ఎన్నాళ్లో..! | How long ..! | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లో..!

Published Wed, Feb 25 2015 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM

How long ..!

గ్రామాభివృద్ధి కోసం రాజకీయూలను పక్కనబెట్టి అందరూ సంఘటితమై ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేసుకున్నారు. జిల్లాలో 33 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యూరుు. గతంలో ఒక్కో పంచాయతీకి రూ.5 లక్షలు ప్రోత్సాహకంగా ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని రెట్టింపు చేయూలని ప్రభుత్వం యోచిస్తోంది. కానీ పంచాయతీ ఎన్నికలు జరిగి ఏడాదిన్నరైనా ఒక్కపైసా రాకపోవడమే నిరుత్సాహం కలిగిస్తోంది..నిరీక్షణ మిగిల్చింది.
 
 సాక్షి ప్రతినిధి, ఖమ్మం: 2013 జూలైలో పంచాయతీ ఎన్నికలు జరిగారుు. అప్పట్లో ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షల ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించింది. గ్రామాభివృద్ధి కోసం పార్టీలకతీతంగా ఊరోళ్లంతా ఏకమయ్యూరు. ఎన్నికలకు దూరంగా ఉండి ఏకగ్రీవం చేసుకున్నారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచాలని యోచిస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇదేదో త్వరగా నిర్ణరుుస్తే పంచాయతీలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని ఏకగీవ్ర పంచాయతీల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు అంటున్నారు. నిధులలేమితో ఊళ్లు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయని వాపోతున్నారు.

 జిల్లాలో మొత్తం 758 గ్రామ పంచాయతీలున్నారుు. ఎన్నికల అనంతరం ఏడు ముంపు మండలాల్లోని 87 గ్రామ పంచాయతీలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనమయ్యాయి. ఇంకా 671 గ్రామ పంచాయతీలున్నారుు. వీటిలో 33 గ్రామ పంచాయతీల పాలకవర్గాలను అక్కడి ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందుకుగాను ప్రోత్సాహక నిధులివ్వాలనే నిర్ణయం ఉంది. ఐదువేల లోపు జనాభా ఉన్న గ్రామపంచాయతీలకు రూ.5 లక్షలు ప్రోత్సాహకంగా ఇవ్వాలని అప్పట్లో నిర్ణరుుంచారు.

అంతకుమించి జనాభా ఉంటే రూ.7 లక్షలు ఇవ్వాలనుకున్నారు. దీనికి దామాషా ప్రకారం ప్రభుత్వం రూ.1.65 కోట్లు విడుదల చేయూల్సి ఉంది. ఇప్పటి వరకు ఆ నిధులు మంజూరు కాలేదు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామపంచాయతీల సంఖ్యను పెంచింది. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని నిర్ణరుుంచింది. పనిలో పనిగా ఏకగ్రీవ పంచాయతీలకూ ఇచ్చే ప్రోత్సాహకాలనూ పెంచాలని యోచిస్తోంది.  

 పెంచటం సరే..ఎప్పుడిస్తారో..?
 ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహకం మొత్తాలను పెంచాలనే యోచనపై సర్పంచ్‌లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రూ.5 లక్షల ప్రోత్సాహకాన్ని రూ.10 లక్షలకు, రూ.7 లక్షలున్నదాన్ని రూ.15 లక్షలకు పెంచాలనే యోచన బాగానే ఉన్నా ఆ నిధులను ఎప్పుడు విడుదల చేస్తారో స్పష్టత ఇవ్వకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఎన్నికై ఏడాదిన్నరకు పైగా పూర్తరుుంది. ఇప్పటి వరకు ఒక్కపైసా విడుదల చేయలేదు. కనీసం ఈ ప్రోత్సాహకమైనా వస్తే గ్రామాభివృద్ధి చేస్తామని అంటున్నారు. జిల్లాలో 33 ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున రూ.3.30 లక్షలు మంజూరు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. కానీ అవి ఎప్పుడొస్తాయనేదే సందిగ్ధంగా ఉంది.

 గ్రామాల్లో నీరు.. పారిశుద్ధ్య సమస్యలు
 మిగతా పంచాయతీలతో పాటే ఏకగ్రీవ పంచాయతీలనూ సమస్యలు వెంటాడుతున్నారుు. రోడ్లు, నీరు, పారిశుద్ధ్య సమస్యల్లో ఊళ్లు కొట్టుమిట్టాడుతున్నారుు. మొన్నటి వరకు డెంగీ, మలేరియూ, టైఫారుుడ్, విషజ్వరాలతో గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే పలుపంచాయతీల్లో తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నారుు.

నిండు వేసవి నాటికి ఈ సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉంది. ఈలోగానే ప్రోత్సాహక నిధులు మంజూరు చేస్తే పంచాయతీలను అభివృద్ధి చేసుకుంటామని ఏకగ్రీవ పంచాయతీల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డుమెంబర్లు అంటున్నారు.
 
 రెండేళ్లు కావస్తోంది..
 ఏకగ్రీవ పంచాయతీ అయితే స్పెషల్ ఇన్సెంటివ్ ఫండ్ (ప్రత్యేక నిధులు) ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మా లోక్యాతండా గ్రామ పంచాయితీ నుంచి నేను ఏకగ్రీవం సర్పంచ్‌గా ఎన్నికయ్యూ. రెండేళ్ల పదవీకాలం కావస్తున్నా నేటికీ నిధుల జాడేలేదు. ప్రత్యేక నిధులు వస్తే గ్రామ పంచాయతీలో  సీసీరోడ్లు, సైడ్ డ్రెయిన్స్ నిర్మించుకుంటాం. చెరువులోని మంచినీటి బావికి స్టీనింగ్ నీరు కలుషితం కాకుండా చూసుకుంటాం.
 - పులుసు ఉమారాణి, సర్పంచ్, లోక్యాతండా, కూసుమంచి
 
 అంతర్గత రోడ్లు నిర్మించాలి

 ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.7 లక్షలు ప్రోత్సాహకం కింద ఇచ్చింది. ఎన్నికలు పూర్తయి 19 నెలలు గడిచినా నిధులు మంజూరు కాలేదు. గ్రామపంచాయతీకి నిధులు లేకపోవడంతో అంతర్గతరోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహక నగదు మంజూరైతే ఆ నిధులతో గ్రామంలో అంతర్గత రోడ్లు నిర్మిస్తాం.
 - చావలి రామరాజు, గ్రామ సర్పంచ్, నాగవరప్పాడు, మధిర
 
 అత్యవసర పనులకు కేటారుుస్తాం..
 ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం విడుదల చేస్తామన్న రూ. 7 లక్షలు త్వరగా విడుదల చేయూలి. వెంటనే పంచాయతీలోని అత్యవసర పనులు గుర్తించి చేపడతాం. తాగునీటి సమస్య పరిష్కరించుకోవడానికి ఈ నిధులు ఉపయోగపడుతారుు. ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు త్వరగా నిధులు విడుదల చేయూలని కోరుతున్నాం.
 - జక్కంపూడి రమాదేవి, సర్పంచ్, చండ్రుపట్ల, కల్లూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement