mla chinthamaneni prabhakar
-
చింతమనేనికి సీఎం వత్తాసు
పెదపాడు: ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు వత్తాసు పలకడం వల్లే ఆయన ఆగడాలకు అడ్డూ ఆపులేకుండా పోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ఆరోపించారు. అప్పనవీడుకు చెందిన గరికపాటి నాగేశ్వరరావును చింతమనేని దౌర్జన్యం చేసి కొట్టడంతో ఆయన్ను గురువారం వైఎస్సార్ సీపీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆళ్లనాని మాట్లాడుతూ రక్షించాల్సిన ఎమ్మెల్యేనే దాడులకు పాల్పడితే ఇంకా ప్రజలను ఎవరు కాపాడుతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్, చంద్రబాబు చింతమనేని దందాల్లో వచ్చే వాటాలను తీసుకోవడం వల్లే ఆయన ఎన్ని ఆగడాలు చేసినా కాపాడుతూ వస్తున్నారని విమర్శించారు. చింతమనేని కొట్టి గాయపర్చిన ఓ మహిళా తహసీల్దార్‌ను తన చాంబర్‌కు పిలిపించుకుని భయపెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్‌ను కొట్టాడన్న కారణంగా ప్రశ్నించిన గరికపాటి నాగేశ్వరరావును కొట్టి 45గంటలు అయినా ఎమ్మెల్యేపై ఇంత వరకు చర్యలు తీసుకోకుండా తాత్సారం చేయడం చూస్తేంటే ప్రభుత్వ యంత్రాంగం ఉందా అన్న సందేహం కలుగుతోందన్నారు. తమకు చింతమనేని నుంచి ఎప్పుడు రక్షణ దొరుకుతుందా అని దెందులూరు నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. చంద్రబాబు బొమ్మ చిరిగిందని వీరంగం వేసి కొట్టిన వారిపై కేసునమోదు చేయకుండా.. తక్షణమే కేసు నమోదు చేయాలని అడిగారని 32మందిపై కేసు పెట్టడం సబబు కాదన్నారు. ఆ 32మందిపై వెంటనే కేసులు ఉపసంహరించాలని, చింతమనేని అరెస్ట్ చేయాలని ఆళ్లనాని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, ఆయన బాధితులకు అండగా ఉండాలని తమను ఆదేశించారని చెప్పారు. పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. సిగ్గుచేటు వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్యయకర్త కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ 40 కేసులున్న చింతమనేని ఎమ్మెల్యే అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి వారందరినీ వచ్చే ఎన్నికల్లో ఓడించాలన్నారు. చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు.నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు 40నుండి 50వరకు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ దెందులూరు నియోజకవర్గ సమన్వయ కర్త కొఠారు రామచంద్రరావు, వైఎస్సార్ సీపీ పెదపాడు మండల కన్వీనర్ అప్పన కనక దుర్గా ప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శులు కొండే లాజరు, గారపాటి బాస్కరరావు, కమ్మ శివరామకృష్ణ, ఆళ్ల సతీష్‌చౌదరి, కాంగ్రెస్‌పార్టీ నాయకుడు చలమల శెట్టి రమేష్, అభయాంజనేయస్వామి దేవాలయ మాజీ చైర్మన్లు కేతినీడి జైనేంద్రకుమార్, బొప్పన కృష్ణ, మాజీ ఎంపీపీ సుధీర్‌బాబు, మధ్యాహ్నపు బలరాం, బేతాళ శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
చింతమనేనిపై అనర్హత వేటు వేయాలి
-
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనికి రెండేళ్ల జైలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు, భీమడోలు: ప్రభుత్వ అధికారులపై దాడులకు, వివాదాలకు మారుపేరైన రాష్ట్ర ప్రభుత్వ విప్, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు కోర్టు బుధవారం రెండేళ్ల జైలుశిక్ష విధించింది. 2011లో అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్‌పై దౌర్జన్యం చేసిన కేసులో మూడు సెక్షన్ల కింద అభియోగాలు రుజువైనందున భీమడోలు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి కె.దీప దైవకృప రెండేళ్ల జైలుశిక్ష, రూ.2500లు జరిమానా విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో నెల రోజులపాటు సాధారణ జైలుశిక్ష విధించారు. అనంతరం తీర్పును తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ చింతమనేని ప్రభాకర్‌కు బెయిల్ మంజూరు చేశారు. -
ఎమ్మెల్యే చింతమనేనికి జైలుశిక్ష
సాక్షి, దెందులూరు : పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు భీమడోలు మెజిస్ట్రేట్ కోర్టు షాక్ ఇచ్చింది. మూడు వేర్వేరు కేసుల్లో ఆయనకు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే.. 2011లో అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై చింతమనేని ప్రభాకర్ చేయి చేసుకున్నారు. అంతే కాకుండా వట్టి వసంత్ కుమార్ గన్‌మెన్‌పై చేయిచేసుకున్న కేసులో దోషిగా నిర్ణయిస్తూ భీమడోలు మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది. 2011 జూన్ నెలలో దెందులూరు హైస్కూల్ లో జరిగిన రచ్చబండలో అప్పటి మంత్రి హోదాలో ఉన్న వట్టి వసంత్ కుమార్ పై దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని దౌర్జన్యం చేయడంతో పాటు అప్పటి ఎంపి కావూరి సాంబశివరావు , ప్రజలందరి సమక్షంలో చేయి చేసుకున్నారు. దీనిపై అప్పటి మంత్రి వట్టి వసంత్ కుమార్ గన్‌మెన్ ఫిర్యాదు మేరకు దెందులూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు నాలుగు సెక్షన్లగా కేసు నమోదు చేశారు. ఏడేళ్లగా కేసు వాదోపవాదనలు జరగగా నేడు (బుధవారం) కోర్టు తీర్పు వెలువరించింది. సెక్షన్ 506(2) గా రెండేళ్ల జైలు శిక్ష, వెయ్యి రూపాయిల జరిమానా....సెక్షన్ 353 గా ఆరు నెలల జైలు శిక్ష, వేయి రూపాయిల జరిమానా, సెక్షన్ 7(1) గా ఆరు నెలలు జైలు శిక్ష తో పాటు 500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. మొత్తంగా మూడేళ్ల జైలు శిక్ష, 2500 జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ సంచలన తీర్పు వెల్లడించారు. అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని తీర్పునివ్వడంతో చింతమనేనికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష వర్తిస్తుంది. తీర్పు వెలువడే సమయంలో తన అనుచరులతో చింతమనేని కోర్టుకు హాజరయ్యారు. తీర్పు వెలువడిన వెంటనే చింతమనేని బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా, కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
టోల్ ఫీజు చెల్లించవద్దు
పశ్చిమగోదావరి ,పెదపాడు:జాతీయ రహదారులు అధ్వానంగా ఉన్నాయని, వాహనదారులు టోల్ ఫీజు చెల్లించవద్దంటూ పెదపాడు మండలం కలపర్రు టోల్ గేట్‌వద్ద దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆందోళన చేశారు. గురువారం ఉదయం ఆయన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి ఏపూరు గ్రామానికి వెళ్తూ మార్గమధ్యంలో కలపర్రు టోల్ గేట్ వద్ద ఆగారు. జాతీయ రహదారులు అధ్వానంగా ఉన్నాయని, వాహనదారులు టోల్ ఫీజు చెల్లించవద్దని చెబుతూ టోల్ ఫీజు చెల్లించకుండానే వాహనాలను పంపించివేశారు. పార్టీ ఏలూరు మండల అధ్యక్షుడు నేతల రవిని అక్కడే ఉంచి, ఎవరి వద్ద నుంచి అయినా టోల్ వసూలు చేస్తే తన దృష్టికి తీసురావాలని ఆదేశించారు. అనంతరం ఆయన ఏపూరులో కార్యక్రమం ముగించుకుని తిరిగి టోల్ గేట్ వద్దకు చేరుకుని అక్కడి నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులతో మాట్లాడారు. జాతీయ రహదారులు బాగు చేయకుండా టోల్ వసూలు చేయవద్దని, అవసరమైతే జిల్లా కలెక్టరుతో మాట్లాడాలని ఆయన వారికి సూచించారు. జాతీయ రహదారులు బాగుచేయకుండా టోల్ వసూలు చేస్తే ఊరుకోనంటూ హెచ్చరించారు. దీంతో టోల్ గేట్ అధికారులు టోల్ ఫీజు వసూలు చేయకుండా వాహనాలను వదిలేశారు. -
తమ్మిలేరులో చెలరేగిన ఇసుకాసురులు
♦ 50 ట్రాక్టర్లతో వచ్చిన చింతమనేని అనుచరులు ♦ అడ్డుకున్న గ్రామస్తులు.. ట్రాక్టర్ల నిలిపివేత గుళ్లపూడి (ముసునూరు): ప్రభుత్వ విప్, పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుక దోపిడీకి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ప్రభుత్వం ఒకవైపు ఇసుకను ఉచితంగా ఇస్తున్నామంటూ పేర్కొంటుందే తప్ప చింతమనేని దోపిడీకి మాత్రం అడ్డుకట్ట వేయడం లేదు. ఇసుక దుమారంలో కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారుపై దాడి ఘటనను ప్రజలు మరువకముందే మళ్లీ తమ్మిలేరులో చింతమనేని ఇసుక దోపిడీని ప్రారంభించారు. ముసునూరు మండలం గుళ్లపూడి వద్ద ఉన్న తమ్మిలేరు నుంచి ఇసుక తోలకానికి తమకు అనుమతులున్నాయంటూ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చింతమనేని అనుచరులు 50 ట్రాక్టర్లతో గుళ్లపూడి రేవు నుంచి ఇసుక తోలే ప్రయత్నాలను ఆదివారం ప్రారంభించారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో ఎస్సై విజయ్‌కుమార్ తన సిబ్బందితో పాటు విలేకర్లతో కలసి ఇసుక ర్యాంపు వద్దకు చేరుకునేసరికి ట్రాక్టర్లతో వచ్చినవారు పలాయనం చిత్తగించారు. వారిలో కొందరిని గ్రామస్తులు నిలిపివేశారు. పోలీసులు 11 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈలోగా నూజివీడు సీఐ వి.సుబ్బరాజు సంఘటనా స్థలానికి చేరుకుని ధర్మాజిగూడేనికి చెందిన అధికార పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక మంత్రితో పోలీసులకు ఫోన్లు చేయిస్తున్నారు. అయితే గుళ్లపూడికి చెందిన రైతులు మాత్రం ఇసుకను తీసుకెళ్లేవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు. -
వనజాక్షి ఘటనే కాదు.. ఇంకా అలంటావి ఎన్నో
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన సంక్షేమ పథకాలను టీడీపీ ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆంధప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన ప్రభుత్వ నేతలు పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ఏపీలో జరిగిన రైతు ఆత్మహత్యలన్నీ కూడా సర్కార్ హత్యలేనని ఆరోపించారు. తహశీల్దార్ వనజాక్షి ఘటన ఒక్కటే వెలుగులోకి వచ్చిందని, ఇంకా వెలుగులోకి రానీ ఎన్నో సంఘటనలు ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కాపాడేందుకు సీఎం పదవిని దుర్వినియోగం చేస్తున్నారని రఘువీరా విమర్శించారు. -
చింతమనేనిపై చర్యలు సీఎం నిర్ణయిస్తారు
విజయవాడ: మహిళా తహశీల్దార్‌పై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తమ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయిస్తారని మంత్రి దేవినేని ఉమ అన్నారు. పుష్యరాల దృష్ట్యా ఆందోళన విరమించాల్సిందిగా ఉద్యోగులను కోరినట్లు ఆయన మీడియాకు తెలిపారు. తహశీల్దార్‌పై పెట్టిన అక్రమ కేసులన్నింటిని ఎత్తివేయాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి సూచించామన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు తనపై దాడి చేశారని, తనను ఇసుకలో ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని ముసునూరు మహిళా ఎమ్మార్వో వనజాక్షి తెలిపిన విషయం తెలిసిందే. జరిగిన ఘటనపై ఆమె కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఆమెతో రెవెన్యూ ఉద్యోగ సంఘాలు కలిసివచ్చి దర్నాలకు దిగిన నేపథ్యంలో ప్రభుత్వం తరుపున చర్చలు దేవినేని చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడి ఈ విషయాలు వెల్లడించారు.