
గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి
మంచాల: గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటు పడాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం మంచాల మండల పరిధిలోని లింగంపల్లి, తాళ్లపల్లి గూడ గ్రామాల్లో హరితాహారం పథకం కింద మొక్కలు నాటారు, అదే విధంగా ఆయా గ్రామాల్లో సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడన్నాకి ప్రతి ఒక్కరు బాధ్యతగా బావించి ముందుకు రావాలన్నారు. గ్రామాల్లో ప్రజలందరికి మౌలిక వసతుల కల్పన కోసం తన వంతు సహాకారం ఎల్లప్పుడు ఉంటుందన్నారు.ప్రధానంగా పారిశుద్ధ్యం, తాగునీరు, విధి లైట్లు, వంటి సమస్యలను పరిష్కారించుకోవాలన్నారు. అదే విధంగా గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం కూడా చాలా అవసరమన్నారు.
గ్రామాల అభివృద్ధికి విడుతల వారిగా నిధులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చె నిధులను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు కూడా పేదలకు అందించే విధంగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అన్నారు. బంగారు తెలంగాణ రాష్ర్ట సాధనలో బాగంగా ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, షాధిముభారక్, వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు ,రవాణా సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల రోడ్ల అభివృద్ధికి కోట్లాది రూపాయాలు కేటాయించడం జరిగిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలు గుర్తించుకోవాలన్నారు. లింగంపల్లిలో రూ.5లక్షలతో సీసీ రోడ్డు, మరో రూ.5లక్షలతో అండర్ డ్రైనేజీ పనులు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా తాళ్లపల్లి గూడ గ్రామంలో రూ.5లక్షలతో సీసీ రోడ్డు, రూ.3లక్షలతో అండర డ్రైనేజీ పనులు ప్రారంభం చేయడం జరిగింది.
హరితాహారం.....
హరితాహారం పథకంలో బాగంగా లింగంపల్లి, తాళ్లపల్లి గూడ గ్రామాల్లో 5వేల మొక్కలు నాటడం జరిగింది. నాటిన ప్రతి మొక్కను కాపాడాలని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో హరితాహారం పథకం అమలు చేయడం జరుగుతుందన్నారు. నాటిన మొక్కలను కాపాడినప్పుడే ఆ పథకాన్నికి సార్ధకత చేకూరుతుందన్నారు.గ్రామాల్లో పాఠశాల స్థాయి నుండి రైతు వరకు కచ్చితంగా మొక్కలు నాటాలి. వాటిని పెంచాలన్నారు. ప్రకృతి వైఫరిత్యాలను అడ్డుకోవాలంటే కచ్చితంగా మొక్కలను నాటాలన్నారు. పచ్చధనం ద్వారా ప్రకృత్తి బాగుంటుందన్నారు.ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలి, రైతులు బాగుండాలి అంటే కచ్చితంగా మొక్కలు నాటాలన్నారు.
కార్యక్రమంలో మంచాల ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ సభ్యుడు భూపతిగళ్లమహిపాల్, వైస్ ఎంపీపీ భాషయ్య, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దండేటికార్ రవి, డైరెక్టర్ కిషన్‌రెడ్డి, లింగంపల్లి సర్పంచ్ రాచకొండ వాసవి, తాళ్లపల్లిగూడ సర్పంచ్ యాదయ్య, ఎంపీటీసీ సభ్యురాలు మంజుల, ఉప సర్పంచ్ మహేంధర్, వార్డు సభ్యులు, ఎంపీడీఓ నాగమణి, తహసీల్దార్ శ్యాంప్రకాశ్, మాజీమార్కెట్ కమిటీ చైర్మన్ అంజిరెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు చిందం రఘుపతి, నాయకులు పరమేష్, శ్రీరాంలు, జానీ పాష, యాదయ్య, సీఐ గంగాధర్, ఎస్సైలు కె.యాదగిరి తదితరులు పాల్గొన్నారు.