ఇంద్రకీలాద్రి: కనకదుర్గమ్మ సన్నిధిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా భక్తులు కొత్త కష్టాలు ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి పనుల నేపథ్యంలో రోడ్డుపైనే మొక్కులు చల్లించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గురువారం ఉదయం కేశఖండన శాలను తొలగించటంతో క్షురకులు రోడ్డుపక్కకు చేరుకున్నారు. దీంతో వృద్ధులు, పిల్లలు, మహిళలు అక్కడే మొక్కులు తీర్చుకున్నారు. దీంతో పాటు క్లాక్‌రూం, చెప్పులస్టాండ్‌ను కూడా తొలగించే పనులను అధికారులు చేపట్టారు. ఈ పరిణామాలతో కంగుతిన్న భక్తులు వస్తువులను ఎక్కడ భద్రపరుచుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. మరో వైపు వర్షాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.