
మందస: కుటుంబ కలహాలను టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేశ్‌రాజ కీయ లబ్ధికి వాడుకుంటున్నారని శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో జరిగిన ఘటనకు సంబంధించి కొట్ర రామారావు సోదరుడు కృష్ణారావు ధ్వజమెత్తారు. బుధవారం ఆయన విలేకరుల తో మాట్లాడుతూ.. తమ కుటుంబ సమస్యగా ఉన్న భూ తగాదాపై అత్యుత్సాహంతో వారు ట్వీట్లు పెట్టాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు.
తమ స్థల వివాదం కోర్టులో ఉందని, రాజకీయం చేయవద్దని ఆయన కోరారు. తమ కుటుంబంలో ఆస్తి తగాదాలకు తెలుగుదేశం పార్టీయే మూల కారణమని కృష్ణారావు ఆరోపించారు. తాను గౌరి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పగా, తన తండ్రి దామోదరరావు వ్యతిరేకించి ఇంటి నుంచి వెళ్లగొట్టాడన్నారు.
తండ్రి మరణానంతరం ఆస్తిలో వాటా కావాలని అడిగితే 2016–2018 మధ్య తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా రికార్డులను మార్చేశారన్నారు. పెద్దల రాజీ కూడా ఫలించలేదని చెప్పారు. ఈ వివాదం ముదిరి పిన తల్లి కొట్ర దాలమ్మ, చెల్లెలు మజ్జి సావిత్రిపై ఘటనా స్థలంలోనే కంకర మట్టి వేశారన్నారు. దీంతో మందస పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment