
పర్యాటకానికి ప్రాణనాడిగా పోలవరం
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పర్యాటక రంగానికి ప్రాణనాడిగా మలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్టు కోసం 1,055 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు చేయాల్సి ఉండగా, 703 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయని, ఇంకా 352 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని వివరించారు. కాఫర్ డ్యాం కటాఫ్ వాల్, స్పిల్ చానల్ బ్రిడ్జి పనులను జూన్ 8న ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జూన్ 30 నుంచి కాంక్రీట్ పనులు వేగవంతం చేయాలని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాజెక్టుల పనుల తీరుపై జిల్లా అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనులు ఆలస్యం కావడానికి కారణమైన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.