బ్యాంకు ఖాతాదారులే టార్గెట్..!
బ్యాంకు ఖాతాదారులే టార్గెట్..!
Published Wed, Jun 25 2014 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 9:20 AM
హుజూర్‌నగర్ :బ్యాంకు ఖాతాదారుల అజాగ్రత్తను గుర్తుతెలియని వ్యక్తులు చాకచాక్యంగా సొమ్ము చేసుకుంటున్నారు. బ్యాంకుల నుంచి డ్రా చేసుకున్న నగదును తమ వాహనాల డిక్కీల భద్రపరుచుకుని పక్కకు వెళ్లి వచ్చేలోపే దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. హుజూర్‌నగర్‌లో ఇటీవల జరిగిన వరుస చో రీలను గమనిస్తే ఈ విషయం ఇట్టే తెలిసిపోతోంది. ప్రస్తుతం ఈ విషయం నియోజకవర్గ కేంద్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఖాతాదారులు బ్యాంకుల నుంచి నగదును డ్రా చేయాలంటేనే జంకుతున్నారు.
అజాగ్రత్తే ప్రధాన కారణం
హుజూర్‌నగర్‌లో వాహనాల డిక్కీల నుంచి మాయమవుతున్న నగదుకు అజాగ్రత్తే ప్రధాన కారణంగా తెలుస్తోంది. బ్యాంకుల నుంచి డ్రా చేసుకున్న నగదు ను సదరు వ్యక్తులు డిక్కీలో భద్రపరుచుకుని నేరుగా ఇంటికి వెళ్లకుండా ఇతరత్ర పనులు చూసుకుంటున్న క్రమంలోనే చోరీలు జరిగినట్లు తెలుస్తోంది. సోమవారం హుజూర్‌నగర్ మండలం శ్రీనివాసపురానికి చెందిన కట్టా కృష్ణారావు బ్యాంకు నుంచి డ్రా చేసుకున్న రూ.5 లక్షల నుంచి రూ.4.50 లక్షలను అతని వా హనం నుంచి గుర్తుతెలియని వ్యక్తులు కొద్ది నిమిషాల్లోనే మాయం చేశారు. అయితే కృష్ణారావు తన వాహనాన్ని ఓ దుకాణం ముందు నిలిపి ఇతర పని చూసుకుంటున్న క్రమంలో ఈ చోరీ జరిగింది.
అదే కృష్ణారావు నేరుగా ఇంటికి వెళ్లి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా గతంలో మేళ్లచెరువు మండ లం మల్లారెడ్డిగూడేనికి చెంది న ఓ వ్యక్తి స్థానికంగా గల ఎస్‌బీహెచ్ నుంచి రూ. 47,000లను డ్రా చేసి తన మోటార్‌సైకిల్ డిక్కీలో పెట్టుకొని ఓ బట్టల దుకాణంలోకి వెళ్లినప్పుడు, పట్టణానికి చెందిన మరో ధా న్యం వ్యాపారి స్థాని కంగా గల పార్‌బాయిల్డ్ మిల్లు నుంచి రూ.85,000ల నగదును తీసుకొని తన హీరోహోండా మోటార్ సైకిల్ డిక్కీలో పెట్టుకొని ఇందిరాసెంటర్‌లోని టీ స్టాల్ వద్ద వాహనాన్ని పార్కింగ్ చే సి అజాగ్రత్తగా ఉన్నప్పుడే చోరీలు జరిగాయి.
పోలీసులు ఏమంటున్నారంటే..
బ్యాంకుల నుంచి నగదును డ్రా చేసుకునే వ్యక్తులు చాల జాగ్రత్తంగా ఉండాలని ఎస్‌ఐ వెంకటశివరావు అన్నారు. నగదును వెంట తీసుకువెళ్లే వారికి ఆయన కొన్ని సూచనలు చేశారు. పెద్ద మొత్తంలో నగదును డ్రా చేసినప్పుడు వెంటనే ఇంటికి వెళ్లిపోవాలి. వీలైతే వెంట ఓ వ్యక్తిని తోడుగా తీసుకువెళ్లాలి.తమను సహాయం కోరినా వెంట ఓ కానిస్టేబుల్‌ను రక్షణగా పంపిస్తాం. తమను ఎవరైనా గమనిస్తున్నారనే విషయాన్ని పసిగట్టగలగాలి. అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. పట్టణంలోని బ్యాంకుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేసి ఇలాంటి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Advertisement
Advertisement