ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం తోటపల్లి ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేశారు.
విజయనగరం: ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం తోటపల్లి ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్ నుంచి లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు కిమిడి మృణాళిని, అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున మిగతా 20వేల ఎకరాలకు వచ్చే ఏడాది మార్చినాటికి నీరందిస్తామని మంత్రి దేవినేని ఉమ తెలిపారు.