సైన్స్‌ సిటీ సీఈవో కృష్ణారావుకు ఎల్లాప్రగడ అవార్డ్‌ | Yellapragada award to krishna rao | Sakshi
Sakshi News home page

సైన్స్‌ సిటీ సీఈవో కృష్ణారావుకు ఎల్లాప్రగడ అవార్డ్‌

Published Thu, Jan 19 2017 3:31 AM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM

సైన్స్‌ సిటీ సీఈవో కృష్ణారావుకు ఎల్లాప్రగడ అవార్డ్‌

సైన్స్‌ సిటీ సీఈవో కృష్ణారావుకు ఎల్లాప్రగడ అవార్డ్‌

నెల్లూరు: ప్రతిష్టాత్మకమైన డాక్టర్‌ ఎల్లాప్రగడ సుబ్బారావు అవార్డుకు ఆంధ్రప్రదేశ్‌ సైన్స్‌ సిటీ సీఈవో, జీన్‌ ఎక్స్‌ప్రెషన్‌ సిస్టమ్స్‌కు చెందిన అమెరికన్‌ డాక్టర్‌ అప్పసాని కృష్ణారావు ఎంపికయ్యారు. ఈ మేరకు ఎల్లాప్రగడ సుబ్బారావు ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎ.జగదీష్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బయాలజీ, కెమిస్ట్రీ, జెనటిక్స్, మెడికల్‌ సైన్స్‌లో విశేష కృషి చేసినందుకు గాను ఆయనకు ఈ అవార్డుని ఇవ్వనున్నట్లు జగదీష్‌ పేర్కొన్నారు.

నోబెల్‌ అవార్డ్‌ గ్రహీత ప్రొఫెసర్‌ హర్‌ గోవింద్‌ ఖొరానా లేబొరేటరీలో సింతటిక్‌ రోడోస్పిన్‌ జీన్‌ను మెదటిసారిగా కృష్ణారావు కనుగొన్నారు. పలు వ్యాధులకు మందులను కనుగొన్న ఎల్లాప్రగడ సుబ్బారావు పేరిట ప్రతియేటా ఫౌండేషన్‌ అవార్డు అందజేస్తుంది.కాగా, ఈ అవార్డుని కృష్ణారావు మార్చి నెలాఖరులో నెల్లూరులో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అందుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement