సాక్షి, ఎన్టీఆర్: టీడీపీలో టికెట్ల పంచాయితీ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఎన్నికల్లో టికెట్ ఆశించిన భంగపడుతున్న నేత టీడీపీ అధినేత చంద్రబాబుకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా కొత్త వారికి టికెట్ ఇస్తే మద్దతు తెలిపే ప్రసక్తేలేదని హెచ్చరిస్తున్నారు. దీంతో, బాబుకు కొత్త టెన్షన్ పట్టుకున్నట్టు రాజకీయంగా చర్చ నడుస్తోంది.
ఇక, మైలవరం టీడీపీ ముక్కలుగా విడిపోయింది. చంద్రబాబు తీరుతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాగా, చంద్రబాబు సమక్షంలో నేడు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. ఆయన వెంట కేశినేని చిన్ని, నెట్టెం రఘురాం కూడా ఉన్నారు. అయితే, వసంత చేరికను దేవినేని ఉమా, అతని అనుచరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే వసంత చేరిక సమయంలో కూడా ఉమా కనిపించలేదు.
మరోవైపు.. వసంత కృష్ణప్రసాద్‌ను పార్టీలో చేర్చుకోవద్దని గతంలోనే దేవినేని ఉమా.. చంద్రబాబుకు చెప్పాడు. అయినప్పటికీ ఉమా మాటలను చంద్రబాబు లైట్ తీసుకున్నాడు. ఈ క్రమంలో ఉమ తన అనుచరులతో కలిసి నిన్న(శుక్రవారం) పార్టీ అధినేతపై తిరుగుబాటు చేశారు. ఎవరో వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే సహకరించేదిలేదని తెగేసి చెప్పారు. ఉమా వర్గం మరో అడుగు ముందుకేసి ఉమాను కాదని మరో వ్యక్తికి మైలవరం టికెట్ కేటాయిస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. వసంత రాకను ఉమాతో పాటుగా బొమ్మసాని సుబ్బారావు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా టీడీపీలోకి వసంత చేరికతో పార్టీ మూడు ముక్కలుగా విడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment