ఉప్పునుంతల/బల్మూరు, న్యూస్‌లైన్: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసే ప్రక్రియను పరిశీలిస్తున్నామని, ఈ విషయమై ఇప్పటికే కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపా రు. ఈజీఎస్ సమాఖ్యలను మరింత పటిష్టం చేయాలని, ఇక్కడ మంచిఫలితం వస్తే రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తామన్నారు.
ఉపాధి కూలీలందరికీ బీమా సౌకర్యం కల్పిస్తామని భరోసాఇచ్చా రు. ఆదివారం ఉప్పునుంతల, మామిళపల్లిలో శ్ర మశక్తి సమాఖ్యల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబ్‌నగర్, అనంతపురం జిల్లాలో పథకాన్ని పకడ్బందీగా అమలుచేసేందుకు చర్య లు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామస్థాయి లో కూలీలను సంఘాలుగా ఏర్పాటు చేసి శ్రమశక్తి సమాఖ్యలకు హక్కులు కల్పిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3500ఎకరాల చెంచుల భూములను సాగులోకి తీసుకొస్తామన్నారు.
కూలీలు ఈజీఎస్ ను ఉపయోగించుకోవడంతోపాటు వచ్చిన డబ్బుతో తమ పిల్లలను చక్కగా చదివించుకోవాలని సూచించారు. అందులోనే కొంత డబ్బులను పొదుపు చేసుకుంటే ఇతర అవసరాలను తీర్చుకునే వీలుంటుందన్నారు. ఇకముందు ఏయే మార్పులు వస్తే మరింత బాగుంటుందనే అంశాలను కూలీలను నేరుగా మంత్రి అడిగి తెలుసుకున్నారు. గతంలో పథకం లేని రోజుల్లో వ్యవసాయ పనులు లేనప్పుడు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వాళ్లమని ఈజీఎస్ వచ్చిన తర్వాత ఉళ్లోనే పనులు చేసుకొని ఉపాధి పొందుతున్నామని సమాఖ్యల ప్రతినిధులు మంత్రికి వివరించారు. ప్రస్తుతం కుటుంబానికి కల్పిస్తున్న వందరోజులు సరిపోవడంలేదని మరో వంద రోజులు పనిదినాలు పెంచడంతోపాటు ప్రస్తుతం ఇస్తున్న కూలీ రేటును రూ.250కి పెంచాలని ప్రతినిధులు మంత్రికి విన్నవించారు.
పనిదినాలు పెంచండి:
ఎమ్మెల్యేలు రాములు, జాపల్లి
ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే కూలీలతో పాటు రైతులు లబ్ధిపొందుతారని అచ్చంపేట ఎమ్మెల్యే రాములు, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మంత్రికి వివరించారు. కూలీలకు అదనంగా వందరోజులు కల్పించడంతోపాటు రూ.250 వేతనం ఇవ్వాలన్నారు. సమాఖ్యల సమావేశాలు నిర్వహించుకోవడానికి గ్రామ స్థాయిలో ఓ భవనం కట్టించాలని జూపల్లి మంత్రికి విన్నవించారు. అచ్చంపేటలో ఈజీఎస్ సిబ్బందికి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుచేయడంతోపాటు భూమిలేని నిరుపేద కూలీలకు కనీసం రెండెకరాల భూమి ఇచ్చేవిధంగా కృషిచేయాలని ఎమ్మెల్యే రాములు మంత్రిని కోరారు.
చెంచులు వ్యవసాయ రంగంలో రాణించాలి
చెంచులు ఐటీడీఏ ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించాలని మంత్రి ఆకాం క్షించారు. బల్మూరు మండలం బాణాలలో ఐటీడీఏ ద్వారా ఇందిర జలప్రభ పథకంలో పదెకరాల చెంచుల భూముల్లో రూ.5.60లక్షల వ్యయంతో వేసిన బోరును ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ చెం చుల వలసల నివారణకు ప్రత్యేక ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పిస్తామన్నారు. అంతే కాకుండా ఐటీడీఏ పరి ధిలో 3500 ఎకరాల చెంచుల భూముల్లో బోర్లు వేయాడానికి ప్రణాళిక సిద్ధంచేసినట్లు తెలిపారు.
ఉపాధి కూలీలకు బీమా
Published Mon, Jan 6 2014 5:30 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement