
'కేసీఆర్ సెక్షన్ 8 చెల్లదనడం సరికాదు'
విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మంగళవారం విజయవాడలో మండిపడ్డారు.రాష్ట్ర పునర్విజభన చట్టం చెల్లినప్పుడు... సెక్షన్-8 ఎందుకు చెల్లదని కేసీఆర్ను ఆయన ప్రశ్నించారు. విభజన నేపథ్యంలో గవర్నర్కు ప్రత్యేక బాధ్యతలు ఉంటాయని సెక్షన్ - 8లో పేర్కొన్నారని ఉమా ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సెక్షన్ -8 చెల్లదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొనడం సరికాదని ఉమా అభిప్రాయపడ్డారు. సెక్షన్ 8 చెల్లకుంటే ఏపీ పునర్విభజన చెల్లుతుందా? అని కేసీఆర్ను దేవినేని ఉమా సూటిగా ప్రశ్నించారు. అంతర్గత భద్రత, శాంతి భద్రతలు గవర్నర్ చేతిలోనే ఉంటాయని విభజన చట్టంలో చెప్పారని దేవినేని ఉమా వెల్లడించారు.