను రూపొందించామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 1,831 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం నియమించిన సబ్‌కమిటీ రిపోర్డు ఆధారంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వేతనాల పెంపు జరుగుతుందన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన కృష్ణా జిల్లాలో 117, గుంటూరు జిల్లాలో 138 పంచాయతీలకు ప్రోత్సాహక నగదు అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు, పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు, ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ఇన్చార్జి శ్రీధర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు. ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. -
ఎన్నాళ్లో..!
గ్రామాభివృద్ధి కోసం రాజకీయూలను పక్కనబెట్టి అందరూ సంఘటితమై ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేసుకున్నారు. జిల్లాలో 33 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యూరుు. గతంలో ఒక్కో పంచాయతీకి రూ.5 లక్షలు ప్రోత్సాహకంగా ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని రెట్టింపు చేయూలని ప్రభుత్వం యోచిస్తోంది. కానీ పంచాయతీ ఎన్నికలు జరిగి ఏడాదిన్నరైనా ఒక్కపైసా రాకపోవడమే నిరుత్సాహం కలిగిస్తోంది..నిరీక్షణ మిగిల్చింది. సాక్షి ప్రతినిధి, ఖమ్మం: 2013 జూలైలో పంచాయతీ ఎన్నికలు జరిగారుు. అప్పట్లో ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షల ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించింది. గ్రామాభివృద్ధి కోసం పార్టీలకతీతంగా ఊరోళ్లంతా ఏకమయ్యూరు. ఎన్నికలకు దూరంగా ఉండి ఏకగ్రీవం చేసుకున్నారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచాలని యోచిస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇదేదో త్వరగా నిర్ణరుుస్తే పంచాయతీలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని ఏకగీవ్ర పంచాయతీల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు అంటున్నారు. నిధులలేమితో ఊళ్లు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయని వాపోతున్నారు. జిల్లాలో మొత్తం 758 గ్రామ పంచాయతీలున్నారుు. ఎన్నికల అనంతరం ఏడు ముంపు మండలాల్లోని 87 గ్రామ పంచాయతీలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనమయ్యాయి. ఇంకా 671 గ్రామ పంచాయతీలున్నారుు. వీటిలో 33 గ్రామ పంచాయతీల పాలకవర్గాలను అక్కడి ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందుకుగాను ప్రోత్సాహక నిధులివ్వాలనే నిర్ణయం ఉంది. ఐదువేల లోపు జనాభా ఉన్న గ్రామపంచాయతీలకు రూ.5 లక్షలు ప్రోత్సాహకంగా ఇవ్వాలని అప్పట్లో నిర్ణరుుంచారు. అంతకుమించి జనాభా ఉంటే రూ.7 లక్షలు ఇవ్వాలనుకున్నారు. దీనికి దామాషా ప్రకారం ప్రభుత్వం రూ.1.65 కోట్లు విడుదల చేయూల్సి ఉంది. ఇప్పటి వరకు ఆ నిధులు మంజూరు కాలేదు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామపంచాయతీల సంఖ్యను పెంచింది. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని నిర్ణరుుంచింది. పనిలో పనిగా ఏకగ్రీవ పంచాయతీలకూ ఇచ్చే ప్రోత్సాహకాలనూ పెంచాలని యోచిస్తోంది. పెంచటం సరే..ఎప్పుడిస్తారో..? ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహకం మొత్తాలను పెంచాలనే యోచనపై సర్పంచ్‌లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రూ.5 లక్షల ప్రోత్సాహకాన్ని రూ.10 లక్షలకు, రూ.7 లక్షలున్నదాన్ని రూ.15 లక్షలకు పెంచాలనే యోచన బాగానే ఉన్నా ఆ నిధులను ఎప్పుడు విడుదల చేస్తారో స్పష్టత ఇవ్వకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఎన్నికై ఏడాదిన్నరకు పైగా పూర్తరుుంది. ఇప్పటి వరకు ఒక్కపైసా విడుదల చేయలేదు. కనీసం ఈ ప్రోత్సాహకమైనా వస్తే గ్రామాభివృద్ధి చేస్తామని అంటున్నారు. జిల్లాలో 33 ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున రూ.3.30 లక్షలు మంజూరు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. కానీ అవి ఎప్పుడొస్తాయనేదే సందిగ్ధంగా ఉంది. గ్రామాల్లో నీరు.. పారిశుద్ధ్య సమస్యలు మిగతా పంచాయతీలతో పాటే ఏకగ్రీవ పంచాయతీలనూ సమస్యలు వెంటాడుతున్నారుు. రోడ్లు, నీరు, పారిశుద్ధ్య సమస్యల్లో ఊళ్లు కొట్టుమిట్టాడుతున్నారుు. మొన్నటి వరకు డెంగీ, మలేరియూ, టైఫారుుడ్, విషజ్వరాలతో గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే పలుపంచాయతీల్లో తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నారుు. నిండు వేసవి నాటికి ఈ సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉంది. ఈలోగానే ప్రోత్సాహక నిధులు మంజూరు చేస్తే పంచాయతీలను అభివృద్ధి చేసుకుంటామని ఏకగ్రీవ పంచాయతీల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డుమెంబర్లు అంటున్నారు. రెండేళ్లు కావస్తోంది.. ఏకగ్రీవ పంచాయతీ అయితే స్పెషల్ ఇన్సెంటివ్ ఫండ్ (ప్రత్యేక నిధులు) ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మా లోక్యాతండా గ్రామ పంచాయితీ నుంచి నేను ఏకగ్రీవం సర్పంచ్‌గా ఎన్నికయ్యూ. రెండేళ్ల పదవీకాలం కావస్తున్నా నేటికీ నిధుల జాడేలేదు. ప్రత్యేక నిధులు వస్తే గ్రామ పంచాయతీలో సీసీరోడ్లు, సైడ్ డ్రెయిన్స్ నిర్మించుకుంటాం. చెరువులోని మంచినీటి బావికి స్టీనింగ్ నీరు కలుషితం కాకుండా చూసుకుంటాం. - పులుసు ఉమారాణి, సర్పంచ్, లోక్యాతండా, కూసుమంచి అంతర్గత రోడ్లు నిర్మించాలి ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.7 లక్షలు ప్రోత్సాహకం కింద ఇచ్చింది. ఎన్నికలు పూర్తయి 19 నెలలు గడిచినా నిధులు మంజూరు కాలేదు. గ్రామపంచాయతీకి నిధులు లేకపోవడంతో అంతర్గతరోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహక నగదు మంజూరైతే ఆ నిధులతో గ్రామంలో అంతర్గత రోడ్లు నిర్మిస్తాం. - చావలి రామరాజు, గ్రామ సర్పంచ్, నాగవరప్పాడు, మధిర అత్యవసర పనులకు కేటారుుస్తాం.. ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం విడుదల చేస్తామన్న రూ. 7 లక్షలు త్వరగా విడుదల చేయూలి. వెంటనే పంచాయతీలోని అత్యవసర పనులు గుర్తించి చేపడతాం. తాగునీటి సమస్య పరిష్కరించుకోవడానికి ఈ నిధులు ఉపయోగపడుతారుు. ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు త్వరగా నిధులు విడుదల చేయూలని కోరుతున్నాం. - జక్కంపూడి రమాదేవి, సర్పంచ్, చండ్రుపట్ల, కల్లూరు -
కుంటుపడిన ‘పల్లె’ పాలన
డిచ్పల్లి : దేశానికి పట్టుకొమ్మలైన పల్లెల్లో పాలన కుంటుపడింది. దీంతో గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలుస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గ్రామాభివృద్ధిలో కీలకపాత్ర వహించే పంచాయతీ రాజ్ శాఖలో మండల స్థాయి అధికారులు, గ్రామస్థాయి కార్యదర్శుల కొరత వల్ల అభివృద్ధి కుంటుపడుతోంది. ఇన్చార్జిల పాలనలో పల్లెలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. జిల్లాలోని పంచాయతీ రాజ్ శాఖలో అధికారుల సంఖ్య నానాటికి పలుచబడిపోతోంది. జిల్లాలో 36 మండలాలకు గాను 16 మండలాలకు ఇన్చార్జి ఎంపీడీఓలే విధులు నిర్వహిస్తున్నారు. 36 మండలాల్లో 718 గ్రామపంచాయతీలు ఉండగా పాలనా సౌలభ్యం కోసం 477 క్లస్టర్లుగా విభజించారు. ఒక్కో క్లస్టర్‌కు ఒక కార్యదర్శి ఉండాలి. అయితే జిల్లాలో 148 మంది కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. దీంతో ఒక్కో కార్యదర్శి రెండు, మూడు క్లస్టర్లకు ఇన్చార్జిగా విధులు నిర్వహించాల్సి వస్తోంది. దీనికి తోడు పంచాయతీ రాజ్ శాఖలో కీలక భూమిక పోషించే ఈఓపీఆర్డీలదీ ఇదే పరిస్థితి. 36 మండలాలకు గాను కేవలం 14 మంది ఈఓపీఆర్డీలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన మండలాల్లో సూపరింటెండెంట్లు, ఈఓలు ఇన్చార్జి ఈఓపీఆర్డీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు నాలుగైదు గ్రామాలకు ఇన్చార్జిలుగా విధులు నిర్వహించడంతో పనిభారం అధికమై ఏ ఒక్క గ్రామానికి తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. దీనికి తోడు పలు గ్రామాల్లో బిల్‌కలెక్టర్, జూనియర్ అసిస్టెంట్, కారోబార్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పని భారాన్ని బట్టి గ్రామంలోని యువకులను కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకుని పని చేయించుకుంటున్నారు. ఇన్చార్జిల పాలనతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. ముఖ్యంగా పారిశుధ్యం, తాగునీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు సమస్యలతో సతమవుతున్నారు. దీనికి తోడు గ్రామాల్లో రోడ్లు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వరాష్ట్రంలోనైనా పరిస్థితులు మారేనా.. ఉమ్మడి రాష్ట్రంలో పంచాయతీ రాజ్ శాఖలో ఖాళీల భర్తీపై అప్పటి ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహించాయి. ప్రస్తుతం మన రాష్ట్రం మనకు ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలోనైనా పంచాయతీ రాజ్ శాఖలో పెరుగుతున్న ఖాళీల గురించి ప్రభుత్వం పట్టించుకుంటుందని ఆశాభావంలో సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖలో పెద్ద ఎత్తున పోస్టుల ఖాళీలు ఉండడం వల్ల అభివృద్ధి అస్తవ్యస్థంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం పల్లెల అభివృద్ధి గురించి ఆలోచించి పంచాయతీ రాజ్ శాఖలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఇటు ప్రజలు, అటు శాఖలోని సిబ్బంది కోరుతున్నారు. -
గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లే కీలకం
కర్నూలు(జిల్లా పరిషత్): గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లే కీలకమని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ అన్నారు. కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్ల పరిధిలోని సర్పంచ్‌లకు బుధవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో గ్రామ పరిపాలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో అనేక పథకాలను అమలు చేస్తోందని, వీటి పర్యవేక్షణ బాధ్యత సర్పంచ్‌లపైనా ఉందన్నారు. అయితే చాలా మంది వారి గ్రామాల పరిధిలోని సమస్యలను గాలికొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల్లో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు సర్పంచ్‌లు బాధ్యతతో వ్యవహరించాలన్నారు. గ్రామాల్లో రాజకీయ, సామాజిక ఆటంకాలు ఎన్ని ఉన్నా సర్పంచ్ల ప్రధాన అజెండా అభివృద్ధే కావాలని సూచించారు. ఈ విషయంలో ఫిర్యాదులుంటే ఈనెల 23 నుంచి ప్రారంభమయ్యే ప్రజావాణి వెబ్సైట్ ద్వారా తెలియజేవచ్చన్నారు. త్వరలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా రూ.2లకే 20 లీటర్ల నీటిని ప్రతి కుటుంబానికి అందజేసేందుకు దశల వారీ కార్యక్రమం రూపొందిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని 360 జిల్లా పరిషత్ పాఠశాలల్లో టాయ్లెట్లను కార్పొరేట్ సంస్థల సహాయంతో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాభివృద్ధికి పెద్దపీట వేయాలన్నారు. పండ్ల తోటల పెంపకానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని, సాగులో లేని భూముల్లో నీటి కుంటలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో జయరామిరెడ్డి, డీపీవో శోభా స్వరూపరాణి, డీఎల్పీవో విజయకుమార్, డీఎంహెచ్‌వో డాక్టర్ వై.నరసింహులు, డీఈవో నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
గ్రామాభివృద్ధికి
1. దేశంలో పేదరికం ఏర్పడడానికి ప్రధాన కారణాలు? 1) నిరుద్యోగం 2) నిరక్షరాస్యత 3) జనాభా వేగంగా పెరగడం 4) పైవన్నీ 2. {పజారోగ్యాన్ని ఏ జాబితాలో పొందు పర్చారు? 1) కేంద్ర జాబితా 2) ఉమ్మడి జాబితా 3) రాష్ర్ట జాబితా 4) కేంద్ర, ఉమ్మడి జాబితా 3.ఆంధ్రప్రదేశ్‌లో జననీ సురక్షా యోజనను ఎప్పుడు ప్రారంభించారు? 1) 2004 అక్టోబరు 2 2) 2004 నవంబరు 1 3) 2005 జనవరి 26 4) 2005 నవంబరు 1 4. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ)ను ఎప్పుడు ప్రారంభించారు? 1) 1986 నవంబరు 1 2) 1987 నవంబరు 1 3) 1989 నవంబరు 1 4) 1983 నవంబరు 1 5. రాష్ర్ట ప్రభుత్వం ‘శుభం’ అనే ప్రచార కార్యక్రమాన్ని కింది వాటిలో ఏ అంశంపై చేపడుతుంది? 1) రైతులకు పంటలపై అవగాహన కల్పించడానికి 2) {పభుత్వ పథకాలు ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి 3) {పజలకు ఎయిడ్సపై అవగాహన కల్పించడానికి 4) బాలికా సురక్షా కార్యక్రమానికి 6. వీటిలో విశ్వగ్రహీత ఏది? 1) A+ 2) B+ 3) AB+ 4) O+ 7. పెర్టుసిస్ (కోరింత దగ్గు) దేని వల్ల సంభవిస్తుంది? 1) బ్యాక్టీరియా 2) వైరస్ 3) ప్రోటోజోవా 4) క్రిములు 8. స్థిర కారకాలను నిరంతరంగా ఉపయో గించడం వల్ల కలిగేది? 1) లుప్తత 2) లాభం 3) తరుగుదల 4) పెట్టుబడి ప్రయోజనం 9.అమృతహస్తం పథకాన్ని 2012, డిసెంబరు 4వ తేదీన రంగారెడ్డి జిల్లాలో ఏ ప్రాంతం నుంచి ప్రారంభించారు? 1) చేవెళ ్ల 2) రాజేంద్రనగర్ 3) శంషాబాద్ 4) తాండూర్ 10.రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్‌దా రుల కు నగదు రహిత వైద్యం కల్పించే ఉ ద్యోగ శ్రీ పథకాన్ని ఎప్పుడు ప్రారంభి ంచారు? 1) 2013 నవంబరు 1 2) 2013 నవంబరు 19 3) 2013 డిసెంబరు 5 4) 2013 డిసెంబరు 21 11. జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1) 2006 2) 2005 3) 2004 4) 1980 12. ఒక ఆర్డినెన్స గరిష్ట కాల పరిమితి? 1) ఆరు నెలలు 2) ఆరు నెలల మూడు వారాలు 3) ఆరు నెలల ఆరు వారాలు 4) కచ్చితమైన కాలం లేదు 13. పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళల వాటా? 1) 1/3 2) 2/3 3) 1/4 4) 1/2 14. ఎంపీటీసీ సభ్యులు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? 1) ఎంఆర్వో 2) ఎంపీడీవో 3) ఆర్డీవో 4) బీడీవో 15. {V>Ð]l$çసభ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? 1) వీఆర్వో 2) పంచాయతీ సెక్రటరీ 3) ఎంపీడీవో 4) సర్పంచ్ 16. సాధారణంగా ఎన్ని రోజులకు ఒకసారి పంచాయతీ సమావేశం అవుతుంది? 1) 15 రోజులు 2) 30 రోజులు 3) 90 రోజులు 4) 180 రోజులు 17. సహకార సంఘాలపై అధ్యయనం చేయడానికి 2004లో కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ అధ్యక్షుడు? 1) వైద్యనాథన్ 2) మోహన్ కందా 3) రామచెన్నారెడ్డి 4) జయతీఘోష్ 18. 1956లో గిరిజన సహకార సంఘాన్ని ఎక్కడ ప్రారంభించారు? 1) హైదరాబాద్ 2) విజయవాడ 3) విశాఖపట్నం 4) ఆదిలాబాద్ 19. {V>Ò$× సహకార పరపతి వ్యవస్థకు, నాబార్‌డకు మధ్య అనుసంధాన కర్తగా పనిచేసే సంస్థ? 1) డీసీసీబీ 2) ఆప్కాబ్ 3) ఆప్కో 4) ఏదీకాదు 20. దేశంలో సంపూర్ణ పారిశుధ్యానికి సంబం ధించింది? 1) పురా 2) భారత్ నిర్మాణ్ 3) నిర్మల్ భారత్ అభియాన్ 4) సేఫ్టీ 21. కింది వాటిలో రూబియోలా అనే వ్యాధి? 1) తట్టు 2) ఆటలమ్మ 3) గవద బిళ్లలు 4) కోరింత దగ్గు 22. శస్త్ర చికిత్స నిమిత్తం ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకువెళ్లే వ్యక్తికి ఇవ్వాల్సిన విటమిన్? 1) ఎ 2) బి 3) డి 4) కె 23. చర్మం ఆరోగ్యంగా ఉండడానికి ఏ విటమిన్ అవసరం ? 1) ఎ 2) బి 3) డి 4) ఇ 24. వెట్టిచాకిరి నిర్మూలన చట్టం చేసిన సంవత్సరం? 1) 1951 2) 1975 3) 1976 4) 1986 25. సంస్థ ప్రాథమిక పుస్తకం ఏది? 1) చిట్టా 2) ఆవర్జా 3) ఖాతాల పట్టీ 4) నగదు ఖాతా 26. మూలధనం దేనికి సమానం? 1) అప్పులు-మూలధనం 2) ఆస్తులు-అప్పులు 3) లాభాలు 4) బుక్ కీపింగ్ 27. నగదు రూపంలోకి మార్చుకోగలిగిన ఆస్తులను ఏమంటారు? 