
త్రిపురలో భాజపా విజయంపై తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణారావు సంతోషం వ్యక్తం చేశారు.
సాక్షి, హైదరాబాద్: త్రిపురలో భాజపా విజయంపై తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణారావు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వామపక్షానికి కంచుకోటగా ఉన్న త్రిపురలో బీజేపీకి చరిత్రాత్మక విజయమని ఆయన పేర్కొన్నారు.
ఈశాన్య రాష్ట్రాల ప్రజల విజయంగా బీజేపీ భావిస్తోందని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ ఇకనైనా కళ్లు తెరవాలని సూచించారు. దక్షిణాదిన బీజేపీకి స్థానం లేదనే ప్రాంతీయ పార్టీకు ఈ విజయం చెంపపెట్టు అని ఆయన వెల్లడించారు.