అల్లాదుర్గం : అల్లాదుర్గం మండల పరిధిలోని చిల్వెర ప్రాథమిక పాఠశాలను బుధవారం హైదరాబాద్ ఆర్జేడీ కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్థన సమయానికి ఒక్క ఉపాధ్యాయుడు కూడా హాజరు కాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయుల్లో ఎవరూ ప్రార్థనకు హాజరు కాలేదని ఎంఈఓకు ఫోన్ చేసి మండిపడ్డారు. హెడ్మాస్టర్ గణపతి, ఉపాధ్యాయురాలు భానుకు సంబంధించి ఒక రోజు వేతనం కట్ చేయాలని ఆదేశించారు. ఇద్దరు ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేశారు. ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరయ్యేలా పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలని ఎంఈఓను ఆదేశించారు.
పాఠశాలను తనిఖీ చేసిన హైదరాబాద్ ఆర్జేడీ
Published Wed, Aug 31 2016 9:26 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
Advertisement
Advertisement