హరీష్‌పై దేవినేని ఉమ ఫైర్
విజయవాడ: తాగునీటి సమస్యను వివాదం చేయడం తగదంటూ ఏపీ మంత్రి దేవినేని ఉమ.. తెలంగాణ మంత్రి హరీష్ రావుపై మండిపడ్డారు. కృష్ణా జలాల పంపిణీపై సామరస్యంగా చర్చలు జరపాలని ఉమ అన్నారు.
తెలంగాణలో నిర్మిస్తున్న పాలమూరు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు కొత్తవేనంటూ ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు ఉన్న హక్కు మేరకే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాద్ధాంతం చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి దేవినేని ఉమ పై విధంగా స్పందించారు.