దుర్గగుడిలో మంత్రి దేవినేనికి చుక్కెదురు | Devotees Serious On Minister Devineni Uma Over Durga Temple Problems | Sakshi
Sakshi News home page

దుర్గగుడిలో మంత్రి దేవినేనికి చుక్కెదురు

Published Wed, Oct 10 2018 9:51 PM | Last Updated on Wed, Oct 10 2018 10:19 PM

Devotees Serious On Minister Devineni Uma Over Durga Temple Problems - Sakshi

సాక్షి, విజయవాడ : దుర్గగుడిలో మంత్రి దేవినేని ఉమకు చుక్కెదురైంది. సాధారణ భక్తులు వెళ్లే క్యూలైన్‌లో కొండపైకి వచ్చిన మంత్రి ఉమని.. ఓ భక్తురాలు సమస్యలపై నిలదీసింది. క్యూలైన్‌లో ఉన్న మంత్రి ఉమ గుడిలోని సదుపాయాల గురించి భక్తులను అడుగగా.. క్యూలైన్ల నిర్వహణ గందరగోళంగా ఉందని, గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఓ మహిళా భక్తురాలు అసహనం వ్యక్తం చేసింది. వీఐపీలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. దీంతో జవాబు చెప్పలేక పోయిన మంత్రి సమయం అవుతోందంటూ గుడిలోకి వెళ్లిపోయారు. ఫిర్యాదు చేస్తే పట్టించుకోని మంత్రి ఈ మాత్రానికే క్యూలైన్లలో రావటం, సమస్యలు ఉన్నాయా అని అడగటం ఎందుకని భక్తులు అసహనం వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement