వాహనచోదకులకు ఆంక్షలు
విశాఖపట్నం : విశాఖలోని వైఎస్‌ఆర్ స్టేడియంలో జరగనున్న మూడో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బుధవారం ట్రాఫిక్ ఆంక్షలు విధిం చారు. ఇవి మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటాయని నగర ట్రాఫిక్ ఏడీసీపీ కె. మహేంద్ర పాత్రుడు తెలిపారు.
శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను ఆనందపురం మీదుగా పెందుర్తి, సబ్బవరం వైపు మళ్లిస్తారు.
అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే వాహనాలను లంకెలపాలెం వద్ద సబ్బవరం, పెందుర్తి మీదుగా మళ్లిస్తారు.
గాజువాక నుంచి వచ్చే వాహనాలను ఎన్‌ఏడీ జంక్షన్ వద్ద గోపాలపట్నం, పెందుర్తి మీదుగా మళ్లిస్తారు. విశాఖపట్నంనుంచి భారీ వాహనాలను హనుమంతవాక జంక్షన్ వద్ద అడవివరం మీదుగా ఆనందపురం వైపు అనుమతిస్తారు.
విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం, విజయనగరం వెళ్లే చిన్న వాహనాలను విశాఖ వేలీ స్కూల్ జంక్షన్, ఎండాడ జంక్షన్ వద్ద రుషికొండ మీ దుగా బీచ్‌రోడ్డులో తిమ్మాపురం మీదుగా ఎన్.హెచ్-16 మారికవలస వైపు మళ్ళించనున్నారు.
ఎండాడ, కారుషెడ్‌ల మధ్య ఎన్‌హెచ్-16 రోడ్డులో పాసుల్లేని వాహనాలను అనుమతించరు.
శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి విశాఖ వచ్చే వాహనాలు (క్రికెట్ మ్యాచ్‌కు వెళ్ళే వాహనాలకు మినహాయింపు) మారికవలస ఎన్. హెచ్-16 జంక్షన్ వద్ద ఎడమవైపునకు తిప్పుకొని జు రాంగ్ జంక్షన్, తిమ్మాపురం, బీచ్‌రోడ్డు, ఎంవీపీ డబుల్‌రోడ్డు మీదుగా ఎన్.హెచ్-16 వైపు మళ్లిస్తారు.
బస్సులు వెళ్లే మార్గమిది
శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుంచి విశాఖ వైపు వచే చిన్న వాహనాలు, ఆర్టీసీ బస్సులను మారికవలస ఐటీ సెజ్ జంక్షన్ వద్ద కాపులుప్పాడ.. తిమ్మాపురం మీదుగా బీచ్‌రోడ్డు చేరుకుని అక్కడ నుంచి జోడుగుళ్ళపాలెం అప్పుఘర్, ఎంవీపీ డబుల్‌రోడ్డు మీదుగా ఎన్.హెచ్-16 వైపు మళ్లించుకోవాలి.
విశాఖ సిటీ నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఎంవీపీ డబుల్ రోడ్డు, అప్పుఘర్ మీదుగా బీచ్‌రోడ్డులో తిమ్మాపురం వైపునకు మళ్లి, మారికవలస వైపు వెళ్లాలి.
ఐపీఎల్ మ్యాచ్...
Published Wed, Apr 22 2015 2:31 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement