న్యూఢిల్లీ: ఎక్కడపడితే అక్కడ వాహనాల్ని పార్కింగ్ చేసే వ్యక్తులకు షాక్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇకపై నిబంధనలకు విరుద్ధంగా పార్క్ చేసిన వాహనాలను పౌరులు మొబైల్‌తో ఫొటో తీసి సంబంధిత విభాగానికి లేదా పోలీసులకు పంపాలని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ కోరారు.
నిబంధనలు ఉల్లంఘించిన సంబంధిత వాహనదారుడికి రూ.500 జరిమానా విధించడంతో పాటు అందులో 10 శాతాన్ని ఫిర్యాదుదారుడికి బహుమానంగా అందజేస్తామని వెల్లడించారు. ఈ మేరకు మోటర్ వాహనాల చట్టంలో మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం నాడిక్కడ రవాణా మంత్రిత్వశాఖ కార్యాలయం ఆటోమేటిక్ పార్కింగ్ లాట్ పనులకు గడ్కారీ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ పార్కింగ్ లాట్‌కు సంబంధించి 13 అనుమతులు పొందడానికి తన మంత్రిత్వశాఖకే 9 నెలలు పట్టిందని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment