
పోలవరంపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. డయా ఫ్రం వాల్ కొట్టుకుపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత దేవినేని ఉమాపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేవినేని ఉమ మరోసారి తన కులం గురించి మాట్లాడితే సహించేది లేదని నిప్పులు చెరిగారు. ‘‘ఆడా మగా కాని ఉమ.. సోడాలు కొట్టుకునే బతుకు నీది. ఆయన ఓ చవట, దద్దమ్మ, సన్నాసి’’ అంటూ మంత్రి మండిపడ్డారు. పోలవరంపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. డయా ఫ్రం వాల్ కొట్టుకుపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. డయా ఫ్రం వాల్ ఎప్పుడు నిర్మించారో రామోజీరావుకు తెలియదా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో జరిగిన దానికి మాపై నిందలా? పోలవరంలో టీడీపీ చేసిన పాపాలను మేం కడుగుతున్నామని’’ అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు.
చదవండి:
బాబు బాగోతం వల్లే డయాఫ్రమ్ వాల్‌కు నష్టం
పోలవరంపై వాస్తవాలు గోదాట్లో కలిపిన ‘ఈనాడు’