చింతమనేనిపై చర్యలు సీఎం నిర్ణయిస్తారు
విజయవాడ: మహిళా తహశీల్దార్పై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తమ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయిస్తారని మంత్రి దేవినేని ఉమ అన్నారు. పుష్యరాల దృష్ట్యా ఆందోళన విరమించాల్సిందిగా ఉద్యోగులను కోరినట్లు ఆయన మీడియాకు తెలిపారు. తహశీల్దార్పై పెట్టిన అక్రమ కేసులన్నింటిని ఎత్తివేయాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి సూచించామన్నారు.
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు తనపై దాడి చేశారని, తనను ఇసుకలో ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని ముసునూరు మహిళా ఎమ్మార్వో వనజాక్షి తెలిపిన విషయం తెలిసిందే. జరిగిన ఘటనపై ఆమె కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఆమెతో రెవెన్యూ ఉద్యోగ సంఘాలు కలిసివచ్చి దర్నాలకు దిగిన నేపథ్యంలో ప్రభుత్వం తరుపున చర్చలు దేవినేని చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడి ఈ విషయాలు వెల్లడించారు.