bharath bandh
-
అలెర్ట్... బ్యాంకులు బంద్
-
భారత్ బంద్ ఎఫెక్ట్: వందల సంఖ్యలో రైళ్లు రద్దు
అగ్నిపథ్ స్కీమ్‌పై దేశవ్యాప్త ఆందోళనలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే రాజకీయ పార్టీల నేతలు నేడు(సోమవారం) భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బంద్ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా రైల్వేశాఖ ఆర్పీఎఫ్ బలగాలను అప్రమత్తం చేసింది. అంతే కాకుండా భారీగా రైళ్లను రద్దు చేసింది. జూన్ 20న బయల్దేరాల్సిన 736 రైళ్ల ప్రయాణాలను నిలిపివేసినట్లు ఐఆర్సీటీసీ పేర్కొంది. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారికి సంఘీభావం తెలిపేందుకు దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహం చేపట్టారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో ఢిల్లీ-గుర్గావ్ ఎక్స్‌ప్రెస్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదిలా ఉండగా.. నిరసనల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ పోలీసులు హెచ్చరించారు. పంజాబ్‌లో అగ్నిపథ్‌పై తప్పుడు ప్రచారం చేస్తే ఆందోళనలను ప్రేరేపించే సమాచారాన్ని సోషల్ మీడియా వ్యాప్తి చెందనివ్వకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇక, బీహార్ ప్రభుత్వం పార్టీ కార్యాలయాల వద్ద భద్రతను పెంచింది. ప్రస్తుతం బీహార్‌లోని 20 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. మరోవైపు.. అగ్నిపథ్‌కు నిరసనగా భారత్ బంద్ నేపథ్యంలో జార్ఖండ్‌లో విద్యా సంస్థలను మూసివేసి, ఈరోజు జరిగే పరీక్షలను రద్దు చేశారు. ఆంధ్రప్రదేశ్, హర్యానా, కేరళ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌లలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. ఫరీదాబాద్, నోయిడాలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సమావేశాన్ని నిషేధిస్తూ పోలీసులు 144 సెక్షన్ విధించారు. Agnipath protest: Railways cancel over 700 trains amid Bharat Bandh, check full list here#Railways #CancelledTrains #Agnipath #BharatBandh https://t.co/26vMAOhrIn — APN NEWS (@apnnewsindia) June 20, 2022 ఇది కూడా చదవండి: భారత్ బంద్ ఎఫెక్ట్: విద్యా సంస్థలు మూసివేత, పరీక్షలు రద్దు -
భారత్ బంద్ ఎఫెక్ట్: విజయవాడలో స్పెషల్ రోబో టీమ్స్ ఏర్పాటు
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అభ్యర్థులకు మద్దతుగా రాజకీయ పార్టీలు సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో నేడు దేశవ్యాప్తంగా ప్రశాంతంగా భారత్ బంద్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. విజయవాడలో పాక్షికంగా భారత్ బంద్ ప్రభావం కనిపిస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగా రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులు భారీ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా రోబో టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. స్టేషన్‌కు వెళ్లే ప్రతీ ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. భారత్ బంద్ నేపథ్యంలో తిరుపతి రైల్వే స్టేషన్లోనూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలర్ట్ అయ్యారు. ఇది కూడా చదవండి: భారత్ బంద్ ఎఫెక్ట్: విద్యా సంస్థలు మూసివేత, పరీక్షలు రద్దు -
గుర్రపు బండిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్‌బంద్‌లో భాగంగా సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గాంధీభవన్ నుంచి అసెంబ్లీ వరకు గుర్రపు బండి ఎక్కి వచ్చారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క ఇందులో పాల్గొన్నారు. అయితే అసెంబ్లీ ముందుకు రాగానే వారిని పోలీసులు అడ్డుకున్నారు. గుర్రపుబండిలో అసెంబ్లీలోనికి వెళ్లేందుకు వీల్లేదనడంతో కాంగ్రెస్ నేతలు వాగ్వివాదానికి దిగారు. అసెంబ్లీ సమావేశాలకు ఎలా హాజరు కావాలన్నది తమ ఇష్టమని, తమను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. అయినప్పటికీ పోలీసులు వారిని లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో భట్టి సహా నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అసెంబ్లీ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కారణంగా సోమవారం జరిగిన అసెంబ్లీ కార్యక్రమాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొనలేకపోయారు. స్పీకర్, చైర్మన్ సమాధానం చెప్పాలి: భట్టి పోలీస్‌స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత సోమవారం మధ్యాహ్నం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అసెంబ్లీకి ఎలా వెళ్లాలనేది సభ్యుల ఇష్టమని, తాము అసెంబ్లీకి హాజరు కాకుండా పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని భట్టి అన్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా వెళ్లినా తమను అరెస్టు చేసిన విధానంపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హక్కుల తీర్మానం ఇస్తాం: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలను టీఆర్ఎస్ ఆమోదిస్తుందా లేక వ్యతిరేకిస్తుందా అన్న దానిపై వివరణ ఇవ్వాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సభకు హాజరుకానివ్వకుండా తమ హక్కులను కాలరాసినందుకు అసెంబ్లీలో, మండలిలో హక్కుల తీర్మానం పెడతామని చెప్పారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎలా రావాలన్న దానిపై నిబంధనలు ఏమైనా ఉన్నాయేమో స్పీకర్, చైర్మన్లు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని జగ్గారెడ్డి విమర్శించారు. సీతక్క మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే, ప్రజలతో కలిసి పోరాడాల్సిన కేసీఆర్ ఢిల్లీలో కేంద్ర పెద్దలతో మంతనాలు జరుపుతున్నారని విమర్శించారు. -
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న భారత్ బంద్
-
రేపు తలపెట్టిన భారత్ బంద్ కు వైఎస్ఆర్ సీపీ సంపూర్ణ మద్దతు
-
భారత్ బంద్.. స్తంభించిన విజయవాడ
-
విజయవాడలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్
-
పెట్రోల్ ధరల సెగ.. 26న భారత్ బంద్
న్యూఢిల్లీ: నిరాటంకంగా పెరుగుతూ సెంచరీ మార్క్ దాటుతున్న పెట్రోల్ ధర.. దానికి అనుగుణంగా పోటీ పడుతూ పెరుగుతున్న డీజిల్ ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు వారాలుగా పెరుగుతున్న ధరలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండగా తాజాగా ధరల పెంపుపై లారీ యజమానులు ఆందోళనకు దిగారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా శుక్రవారం (ఫిబ్రవరి 26) భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. 26న భారత్ బంద్ చేపట్టాలని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ పిలుపునివ్వడంతో దానికి కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. దీంతోపాటు అఖిల భారత వాహనదారుల సంక్షేమ సంఘం (ఆలిండియా ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్-ఏఐటీడబ్ల్యూఏ) కూడా సంపూర్ణ మద్దతు పలికింది. బంద్‌కు అన్ని రాష్ట్ర స్థాయి వాహనదారుల సంఘం బంద్‌కు మద్దతిస్తాయని ఏఐటీడబ్ల్యూఏ అధ్యక్షుడు మహేంద్ర ఆర్య తెలిపారు. డీజిల్ ధరల పెంపుకు నిరసనగా ఒకరోజు బంద్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు కొత్తగా తీసుకొచ్చిన ఈ-వే బిల్లు నిబంధనలను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. డీజిల్ ధరలు తగ్గించాలని.. దేశవ్యాప్తంగా ధరలు ఒకేలా ఉండాలని కోరారు. వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేపట్టిన ‘చక్కా జామ్ (జాతీయ రహదారుల దిగ్భంధం)’ను చేపడతామని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ప్రకటించింది. 26వ తేదీన రహదారుల దిగ్బంధం చేస్తామని స్పష్టం చేసింది. అంతకుముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. డీజిల్ ధరలు తగ్గించాలని.. జీఎస్టీని సమీక్షించి సిఫారసులు చేయడానికి ఓ కమిటీ ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేసింది. భారత్ బంద్‌కు దేశంలోని దాదాపు 40 వేల కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని సమాచారం. ఈ భారత్ బంద్‌లో దాదాపు 8 కోట్ల మంది వ్యాపారులు పాల్గొనున్నారు. -
పార్లమెంట్లో వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాం: కేటీఆర్
-
కేంద్రం మెడలు వంచుతాం: తలసాని
సాక్షి, హైదరాబాద్: రైతు వ్యతిరేక చట్టాలతో కేంద్రం వ్యవసాయన్ని కార్పొరేట్ వ్యవస్థలకు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్‌లో టీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటిస్తూ పాల్గొంది. భారత్ బంద్‌లో పాల్గొన్న మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి రైతు వెన్నెముక అని, దేశ వ్యాప్తంగా రైతన్న తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడని అన్నారు. వ్యవసాయ చట్టాలతో రైతులు నడ్డి విరుగుతోందని, రాజ్యసభలో అన్ని పార్టీలు వ్యతిరేకించినా చట్టాలను ఆమోదించుకున్నారని దుయ్యబట్టారు. సంఖ్యా బలం ఉందని ఈ నల్ల చట్టాలను తీసుకొచ్చారని, చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో రైతులను ఆదుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్ మాత్రమే అని ఆయన గుర్తు చేశారు. చదవండి: వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేవే.. ఇప్పటికైనా కేంద్రం దిగి వచ్చి, జీఎస్టీని మార్చలేదా? దేశంలో రైతుల పరిస్థితి తీవ్రంగా మారుతుందని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర లేదు.. తెలంగాణలో పండిన పంట దేశంలో వేరే చోట అమ్ముకోవాలంటే ఎలా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో రైతాంగం కోలుకుంటుందని గుర్తుచేశారు. ఎవర్ని పెంచి పోషించడం కోసం ఈ చట్టాలు తీసుకువచ్చారని ప్రశ్నించారు. పంజాబ్, హరిహాణలో ఇంత ఉధృతంగా ఎందుకు జరుగుతుందో ఆలోచించుకోవాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలో కేంద్రం మెడలు వంచుతామని, రైతాంగంతో డ్రామాలు ఆడితే మీ అధికార పీఠం కదులుతుందన్నారు. కొంతమంది మూర్ఖులు అనవసరంగా మాట్లాడుతున్నారని, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ టీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి భయపడుతోందన్నారు. కానీ, ఇలాంటి రాజకీయాలు, ఎన్నికలు తాము ఎన్నో చూశామని అన్నారు. రైతులు నిరసన చేస్తుంటే రాజకీయ పార్టీలపై నెడుతున్నారని అన్నారు. చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం అవుతుంది అధికారం శాశ్వతం కాదని హెచ్చరించారు. నిజంగా సమస్య లేకపోతే కేంద్రం ఎందుకు చర్చలు జరుపుతుందని నిలదీశారు. రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందో ఒకసారి గమనించాలన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలను కేంద్రం పరిగణలోకి తీసుకుందని గుర్తు చేశారు. రైతుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదని మండిపడ్డారు. నేటి భారత్ బంద్‌కు వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. -
డిసెంబర్ 8న భారత్ బంద్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ప్రభుత్వానికి రైతులకు మధ్య చర్చలు జరుగుతున్నా అవి ఫలితాన్నివ్వటం లేదు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన రైతులు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. డిసెంబర్ 8వ తేదీన దేశ వ్యాప్త బంద్ పాటించాలని నిర్ణయించారు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే అన్ని రహదారులను మూసేస్తామని ప్రకటించారు. (కెనడా ప్రధాని వ్యాఖ్యలు: భారత్ హెచ్చరిక!) దేశ వ్యాప్తంగా ఉన్న టోల్గేట్లను స్వాధీనపర్చుకుని టోల్ గేట్ ఫీజులు వసూలు చేసుకోకుండా అడ్డుకుంటామని చెప్పారు. ‘‘ ఈ ఉద్యమంలో మరికొంత మంది చేరతారు. విద్యుత్ ఛార్జీలు, పంట నష్టం విషయంలో ప్రభుత్వం మా డిమాండ్లను ఒప్పుకుంటుందో లేదో చూడాలి’’ అని నిరసనలు తెలుపుతున్న ఓ రైతు సంఘం నాయకుడు హరిందర్ సింగ్ లోఖోవాల్ అన్నారు. -
దీపికకు నోటీసుల వెనుక ఇంత కుట్రనా..
సాక్షి, ముంబై : బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో మొదలైన వివాదం చిత్రపరిశ్రమలో పెను దుమారాన్ని రేపుతోంది. మొదట నెపోటిజం చుట్టూతిరిగిన కథఅంతా.. డ్రగ్స్‌వైపు మళ్లింది. ప్రస్తుతం విచారణ అంతా సుశాంత్ ఆత్మహత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి వాంగ్మూలం చుట్టు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఆమె వెల్లడించిన పేర్ల ప్రకారం.. హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్‌లకు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు నోటీసులు జారీచేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా డ్రగ్స్ కేసులో బాలీవుడ్ టాప్ బ్యూటీ దీపికా పదుకొనెకు కూడా నోటీసులు పంపడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిపై చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లోనూ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. దీపికపై కక్షసారింపు చర్యగా ఈ కేసులో ఇరికించారనీ, సుశాంత్ ఆత్మహత్య కేసులో వాస్తవాలను కప్పిపుచ్చేందుకు డ్రగ్స్ కేసు తెరపైకి తీసుకువచ్చారనీ పలువురు అభిప్రాయపడుతున్నారు. (రకుల్, దీపిక, సారా, శ్రద్ధలకు సమన్లు) అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈనెల 25న దేశ వ్యాప్త బంద్‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చిన తరుణంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే దీపికతో పాటు ఇతర నటీమనుల పేర్లును డ్రగ్స్ కేసు జాబితాలో చేర్చారని సోషల్ మీడియా వేదికగా పలువురు విశ్లేషిస్తున్నారు. వ్యవసాయంలో సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు దేశంలో ఆగ్రహావేశాలకు దారితీస్తున్న విషయం తెలిసిందే. దీనిపై విపక్షాల నిరసనలతో పార్లమెంట్ రణరంగాన్నే తలపించింది. బిల్లులపై ఓటింగ్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణాకం ఏకంగా సభ్యుల సస్పెన్సన్‌కు దారితీసింది. అంతేకాకుండా బిల్లులను ఉపసంహించుకోవాలని కోరుతు విపక్ష పార్టీలు సమావేశాలను సైతం బహిష్కరించాయి. (డ్రగ్ కేసు: దీపికాకు కంగనా చురకలు) ఈ క్రమంలోనే ఈనెల 25(శుక్రవారం) దేశ వ్యాప్తంగా బంద్‌కు అఖిల భారత రైతు కూలీసంఘం పిలుపునివ్వగా దీనికి దేశంలోని రైతు సంఘాలన్నీ మద్దతు ప్రకటించాయి. వీటితో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సైతం మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని బంద్‌పై పడనీయకుండా కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రలో భాగంగా రెండు రోజుల ముందు నోటీసులు జారీచేశారని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. మీడియా దృష్టిని సైతం మళ్లించే విధంగా బీజేపీ పెద్దలు రచించిన వ్యూహంలో దీపికను పావుగా ఉపయోగించుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 25న జరిగే బంద్‌ను ఏమాత్రం కవర్ చేయకుండా మీడియా మొత్తం దీపిక చుట్టే తిరుగుతుందని పోస్టులు పెడుతున్నారు. దీపికపై ఎందుకింత కుట్రఅని నిలదీస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో విద్యార్థులు, టీచర్లపై జరిగిన దాడిని ఖండిస్తూ దీపిక వర్సిటీని సందర్శించిన విషయం తెలిసిందే. బీజేపీ మద్దతుదారులు చేసిన దాడికి నిరసనగా అక్కడి విద్యార్థులు చేపట్టిన దీక్షకు ఆమె సంఘీభావం తెలిపారు. ఈ పరిణామం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కొందరు దీపిక చర్యలను సమర్థించగా.. బీజేపీ పెద్దలు మాత్రం విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా డ్రగ్స్ కేసులో ఆమెకు జారీచేసిన నోటీసులు జేఎన్‌యూ సందర్శనకు కక్షసారింపేనని విశ్లేషిస్తున్నారు. మరోవైపు డ్రగ్స్ కేసులు ఇంకా పలువురు నటీమనులు ఉన్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. (విమర్శలు... వ్యంగ్యాస్త్రాలు) దీనిపై సీనియర్ నటీ నగ్మా తాజాగా ట్విటర్ వేదికగా స్పందించింది. డ్రగ్స్ కేసులో చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయని, కంగనా రనౌత్‌కు ఎందుకు నోటీసులు పంపడంలేదని ప్రశ్నించారు. తాను డ్రగ్స్‌కు బానిసగా మారాను అంటూ ఓ టీవీషోలో తానే స్వయంగా ప్రకటించిందని అలాంటప్పుడు కంగనాను ఎందుకు అరెస్ట్ చేయరని నగ్మా నిలదీసింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన నటీనటులను కేసుల్లో ఇరికించి ప్రతీకారం తీర్చుకుంటున్నారని.. అదే అనుకూలంగా మాట్లాడినప్పుడు తప్పు చేసినా సరే, వారికి ఎలాంటి శిక్ష ఉండబోదని ప్రభుత్వమే స్వయంగా చెప్తున్నట్లు ఉందని వ్యంగ్యంగా విమర్శనాస్గ్రాలు సందించింది. ఇక తాజా వివాదంపై ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ సైతం స్పందించారు. ‘ఈ నెల 25 శుక్రవారం దీపికని విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ ఆదేశించింది. ఓవైపు భారత్ బంద్‌కు రైతులు పిలుపునివ్వగా దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని కేంద్రం భావిస్తోంది’ అంటూ ట్వీట్ చేశారు. So @deepikapadukone summoned on September 25 by @narcoticsbureau . Farmers all India protest on Sept 25. Samajh mein aaya?🙏 — Rajdeep Sardesai (@sardesairajdeep) September 23, 2020 -
మావోయిస్టుల బంద్ ప్రశాంతం
విశాఖపట్నం, అరకులోయ,పాడేరు: కేంద్రప్రభుత్వం సమాధాన్ పేరిట నిర్భందం అమలుజేస్తోందని నిరసిస్తూ మావోయిస్టు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం నిర్వహించిన భారత్‌బంద్ మన్యంలో ప్రశాంతంగా, పాక్షికంగా జరిగింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఒడిశా సరిహద్దులో ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు మండల కేంద్రాలలో ఉదయం నుంచి 11గంటల వరకు వ్యాపారులు దుకాణాలను మూసివేశారు.పెదబయలు మండల కేంద్రంలో కొన్ని దుకాణాలు తెరిచారు. పోలీసులు జోక్యం చేసుకుని మిగిలిన దుకాణాలను కూడా తెరిపిం చారు.ముంచంగిపుట్టులో ఉదయం 11గంటల వరకు దుకాణాలను మూసివేశారు.పోలీసుల ఆదేశాలతో వ్యాపారులు మధ్యాహ్నం నుంచి తమ దుకాణాలను తెరిచారు.డుంబ్రిగుడ మండలంలో మాత్రం బంద్ ప్రభావం కనిపించింది.ఉదయం నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు డుంబ్రిగుడ,అరకుసంత ప్రాంతాలలో దుకాణాలు మూతపడ్డాయి.హుకుంపేట,అరకులోయ,అనంతగిరి, కొయ్యూరు మండలాల్లో దుకాణాలు,ప్రభుత్వ కార్యాలయాలు యథావిథిగా తెరుచుకున్నాయి. ఈ మండలాల్లో మావోయిస్టుల బంద్ ప్రభావం కానరాలేదు. పాడేరు నియోజకవర్గంలో చింతపల్లి,జి.మాడుగుల, జీకే వీధిలో బంద్‌పాక్షికంగా జరిగింది. స్తంభించిన రవాణా మావోయిస్టుల బంద్ కారణంగా మన్యంలోని మారుమూల ప్రాంతాలకు రవాణా సేవలు స్తంభించాయి. ముంచంగిపుట్టు,పెదబయలు మండల కేంద్రాల వరకే పాడేరు డిపో నుంచి ఆర్టీసీ బస్సులు నడిచాయి.ఒడిశాకు ఆనుకుని ఉన్న జోలాపుట్,డుడుమ ప్రాంతాలకు పూర్తిగా బస్ సర్వీసులను రద్దు చేశారు.ఈ మండలాల్లోని మారుమూల ప్రాంతాలకు బస్సులు,ఇతర ప్రైవే ట్ వాహనాల సర్వీసులు నిలిచిపోయాయి.ముంచంగిపుట్టు మండలంలోని మారుమూల గ్రామా ల నుంచి ఒడిశాలోని మల్కన్‌గిరి,కోరాపుట్ జిల్లాలోని గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.విశాఖ నుంచి జైపూర్,ఒనకఢిల్లీ ప్రాంతాల బస్సు సర్వీసులను కూడా నిలిపివేశారు.దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పాడేరు, చింతపల్లి, జి.కె వీధి, జోలాపుట్టు ప్రాంతాలకు వచ్చే నైట్‌హాల్ట్ సర్వీసుల్ని బుధవారం, గురువారం రాత్రి కూడా నిలిపివేశారు. పాడేరు ఆర్టీసీ డిపో నుంచి కొండవంచుల, జోలాపుట్టు, గోమంగి, లక్ష్మిపేట, లోతేరు, గుంట సీమ, రూడకోట, మూలకొత్తూరు, ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసుల్ని నిలిపివేశారు. విస్తృతంగా తనిఖీలు మావోయిస్టుల బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసుశాఖ అప్రమత్తమైంది.ఒడిశా నుంచి ముంచంగిపుట్టు మండల కేంద్రం వరకు ఉన్న ప్రధాన రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రంలో ఎస్ఐ అరుణ్‌కిరణ్,ఇతర పోలీసు పార్టీలు తనిఖీలు నిర్వహించారు. పెదబయలు మండల కేంద్రంతో పాటు,పాడేరు నుంచి అరకులోయ రోడ్డులో హుకుంపేట,డుంబ్రిగుడ ప్రాంతాలలో పోలీసులు వాహనాల తని ఖీలు జరిపారు.హుకుంపేట ఎస్ఐ నాగకార్తీక్,ఇతర సిబ్బంది ఆర్టీసీ,ప్రైవేట్ వాహనాలలో ప్రయాణికుల లగేజీ బ్యాగులను సోదా చేశారు.అనుమానిత వ్యక్తుల సమాచారం సేకరించి వదిలిపెటా ్టరు.హుకుంపేట నుంచి కామయ్యపేట మీదుగా ఒడిశాలోని పాడువా ప్రాంతానిక వెళ్లే రోడ్డులో కూడా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈజంక్షన్‌లోను పోలీసులు పహారా కాశారు. -
‘ఆపరేషన్ సమాధాన్’పై మావ్చోల పోరు
సాక్షి, కొత్తగూడెం: మావోయిస్టులకు, బలగాలకు మధ్య సుదీర్ఘకాలంగా పోరు జరుగుతోంది. కొన్ని నెలలుగా మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ సమాధాన్’ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. ఆంగ్ల అక్షరమాలలోని ‘ఎస్ ఏ ఎం ఏ డీ హెచ్ ఏ ఎన్’ (ఎస్–స్మార్ట్ లీడర్షిప్), (ఏ–అగ్రెసివ్ స్ట్రాటజీ), (ఎం–మోటివేషన్ అండ్ ట్రైనింగ్), (ఏ–యాక్షనబుల్ ఇంటెలిజెన్సీ), (డి–డాష్‌బోర్డ్ బేస్డ్ కీ), (హెచ్–హార్నెసింగ్ టెక్నాలజీ), (ఏ–యాక్షన్ ప్లాన్), (ఎన్–నో యాక్సెస్ టు ఫైనాన్సింగ్) లక్ష్యంతో ఈ ఆపరేషన్‌ను చేపడుతోంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా పోలీసులను సమన్వయపర్చుకుంటూ కేంద్ర బలగాలను దండకారణ్యంలోకి కేంద్ర ప్రభుత్వం ముందుకు నడిపిస్తోంది. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ, సుక్మా, బీజాపూర్, బస్తర్, కాంకేర్, నారాయణపూర్ జిల్లాల్లో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. ఫలితంగా, మావోయిస్టులకు భారీగా నష్టం వాటిల్లుతోంది. మొన్నటి శాసనసభ ఎన్నికలకు ముందు నుంచే ‘ఆపరేషన్ సమాధాన్’కు కేంద్రం పదును పెట్టింది. మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలున్నాయి. వీటి నిర్వహణకు మావోయిస్టుల నుంచి ఎటువంటి ఆటంకాలు ఎదురవకుండా చూసేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలను పోలీసులు గట్టిగానే నియంత్రించగలిగారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణలోకి ప్రవేశించేందుకు మావోయిస్టులు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. సభలు–సమావేశాలు, బంద్... పై పరిణామాలన్నింటి నేపథ్యంలో, ‘ఆపరేషన్ సమాధాన్’కు వ్యతిరేకంగా మావోయిస్టులు ఈ నెల 25 నుంచి 30 వరకు సభలు–సమావేశాలకు, 31న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. వీటి ప్రచా రంలో భాగంగా శుక్రవారం భద్రాచలం బస్టాండులో కరపత్రాలు, అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగు–నెల్లిపాక బంజర గ్రామాల మధ్యలో బ్యానర్లు, చర్ల మండలంలోని ఆర్.కొత్తగూడెం–కుదునూరు మధ్య ప్రధాన రహదారిపై కనిపించాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలంలోని సూరవీడు వద్ద బ్యానర్లు, ఆంధ్రప్రదేశ్‌లోని చింతపల్లి మండలం అంతర్లా గ్రామ వద్ద కరపత్రాలు, భద్రాచలం నుంచి అశ్వారావుపేట వెళ్లే ప్రధాన రహదారి పక్కన పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం మారేడుబాక, ఉప్పేరు, వెంకటాపురం గ్రామాల వద్ద బ్యానర్లు, పోస్టర్లు కనిపించాయి. జయశంకర్ జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు వద్ద కామినిచెరువు పనులు చేస్తున్న జేసీబీని ఈ నెల 24న మావోయిస్టులు తగులబెట్టారు. ‘సమాధాన్’కు వ్యతిరేకంగా బ్యానర్లు, కరపత్రా లు వదిలారు. పాక్షిక మైదాన ప్రాంతంగా పేరుపడిన అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగు–నెల్లిపాక బంజర ప్రాంతంలోనూ మావోయిస్టుల బ్యానర్లు కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. రెచ్చిపోతున్న మావోయిస్టులు... మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. బాంబులు పెడుతున్నారు, పేలుస్తున్నారు. ఈ నెల 22న చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో ప్రెషర్ బాంబు పేలడంతో నలుగురు ఆర్ అండ్ బీ ఉద్యోగులు గాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఎల్‌డబ్ల్యూఈ నిధులతో పెదమిడిసీలేరు నుంచి చెన్నాపురం వరకు గతంలో రోడ్డు నిర్మాణం పూర్తియింది. దీని పక్కన కిలోమీటర్ రాళ్లను పాతేందుకు ఆర్ అండ్ బీ ఉద్యోగులు మార్కింగ్ చేస్తుండగా ప్రెషర్ బాంబు పేలింది. 2018 డిసెంబర్ 31న చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్ సమీపంలోని తిప్పాపురం రోడ్డులో మావోయిస్టులు అమర్చిన రెండు మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. 2018 డిసెంబర్ 11న చర్ల మండలంలోని బోదనెల్లి సమీపంలో ప్రధాన రహదారిపై మావోయిస్టులు అమర్చిన మందుపాతరను పోలీసులు గుర్తించారు. బయటకు తీస్తుండగా అది పేలింది. ఒక జావానుకు తీవ్ర గాయాలయ్యాయి. 2018 డిసెంబర్ 7న చర్ల మండలం పెదమిడిసిలేరు సమీపంలోని తిప్పాపురం మార్గంలోగల పగిడివాగు చప్టాను మందుపాతరతో మావోయిస్టులు పేల్చివేశారు. 2017 జూలైలో చర్ల మండలంలోని లెనిన్ కాలనీకి వెళ్లే మార్గంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరను పోలీసులు నిర్వీర్యం చేశారు. 2018 మే 5న చర్ల మండలంలోని సత్యనారాయణపురం ప్రధాన రహదారిలోగల ప్రధాన కల్వర్టును మావోయిస్టులు మందుపాతరలతో పేల్చివేశారు. 2018 మే నెలలో చర్ల బస్టాండ్ అవుట్ గేట్ వద్ద మావోయిస్టులు బ్యాగులో ఉంచిన ప్రెషర్ బాంబును పోలీసులు గుర్తించారు. దానిని స్వాధీనపర్చుకుని, సమీపంలోని చెరువు వద్ద నిర్వీర్యం చేశారు. ‘సమాధాన్‘మిస్తున్న బలగాలు దాడులు, బాంబులతో రెచ్చిపోతున్న మావోయిస్టులకు ‘ఆపరేషన్ సమాధాన్’ పేరుతో బలగాలు గట్టిగానే సమాధానమిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దండకారణ్యం నుంచి తెలంగాణలోని సరిహద్దు జిల్లాల్లోకి చొచ్చుకొచ్చేందుకు మావోయిస్టులు సాగించిన ప్రయత్నాలను మన పోలీసులు గట్టిగానే తిప్పికొట్టారు. దీనికి ప్రతీకారంగా, మావోయిస్టులు దాడులకు, విధ్వంసానికి దిగుతున్నారు. పోలీసు బలగాలే లక్ష్యంగా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు దాటి వస్తున్నారు. భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం మండలాల్లో అనేకచోట్ల మందుపాతరలు, ప్రెషర్ బాంబులు ఏర్పాటు చేశారు. వీటి నుంచి బలగాలు చాకచక్యంగా తప్పించుకుని దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాడులకు మావోయిస్టు పార్టీ యాక్షన్ టీములు రంగంలోకి దిగినట్టు పోలీసులు గుర్తించారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక యాక్షన్ టీం ఏర్పాటైనట్టు, ఇన్చార్జిగా దామోదర్ నియమితులైనట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు, పకడ్బందీగా వ్యవహరించారు. గత నవంబర్ 28న మావోయిస్టు పార్టీ మణుగూరు–పాల్వంచ ఏరియా కార్యదర్శి సుజాతక్కను అరెస్ట్ చేశారు. మావోయిస్టు పార్టీ ఈమె తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, భద్రాద్రి కొత్తగూడెం–తూర్పుగోదావరి జిల్లాల కార్యదర్శి కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ భార్యనే ఈ సుజాతక్క. యాక్షన్ టీం వివరాలను ఈమె నుంచి పోలీసులు సేకరించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత ఒకవైపు, మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. మరోవైపు, బలగాలు–పోలీసులు గట్టిగానే ‘సమాధాన్’మిస్తున్నారు. ఇంకోవైపు, మరో మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో... ‘ఆపరేషన్ సమాధాన్’ను ఓడించాలంటూ మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ పేరుతో వారు తీవ్ర హింసకు దిగే ప్రమాదముంది. ‘సమాధాన్’ పేరుతో బలగాలు–పోలీసులు కూడా అప్రమత్తంగా, సర్వసన్నద్ధంగా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే... సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం, తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. -
స్తంభించిన ప్రజా రవాణా
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 కార్మిక సంఘాలు ప్రకటించిన రెండ్రోజుల భారత్ బంద్ బుధవారంతో ముగిసింది. బంద్ సందర్భంగా కేరళ, పశ్చిమబెంగాల్లో ఆందోళనకారులు పలుచోట్ల రైళ్లను అడ్డుకోగా, బ్యాంకింగ్, బీమా కార్యకలాపాలు పాక్షికంగా నిలిచిపోయాయి. చాలా చోట్ల రవాణా, విద్యుత్ సరఫరా, మైనింగ్ కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. బెంగాల్ లోని హౌరా జిల్లాలో ఆందోళనకారులు ఓ బస్సుపై రాళ్లవర్షం కురిపించారు. కేరళలోని తిరువనంతపురంలో ఎస్బీఐ ట్రెజరీ శాఖపై దాడిచేశారు. తిరువనంతపురం–హైదరాబాద్ శబరి ఎక్స్‌ప్రెస్, వేనాడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆందోళనకారులు తిరువనంతపురంలో అడ్డుకున్నారు. బంద్ నేపథ్యంలో కేరళలో వాణిజ్య సముదాయాలు, షాపులు రెండో రోజూ మూతపడ్డాయి. తమిళనాట కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులు రైళ్లను అడ్డుకోగా, తెలంగాణలోని కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కార్యకలాపాలు స్తంభించాయి. అయితే సామా న్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఆగిపోయిన 20 వేల కోట్ల లావాదేవీలు గోవాలో ప్రైవేటు బస్సులు, ట్యాక్సీల యాజమాన్యాలు బంద్‌లో పాల్గొనడంతో పలువురు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ముంబైలో అక్కడి రోడ్డు రవాణా సంస్థ ‘బెస్ట్’ జీతాల పెంపు సహా పలు డిమాండ్లతో నిరవధిక బంద్‌కు దిగడంతో లక్షలాది మంది ప్రయాణికులు రోడ్లపై పడిగాపులు కాశారు. అలాగే బెంగళూరులో రద్దీగా ఉండే మేజిస్టిక్ బస్టాండ్‌లోనూ వామపక్ష ట్రేడ్ యూనియన్లు బస్సుల రాకపోకల్ని అడ్డుకున్నాయి. ఈ బంద్ లో ఆల్ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసో సియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లా యీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ) పాలొ ్గనడంతో రూ.20,000 కోట్ల విలువైన చెక్కుల లావాదేవీలు నిలిచిపోయాయి. అయితే ప్రభు త్వ రంగ ఎస్బీఐతో పాటు ప్రైవేటు బ్యాంకుల కార్యకలాపాలు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. -
మాయావతి డిమాండ్‌కు తలొగ్గిన ఎంపీ సర్కార్
భోపాల్ : బీఎస్పీ అధినేత్రి మాయావతి హెచ్చరికలతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సర్కార్ దిగివచ్చింది. గతంలో దళిత సంఘాలు పిలుపుతో జరిగిన భారత్ బంద్ సందర్భంగా నమోదైన రాజకీయ కేసులను ఉపసంహరించకుంటే మధ్యప్రదేశ్, రాజస్ధాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలకు మద్దతుపై పునరాలోచిస్తామని మాయావతి హెచ్చరించిన సంగతి తెలిసిందే. దళితుల ఆందోళనల సందర్భంగా నమోదైన కేసులన్నింటినీ ఉపసంహరిస్తున్నట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. యూపీ, రాజస్ధాన్, మధ్యప్రదేశ్ సహా అప్పటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో భారత్ బంద్ నేపథ్యంలో అమాయక దళితులపై కేసులు నమోదు చేశారని, వీటిని మధ్యప్రదేవ్, రాజస్ధాన్‌లో నూతనంగా ఎన్నికైన ప్రభుత్వాలు తక్షణమే ఉపసంహరించాలని మాయావతి సోమవారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అల్టిమేటం జారీ చేశారు. మాయావతి డిమాండ్‌ను మధ్యప్రదేశ్ సర్కార్ అంగీకరించింది. భారత్ బంద్ నేపథ్యంలో అప్పటి బీజేపీ ప్రభుత్వం మోపిన రాజకీయ కేసులన్నింటినీ ఉపసంహరించాలని నిర్ణయించామని న్యాయ, శాసనసభా వ్యవహారాల మంత్రి పీసీ శర్మ పేర్కొన్నారు. -
బంద్ ప్రశాంతం
సాక్షి, వరంగల్ రూరల్: అడ్డూఅదుపు లేకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ విపక్షాలు భగ్గుమన్నాయి. జిల్లావ్యాప్తంగా నిరసన ర్యాలీలతో హోరెత్తించారు. పెరుగుతున్న చమురు ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌లో భాగంగా జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్‌తో పా టు టీడీపీ,సీపీఎం,సీపీఐ, ఇతర ప్రజాసంఘాలు పాల్గొన్నాయి. తెల్లవారుజాము నుంచే విపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి చేరుకున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను నడవకుండా అడ్డుకున్నారు. నర్సంపేట, పరకాల ఆర్టీసీ బస్టాండ్, డిపోల ఎదుట బస్సులు బయటికి రాకుండా నిరసన వ్యక్తం చేశారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకరావాలని డిమాండ్ చేశారు. మండలాల్లో కాంగ్రెస్, టీడీపీ, వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. బంద్ సక్సెస్.. జిల్లాలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రాలతోపాటు మండల కేంద్రాల్లో కూడా వ్యాపార వాణిజ్య సంస్థలు తెరుచుకోలేదు. హోటళ్లు, సినిమాహాళ్లు ముసివేశారు. ఉదయం పూట ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ప్రైవేటు వాహనాలు నడవలేదు. బంద్ కారణంగా ఉదయం విధులకు వెళ్లే ఉద్యోగులు, గమ్యస్థానాలకు వెళ్లే సామాన్య ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రైవేటు వాహనాల యజమానులు అమాంతం ఛార్జీలను పెంచి ప్రయాణికులను తరలించారు. -
ఎక్కడి కక్కడే..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీతోపాటు వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన బంద్ జిల్లాలో విజయవంతమైంది. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, టీడీపీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఖమ్మం డిపో ఎదుట తెల్లవారుజామున బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. అనంతరం బస్టాండ్ వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులకు సర్దిచెప్పి బస్సులను పంపించే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులు ఎంతకూ పోలీసుల మాట వినకపోవడంతో కొన్ని బస్సులను డిపోలో.. మరికొన్నింటిని బస్టాండ్‌లో నిలిపారు. కాంగ్రెస్‌తోపాటు సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీల నేతలు ఉదయం 9 గంటలకు బస్టాండ్ ప్రాంతానికి చేరుకుని ఆందోళనలు నిర్వహించారు. వామపక్షాల ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ యాత్ర నిర్వహించి.. బస్టాండ్ ఎదుట దహనం చేశారు. పలువురు కార్యకర్తలు మోదీ చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ దహనం చేశారు. కాగా.. డిపో ఎదుట బయటకు వచ్చిన బస్సును అడ్డుకుని డిపోలోకి పంపించాలని నినాదాలు చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు, వ్యాపార వర్గాలు, పెట్రోల్ బంక్‌ల యజమానులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. సినిమా హాళ్లు, బ్యాంకులు, బంగారం, బట్టలు, కిరాణా దుకాణాలను ఆందోళనకారులు బంద్ చేయించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని వ్యాపారులు బంద్‌కు మద్దతునివ్వడంతో మార్కెట్లో వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. శాసన మండలి ఉప నాయకుడు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పెరిగిన ధరలకు నిరసనగా జరుగుతున్న బంద్‌లో భాగంగా ఎడ్ల బండిపై నగరంలో ప్రదర్శన నిర్వహించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అనుచర గణంతో బస్టాండ్ ప్రాంతానికి చేరుకోగా.. కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి తన క్యాంపు కార్యాలయం నుంచి ట్రాక్టర్ నడుపుతూ రాగా.. కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక పాలన సాగిస్తూ.. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ కథ సినిమా ట్రైలర్‌లా ఉందని, దీనిని చూసిన వారంతా బాగుంటుందని సినిమాకు వెళ్తే అక్కడ శూన్యమని.. అదే స్థాయిలో కేసీఆర్ పరిపాలన ఉందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని అనేక సార్లు డిమాండ్ చేసినా.. అధికార దాహంతో మోదీతో కలిసి ధరలు తగ్గించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఎమ్మెల్సీ పొం గులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ క్రూడాయిల్ ధరలు తగ్గినా.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోవడం దారుణమన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఇరు ప్రభుత్వాలు సైతం హామీల అమలులో ఘోరంగా విఫలమయ్యాయన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా.. మోదీ సర్కార్ మాత్రం ధరలు పెంచుతూ పోతోందన్నారు. దీనివల్ల సామాన్యుడిపై మోయలేని భారం పడుతోందని, ధరలు తగ్గించకపోతే ప్రభుత్వాలకు తగిన విధంగా గుణపాఠం చెప్పాల్సి వస్తోందని హెచ్చరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంధన ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయన్నారు. రోజువారీ ధరల మార్పును తీసుకొచ్చి.. ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ వారికి లాభాలను చేకూర్చేందుకు దేశంలో సామాన్య ప్రజలపై భారాన్ని మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. బంద్‌లో వివిధ పార్టీల నాయకులు పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్, దిరిశాల భద్రయ్య, మద్ది వీరారెడ్డి, రాపర్తి శరత్, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఫజల్, రాయల నాగేశ్వరరావు, మేళం శ్రీనివాసయాదవ్, రామిశెట్టి మనోహర్‌నాయుడు, కట్ల రంగారావు, నాగండ్ల దీపక్‌చౌదరి, బాలగంగాధర్ తిలక్, టీడీపీ జిల్లా కార్యదర్శి తోటకూరి శివయ్య, నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య, ఆవుల అశోక్, పోటు ప్రసాద్, జానీమియా, తాటి వెంకటేశ్వర్లు, ఎర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి, కల్యాణం వెంకటేశ్వర్లు, సింహాద్రి యాదవ్, గోపాల్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పాక్షికంగా తిరిగిన బస్సులు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బస్సులు పాక్షికంగా తిరిగాయి. కొన్ని ప్రాంతాల్లో బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. ఆందోళనకారులు ఉదయం సమయంలో డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. మధ్యాహ్నం నుంచి బస్సులు బయటకు వచ్చాయి. మధిర, ఖమ్మం తదితర డిపోల ఎదుట ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 634 బస్సులు ఉండగా.. వాటిలో 190 బస్సులు రద్దు చేశారు. 444 బస్సులు తిరిగినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. బంద్ కారణంగా ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీకి రూ.30లక్షల వరకు నష్టం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో ప్రజలు ప్రయాణాలు చేసేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఖమ్మం వచ్చిన ఒకటి, రెండు బస్సులను కాల్వొడ్డు వద్ద అడ్డుకోవడంతో ప్రయాణికులు అక్కడి నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు రెండు, మూడు కిలోమీటర్లు నడిచివెళ్లారు. ఆస్పత్రులకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లావ్యాప్తంగా బంద్.. ఖమ్మం నియోజకవర్గంతోపాటు సత్తుపల్లి, మధిర, వైరా, పాలేరు నియోజకవర్గాల్లో బంద్ ప్రభావం కనిపించింది. కాంగ్రెస్‌తోపాటు సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, టీడీపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. దుకాణాలను బంద్ చేయించారు. సినిమా హాళ్లు మూసివేశారు. చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ఖమ్మం–బోనకల్ ప్రధాన రహదారిపై బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ముదిగొండలో ఖమ్మం–కోదాడ ప్రధాన రహదారిపై ముదిగొండ సెంటర్లో రెండు గంటలపాటు బంద్ నిర్వహించారు. ఏన్కూరు ప్రధాన సెంటర్ నుంచి సాయిబాబా మందిరం వరకు ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన సెంటర్లో రాస్తారోకో చేశారు. సుమారు గంటసేపు రాస్తారోకో చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం జీపునకు తాడుకట్టి లాగి నిరసన తెలియజేశారు. ఎర్రుపాలెంలో కాంగ్రెస్, టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి తహసీల్ వరకు ఆటోకు తాడుకట్టి లాక్కుంటూ వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. -
‘భారత్ బంద్’ పాక్షికం
న్యూఢిల్లీ: పెట్రో ధరల పెంపును నిరసిస్తూ దేశ వ్యాప్తంగా విపక్షాలు సోమవారం నిర్వహించిన భారత్ బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. చెదురుమదురు హింసాత్మక ఘటనలు మినహా మొత్తానికి ప్రశాంతంగా ముగిసింది. కార్యాల యాలు, విద్యాసంస్థలు మూతపడటం, వాహనాలు తిరగకపోవడంతో కేరళ, కర్ణాటక, బిహార్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో జనజీవనానికి అంతరాయం ఏర్పడగా.. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మిజోరాం తదితర రాష్ట్రాల్లో బంద్ ప్రభావం అసలు కనిపించ లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో 21 ప్రతిపక్ష పార్టీలు భారత్ బంద్ చేపట్టగా.. రాంలీలా మైదాన్ వద్ద నిరసన ర్యాలీలో మోదీ ప్రభుత్వంపై రాహుల్ నిప్పులు చెరిగారు. బంద్ విజయవంతమని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రకటించుకోగా.. విఫలమైందని బీజేపీ పేర్కొంది. చెదురుమదురు ఘటనలు బిహార్ రాజధాని పట్నాలో కొన్ని చోట్ల ఆందోళనకారులు రైల్వే ట్రాక్‌లపై టైర్లు మండించి రైలు సర్వీసులకు అంతరాయం కలిగించారు. ఎక్కడికక్కడ వాహనాల్ని అడ్డుకో వడంతో ట్రాఫిక్ స్తంభించింది. పలు ప్రాంతా ల్లో బస్సుల విధ్వంసం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వాహనం ఏర్పాటులో జాప్యం వల్ల జెహనా బాద్ జిల్లాలో మూడేళ్ల చిన్నారి మరణించిందని బీజేపీ ఆరోపించింది. ఒడిశాలో రైల్వే ట్రాక్‌లపై కాంగ్రెస్ కార్యకర్తల బైఠాయింపుతో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. 10 రైళ్లను అధికారులు రద్దు చేశారు. భువనేశ్వర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రోడ్లను దిగ్బంధించ డంతో రవాణాకు తీవ్ర ఆటంకం కలిగింది. దుకాణాలు, మార్కెట్లు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. కేరళలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. బస్సులతో పాటు ఆటోరిక్షాలు కూడా తిరగకపోవడంతో రోడ్లనీ ఖాళీగా దర్శనమి చ్చాయి. కర్ణాటకలో బంద్ ప్రభావం పూర్తిగా కనిపించింది. బెంగళూరులో వ్యాపార సంస్థ లు, దుకాణాలు, మాల్స్, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు తిరగకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. మంగళూరులో తెరచి ఉంచిన దుకాణాలు, హోటల్స్‌పై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత కొనసాగింది. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, ఎంఎన్ఎస్, ఎస్పీ కార్యకర్తలు పలు చోట్ల ధర్నాలు నిర్వహించారు. ముంబైలో సబర్బన్, మెట్రో రైళ్లను అడ్డుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. రోడ్లపై వాహనాలు తిరగలేదు. పలు రాష్ట్రాల్లో ఆందోళన చేస్తున్న వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు పశ్చిమ బెంగాల్లో అన్ని స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలు రోజువారీ కార్యక లాపాల్ని యథావిధిగా కొనసాగిం చాయి. ప్రయాణికుల నిరసనతో జాదవ్‌పూర్ రైల్వే స్టేషన్ వద్ద ఆందోళనకారులు ధర్నాను ఉపసం హరించుకున్నారు. తమిళనాడులో బంద్ ప్రభా వం నామమాత్రంగా కనిపించింది. ఢిల్లీలో కార్యాలయాలు, కళాశాలలు, స్కూళ్లు యథావిధిగా తెరచుకున్నాయి. అయితే ఆందోళనలతో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్ వద్ద సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీతో పాటు పలువురు లెఫ్ట్ నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. అంతర్జాతీయ కారణాలతోనే : కేంద్రం అంతర్జాతీయ అంశాల ప్రభావంతోనే పెట్రో ధరలు పెరిగాయని, భారత్ బంద్ పేరిట ప్రతిపక్షాలు హింసను రేకెత్తించేందుకు ప్రయత్నించాయని బీజేపీ ఆరోపించింది. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలతో ప్రజల తాత్కాలిక ఇబ్బంది తమకు తెలుసని, సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా మని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. పెట్రో ధరల్లో హెచ్చుతగ్గులు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో లేదన్న విషయం ప్రజలు అర్థం చేసుకున్నారని, అందువల్ల బంద్ పిలుపును తిప్పికొట్టారని చెప్పారు. పెట్రో ఉత్పత్తులపై వసూలు చేస్తున్న పన్నుల మొత్తాన్ని సంక్షేమ పథకాల కోసమే ఖర్చు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో పెట్రోలు ధర రూ. 39 నుంచి రూ. 71కి పెరిగిందని ఆయన తప్పుపట్టారు. ప్రతిపక్షాలు ఐక్యంగా సాగాల్సిన తరుణమిది: మన్మోహన్ న్యూఢిల్లీ: దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ వ్యవస్థను కాపాడేందుకు ప్రతిపక్ష పార్టీలు విభేదాల్ని పక్కన పెట్టి కలిసి సాగాల్సిన తరుణం ఆసన్నమైందని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఉద్ఘాటించారు. పెట్రో ధరల పెంపునకు నిరనసగా ప్రతిపక్షాలు చేపట్టిన భారత్ బంద్‌లో భాగంగా ఢిల్లీలోని రాంలీలా మైదానం వద్ద నిర్వహించిన ర్యాలీలో కేంద్రంపై ఆయన విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలు దేశ ప్రయోజనాల కోసం కాదని విమర్శించారు. సమాజంలోని యువత, రైతులు, సామాన్య ప్రజలు ఇలా అందరూ మోదీ ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారని, ప్రజలకిచ్చిన హామీల్ని నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. ‘మోదీ ప్రభుత్వం ఇప్పుడు పరిధి దాటి ప్రవర్తిస్తోంది. ఆ ప్రభుత్వాన్ని మార్చే సమయం ఆసన్నమైంది. పార్టీలు చిన్నచిన్న విభేదాల్ని పక్కనపెట్టి దేశ సమగ్రత, సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సిద్ధమైనప్పుడే అది సాధ్యం’ అని పేర్కొన్నారు. మోదీజీ.. ధరలపై మౌనం వీడండి: రాహుల్ ప్రధాని మోదీ పాలనలో దేశంలో విభేదాలు పెచ్చరిల్లుతున్నాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ప్రతిపక్షాల ఐక్య కూటమి ఓడించడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ర్యాలీలో మాట్లాడుతూ.. పెట్రో ధరల పెరుగుదల, రాఫెల్ ఒప్పందం, రైతుల ఆత్మహత్యలు, మహిళలపై అఘాయిత్యాలు, నిరుద్యోగం వంటి సమస్యలపై ప్రధాని మోదీ మౌనాన్ని రాహుల్ ప్రశ్నించారు. ‘70 ఏళ్లలో జరగనిది ఈ నాలుగేళ్లలో చేశామని మోదీ చెబుతున్నారు. అది నిజమే. ఎక్కడ చూసినా ఒకరితో మరొకరు గొడవలు పడుతున్నారు. ప్రజల మధ్య విభేదాల్ని సృష్టించారు. అదే వారు సాధించింది’ అని తప్పుపట్టారు. ఈ ర్యాలీలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, లోక్తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పట్నాలో బస్సు అద్దాల ధ్వంసం; ఢిల్లీలో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి బెంగళూరులోని మెజెస్టిక్ బస్టాండ్‌లో నిలిచిపోయిన బస్సులు -
పెట్రో షాక్: ఆ పట్టణంలో అత్యధిక ధర
సాక్షి, ముంబై : పెట్రోల్ ధరలు రికార్డు స్ధాయిలో భగ్గుమంటుంటే మహారాష్ట్రలోని పర్బాని పట్టణంలో దేశంలోనే అత్యధికంగా లీటర్ పెట్రోల్ రూ 89.97కు చేరి రికార్డు సృష్టించింది. పెట్రోల్ ధరలు తమ ప్రాంతంలో సోమవారం లీటర్‌కు రూ 90కు చేరువగా, డీజిల్ లీటర్‌కు రూ 77.92 పలికిందని పర్బాని జిల్లా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంజయ్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఇక మహారాష్ట్ర అంతటా పెట్రోల్ ధరలు రూ 88, డీజిల్ ధరలు లీటర్‌కు రూ 76 పలికాయని అఖిల భారత పెట్రోల్ డీలర్ల అసోసియేషన్ ప్రతినిధి అలి దరువాలా పేర్కొన్నారు. కాంగ్రెస్ పిలుపు మేరకు పెట్రో ధరల పెంపునకు నిరసనగా భారత్ బంద్‌లో భాగంగా మహారాష్ట్రలో బంద్ కొనసాగుతోంది. పాలక బీజేపీ-శివసేన మినహా అన్ని పార్టీలు బంద్‌లో పాల్గొన్నాయి. ముంబైలోని అంథేరి స్టేషన్ వెలుపల మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అశోక్ చవాన్, ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ నేతృత్వంలో వేలాది మంది కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. -
నేడు భారత్ బంద్
-
భారత్ బంద్‌కు రాజ్ థాకరే మద్దతు
సాక్షి, ముంబై : ఇంధన భారాలకు వ్యతిరేకంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) మద్దతు ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండటం పట్ల సామాన్య ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, భారత్ బంద్‌లో తమ పార్టీ చురుకుగా పాల్గొంటుందని రాజ్ థాకరే ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. పెట్రో ధరలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులతో మరింత భారమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి ఇష్టాఇష్టాలకు అనుగుణంగా దేశ విధానాలు ఉండటం ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని దుయ్యబట్టారు. నోట్ల రద్దు పర్యవసానాలను చక్కదిద్దుకునేందుకు పెట్రోల్, డీజిల్ ధరలపై భారీగా పన్నులు వడ్డించారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ తప్పిదాలకు సామాన్యుడిపై భారం ఎందుకు మోపుతున్నారని ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రజలంతా రాజకీయ, సిద్ధాంత వైరుధ్యాలను పక్కనపెట్టి బంద్‌లో పాల్గొనాలని కోరారు. -
దీదీపై కాంగ్రెస్ ఫైర్
కోల్‌కతా : పెట్రో భారాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సోమవారం ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ప్రకటించకపోవడంపై కాంగ్రెస్ మండిపడింది. మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ భారత్ బంద్‌పై తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులు ప్రజలపై పెనుభారం మోపుతుండగా, ఇంధనంపై వ్యాట్ వసూలు చేస్తూ తృణమూల్ సర్కార్ పరిస్థితిని మరింత దిగజార్చిందని బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. బంద్‌కు పిలుపు ఇచ్చిన అంశాలను తాము సమర్ధిస్తామని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంటూనే సమ్మెకు తాము వ్యతిరేకమని, భారత్ బంద్ సందర్భంగా జనజీవనం యధావిధిగా సాగేందుకు అన్ని చర్యలూ చేపడతామని పేర్కొంది. సమ్మె కారణంగా ప్రజలకు అసౌకర్యం తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పార్థ్ ఛటర్జీ వెల్లడించారు. మరోవైపు భారత్ బంద్‌కు మద్దతు ఇస్తున్నట్టు ఎన్సీపీ, ఎస్పీ, డీఎంకే సహా పలు విపక్ష పార్టీలు ప్రకటించాయి. -
భారత్ బంద్ : ఉత్తరాదిలో ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ చట్టానికి ఇటీవల చేసిన సవరణను నిరసిస్తూ పలు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం భారత్ బంద్ సందర్భంగా ఉత్తరాదిలో ఉద్రిక్తత నెలకొంది. బిహార్‌లో నిరసనకారులు పలు రైళ్లను నిలిపివేయగా, యూపీ, మధ్యప్రదేశ్‌ల్లో దిష్టిబొమ్మల దహనం చేపట్టారు. బంద్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా బిహార్‌లో విద్యాసంస్థలు, పెట్రోల్ పంపులు మూసివేశారు. బిహార్, జార్ఖండ్‌ల్లో బస్సు సర్వీసులు రద్దయ్యాయి. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించినట్టు పోలీసులు తెలిపారు. దర్భంగా, ముంగర్ మసుదాన్, అర్రాలలో ఆందోళనకారులు రైళ్లను నిలిపివేశారు. 34 కంపెనీల సాయుధ పోలీసు బలగాలను వివిధ జిల్లాల్లో మోహరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న దళిత సంఘాలు పిలుపు ఇచ్చిన భారత్ బంద్‌లో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మరోవైపు మధ్యప్రదేశ్‌లో భారత్ బంద్ ప్రభావం అధికంగా ఉందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు రోడ్లపై టైర్లను దగ్ధం చేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పలు జిల్లాల్లో 144 సెక్షన్ అమలు చేశామని, 35 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించామని పోలీసు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్, యూపీలో వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులు దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. మార్కెట్లు, దుకాణాలు మూతపడ్డాయని, బస్సుల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని అధికారులు తెలిపారు.