విజయవాడ: రాష్ట్రంలో టీడీపీ నేతలు అధికార దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేత పి. గౌతంరెడ్డి ఆరోపించారు. మంగళవారం విజయవాడలో గౌతంరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. టీడీపీ కార్యకర్తలకు తక్కువ ధరలకే టెండర్లు అప్పగిస్తున్నారని విమర్శించారు.
విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అద్దె ధర రోజుకు రూ. 60 వేలుగా ఉందని ఆయన గుర్తు చేశారు. టీడీపీ కార్యకర్త గరిమెళ్ల నానికి రూ. 15 వేలకే కట్టబెట్టడంలో ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు. టీడీపీ మంత్రి దేవినేని ఉమా, స్థానిక ఎమ్మెల్యే బోండా కుమ్మకై గరిమెళ్ల నానికి తక్కువ ధరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ను తక్కువ అద్దెకు ఇచ్చారని గౌతంరెడ్డి అన్నారు.