ఎవరెన్ని కుట్రలు చేసి పాలమూరు ఎత్తిపోతల పథకం ఆగదని తెలంగాణ నీటి పారుదల శాఖమంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఎన్ని అవంతరాలు కల్పించినా యుద్ధప్రాతిపదికన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. హరీష్ రావు శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు - రంగారెడ్డి, నక్కలగండి ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు లేవన్న ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. దేవినేని ఉమా వ్యాఖ్యలు అవాస్తవాలు అని హరీశ్ రావు అన్నారు.