ఒడిశా – ముంచంగిపుట్టు రోడ్డులో ప్రయాణికుల లగేజీ బ్యాగులను తనిఖీలు చేస్తున్న ఎస్‌ఐ అరుణ్‌కిరణ్
విశాఖపట్నం, అరకులోయ,పాడేరు: కేంద్రప్రభుత్వం సమాధాన్ పేరిట నిర్భందం అమలుజేస్తోందని నిరసిస్తూ మావోయిస్టు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం నిర్వహించిన భారత్‌బంద్ మన్యంలో ప్రశాంతంగా, పాక్షికంగా జరిగింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఒడిశా సరిహద్దులో ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు మండల కేంద్రాలలో ఉదయం నుంచి 11గంటల వరకు వ్యాపారులు దుకాణాలను మూసివేశారు.పెదబయలు మండల కేంద్రంలో కొన్ని దుకాణాలు తెరిచారు. పోలీసులు జోక్యం చేసుకుని మిగిలిన దుకాణాలను కూడా తెరిపిం చారు.ముంచంగిపుట్టులో ఉదయం 11గంటల వరకు దుకాణాలను మూసివేశారు.పోలీసుల ఆదేశాలతో వ్యాపారులు మధ్యాహ్నం నుంచి తమ దుకాణాలను తెరిచారు.డుంబ్రిగుడ మండలంలో మాత్రం బంద్ ప్రభావం కనిపించింది.ఉదయం నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు డుంబ్రిగుడ,అరకుసంత ప్రాంతాలలో దుకాణాలు మూతపడ్డాయి.హుకుంపేట,అరకులోయ,అనంతగిరి, కొయ్యూరు మండలాల్లో దుకాణాలు,ప్రభుత్వ కార్యాలయాలు యథావిథిగా తెరుచుకున్నాయి. ఈ మండలాల్లో మావోయిస్టుల బంద్ ప్రభావం కానరాలేదు. పాడేరు నియోజకవర్గంలో చింతపల్లి,జి.మాడుగుల, జీకే వీధిలో బంద్‌పాక్షికంగా జరిగింది.
స్తంభించిన రవాణా
మావోయిస్టుల బంద్ కారణంగా మన్యంలోని మారుమూల ప్రాంతాలకు రవాణా సేవలు స్తంభించాయి. ముంచంగిపుట్టు,పెదబయలు మండల కేంద్రాల వరకే పాడేరు డిపో నుంచి ఆర్టీసీ బస్సులు నడిచాయి.ఒడిశాకు ఆనుకుని ఉన్న జోలాపుట్,డుడుమ ప్రాంతాలకు పూర్తిగా బస్ సర్వీసులను రద్దు చేశారు.ఈ మండలాల్లోని మారుమూల ప్రాంతాలకు బస్సులు,ఇతర ప్రైవే ట్ వాహనాల సర్వీసులు నిలిచిపోయాయి.ముంచంగిపుట్టు మండలంలోని మారుమూల గ్రామా ల నుంచి ఒడిశాలోని మల్కన్‌గిరి,కోరాపుట్ జిల్లాలోని గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.విశాఖ నుంచి జైపూర్,ఒనకఢిల్లీ ప్రాంతాల బస్సు సర్వీసులను కూడా నిలిపివేశారు.దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పాడేరు, చింతపల్లి, జి.కె వీధి, జోలాపుట్టు ప్రాంతాలకు వచ్చే నైట్‌హాల్ట్ సర్వీసుల్ని బుధవారం, గురువారం రాత్రి కూడా నిలిపివేశారు. పాడేరు ఆర్టీసీ డిపో నుంచి కొండవంచుల, జోలాపుట్టు, గోమంగి, లక్ష్మిపేట, లోతేరు, గుంట సీమ, రూడకోట, మూలకొత్తూరు, ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసుల్ని నిలిపివేశారు.
విస్తృతంగా తనిఖీలు
మావోయిస్టుల బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసుశాఖ అప్రమత్తమైంది.ఒడిశా నుంచి ముంచంగిపుట్టు మండల కేంద్రం వరకు ఉన్న ప్రధాన రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రంలో ఎస్‌ఐ అరుణ్‌కిరణ్,ఇతర పోలీసు పార్టీలు తనిఖీలు నిర్వహించారు. పెదబయలు మండల కేంద్రంతో పాటు,పాడేరు నుంచి అరకులోయ రోడ్డులో హుకుంపేట,డుంబ్రిగుడ ప్రాంతాలలో పోలీసులు వాహనాల తని ఖీలు జరిపారు.హుకుంపేట ఎస్‌ఐ నాగకార్తీక్,ఇతర సిబ్బంది ఆర్టీసీ,ప్రైవేట్ వాహనాలలో ప్రయాణికుల లగేజీ బ్యాగులను సోదా చేశారు.అనుమానిత వ్యక్తుల సమాచారం సేకరించి వదిలిపెటా ్టరు.హుకుంపేట నుంచి కామయ్యపేట మీదుగా ఒడిశాలోని పాడువా ప్రాంతానిక వెళ్లే రోడ్డులో కూడా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈజంక్షన్‌లోను పోలీసులు పహారా కాశారు.
Comments
Please login to add a commentAdd a comment