- ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కులు
- పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ పటేల్
గ్రామీణ ఉపాధికి పరిశ్రమల స్థాపన
Published Tue, Aug 2 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
కడియం :
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన లక్ష్యంగా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఏవీ పటేల్ చెప్పారు. ఆయన సారథ్యంలోని పలువురు అధికారుల బృందం మండలంలోని జేగురుపాడు పంచాయతీ పరిధిలోని పాములమెట్ట కాలనీ వద్ద గల స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పటేల్ మాట్లాడుతూ నియోజకవర్గానికి ఒక్కొక్కటి చొప్పున ది మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందుకోసం జేగురుపాడు పంచాయతీ పరిధిలోని, మండపేట మండలం వేములపల్లిలోని, రాజానగరం మండలం కొండ గుంటూరుల్లోని స్థలాలను పరిశీలించినట్టు వివరించారు. పాములమెట్ట వద్ద గన్న 38.67 ఎకరాల స్థలంఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఈ నెల 15న పార్కు నిర్మాణ చర్యలు ప్రారంభమవుతాయన్నారు. ఈ బృందంలో పటేల్‌తోపాటు ఏపీఐఐసీ జీఎం పి. నాగేశ్వరరావు, మేనేజర్ జ్యోత్సS్న, డిప్యూటీ డైరెక్టర్ డేవిడ్ సుందర్‌కుమార్, రిటైర్డ్ ఏడీ ఆఫ్ సర్వేస్ వి. సోమరాజు తదితరులు ఉన్నారు. కాగా వైస్ ఎంపీపీ వెలుగుబంటి రఘురామ్ ఈ బృందాన్ని కలిసి భూములను గురించి వివరించారు. స్థానిక నాయకులు కూడా ఉన్నారు.
Advertisement