ఆదిలాబాద్ రూరల్ : గ్రామాల అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని యువజన సర్వీసుల శాఖ స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు అన్నారు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని యాపల్‌గూడ గ్రామంలో యువదర్శిని కార్యక్రమం నిర్వహించారు.
-
స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు
ఆదిలాబాద్ రూరల్ : గ్రామాల అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని యువజన సర్వీసుల శాఖ స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు అన్నారు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని యాపల్‌గూడ గ్రామంలో యువదర్శిని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ శాఖ ఆధ్వర్యంలో యువతను చైతన్యవంతం చేసేందుకు యువదర్శిని కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. యువజన సంఘాలు పొదుపు చేసుకుంటే రుణాలు ఇస్తామని తెలిపారు. అలాగే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై యువత స్పందించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కొడప ఇస్రూబాయి, ఎంపీటీసీ శ్రీవాణి, పంచాయతీ కార్యదర్శి అనిల్‌కుమార్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తూరాటి గంగన్న, గ్రామ యువజన సంఘం అధ్యక్షుడు రోషన్, స్వామి, స్టెప్ సిబ్బంది దశరథ్, మసూద్ పాల్గొన్నారు.