అధికారులపై ఆగ్రహం ప్రదర్శిస్తున్నగాలి కృష్ణారావు
కాశీబుగ్గ : రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తెలుగుదేశం నాయకుడు, పలాస సామాజిక ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గాలి కృష్ణారావు అధికార జులుం ప్రదర్శించారు. ‘మేమంటే ఎవరనుకుంటున్నావు? మా సంగతి తెలియదా? నీ సంగతేంటో చూస్తాం.
జాగ్రత్తగా ఉండు’ అంటూ వీరంగం సృష్టించారు. కాశీబుగ్గ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం జరిగిన సంఘన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు, రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బందిపై ఆయన విరుచుకుపడ్డ తీరు చూసి అంతా అవాక్కయ్యారు.
ఎలా పనిచేస్తారో చూస్తా.. ట్రాన్స్‌ఫర్ చేయిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని జిల్లా అధికారులకు ఇక్కడ తీరును వివరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. పలాస నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో చోటా నాయకులు ఎమ్మెల్యే దన్ను చూసుకుని పేట్రేగిపొతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment