Professor Sai Baba
-
ప్రొఫెసర్ సాయిబాబా మృతిపై మావోయిస్టుల సంతాపం
సాక్షి,హైదరాబాద్: ప్రొఫెసర్ సాయిబాబా మృతిపై మావోయిస్టు పార్టీ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి మంగళవారం( అక్టోబర్ 15) ఒక ప్రకటన విడుదల చేశారు. ‘బడుగు బలహీన వర్గాల గొంతును సాయిబాబా వినిపించాడు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సాయిబాబా కీలక పాత్ర పోషించాడు.జైలులో సుదీర్ఘకాలం దుర్భర పరిస్థితులను సాయిబాబా అనుభవించాడు. జైలులో ఉన్న పరిస్థితుల కారణంగానే సాయిబాబా ఆరోగ్యం క్షీణించింది. సాయిబాబా మృతికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలి’అని జగన్ పేర్కొన్నారు. కాగా, ప్రొఫెసర్ సాయిబాబా ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇదీ చదవండి: ప్రొఫెసర్ సాయిబాబాకు కన్నీటి వీడ్కోలు -
ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
-
జీవించే హక్కు వీరికి లేదా?
సమాజానికి రాజకీయం అవసరం. నలుగురు కూడి ఓ సమస్యకు పరిష్కారం వెతికే అద్భుత క్రతువే రాజకీయం. రాజకీయంలో భిన్న ఆలోచనలుంటాయి. అంతులేని విజ్ఞాన శోధన ఉంటుంది. వాటిలో తార్కి కత ఉంటుంది. ఏకాభిప్రాయాలు, విస్తృతాభిప్రాయాలు, విభేదాలు కూడా ఉంటాయి. ఈ సంఘర్షణలోంచే భిన్న రాజకీయ దృక్పథాలు ఉత్పన్నమవుతాయి. విప్లవ భావజాలం పుట్టుకొస్తుంది, అది పరిసరాలను, ప్రాంతాలను, అవసరాలను బట్టి సాయుధ పోరాటంగానూ మారవచ్చు లేదా శాంతి మార్గంలోనూ నడవవచ్చు. ఎలా రూపాంతరం చెందాలనేది అక్కడి ప్రజల విశ్వాసాలు, అవసరాలు, ఆకాంక్షలను బట్టి ఉంటుంది. ప్రశ్నించే స్థాయికి ఎదిగితే రాజద్రోహమే పాలకులకు ఎప్పుడూ ప్రజా విశ్వాసాలు మూఢంగా ఉండాలి. రాజభక్తిని ప్రదర్శించే విధంగానే ఉండాలి. అంతే కానీ అవి బలమైన భావజాలంగా మారొద్దు. రాజ్యహింసను, దోపిడీని, నిరంకుశత్వాన్ని ప్రశ్నించే స్థాయికి ఎదగొద్దు. అట్లా ఎదిగితే వాళ్లు రాజద్రోహులు అవుతారు. వాళ్ల మీద పోలీసు నిర్బంధం పెరుగుతుంది. ఇనుప గజ్జల బూట్ల కింద పౌరహక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ప్రజా విశ్వాసాల మీద నిర్బంధ దాడి మొదలవుతుంది. ఇక్కడే ధర్మదేవత అడ్డం పడి ప్రజా హక్కులను రక్షించాలి. పౌర స్వేచ్ఛను కాపాడాలి. కానీ ఎందుకో న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక శాఖ తీరుగానే ఆలోచన చేస్తోంది. పోలీసులు చేసే హక్కుల ఉల్లంఘనకు అంగీకార ముద్ర వేసే ధోరణి క్రమంగా బలపడుతోంది. నిర్బంధించడం రాజ్యానికి కొత్తేమీ కాదు ప్రధాన మంత్రి మోదీని హత్య చేయటానికి మావోయిస్టులు కుట్ర పన్నారనే అభియోగం మోపి పుణే పోలీసులు హక్కుల ఉద్యమకారులు సురేంద్ర గాడ్లింగ్, సుధీర్ ధావ్లే, రోనా విల్సన్, మహేశ్ రౌత్, సుధా భరద్వాజ్, వర్నన్ గోంజాల్వెస్, అరుణ్ ఫరేరా, వరవరరావుల మీద కుట్ర కేసులు పెట్టి జైల్లో నిర్బంధించారు. అంతకుముందు ప్రొఫెసర్ సాయిబాబా మీద కూడా దేశ ద్రోహం కిందనే జైల్లో పెట్టారు. ప్రజా విశ్వాసాల మీద పోలీసులు దాడి చేస్తూ.. కృత్రిమ లేఖలు, ఊహాత్మక అభియోగాలతో ప్రజా సంఘాల నాయకులను ఏళ్లకు ఏళ్లుగా జైల్లో బంధించటం అనేది రాజ్యానికి కొత్తేమీ కాదు. ప్రపంచాన్ని కోవిడ్–19 మహమ్మారి కబళి స్తున్న సమయం ఇది. అన్ని వ్యవస్థలను లాక్డౌన్ చేసి స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయాం. వయసు మళ్ళిన వృద్ధుల మీద ఆ కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఇటువంటి వాళ్లకు సామాజిక దూరమే పరిష్కారమని వైద్య పరిశోధనలు, పరిశీలనలు చెబుతున్నాయి. కరోనా కేసుల్లో మహారాష్ట్ర రికార్డు దేశంలోకల్లా మహారాష్ట్రలోనే అత్యధికంగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. మే 9 నాటికి ఈ రాష్ట్రంలో అత్యధికంగా 19,063 కేసులు నమోదు కాగా 1,089 పాజిటివ్ కేసులు కొత్తగా నిర్ధారణ అయ్యాయి. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా మృతుల సంఖ్య ఈ శుక్రవారానికి 731కి చేరుకుంది. పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఒక్క రాష్ట్రంలోనే 714 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. సమూహాలుగా ఉంటే వైరస్ వేగంగా విస్తరించే అవకాశాలు ఎక్కువ. ఈ నేపథ్యంలోనే పుణే జైలులో స్థాయికి మించి ఖైదీలను బంధించి ఉంచారని, ఖైదీలకు సులువుగా కరోనా అంటుకునే ప్రమాదం ఉందని, ఈ వ్యాధి బారి నుంచి తప్పించుకోవడానికి తమకు తాత్కాలికంగా బెయిలు మంజూరు చేయాలని వరవరరావు, సోమాసేన్ ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టుకు దరఖాస్తు పెట్టుకున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ వారి ఇద్దరి బెయిల్ అభ్యర్థన పట్ల అభ్యం తరం చేసింది. కోర్టు బెయిలు నిరాకరించింది. మరో వైపు నాగపూర్ సెంట్రల్ జైలులో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్య పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఆయనకు పిత్తాశయం, క్లోమ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. 90 శాతం అంగవైకల్యం, దాదాపుగా కుప్పకూలిన వ్యాధినిరోధక సామర్థ్యం. ఛాతీ నొప్పి, గుండెదడ తదితర ఆరోగ్య సమస్యలతో ఉన్న సాయిబాబా జీవించే హక్కులో భాగంగా న్యాయస్థానాల్లో బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకుంటే అంగీకరించలేదు. 25 కేసులు కొట్టేసినా వీవీని వదలని రాజ్యం వరవరరావు మీద కుట్ర కేసులు కొత్తేమీ కాదు.ఆయన మీద 25 రకాల కేసులు పెట్టారు. ఇందులో ఒకటి అంటే ఒక్కటి కూడా నిర్ధారణ కాలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో కుట్ర చేశారని 1974లో 46 మందిపై కుట్ర, రాజద్రోహ అభియోగం మోపారు. నాటి నక్సలైట్ నేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి లతో పాటు విప్లవ రచయితల సంఘం సభ్యులైన వరవరరావు, చెరబండరాజు, కె.వి.రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, ఎం.టి.ఖాన్‌లను ఈ కుట్ర కేసులో నిందితులుగా పేర్కొన్నారు. 1989 ఫిబ్రవరి 27న సెషన్స్ కోర్టు అందరినీ నిర్దోషులుగా తేల్చింది. 1986లో ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నారంటూ రాంనగర్ కుట్ర కేసు పెట్టారు. కొండపల్లి సీతారామయ్య, వరవరరావు తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. కేసు విచారణ జరిగిన ఈ సుదీర్ఘ కాలంలో వరవరరావు, సూరిశెట్టి సుధాకర్‌లు మినహా మిగిలిన నిందితులంతా మరణించారు. 2003 సెప్టెంబర్‌లో వరవరరావు, సూరి శెట్టి సుధాకర్‌లు ఇద్దరినీ నిర్దోషులుగా పేర్కొంటూ కోర్టు కేసు కొట్టివేసింది. 2005లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఔరంగాబాద్‌లో కుట్ర పన్ని, అది అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని విరసం సభ్యులను 2005 మే 30న నిజామాబాదులో అరెస్ట్ చేశారు. 2010 ఆగస్ట్ 2న నిజామాబాద్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఆ కేసును కొట్టేశారు. రాజ్యహింస ప్రజా విశ్వాసాలపై దాడి ఇలా ఏ కేసు స్టడీ చేసినా రాజ్యహింసే ఉంది. ప్రజా విశ్వాసాల మీద పోలీసుల దాడి కనిపిస్తుంది. బెయిల్ మంజూరు చేసే విషయంలో కోర్టు ఈ రికార్డును కూడా పరిగణనలోకి తీసుకొని విచారణ జరపాలి. సామూహిక ప్రదేశాల్లో నివసించడం వలన కరోనా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఒక్కసారి వ్యాధి అంటుకుంటే ఒకవైపు వృద్ధాప్యం మరోవైపు వ్యాధి నిరోధక శక్తిని పోగొట్టుకున్న వీళ్లు తట్టుకుని నిలబడటం కష్టం. అదే జరిగితే వాళ్ల జీవించే హక్కును రాజ్యాంగం హరించినట్లు అవుతుంది. కార్యనిర్వాహక వ్యవస్థ తరహాలో కాకుండా న్యాయవ్యవస్థ విభిన్నంగా, తార్కిక ఆలోచన చేయాలి. ఉద్యమకారులకు సత్వర న్యాయాన్ని అందించాలి. మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసుకొని హక్కుల ఉద్యమకారులపై పెట్టిన రాజద్రోహం కేసులను ఉపసంహరించుకోవాలి. జీవించే హక్కును గౌరవించాలి. వ్యాసకర్త: సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ శాసనసభ అంచనాలు, పద్దుల కమిటీ చైర్మన్ మొబైల్ : 94403 80141 -
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా?
రాజ్యానికి విశ్వాసాలు ఎప్పుడూ మూఢంగానే ఉండాలి. అవి బలమైన భావజాలంగా మారకూడదు. రాజ్యహింసను, మత విద్వేషాలను ప్రశ్నించే స్థాయికి ఎదిగితే రాజ్యం వాళ్లను రాజద్రోహుల కింద జమ కడుతుంది. ఈ క్రమంలోనే 90 శాతం ఆంగవైకల్యంతో, 15 రకాల వ్యాధులతో ఉన్న ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబ, న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్ ఫరేరా, అంబేడ్కర్ మనవడు ఆనంద్ తేల్‌తుంబ్డేలు రాజద్రోహులయ్యారు. కృత్రిమ లేఖలు, ఊహాత్మక అభియోగాలతో అమాయకులను ఏళ్లకు ఏళ్లుగా జైళ్లో బంధించే హింస కొనసాగుతుంటే, కాపాడాల్సిన న్యాయ వ్యవస్థ రాజ్య హింసకు అంగీకార ముద్ర వేసే ధోరణి బలపడుతోంది. దేశంలో, రాష్ట్రలో ఎప్పుడు సాధారణ ఎన్నికలొచ్చినా.. ప్రజల్లో సానుభూతి పవ నాలు తగ్గినట్లు అనిపిం చినా.. పాలకులపై హత్యా యత్నం కుట్రలు బయట కొస్తుంటాయి. నిఘా వర్గాలు చెమటోర్చి కుట్రను పసిగట్టి ‘అత్యవసరం’గా బయట పెడుతూనే ఉంటాయి. ఇది రాజ్యం అల్లిన విషవలయం. ఆధిపత్య అస్తిత్వాల పాలనలో ఈ వృత్తం పునరావృతమవుతూనే ఉంటుంది. రాజ్యా ధికారం సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ‘రాజ్యం’ లో వివిధ రూపాల్లో హింస రచన జరుగుతూనే ఉంటుంది. దాంట్లో భాగమే ఇలాంటి కుట్రకోణాలు. వరవరరావుతోపాటు హక్కుల ఉద్యమకారులపై మోపిన రాజద్రోహం ఎన్నికల అంకగణితంలో ఓట్ల లెక్కను సాధించే ఓ అధ్యాయం మాత్రమే. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనను హత్య చేసేందుకు పాకిస్తాన్ సహాయంతో కుట్ర పన్నుతున్నారని గుండెలు బాదుకుంటూ మొత్తుకుని ఓట్లు, సీట్లు సంపాదించిన మోదీ.. వేగంగా పడిపోతున్న తన పొలిటికల్ గ్రాఫ్‌ను నిల బెట్టుకోవటానికి మరో హత్యాయత్నంను తెర మీదకు తెచ్చారు. ప్రధానిని హత్య చేయటానికి మావోయిస్టులు కుట్ర పన్నారని పుణే పోలీసులు ఆరోపించటం, హక్కుల ఉద్యమకారులు సురేంద్ర గాడ్లింగ్, సుధీర్ ధావ్లే, రోనా విల్సన్, మహేశ్ రౌత్, సుధా భరద్వాజ్, వర్నన్ గోంజాల్వెస్, అరుణ్ ఫరేరా, వరవరరావుల మీద కుట్ర కేసులు పెట్టి, నెలనెల తరబడి వాళ్లను జైల్లో బంధించి ప్రజల్లో ఓ మిధ్యా సానుభూతి వలయాన్ని పరిచి రాజ్యాధికారం సుస్థిరపరుచుకునే ప్రయత్నమే. రాజ్యానికి విశ్వాసాలు ఎప్పుడూ మూఢంగానే ఉండాలి. అవి బలమైన భావజాలంగా మారకూ డదు. రాజ్యహింసను, మత విద్వేషాలను ప్రశ్నించే స్థాయికి ఎదిగితే రాజ్యం వాళ్లను రాజద్రోహుల కింద జమ కడుతుంది. అట్లానే కాళ్లు చేతులు చచ్చుబడి పోయి, 90 శాతం ఆంగవైకల్యంతో, 15 రకాల వ్యాధులతో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబ, దాదాపు వృద్ధాప్యం అంచుల్లో ఉన్న న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్ ఫరేరా, అంబేడ్కర్ మన వడు ఆనంద్ తేల్‌తుంబ్డేలు రాజద్రోహులు అయ్యారు. ప్రజా విశ్వాసాల మీద పోలీసులు దాడి చేస్తూ.. కృత్రిమ లేఖలు, ఊహాత్మక అభియోగాలతో అమా యకులను ఏళ్లకు ఏళ్లుగా జైల్లో బంధించే హింస కొనసాగుతుంటే, కాపాడాల్సిన న్యాయ వ్యవస్థ. రాజ్యహింసకు అంగీకార ముద్రవేసే ధోరణి బలపడుతోంది. బ్యాంకులను లూటీ చేసి రూ కోట్లకు కోట్లు కొల్లగొట్టి దేశంలో కృత్రిమ ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించే ఆర్థిక నేరగాళ్లు మాత్రం దేశ ద్రోహులు కాదు. దేశీయ బ్యాంకుల నుంచి రూ వేల కోట్ల దబ్బును దర్జాగా విదేశాలకు పట్టుకుని పోతుంటే ఏ చట్టం కూడా వాళ్లకు అడ్డు రాదు. బడుగు బలహీన, మధ్య తరగతి వర్గాలు తమ చెమట, రక్తమాంసా లను రూపాయిగా మలిచి బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును వైట్ కాలర్ దొంగలు ఎత్తుకుపోతుంటే రాజ్యం కళ్లు మూసుకుంటోంది. నీరవ్ మోదీ అనే వ్యాపారి పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ. 11,360 కోట్లు, నీలేష్ ఫరేఖ్ రూ. 2,500 కోట్లు దోచుకుని విదేశాలకు వెళ్లిపోయేంతవరకు రాజ్యా నికి తెలియదు. విజయ్ మాల్యా బ్యాంకులకు రూ. 9,500 కోట్లు ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లిపోయాక కానీ మనకు ఆ విషయం తెలియదు. రైతులు పంట రుణాలు తీసుకుని తిరిగి కట్టలేకపోతే రెవెన్యూ రిక వరి(ఆర్ఆర్ యాక్ట్) కింద ఆస్తులు జప్తు చేస్తారు. ఆçస్తులు జప్తు చేయటాన్ని అవమానంగా భావించి ఆత్మహత్యలు చేసుకున్న రైతులు వేలమంది ఉన్నారు. కానీ వీళ్ల మెడలు వంచి పొరుగు దేశాల నుంచి పట్టుకొని వచ్చి తిన్నది కక్కేయటానికి మన రాజ్యాంగంలో చట్టాలు, ఐపీసీ సెక్షన్లు ఏమీ ఉండవు. దేశంలో కుట్ర కేసులు కొత్తేమీ కాదు. ప్రభుత్వా నికి వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో కుట్ర చేశారని 1974లో ‘సికింద్రాబాద్ కుట్ర కేసు’ పెట్టారు. 1971 నుంచి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మెదక్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సమావేశాలు, సభలు, ఊరేగింపులు, వాటికి ముందు జరిగిన హింసాత్మక ఘటనల ఆధారంగా ఈ కుట్ర కేసు నమోదు చేశారు. 46 మందిపై కుట్ర, రాజద్రోహ నేరం అభియోగాలు మోపారు. నాటి నక్సలైట్ నేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి లతో పాటు విప్లవ రచయితల సంఘం సభ్యులైన కె.వి.రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, వర వరరావు, చెరబండరాజు, ఎం.టి.ఖాన్‌లను ఈ కుట్ర కేసులో నిందితులుగా పేర్కొన్నారు. 1989 ఫిబ్రవరి 27న సెషన్స్ కోర్టు సికింద్రాబాద్ కుట్ర కేసులో అంద రినీ నిర్దోషులుగా ప్రకటించింది. 1986లో ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నారంటూ రాంనగర్ కుట్ర కేసు పెట్టారు. కొండ పల్లి సీతారామయ్య వంటి నక్సల్స్ నేతలు, వరవర రావు తదితర విప్లవ రచయితలను నిందితులుగా పేర్కొన్నారు. ఆ తర్వాత 1995లో కేఎస్‌పై కేసు ఉపసంహరించుకున్నారు. కేసు విచారణ జరిగిన ఈ సుదీర్ఘ కాలంలో వరవరరావు, సూరిశెట్టి సుధాకర్‌లు మినహా మిగిలిన నిందితులంతా మరణించారు. 2003 సెప్టెంబర్‌లో వరవరరావు, సూరిశెట్టి సుధా కర్లు ఇద్దరినీ నిర్దోషులుగా పేర్కొంటూ కోర్టు కేసు కొట్టివేసింది. 2005లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి మావోయిస్టు, విప్లవ రచయితలు కుట్ర పన్నారని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఔరంగాబాద్‌లో కుట్ర పన్ని, అది అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని విరసం సభ్యులను 2005లో మే 30న నిజా మాబాదులో అరెస్ట్ చేశారు. ఆయుధాలు సేకరించారు, ప్రభుత్వంపై యుద్ధ ఏర్పాట్లు చేశారన్న పోలీసుల వాదనతో విభేదిస్తూ.. 2010 ఆగస్ట్ 2న నిజామాబాద్ అడిషనల్ సెషన్స్‌జడ్జి ఆ కేసును కొట్టేశారు. 2004లో చంద్రబాబు ప్రభు త్వం కృత్రిమ లేఖ లతో నా మీద కూడా టాడా కేసు పెట్టింది. అభియోగం తప్పు అని కోర్టులు అంతిమ తీర్పులు ఇచ్చాయి. నిజమే..! కానీ కృత్రిమ లేఖ లతో, ఊహా త్మక అభియోగాలతో అక్రమంగా చార్జిషీట్ మోపిన పాలకులు, పోలీసుల మీద చర్యలు ఏవి? రాజ్యాంగంలో అటువంటి చట్ట సవరణ ఎందుకు తీసుకురావటం లేదు? కనీసం ఆత్మవిమర్శ అయినా చేసుకోవాలి. పరిపాలన చివరి దశలో ఉన్న మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని హక్కుల ఉద్యమ కారులపై పెట్టిన రాజద్రోహం కేసు లను ఉపసంహరించుకోవాలి. వ్యాసకర్త : సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే సెల్ : 94403 80141 -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ సాయిబాబా విషయంలో ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యం వహిస్తోందని విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు ఆరోపించారు. టీవీవీ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల నేతృ త్వంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వరవరరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలో నిత్యం దోపిడీకి గురవుతున్న దళితులు, ఆదివాసీ లు, అణగారిన వర్గాలవారి పక్షాన మాట్లాడాడు కనుకనే సాయిబాబా పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తోందని చెప్పారు. ప్రజలను ఓటర్లుగా, ఓటర్లను సంస్కరణల పేరుతో బిచ్చగాళ్లుగా మార్చిన ప్రభుత్వం.. సాయిబాబా లాంటి యుద్ధఖైదీనీ బిచ్చగాడిగా మార్చేస్తోందని మండి పడ్డారు. సాయిబాబా జైలు నుంచి రాసిన లేఖను ప్రస్తావిస్తూ సాయిబాబా కేసును వాదించేందుకు మొదట సుప్రీంకోర్టు న్యాయవాది రాంజెఠ్మలానీని నిశ్చయించుకున్నామని, ఆయన అనారోగ్య మో, ప్రభుత్వ ఒత్తిడి కారణంగానో మనుషులను గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో సాయిబాబా నిర్ణయం ప్రకారం గాడ్లింగ్ అనే మరో సీనియర్ న్యాయవాదికి అప్పగించామని చెప్పారు. సాయి బాబా మావోయిస్టు పార్టీ అభిప్రాయాలను సమర్థిస్తున్న ఏకైక కారణంగా ఏ నేరం చేయకుండానే జైలుపాల్జేశారన్నారు. ఆ భావజాలం కలిగి ఉండటం నేరం కాదు.. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. మావోయిస్టు భావజాలాన్ని కలిగి ఉండటం నేరం కాదన్నారు. విశ్వాసాలను నిషేధించలేరని, మావోయిస్టు అభిప్రాయాలు కలిగి ఉండటాన్ని తప్పుబట్టే అప్రజాస్వామిక భావజాలాన్ని ప్రజాస్వామికవాదులంతా వ్యతిరేకించాలన్నారు. దీనిపై వర్సిటీలు, బాహ్యసమాజంలో విస్తృత చర్చ జరగాలన్నారు. సాయిబాబాతో పాటు మిగిలిన రాజకీయ ఖైదీలు, ఆదివాసీల విడుదలకు ఉద్యమిం చాల్సిన అవసరం పౌరసమాజంపై ఉందన్నారు. జైల్లో ఉండటంతో బతికిపోయారు జైల్లో ఉన్నారు కనుకనే సాయిబాబా బతికున్నారని, బయట ఉన్న కల్బుర్గి, గోవింద్ పన్సారే, గౌరీ లంకేశ్‌లను చంపేశారని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ చెప్పారు. మెరుగైన విద్యావిధానం, భావసంఘర్షణ, మార్పుకోసం పనిచేస్తోన్న సాయిబాబా గొంతును మావోయి స్టు పేరుతో నొక్కేయడం అన్యాయమని కాకతీయ వర్సిటీ ప్రొ.కాత్యాయినీ విద్మహే అన్నారు. అకడమిక్ స్వేచ్ఛ కోసం, సాయిబాబా విడుదల కోసం జరిగే పోరాటంలో అందరం భాగస్వాము లం కావాలని హెచ్‌సీయూ ప్రొ.లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. సాయిబాబా సహా అన్యాయంగా జైళ్లలో మగ్గుతున్న వారిని గురించి మాట్లాడాల్సిన బాధ్యత సమాజంపై ఉందని పాత్రికేయురాలు మాలినీ సుబ్రహ్మణ్యం చెప్పారు. సాయిబాబాకి తక్షణం వైద్యం అందించాలని హైకోర్ట్ న్యా యవాది నందిగామ కృష్ణారావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సాయిబాబా విడుదల కమిటీ నాయకుడు రవీందర్, విరసం సభ్యుడు రవిచంద్ర, న్యూడెమోక్రసీ నాయకులు డీవీ కృష్ణారెడ్డి, అచ్యుతరామారావు, సీపీఎం నాయకుడు నరసింహరావు, కాంగ్రెస్ నాయకులు బెల్లయ్య నాయక్, జహీర్, అరుణోదయ విమలక్క, రచ యిత పింగళి చైతన్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ సమున్నత, కోటా శ్రీనివాస్, రెహమాన్ పాల్గొన్నారు. -
ఎన్‌కౌంటర్‌పై ఢిల్లీలో నిరసన గళం
► ఎన్‌కౌంటర్‌ను ఖండించిన సీపీఐ నేత డి.రాజా ► ఇది భారీ బూటకపు ఎన్కౌంటర్: ప్రొఫెసర్ సాయిబాబా సాక్షి, న్యూఢిల్లీ: ఏవోబి లోని మల్కన్‌గిరి అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ బూటకమని ఖండిస్తూ బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలు,మేధావులు, విద్యార్ధి సంఘాలు సంయుక్తంగా నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఈ సందర్భంగా సిపిఐ నేత డి.రాజా మాట్లాడుతూ భూమి కోసం,హక్కుల కోసం పోరాడుతున్న ప్రజలపై దాడిని తీవ్రంగా ఖండించారు. దీన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి గొంతుకపై జరిగిన దాడిగా రాజా పేర్కొన్నారు. మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌కు సంబంధించి మీడియాలో వచ్చిన విషయాలను ఢిల్లీ విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ జి.ఎన్ సాయిబాబా వివరించారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి వెలుగులోకి వచ్చిన సాక్ష్యాలను బట్టి ముందుగా వేసుకున్న పధకం ప్రకారమే ఈ ఆపరేషన్ చేపట్టారని, దేశ చరిత్రలోనే ఇది భారీ బూటకపు ఎన్కౌంటర్ అని,పట్టుకొని కాల్చి చంపారని సాయిబాబా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో బాక్సైట్ మైనింగ్ కోసం జరుగుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నారని సాయిబాబా చెప్పారు. పోలీసుల కస్టడీలో ఉన్న మావోయిస్టులను తక్షణం కోర్టులో హాజరు పర్చాలని సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమొక్రసీ నేత అపర్ణ డిమాండ్ చేశారు. మల్కాన్‌గిరి ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని, గాలింపు చర్యల పేరిట ఆదివాసీ గ్రామాలను ధ్వంసం చేయరాదని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఏబిఎస్ఎఫ్, ఏఐఎస్ఏ, ఏఐఎస్ఎఫ్, బిఏఎస్‌వో, బస్తర్ సాలిడారిటీ నెట్వర్క్, సిఎఫ్ఐ,సిపిఐ(ఎం-ఎల్) లిబరేషన్,పియుసిఎల్, పియుడిఆర్ తదితర సంఘాలు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాయి. -
తాకట్టులో సార్వభౌమత్వం ప్రొఫెసర్ సాయిబాబా విమర్శ
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ఆదీవాసీల కోసం పాటుపడేవారికి దేశవ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారని, జైళ్లలో పెడుతున్నారని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా అన్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై జైలుశిక్ష అనుభవించి గతవారమే బెయిల్‌పై విడుదలైన సాయిబాబా.. ప్రభుత్వ దమనకాండ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మనకు నచ్చిన విషయాలు బహిర్గతంగా మాట్లాడలేం. ప్రతిచోటా బెదిరింపు వాతావరణమే కనబడుతోంది. ఇదే నియంతృత్వ ధోరణి’ అని సాయిబాబా అన్నారు. అధికారంలో ఉన్నవారు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను హరిస్తున్నారన్నారు. దళితులు, ఆదీవాసీలకు సంబంధించిన కొన్ని కనీస అంశాలపై విద్యార్థులు, ప్రొఫెసర్లు ప్రశ్నలు లేవనెత్తారని.. జేఎన్‌యూ, హెచ్‌సీయూ, నిట్ శ్రీనగర్, ఐఐటీ మద్రాస్ గొడవలు అన్నింటికీ కారణం ఒకటేనన్నారు. రాజ్యాంగపరంగా దేశభక్తుడు అనే దానికి సరైన నిర్వచనం లేదని.. దేశంలోని చాలా సమస్యలపై చర్చను పక్కదారి పట్టించేందుకే ‘దేశవ్యతిరేకం’ అనే చర్చను తెరపైకి తెచ్చారన్నారు. ప్రభుత్వాలు దేశ సార్వభౌమత్వాన్ని సామ్రాజ్యవాదులకు తాకట్టుపెడుతున్నారని ఆరోపించారు. పర్యావరణాన్ని నాశనం చేస్తూ సహజవనరులను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని సాయిబాబా విమర్శించారు. -
ప్రొఫెసర్ సాయిబాబా కేసును రోజూ విచారించండి
ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: నక్సల్స్ తో సంబంధాల ఆరోపణలపై అరెస్టయిన ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కేసును ప్రతిరోజూ విచారించాలని మహారాష్ట్రలోని విచారణ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. సాయిబాబా బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సోమవారం జస్టిస్ జేఎస్ ఖేహర్, సీ నాగప్పన్‌ల ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. నెల రోజుల్లోపు ప్రాసిక్యూషన్ వారు ఇచ్చిన 8 ప్రధాన సాక్ష్యాలను పరిశీలించాలని గడ్చిరోలిలోని ట్రయల్ కోర్టుకు సూచించింది. వీటిని పరిశీలించాకే బెయిల్ మంజూరును పరిగణలోకి తీసుకుంటామంది. సాయిబాబా సహా నిందితులందరూ విచారణకు సహకరించాలని ఆదేశించింది. తదుపరి విచారణ తేదీ అయిన ఏప్రిల్ 4లోగా సంబంధిత వివరాలు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం వేసిన కౌంటర్, అదనపు అఫిడవిట్లను అధ్యయనం చేశామని, సాయిబాబా న్యాయవాది వాదనలను విన్నామని ధర్మాసనం తెలిపింది. -
లొంగిపోయిన ప్రొఫెసర్ సాయిబాబా
నాగ్‌పూర్: మావోయిస్టులతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా నాగ్‌పూర్‌లోని సెంట్రల్ జైల్లో లొంగిపోయారు. బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్ బెంచ్ ఆదేశాల మేరకు ఆయన శుక్రవారం రాత్రి జైలుకు వచ్చి సరెండర్ అయినట్లు జైలు వర్గాలు వెల్లడించాయి. కోర్టు ఆయనకిచ్చిన బెయిల్ గడువు ఈనెల 31 వరకు ఉంది. అయితే ఆరోగ్యకారణాల రీత్యా బెయిల్ గడువును పొడిగించాలంటూ ఆయన చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. 48 గంటల్లోపు లొంగిపోవాలని ఆదేశించింది. రెండు రోజుల్లోగా సరెండర్ కాకపోతే సాయిబాబాను అరెస్ట్ చేయాలని జస్టిస్ అరుణ్ చౌదరీ పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సాయిబాబా జైలు అధికారుల వద్దకు వచ్చి లొంగిపోయారు. వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను ఆస్పత్రికి తరలించారు. వైద్య నివేదికను సమర్పించాలని జడ్జి ఆదేశించారు. -
ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలి
ప్రజాసంఘాల నేతల డిమాండ్ హైదరాబాద్: ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని వివిధ సంఘాల, పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను అక్రమంగా అరెస్టు చేసి ఏడాది అయిన సందర్భంగా డాక్టర్ సాయిబాబా విడుదల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారమిక్కడ ఇందిరాపార్కు వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నాలో విరసం నేత వరవరరావు మాట్లాడుతూ పార్లమెంటరీ ప్రత్యామ్నాయ రాజకీయాలను బలపర్చే, ప్రజల పక్షాన పోరాడేవారిపై ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్బంధకాండకు సాయిబాబా అరెస్టు ప్రతీక అని అన్నారు. ఢిల్లీ కేంద్రంగా ప్రజాస్వామిక ఉద్యమాలను, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలను నడపడాన్ని సహించలేకే ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. బయటి ఆహారాన్ని, మందులను అనుమతించకపోవడాన్ని బట్టి సాయిబాబాను జైలులోనే హత్య చేసే కుట్ర సాగుతుందని ఆరోపించారు. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రముఖనటుడు నారాయణమూర్తి మాట్లాడుతూ సాయిబాబా ఏమైనా మోస్ట్ వాంటెడ్ క్రిమినలా? అని నిలదీశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు రాములు, రామనర్సింహ్మరావు(సీపీఐ), సీపీఐ(ఎంఎల్) న్యూడెమాక్రసీ నాయకుడు వేములపల్లి వెంకట్రామయ్య, గోవర్ధన్(న్యూడెమెక్రసీ), భూతం వీరయ్య(సీపీఐఎంఎల్), మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. సామాజిక కార్యకర్తలు కూడా... సాక్షి, న్యూఢిల్లీ: ప్రొఫెసర్ సాయిబాబాను తక్షణం విడుదల చేయాలంటూ శనివారం ఢిల్లీ, జవహర్లాల్, జామియా మిలియా ఇస్లామియా, ఇంద్రప్రస్థ, అంబేడ్కర్ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, సామాజిక కార్యకర్తలు ఢిల్లీ వర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద దీక్ష చేశారు.