
సాక్షి,హైదరాబాద్: ప్రొఫెసర్ సాయిబాబా మృతిపై మావోయిస్టు పార్టీ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి మంగళవారం( అక్టోబర్ 15) ఒక ప్రకటన విడుదల చేశారు. ‘బడుగు బలహీన వర్గాల గొంతును సాయిబాబా వినిపించాడు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సాయిబాబా కీలక పాత్ర పోషించాడు.
జైలులో సుదీర్ఘకాలం దుర్భర పరిస్థితులను సాయిబాబా అనుభవించాడు. జైలులో ఉన్న పరిస్థితుల కారణంగానే సాయిబాబా ఆరోగ్యం క్షీణించింది. సాయిబాబా మృతికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలి’అని జగన్ పేర్కొన్నారు. కాగా, ప్రొఫెసర్ సాయిబాబా ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఇదీ చదవండి: ప్రొఫెసర్ సాయిబాబాకు కన్నీటి వీడ్కోలు
Comments
Please login to add a commentAdd a comment