vehicle parking
-
రూ.25 కోట్ల పార్కింగ్ భవనం.. వృథా
శివమొగ్గ: మల్టీప్లెక్స్ థియేటర్ మాదిరిగా కనిపిస్తున్న ఈ భవనం పార్కింగ్ కోసం కట్టినది. శివమొగ్గ నగర నడిరోడ్డున పూల మార్కెట్ సమీపంలో కోట్లాది రూపాయలను ఖర్చు చేసి నిర్మించిన మల్టీ లెవెల్ పార్కింగ్ భవనం.. ఏడాది గడుస్తున్నా ఇంతవరకు ప్రజలకు అందుబాటులోకి రాలేదు. నగరంలో ఏటేటా వాహనాల సంఖ్య పెరుగుతోంది. దీంతో పార్కింగ్ సమస్య ఏర్పడుతోంది. కొన్ని రోడ్లలో వాహనాల పార్కింగ్ సమస్యతో ప్రజలు, వాహన రాకపోకలు దుర్భరంగా మారాయి. దీంతో స్మార్ట్‌సిటీ పథకం కింద రూ.25 కోట్లతో మూడంతస్తుల అత్యాధునిక వాహనాల పార్కింగ్ భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలో ఒకేసారి 172 కార్లు, 78 ద్విచక్రవాహనాలను నిలపవచ్చు. అదే విధంగా సెల్లార్లో 118 స్టాళ్లను నిర్మించారు. వీటిలో పూలు, పండ్లు విక్రయించే వ్యాపారులకు అవకాశం కలి్పంచాలని నిర్ణయించారు. లిఫ్ట్ వ్యవస్థతో పాటు అన్ని హంగులను కల్పించారు. స్టాళ్లకు బాడుగను నిర్ణయించి వ్యాపారులకు పంపిణీ చేయాల్సి ఉంది. వాహనాల పార్కింగ్‌కు టెండర్ పిలిచి అర్హులైన కాంట్రాక్టరుకు అప్పగించాల్సి ఉంది. పాలికె మొద్దు నిద్ర అయితే ఇంతవరకు ఆ పనులేవీ కాలేదు. దీంతో ప్రతి నెలా భవనం నుంచి లభించాల్సిన లక్షలాది రూపాయల ఆదాయం అందకుండా పోతోంది. ప్రజల పార్కింగ్ కష్టాలు కూడా తీరడం లేదు. ఈ భవనం మహానగర పాలికె ఆధ్వర్యంలో ఉండడంతో పాలికె అధికారులే పట్టించుకోవాల్సి ఉంది. -
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆహుతైన కార్లు, బైక్‌లు, రిక్షాలు, ఫొటోలు వైరల్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జామియా నగర్లో ఎలక్ట్రిక్ వాహనాల పార్కింగ్ స్టేషన్ వద్ద బుధవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కార్లు, ద్విచక్ర వాహనాలతో సహా దాదాపు వందలాది వెహికిల్స్ అగ్నికి ఆహుతయ్యాయి. మంటల్లో కాలిబూడిదైన వాటిలో ఈవీ వాహనాలు కూడా ఉన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అందుపులోకి తెచ్చారు. మంటల్లో పది కార్లు, రెండు బైక్‌లు, రెండు స్కూటీలు, 30 ఈ- రిక్షాలు, 50 పాత ఈ-రిక్షాలు తగలబడినట్లు ఢిల్లీ ఫైర్ అధికారులు తెలిపారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో పార్కింగ్ మేనేజర్ అక్కడే ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చదవండి: సిద్దిపేట జిల్లాలో ఘోరం.. ఎలక్ట్రిక్ వాహనం పేలి ఇల్లు దగ్దం ఇక భారత్‌లో ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల పేలుళ్లు అధికమయ్యాయి. ఈవీ ప్రమాదాల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. మొన్నటికి మొన్న నాసిక్‌లోని రవాణా కంటైనర్‌లో జితేంద్ర ఎలక్ట్రిక్ వాహనాలకు చెందిన నలభై ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. కాగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో మార్చి నుంచి ఏప్రిల్ మధ్య ఎనిమిది ఈవీ ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. Delhi | Fire broke out at the electric motor parking Jamia Nagar. Seven fire tenders have reached the spot. The fire has been brought under control. Many vehicles have been damaged in the fire, and several e-rickshaws were burnt to ashes: Delhi Fire Service pic.twitter.com/HgKtTbY7wR — ANI (@ANI) June 8, 2022 -
మాల్స్‌లో ఫ్రీ పార్కింగ్
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లలో పార్కింగ్ ఫీజుల దోపిడీకి ప్రభుత్వం కళ్లెం వేసింది. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని ఇతర నగర, పట్టణ ప్రాంతాల్లో పార్కింగ్ ఫీజుల వసూళ్లపై నియంత్రణలు విధిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం.. ఎవరికైనా తొలి అర్ధగంట పాటు వాహనాల పార్కింగ్ బేషరతుగా ఉచితం. ఏవైనా కొనుగోళ్లు జరిపినట్లు బిల్లు చూపిస్తే అర్ధ గంట నుంచి గంట వ్యవధిలోపు పార్కింగ్ ఉచితమే. అయితే ఎలాంటి కొనుగోళ్లు జరపకపోతే నిర్ణీత పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పార్కింగ్ సమయం గంటకు మించితే ఆ వ్యవధికి చెల్లించాల్సిన పార్కింగ్ ఫీజు కంటే అధిక వ్యయం కొనుగోళ్లు జరిపినట్లు బిల్లు లేదా సినిమా టికెట్ చూపి ఉచిత పార్కింగ్ సదుపాయం పొందొచ్చు. ఈ కేటగిరీ కింద పార్కింగ్ ఫీజు కంటే షాపింగ్ వ్యయం తక్కువగా ఉంటే మాత్రం మొత్తం పార్కింగ్ సమయానికి నిర్ణీత పార్కింగ్ ఫీజు చెల్లించాలి. ఏప్రిల్ 1 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ఈ ఉత్తర్వులను వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలు తప్పనిసరిగా అమలు చేయాలని, లేకపోతే బాధ్యులపై క్రిమినల్ చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదాహరణకు ఒక మాల్లో పార్కింగ్ ఫీజు తొలి రెండు గంటలు రూ.30, ఆ తర్వాత గంటకు రూ.20 అయితే మూడు గంటలకు వెరసి రూ.50 అవుతుంది. రూ.50లకు మించి వస్తువులు కొనుగోలు చేసినా, సినిమా టికెట్ రూ.50 కంటే ఎక్కువున్నా పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లో పార్కింగ్ ఫీజుల నియంత్రణ విషయంలో ఉల్లంఘనలు జరిగితే చర్యలు తీసుకునే అధికారం జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఉంటుందని పేర్కొంది. పార్కింగ్ నియంత్రణకు ఎస్పీవీ! హైదరాబాద్‌లో అస్తవ్యస్తంగా మారిన వాహనాల పార్కింగ్‌ను నియంత్రించడంతో పాటు విడివిడిగా పార్కింగ్ సదుపాయం కల్పించేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పార్కింగ్ పాలసీ అమలు బాధ్యతలను ప్రభుత్వం ఎస్పీవీకి అప్పగించనుందని రాష్ట్ర పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి. -
రాంగ్ పార్కింగ్ ఫొటో కొట్టు.. గిఫ్ట్ పట్టు
న్యూఢిల్లీ: ఎక్కడపడితే అక్కడ వాహనాల్ని పార్కింగ్ చేసే వ్యక్తులకు షాక్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇకపై నిబంధనలకు విరుద్ధంగా పార్క్ చేసిన వాహనాలను పౌరులు మొబైల్‌తో ఫొటో తీసి సంబంధిత విభాగానికి లేదా పోలీసులకు పంపాలని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన సంబంధిత వాహనదారుడికి రూ.500 జరిమానా విధించడంతో పాటు అందులో 10 శాతాన్ని ఫిర్యాదుదారుడికి బహుమానంగా అందజేస్తామని వెల్లడించారు. ఈ మేరకు మోటర్ వాహనాల చట్టంలో మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం నాడిక్కడ రవాణా మంత్రిత్వశాఖ కార్యాలయం ఆటోమేటిక్ పార్కింగ్ లాట్ పనులకు గడ్కారీ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ పార్కింగ్ లాట్‌కు సంబంధించి 13 అనుమతులు పొందడానికి తన మంత్రిత్వశాఖకే 9 నెలలు పట్టిందని వాపోయారు. -
ఐపీఎల్ మ్యాచ్...
వాహనచోదకులకు ఆంక్షలు విశాఖపట్నం : విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియంలో జరగనున్న మూడో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బుధవారం ట్రాఫిక్ ఆంక్షలు విధిం చారు. ఇవి మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటాయని నగర ట్రాఫిక్ ఏడీసీపీ కె. మహేంద్ర పాత్రుడు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను ఆనందపురం మీదుగా పెందుర్తి, సబ్బవరం వైపు మళ్లిస్తారు. అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే వాహనాలను లంకెలపాలెం వద్ద సబ్బవరం, పెందుర్తి మీదుగా మళ్లిస్తారు. గాజువాక నుంచి వచ్చే వాహనాలను ఎన్ఏడీ జంక్షన్ వద్ద గోపాలపట్నం, పెందుర్తి మీదుగా మళ్లిస్తారు. విశాఖపట్నంనుంచి భారీ వాహనాలను హనుమంతవాక జంక్షన్ వద్ద అడవివరం మీదుగా ఆనందపురం వైపు అనుమతిస్తారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం, విజయనగరం వెళ్లే చిన్న వాహనాలను విశాఖ వేలీ స్కూల్ జంక్షన్, ఎండాడ జంక్షన్ వద్ద రుషికొండ మీ దుగా బీచ్‌రోడ్డులో తిమ్మాపురం మీదుగా ఎన్.హెచ్-16 మారికవలస వైపు మళ్ళించనున్నారు. ఎండాడ, కారుషెడ్ల మధ్య ఎన్‌హెచ్-16 రోడ్డులో పాసుల్లేని వాహనాలను అనుమతించరు. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి విశాఖ వచ్చే వాహనాలు (క్రికెట్ మ్యాచ్‌కు వెళ్ళే వాహనాలకు మినహాయింపు) మారికవలస ఎన్. హెచ్-16 జంక్షన్ వద్ద ఎడమవైపునకు తిప్పుకొని జు రాంగ్ జంక్షన్, తిమ్మాపురం, బీచ్‌రోడ్డు, ఎంవీపీ డబుల్‌రోడ్డు మీదుగా ఎన్.హెచ్-16 వైపు మళ్లిస్తారు. బస్సులు వెళ్లే మార్గమిది శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుంచి విశాఖ వైపు వచే చిన్న వాహనాలు, ఆర్టీసీ బస్సులను మారికవలస ఐటీ సెజ్ జంక్షన్ వద్ద కాపులుప్పాడ.. తిమ్మాపురం మీదుగా బీచ్‌రోడ్డు చేరుకుని అక్కడ నుంచి జోడుగుళ్ళపాలెం అప్పుఘర్, ఎంవీపీ డబుల్‌రోడ్డు మీదుగా ఎన్.హెచ్-16 వైపు మళ్లించుకోవాలి. విశాఖ సిటీ నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఎంవీపీ డబుల్ రోడ్డు, అప్పుఘర్ మీదుగా బీచ్‌రోడ్డులో తిమ్మాపురం వైపునకు మళ్లి, మారికవలస వైపు వెళ్లాలి. -
బ్యాంకు ఖాతాదారులే టార్గెట్..!
హుజూర్నగర్ :బ్యాంకు ఖాతాదారుల అజాగ్రత్తను గుర్తుతెలియని వ్యక్తులు చాకచాక్యంగా సొమ్ము చేసుకుంటున్నారు. బ్యాంకుల నుంచి డ్రా చేసుకున్న నగదును తమ వాహనాల డిక్కీల భద్రపరుచుకుని పక్కకు వెళ్లి వచ్చేలోపే దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. హుజూర్‌నగర్‌లో ఇటీవల జరిగిన వరుస చో రీలను గమనిస్తే ఈ విషయం ఇట్టే తెలిసిపోతోంది. ప్రస్తుతం ఈ విషయం నియోజకవర్గ కేంద్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఖాతాదారులు బ్యాంకుల నుంచి నగదును డ్రా చేయాలంటేనే జంకుతున్నారు. అజాగ్రత్తే ప్రధాన కారణం హుజూర్‌నగర్‌లో వాహనాల డిక్కీల నుంచి మాయమవుతున్న నగదుకు అజాగ్రత్తే ప్రధాన కారణంగా తెలుస్తోంది. బ్యాంకుల నుంచి డ్రా చేసుకున్న నగదు ను సదరు వ్యక్తులు డిక్కీలో భద్రపరుచుకుని నేరుగా ఇంటికి వెళ్లకుండా ఇతరత్ర పనులు చూసుకుంటున్న క్రమంలోనే చోరీలు జరిగినట్లు తెలుస్తోంది. సోమవారం హుజూర్నగర్ మండలం శ్రీనివాసపురానికి చెందిన కట్టా కృష్ణారావు బ్యాంకు నుంచి డ్రా చేసుకున్న రూ.5 లక్షల నుంచి రూ.4.50 లక్షలను అతని వా హనం నుంచి గుర్తుతెలియని వ్యక్తులు కొద్ది నిమిషాల్లోనే మాయం చేశారు. అయితే కృష్ణారావు తన వాహనాన్ని ఓ దుకాణం ముందు నిలిపి ఇతర పని చూసుకుంటున్న క్రమంలో ఈ చోరీ జరిగింది. అదే కృష్ణారావు నేరుగా ఇంటికి వెళ్లి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా గతంలో మేళ్లచెరువు మండ లం మల్లారెడ్డిగూడేనికి చెంది న ఓ వ్యక్తి స్థానికంగా గల ఎస్బీహెచ్ నుంచి రూ. 47,000లను డ్రా చేసి తన మోటార్‌సైకిల్ డిక్కీలో పెట్టుకొని ఓ బట్టల దుకాణంలోకి వెళ్లినప్పుడు, పట్టణానికి చెందిన మరో ధా న్యం వ్యాపారి స్థాని కంగా గల పార్బాయిల్డ్ మిల్లు నుంచి రూ.85,000ల నగదును తీసుకొని తన హీరోహోండా మోటార్ సైకిల్ డిక్కీలో పెట్టుకొని ఇందిరాసెంటర్‌లోని టీ స్టాల్ వద్ద వాహనాన్ని పార్కింగ్ చే సి అజాగ్రత్తగా ఉన్నప్పుడే చోరీలు జరిగాయి. పోలీసులు ఏమంటున్నారంటే.. బ్యాంకుల నుంచి నగదును డ్రా చేసుకునే వ్యక్తులు చాల జాగ్రత్తంగా ఉండాలని ఎస్ఐ వెంకటశివరావు అన్నారు. నగదును వెంట తీసుకువెళ్లే వారికి ఆయన కొన్ని సూచనలు చేశారు. పెద్ద మొత్తంలో నగదును డ్రా చేసినప్పుడు వెంటనే ఇంటికి వెళ్లిపోవాలి. వీలైతే వెంట ఓ వ్యక్తిని తోడుగా తీసుకువెళ్లాలి.తమను సహాయం కోరినా వెంట ఓ కానిస్టేబుల్‌ను రక్షణగా పంపిస్తాం. తమను ఎవరైనా గమనిస్తున్నారనే విషయాన్ని పసిగట్టగలగాలి. అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. పట్టణంలోని బ్యాంకుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేసి ఇలాంటి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
పార్కింగ్ స్థలాలుగా బస్ డిపోలు..!
సాక్షి, ముంబై: నష్టాల్లో కూరుకుపోయిన బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ అదనపు ఆదాయం వేటలో పడింది. అందుకు బస్ డిపోల స్థలాలను వాహనాల పార్కింగ్‌కు ఇవ్వాలని బెస్ట్ పరిపాలన విభాగం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. నగరం, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో మొత్తం 26 బెస్ట్ బస్ డిపోలున్నాయి. ఇందులో పార్కింగ్ చేసే బస్సులన్నీ ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్లపై తిరుగుతుంటాయి. రాత్రి ఆలస్యంగా డిపోలకు చేరుకుంటాయి. దీంతో రోజంతా ఖాళీగా ఉన్న డిపోల్లోని స్థలాలను వాహనాల పార్కింగ్‌కు కేటాయిస్తే అదనపు ఆదాయం వస్తుందని పరిపాలని విభాగం భావించింది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించి మంజూరు కోసం బెస్ట్ సమితికి పంపించింది. ఇక్కడ మంజూరు లభించగానే త్వరలో వాహనాల పార్కింగ్‌కు స్థలం అందుబాటులోకి రానుంది. ఈ స్థలాలను ప్రైవేటు వాహనాల పార్కింగ్ కోసం వాడేందుకు కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించనుంది. ఆ ప్రకారం ప్రతి డిపోలో 20 ద్విచక్ర వాహనాలు, 10 కార్లు, ఐదు భారీ వాహనాలు ఇలా పార్కింగ్ చేసేందుకు అనుమతి ఇవ్వనుంది. స్థాయీ సమితిలో ఈ ప్రతిపాదనకు మంజూరు లభించగానే పార్కింగ్ చార్జీలను నిర్ణయిస్తామని బెస్ట్ యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే ఈ బస్ డిపో స్థలాలను కేవలం ఉదయం నుంచి రాత్రి వరకు 12 గంటలు మాత్రమే వాడుకునేందుకు అనుమతినివ్వనున్నారు. కాంట్రాక్టర్లకు కూడా ఈ షరతులపైనే బాధ్యతలు అప్పగిస్తారు. కాగా భద్రతాపరమైన ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తామే తీసుకుంటామని బెస్ట్ అధికారి ఒకరు పేర్కొన్నారు. అదేవిధంగా వాహనదారుల నుంచి అడ్డగోలుగా చార్జీలు వసూలు చేయడాన్ని నిరోధించేందుకు బెస్ట్ స్వయంగా పార్కింగ్ చార్జీలను కేటాయించనుందని తెలిపారు. ఇదిలా ఉండగా, వృథాగా ఉన్న కొన్ని బెస్ట్ బస్ స్థలాలను 30 ఏళ్ల వరకు లీజుకు ఇవ్వాలని ఇదివరకే బెస్ట్ సంస్థ నిర్ణయం తీసుకుంది. కాని వ్యతిరేకత రావడంతో ఈ ప్రతిపాదనను విరమించుకుంది. -
కాలిబాటకు పెద్దపీట: హెచ్ఎండీఏ
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో కాలిబాటలకు పెద్దపీట వేయాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నిత్యం రోడ్లపైకి వస్తున్న వాహనాల సంఖ్యను లెక్కలోకి తీసుకొని, వాటి ఆధారంగా రోడ్లు, కూడళ్ల విస్తరణ చేపడుతున్నారు. అయితే రోడ్లపై నిత్యం 60 శాతం మంది పాదచారులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరిని పరిగణనలోకి తీసుకోకపోవడం, వాహనాల పార్కింగ్ అంశాన్ని విస్మరించడం వల్లే పాదచారుల సమస్య యథాతథంగా ఉంటోంది. ఈ క్రమంలో పాదచారులకు, సైక్లిస్ట్‌లకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి సౌకర్యాలు కల్పిస్తే కానీ సమస్య పరిష్కారం కాదని ‘సమగ్ర రవాణా అధ్యయనం (సీటీసీ)’పై గురువారం బుద్ధపూర్ణిమ ప్రాజెక్టులో జరిగిన సమావేశంలో ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. పాదచారులు, సైక్లిస్టుల సమస్యలు, మోటారు రహిత రవాణా, పార్కింగ్ విధానంపై జీహెచ్ఎంసీ, పోలీసు, జలమండలి తదితర విభాగాల ఉన్నతాధికారులతో హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్‌ప్రసాద్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్‌లో సమగ్ర రవాణాపై లీ అసోసియేట్స్ సంస్థ జరిపిన అధ్యయనం తాలూకు ప్రాథమిక పరిశీలన పత్రాలను ఆయన సమావేశం దృష్టికి తెచ్చారు. అదే సందర్భంలో ఇటీవల ఫుట్‌పాత్‌ల ఆక్రమణ, పాదచారుల నడకయాతనలపై ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుతం నగరంలో ఫుట్‌పాత్‌లు పాదచారుల రద్దీకి త గ్గట్టు ఉన్నాయా? ఏ మేరకు విస్తరించాలి? ఏయే ప్రాంతాల్లో విస్తరించాలి? వంటి అంశాలపై లోతుగా చర్చించారు. నడకయాతన తప్పిస్తేనే మార్గం సుగమం నగరంలో చాలా వరకు ఫుట్‌పాత్‌లు ఆక్రమణల పాలవడంతో పాదచారులంతా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. ఫలితంగా వాహనాలు సాఫీగా ముందుకెళ్లలేని పరిస్థితి ఎదురవుతోంది. పాదచారులు, సైక్లిస్ట్‌లకు నిర్దేశిత మార్గాలు లేకపోవడం, ఉన్నా వినియోగంలో లేకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడుతోంది. వాస్తవానికి ఫుట్‌పాత్ 1.8 మీటర్ల వెడల్పు, 6-9 అంగుళాల ఎత్తు ఉండాలి. అబిడ్స్, అమీర్‌పేట, కోఠి, దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్, మెహిదీపట్నం ప్రాంతాల్లో కాలిబాటలన్నీ కుంచించుకుపోయాయి. ఈ క్రమంలో కీలక మార్గాల్లో పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు ప్రత్యేక సిగ్నల్స్, ఇతర సూచికలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ, జలమండలి తవ్వకాల సందర్భంలో ఫుట్‌పాత్‌లను దృష్టిలో పెట్టుకొని సెట్‌బ్యాక్స్ నిర్ణయించాలని, విద్యుత్, వరద, నీటి పైపులైన్లు ఫుట్‌పాత్‌ల కిందకు రాకుండా చూడాలని నిర్ణయించారు. అన్ని విభాగాలు సంయుక్తంగా పని చేస్తేనే ఇవన్నీ సాధ్యమని హెచ్ఎండీఏ కమిషనర్ సమావేశం దృష్టి తెచ్చారు. నాలుగు మార్గాల్లో.. పాదచారులు, సైక్లిస్ట్ల రాకపోకలకు అనువుగా సౌకర్యాలు కల్పించేందుకు నాలుగు ప్రధాన మార్గాల్లో ఫుట్‌పాత్‌లు అభివృద్ధి చేయాలని సమావేశం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా తలపెడుతున్న ఈ పనులను తొలుత ఏయే ప్రాంతాల్లో చేపట్టాలన్నది సర్వే సంస్థే నిర్ణయించి సమగ్ర నివేదిక (డీపీఆర్)ను తయారు చేయాలని అధికారులు సూచించారు. ప్రత్యేకించి పాదచారులు, సైక్లిస్ట్ల సౌకర్యాలకు సంబంధించి ఒక విధానాన్ని రూపొందించి, అన్ని విభాగాల అభిప్రాయాలు తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆపై అమల్లోకి తేవాలని నిర్ణయించారు. నగరంలో మోటారురహిత రవాణా వ్యవస్థ! నగరంలో మోటారు రహిత రవాణా వ్యవస్థను అమల్లోకి తేవాలని హెచ్ఎండీఏ భావి స్తోంది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ నగరాల్లో అమలవుతున్న కాలుష్య రహిత రవాణా వ్యవస్థను గ్రేటర్‌లోనూ అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్‌పోర్టు (ఎన్ఎంటీ) పాలసీ, పార్కింగ్ పాలసీలపై మరింత లోతుగా అధ ్యయనం చేయించాలని నిర్ణయించింది. పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి నగరంలో పార్కింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. కీలక ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ లాట్స్ లేవు. వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలిపేస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. ఈ క్రమంలో గ్రేటర్లో మల్టీలెవెల్ పార్కింగ్ విధానాన్ని అమల్లోకి తేవాలని సీటీఎస్ సమావేశం అభిప్రాయపడింది. ఇందుకు నగరంలో ఏయే ప్రాంతాల్లో అవకాశాలున్నాయనే దానిపై చర్చించింది. వివిధ నగరాల్లో అమలువుతున్న పార్కింగ్ వ్యవస్థలను పరి శీలించి.. అటువంటి పద్ధతుల్ని ఇక్కడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. దీనిపై నివేదిక రూపొందించే బాధ్యతను అధికారులు లీ అసోసియేట్స్ సంస్థకు అప్పగించారు. సమావేశంలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ కమిషనర్లతో పాటు మెట్రోరైల్, జలమండలి ఎండీలు, విద్యు త్, ట్రాఫిక్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.