1) స్థిరాస్తులు 2) చరాస్తులు 3) భౌతిక ఆస్తులు 4) ద్రవ్యపర ఆస్తులు 28. వేతనాల చెల్లింపులను ఏ విధంగా పరిగణించవచ్చు? 1) ఖర్చు 2) రాబడి 3) అప్పు 4) పైవన్నీ 29. గుడ్‌విల్, పేటెంట్లు, ట్రేడ్ మార్కులు, కాపీరైట్స్ మొదలైనవి? 1) కనిపించే స్థిరాస్తులు 2) కనిపించని స్థిరాస్తులు 3) రాయల్టీలు 4) రాబడి వ్యయాలు 30. మధుమేహ వ్యాధి లక్షణాలు ఏవి? 1) ఆకలి 2) అధిక మూత్ర విసర్జన 3) అధిక దాహం 4) పైవన్నీ 31. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు? 1) 1994 2) 1995 3) 1996 4) 1998 32. క్షయ వ్యాధి శరీరంలోని ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది? 1) ఊపిరితిత్తులు 2) పేగులు 3) శ్వాస వ్యవస్థ 4) నాడీ వ్యవస్థ 33. అస్పృశ్యతను ఒక పాపంగా వర్ణించిన వారు? 1) అంబేద్కర్ 2) గాంధీ 3) నెహ్రూ 4) థామస్ మన్రో 34.షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్‌ను ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేశారు? 1) 338 2) 338 (ఎ) 3) 340 4) 340(ఎ) 35. డ్వాక్రా పథకానికి ప్రారంభంలో ఆర్థిక సహా యం అందించిన అంతర్జాతీయ సంస్థ? 1) యూఎన్ఓ 2) ఐఎంఎఫ్ 3) ప్రపంచ బ్యాంకు 4) యూనిసెఫ్ 36. చిట్టాలో ఉండే వరుసల సంఖ్య? 1) 3 2) 5 3) 7 4) 11 37. డిపాజిట్లపై వడ్డీని పాస్‌బుక్‌లో ఏ వైపు రాస్తారు? 1) క్రెడిట్ వైపు 2) డెబిట్ వైపు 3) ఆవర్జాలో 4) వాస్తవిక ఖాతాలో 38. తాగేనీటిలో ఫ్లోరిన్ గరిష్టంగా ఎంత పరిమాణంలో ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది? 1) 1.0 పీపీఎం 2) 1.25 పీపీఎం 3) 1.5 పీపీఎం 4) 2.0 పీపీఎం 39. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో శిశు మరణాల రేటు(ప్రతి 1000కి)? 1) 23 2) 33 3) 43 4) 123 40. జాతీయ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చిహ్నం ఏమిటీ? 1) హస్తం 2) నాగలి 3) ఉదయించే సూర్యుడు 4) గడియారం 41. గవర్నర్‌ను తొలగించడానికి ఏ పద్ధతిని అనుసరిస్తారు? 1) అవిశ్వాస తీర్మానం 2) అభిశంసన తీర్మానం 3) తొలగింపు తీర్మానం 4) పైవేవీ కావు 42. ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్(మార్క ఫెడ్)ను 1957లో ఎక్కడ ప్రారంభించారు? 1) వైజాగ్ 2) విజయవాడ 3) హైదరాబాద్ 4) గుంటూరు 43. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక చేనేత సహకార సంఘాలు కలిగిన జిల్లా? 1) కరీంనగర్ 2) కర్నూలు 3) కడప 4) కృష్ణా 44. అంటరానితనాన్ని నిషేధించే అధికరణ? 1) 16 2) 17 3) 19 4) 15(4) 45. భారత రాజ్యాంగంలో పొందుపర్చిన స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలను ఏ దేశం నుంచి తీసుకున్నారు? 1) ఫ్రాన్స 2) సౌత్ ఆఫ్రికా 3) యూఎస్ఏ 4) యూఎస్ఎస్ఆర్ 46. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక శాతం షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జనాభా ఉన్న రాష్ర్టం? 1) మధ్యప్రదేశ్ 2) మేఘాలయ 3) మణిపూర్ 4) మిజోరాం 47. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అత్యధిక శాతం ఎస్సీ జనాభా ఉన్న జిల్లా? 1) గుంటూరు 2) ప్రకాశం 3) నెల్లూరు 4) విజయనగరం 48. 1961లో చేసిన వరకట్న నిషేధ చట్టాన్ని పునరుద్ధరణ చేసిన సంవత్సరం? 1) 1991 2) 2005 3) 2006 4) 2009 49. 15వ లోక్‌సభకు ఎన్నికైన మహిళా ఎంపీల సంఖ్య? 1) 48 2) 52 3) 57 4) 59 50. మహిళలపై జరిగే శారీరక, మానసిక, లైంగిక, ఆర్థిక వేధింపులు అన్నీ గృహ హింస కిందకు తీసుకువస్తూ గృహహింస నిరోధక చట్టాన్ని 2005లో పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1) 2006 అక్టోబర్ 2 2) 2006 అక్టోబర్ 26 3)2006 నవంబర్ 14 4) 2006 నవంబర్ 19 51. భారతీయ మహిళా బ్యాంకు (బీఎంబీ)ను 2013 నవంబర్ 19న ఎక్కడ ప్రారంభించారు? 1) న్యూఢిల్లీ 2) చెన్నై 3) ముంబై 4) కోల్కత్తా 52. శిశువులు, మహిళల సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రారంభించిన పథకాలు? 1) సబల 2) ఉజ్జ్వల 3) స్వాధార్ షెల్టర్స హోమ్స్ 4) అన్నీ 53. వీటిలో ఆర్థిక హక్కు కానిది? 1) ఆస్తి హక్కు 2) వృత్తి వ్యాపార హక్కు 3) పని హక్కు 4) ఓటు వేసే హక్కు 54. అతిసారానికి ప్రధాన కారణం? 1) ఈకొలి బ్యాక్టీరియా 2) బ్రూసెల్లా అబార్టస్ 3) బ్రూసెల్లా ఆంత్రాసిస్ 4) మైకో బ్యాక్టీరియం 55. రాష్ట్రంలో 9, 10వ తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రీమెట్రిక్ ఉపకార వేతనాల కోసం ప్రారంభించిన పథకం? 1) రాజీవ్ విద్యాదీవెన 2) రాజీవ్ అభ్యుదయ యోజన 3) ఇందిరమ్మ కలలు 4) ఇందిరమ్మ విద్యాదీవెన 56. పుట్టిన పిల్లలకు 30 రోజుల్లోగా అవస రమైన వైద్య సేవలను పూర్తిగా ఉచితంగా అందించడానికి 2011 అక్టోబరు 23న ప్రారంభించిన పథకం? 1) రాజీవ్ ఆరోగ్యశ్రీ 2) జననీ శిశు సంరక్షణ పథకం 3) స్వాదార్ షెల్టర్ హోమ్స్ 4) ఏవీకావు 57. 2000 జూన్ 15న ప్రారంభించిన వెలుగు పథకం లక్ష్యం? 1) స్వయం సహాయక మహిళలకు గ్యాస్ కనెక్షన్ 2) {V>Ò$× పేదలకు గ్యాస్ కనెక్షన్ 3) ఇంటింటికీ ఎల్పీజీ గ్యాస్ అందించడం 4) పేదరిక నిర్మూలన 58. సమాజంలో వెనుకబడి ఉన్న షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి 1998లో ప్రారంభించిన పథకం? 1) ఆదరణ 2) చేయూత 3) ముందడుగు 4) చైతన్యం 59. 1999లో మైనార్టీల అభివృద్ధి కోసం రాష్ర్ట ప్రభుత్వం రోష్ని పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమంలో రెండో అధికార భాషగా దేన్ని గుర్తించారు? 1) హిందీ 2) ఉర్దూ 3) బెంగాలీ 4) మరాఠీ 60. మహారాష్ర్టలో పాలేగావ్ సిద్ధి అనే గ్రామంలో అన్నా హజారే అనే సామాజిక వేత్తను ఆదర్శంగా తీసుకుని మన రాష్ర్టంలో ప్రారంభించిన పథకం? 1) రైతు బజార్లు 2) దీపం 3) విద్యావలంటీర్లు 4) వాటర్షెడ్స 61. పట్టణాల్లోని వృద్ధులకు చేయూత ఇవ్వడానికి 2010 నవంబర్ 1న ప్రారంభించిన పథకం? 1) చేయూత 2) చైతన్యం 3) ఆసరా 4) పైవన్నీ 62. 1997 జనవరి 1న దక్షిణ కొరియాలోని సైమల్ అన్డంగ్ అనే పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని జన్మభూమి కార్యక్రమాన్ని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. దీన్ని ఎన్ని విడతలుగా నిర్వహించారు? 1) 7 2) 9 3) 11 4) 19 63. బడికి వెళ్లలేని గ్రామీణ పేద పిల్లల ఇళ్ల వద్దకే విద్యను తీసుకెళ్లేందుకు 2010 నవంబర్ 23న ప్రారంభించిన పథకం? 1) విద్యావాహిని పథకం 2) రాజీవ్ విద్యాదీవెన 3) ఆసరా 4) కిశోర్ బాలిక పథకం 64. {పస్తుతం ఆశ్రమ పాఠశాల స్థితిగతులను మె రుగుపర్చడానికి ఏర్పాటు చేసిన పథకం? 1) దిశ 2) భవిత 3) పునాది 4) రూపాంతర 65. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో గ్రామీణ జనాభా శాతం? 1) 68.8 శాతం 2) 71.8 శాతం 3) 65.5 శాతం 4) 66.5 శాతం 66. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో జనాభా శాతం? 1) 68.8 శాతం 2) 71.8 శాతం 3) 65.5 శాతం 4) 66.5 శాతం 67. ఏ వయసు మధ్య ఉన్న వారిని ఉత్పాదక వయోవర్గంగా భావిస్తారు? 1) 15-58 2) 15-60 3) 18-60 4) 15-50 68. 2009-10 అంచనాల ప్రకారం దేశంలో అత్యధిక పేదరికం ఉన్న రాష్ర్టం? 1) ఒడిశా 2) బీహార్ 3) చత్తీస్‌గఢ్ 4) జమ్మూ, కాశ్మీర్ 69. ఏ వయసు మధ్య ఉన్న వారిని మానవ వన రులు లేదా కార్మిక శక్తి అని పేర్కొంటారు? 1) 15-60 2) 15-35 3) 18-60 4) 18-58 70. 2009-10 లెక్కల ప్రకారం భారతదేశంలో నిరుద్యోగిత రేటు ఎంత శాతం? 1) 8.8 2) 7.7 3) 6.6 4) 5.5 సమాధానాలు 1) 4; 2) 3; 3) 4; 4) 1; 5) 3; 6) 3; 7) 1; 8) 3; 9) 4; 10) 3; 11) 4; 12) 3; 13) 4; 14) 2; 15) 4; 16) 2; 17) 1; 18) 3; 19) 2; 20) 3; 21) 1; 22) 4; 23) 4; 24) 3; 25) 1; 26) 2; 27) 2; 28) 1; 29) 2; 30) 4; 31) 3; 32) 1; 33) 2; 34) 2; 35) 4; 36) 2; 37) 1; 38) 3; 39) 3; 40) 4; 41) 4; 42) 2; 43) 3; 44) 2; 45) 1; 46) 4; 47) 2; 48) 3; 49) 4; 50) 2; 51) 3; 52) 4; 53) 4; 54) 1; 55) 1; 56) 2; 57) 4; 58) 3; 59) 2; 60) 4; 61) 3; 62) 4; 63) 1; 64) 4; 65) 1; 66) 4; 67) 2; 68) 2; 69) 1; 70) 3; (మిగతా ప్రశ్నలు రేపటి ‘విద్య’లో) -
‘ఉపాధి’ భేష్
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ జిల్లాకు జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరును ప్రశంసిస్తూ జిల్లాను జాతీయ అవార్డుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఎంపిక చేసింది. ఈ మేరకు సోమవారం ఆ శాఖ సంయుక్త కార్యదర్శి అపరజిత సారంగి ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో తొమ్మిది జిల్లాలకు అవార్డు ప్రదానం చేస్తుండగా ఇందులో జిల్లా కూడా ఉంది. ఏటా ఫిబ్రవరి 2న ఉపాధి హామీ దివస్ సందర్భంగా ఢిల్లీలో ప్రధానమంత్రి చేతుల మీదుగా జాతీయ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ అవార్డును కలెక్టర్ అహ్మద్‌బాబు, డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి అందుకోనున్నారు. దీనితోపాటు మరో పదకొండు గ్రామపంచాయతీలకు ఉత్తమ నిర్వహణ కింద కూడా అవార్డును ఇదే వేదిక ద్వారా అందజేయనున్నారు. అట్టడుగు నుంచి పైకి.. జిల్లాలో ఉపాధి హామీ పథకం ఫిబ్రవరి 2006 నుంచి ప్రారంభం కాగా ఇప్పటివరకు జాతీయ అవార్డు లభించలేదు. ప్రధానంగా కలెక్టర్ అహ్మద్‌బాబు సౌజన్యం, డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి పర్యవేక్షణ, క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరు కారణంగా జిల్లాకు అవార్డు దక్కిందని ఆ శాఖలో ఆనందం వ్యక్తమవుతోంది. గతంలో రాష్ట్రంలో 22వ స్థానంలో ఉన్న జిల్లా ఇప్పుడు రెండో స్థానానికి చేరుకోవడమే దీనికి నిదర్శనం. ఉపాధి హామీ పథకం పరంగా గ్రామీణాభివృద్ధి శాఖ 26 రకాల ప్రాజెక్టు పనులు రూపొందించి క్షేత్రస్థాయిలో అమలుకు ఆదేశించగా, ఏ జిల్లాలో లేనివిధంగా మన జిల్లాలో 13 ప్రాజెక్టు పనులు నిర్వహిస్తుండటాన్ని ప్రత్యేకంగా తీసుకున్నారు. భూమి అభివృద్ధి, ఉద్యానవన, ఇందిరమ్మ పచ్చతోరణం పథకాల పరంగా జిల్లా రాష్ట్రంలోనే మొదటి మూడు స్థానాల్లో నిలిచింది. వాటర్‌షెడ్ పథకాల పరంగా రెండో స్థానంలో, ఇందిరా జలప్రభ పరంగా మొదటిస్థానంలో ఉంది. దీంతోపాటు నాడర్కంపోస్ట్, పశువుల తొట్టెలతోపాటు వివిధ పనులు విస్తృతంగా చేపట్టడం జరిగింది. భూ అభివృద్ధి పథకంలో అనేక పనులు చేపట్టడం ద్వారా జిల్లాలోని కూలీలకు పని కల్పించడంతోపాటు నిధుల వినియోగం జరిగింది. మొదట్లో జాతీయ అవార్డు కోసం దేశంలోని 40 జిల్లాల నుంచి నామినేషన్లు రాగా రాష్ట్రం నుంచి శ్రీకాకుళం, ఆదిలాబాద్, చిత్తూరు జిల్లాలు అందులో ఉన్నాయి. నెలరోజుల కిందట సదరు నామినేషన్ల ఆధారంగా కేంద్ర పరిశీలకులు ఆయా జిల్లాల్లో పథకం అమలుతీరును పరిశీలించి అందులోంచి 20 జిల్లాలకు కుదించారు. వీటిలో ఆదిలాబాద్, శ్రీకాకుళం జిల్లాలు ఉండగా ఈనెల 15న కేంద్ర పరిశీలకులు జిల్లాలో పర్యటించి ప్రత్యక్షంగా పథకం అమలుతీరును చూశారు. దీని ఆధారంగా కేంద్రానికి నివేదిక పంపారు. శ్రీకాకుళంతోపాటు ఆదిలాబాద్ జిల్లా జాతీయ అవార్డుకు ఎం పికైంది. శ్రీకాకుళం జిల్లాకు ఎక్కువ మంది కూలీలకు ఉపాధిహామీ కల్పించినందుకు అవార్డు లభించింది. జిల్లా పరిస్థితి.. జిల్లాలో ఉపాధి హామీ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 5,32,894 జాబ్‌కార్డులు జారీ చేశారు. జాబ్‌కార్డుల్లో వ్యక్తిగతంగా 11,94,735 మంది ఉన్నారు. ఈ సంవత్సరం 31,050 జాబ్‌కార్డులు జారీ చేయగా అందులో 59,662 జాబ్‌కార్డులు ఉన్నాయి. 2,73,845 కుటుంబాలకు కూలీ వేతనాలు ఉపాధిహామీ ద్వారా అందించగా, వ్యక్తిగతంగా 5,32,296 మంది ప్రయోజనం పొందారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు రూ.273 కోట్లతో పనులు చేపట్టారు. 35,847 కుటుంబాలకు వంద రోజుల పని కల్పించారు. జిల్లాలో డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు పీడీగా గణేష్ రాథోడ్ వ్యవహరిస్తున్నారు. మరో అదనపు పీడీ పోస్టు ఖాళీగా ఉంది. 52 మండలాలకు గాను ప్రతీ ఐదు మండలాలకు ఒక క్లస్టర్‌గా రూపొందించి ఒక్కో క్లస్టర్‌కు సహాయ పథక సంచాలకుల పది పోస్టులకు తొమ్మిది ఖాళీగా ఉన్నాయి. అయినప్పటికీ పథకం అమలుపరంగా ఈయేడాది అధికారుల పర్యవేక్షణ, క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు కారణంగా జిల్లాకు గుర్తింపు లభించింది. ప్రధానంగా ఇటీవల జిల్లాకు వచ్చిన జాతీయ పరిశీలకులు ఉపాధిహామీ పరంగా నిధుల వినియోగం, చేపట్టిన పనులు, అధికారుల పర్యవేక్షణ అంశాలను తీసుకున్నారు. అందులో జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో ఉపాధిహామీ పనులకు సంబంధించి సమాచార బోర్డులు ఏర్పాటు చేయడం, అప్డేట్ చేయడం వంటి అంశాలు వారిని ఆకట్టుకున్నాయి. ఈజీఎస్ డెరైక్టర్ కరుణ సమాచార బోర్డుల ఏర్పాటులో జిల్లా తీరును ప్రశంసిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆదిలాబాద్ జిల్లాను మోడల్‌గా తీసుకోవాలని ఆదేశించడం ప్రత్యేకం. ఇలా అనేక అంశాల్లో ఉపాధిహామీ పరంగా జిల్లాకు జాతీయ అవార్డు లభించింది. -
గ్రామసభ రసాభాస
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: గ్రామ అభివృద్ధి పనులపై చర్చించేందుకు భద్రాచలంలోని రాజుపేట కాలనీలో శనివారం ఏర్పాటుచేసిన గ్రామసభ రసాభాసగా మారింది. ఉదయం పది గంటలకు ప్రారంభం కావాల్సిన గ్రామసభ మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలైంది. సభ ప్రారంభమవగానే గ్రామస్తులు లేచి నిలబడి, ఎవరికీ చెప్పకుండా... తగిన ప్రచారం చేయకుండా, దండోరా వేయకుండా గ్రామసభ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. గ్రామసభ ఏర్పాట్లపై కూడా వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. భద్రాచలం ఇసుక క్వారీ సభ్యులు, డ్రైవర్లు తమ సమస్యలను వివరించేందుకు యత్నించారు. దీనికి గ్రామసభ అధ్యక్షుడు గుండు శరత్ అడ్డుతగిలారు. కేవలం అభివృద్ధి పనులపై చర్చించేందుకే మాత్రమే ఈ సభ ఏర్పాటుచేసినట్టు చెప్పారు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎజెండా ప్రకటించకుండా సభను నిర్వహించడం, సమస్యలను చెప్పొద్దనడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఇసుక ర్యాంపు నిధులతో పాఠశాల భవనాన్ని ఆధునీకరించామని అధ్యక్షుడు చెప్పారు. దీనికి గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. భవన నిర్మాణంలో అన్నీ అక్రమాలే చోటుచేసుకున్నాయని చెప్పారు. ఈదురుగాలులతో భారీ వర్షం రావడంతో గ్రామసభను వాయిదా వేస్తున్నట్టు అధ్యక్షుడు గుండు శరత్ ప్రకటించారు. ఈ సభలో ఉపాధ్యక్షురాలు మిడియం భారతి, గ్రామ కార్యదర్శి పూనెం కృష్ణ, ఆదివాసీ సంఘాల నాయకులు నాగేశ్వరరావు, ముర్ల రమేష్, మడివి నెహ్రు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం సర్పంచ్ నోటీసు రాజుపేట కాలనీలో నిర్వహించిన భద్రాచలం గ్రామసభ సమాచారాన్ని తనకు కనీసంగా కూడా తెలపకపోవడంపై అభ్యంతరం తెలుపుతూ భద్రాచలం సర్పంచ్ భూక్యా శ్వేత, వార్డు మెంబర్లు గ్రామసభ నిర్వాహకులకు శనివారం నోటీసు ఇచ్చారు. గ్రామసభ సమాచారాన్ని పత్రికల ద్వారానే తెలిసిందని పేర్కొన్నారు. గ్రామసభను నిర్వహణ, ఊరిలో టాంటాం వేయించాల్సిన భాద్యత తనపై ఉందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులకు, వివిధ వర్గాల ప్రజలకు గ్రామసభ సమాచారం ఎందుకు తెలపలేదని సర్పంచ్, వార్డు సభ్యులు ఆ నోటీసులో ప్రశ్నించారు. గ్రామసభను వాయిదా వేసి, అందరికీ ఆమోదయోగ్యమైన తేదీలో నిర్వహించేలా గ్రామసభ కమిటీ తీర్మానం చేయాలని కోరారు.