
గంగిడి మనోహర్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్న నాయకులు
సాక్షి,నాంపల్లి: బీజేపీతోనే గ్రామాల అబివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన నివాసంలో మర్రిగూడెం మండలంలోని లెంకలపల్లి గ్రామానికి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. భావి తరాల అభివృద్ధికి బీజేపీ పాటుపడుతుందని తెలిపారు.యువత బీజేపీ వెంటే ఉందన్నారు. పార్టీలో చేరిన వారిలో బి.వెంకన్న, ఐతగోని నర్సింహ, దేవేందర్, వరుకుప్పల అనిల్, ఏర్పుల శ్రీశైలం, బరిగెల నాగరాజు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రావు, చాపల వెంకన్న తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment