
మున్సిపాలిటీ మాజీ చైర్మన్ దుర్మరణం
మెదక్: మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కృష్ణారావు దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి... చిన్నకోడూరు మండలం అనంతసాగర్ వద్ద కారును లారీ ఢీకొనడంతో కృష్ణారావు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గతంలో కృష్ణారావు మూడు పర్యాయాలు మంచిర్యాల మున్సిపాలిటీకి చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు.