ఏ ఎమ్మెల్యేతోనూ వర్గ పోరు లేదు | no clash between any mla, says devineni nehru | Sakshi
Sakshi News home page

ఏ ఎమ్మెల్యేతోనూ వర్గ పోరు లేదు

Published Tue, Oct 4 2016 8:27 AM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM

ఏ ఎమ్మెల్యేతోనూ వర్గ పోరు లేదు - Sakshi

ఏ ఎమ్మెల్యేతోనూ వర్గ పోరు లేదు

దేవినేని నెహ్రూ
 
విజయవాడ (గుణదల) : తనకు జిల్లాలోని ఏ ఎమ్మెల్యేతోనూ వర్గపోరు లేదని మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) అన్నారు. తాను టీడీపీలో చేరిన15 రోజుల్లోనే వర్గపోరు అనడం సరికాదని పేర్కొన్నారు. ‘నేనంటే నేను’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనంపై నెహ్రూ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. పార్టీ నేతలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని వివరించారు.

అరాజకీయమైన రాజకీయ శక్తులన్నీ వైఎస్సార్ సీపీలోనే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ పత్రికలు, మీడియాతో విరోధం పెట్టుకోలేదని చెప్పారు. అయినా తనపై నిందారోపణలు చేయడం సమంజసం కాదన్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. మంత్రులు నారాయణ, దేవినేని ఉమ, సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌తో తాను ఎన్నడూ మాట్లాడలేదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement