న్యూఢిల్లీ: విద్య, ఉద్యోగ రంగాల్లో కుల ఆధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని సంస్థలు మంగళవారం ‘భారత్ బంద్’ను నిర్వహించనున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్రాలను హోంశాఖ ఆదేశించింది. ఎక్కడైనా శాంతిభద్రతలకు భంగం వాటిల్లితే ఆ ప్రాంతానికి చెందిన కలెక్టర్, ఎస్పీలు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఎస్సీ,ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ ఇటీవల దళిత సంఘాలు నిర్వహించిన భారత్ బంద్ హింసాత్మకంగా మారి 12 మంది మరణించడం తెల్సిందే. సోషల్‌మీడియాల్లో కొన్ని సంస్థలు కుల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చాయని హోంశాఖ ఉన్నతాధికారి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment