security alert
-
కంటిపాపలకు కనురెప్పలా...
‘స్వావలంబన దిశగా భవిష్యత్’ అనే థీమ్‌ను నిర్ణయించారు. నేటి బాలికలు భద్రంగా ఉంటేనే భవిష్యత్ సాధికారత సాధ్యమవుతుంది! ఆ భద్రతే నేడు అతి పెద్ద సమస్య! సమస్య ఆలోచనలను రేకెత్తిస్తుంది.. వినూత్న ఆవిష్కరణలు ఆకారం దాల్చేలా చేస్తుంది!అలాంటి యువ ఆవిష్కర్తలనే ఇక్కడ పరిచయం చేయబోతున్నాం.. ఆడపిల్లల భద్రత కోసం వారు రూ΄పొందించిన డివైజెస్‌తో!గణేశ్ రూరల్ ఇన్నోవేటర్. సైన్స్ అండ్ టెక్నాలజీలో అయిదు ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్‌ను సాధించాడు. గణేశ్ ఘనత గురించి తన ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ కూడా ప్రస్తావించారు. కట్టెల΄పొయ్యి మీద వంట చేస్తున్నప్పుడు ఆ ΄పొగను తట్టుకోలేకపోతున్న అమ్మ అవస్థను చూసి ఆమె కోసం తన పదకొండేళ్ల వయసులోనే హ్యాండ్ ఫ్యాన్ తయారు చేసి ఇచ్చాడు. ఆనాడు మొదలైన ఆ ప్రస్థానం నేడు 30కి పైగా ఆవిష్కరణలకు చేరుకుంది. అందులోదే బాలికల భద్రత కోసం రూ΄పొందించిన సంస్కార్ టాయ్. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పాలంటే వారిని ముట్టుకునే చెప్పాల్సి వస్తోంది. వారిని తాకకుండా.. దూరంగానే ఉంటూ చెప్పడమెలా అన్న అతని ఆలోచనకు పరిష్కారమే ‘సంస్కార్ టాయ్’. దీనిపేరు ఆద్య. ఇది మాట్లాడే బొమ్మ. ఆద్యను ఛాతీ ప్రాంతంలో తాకామనుకో.. ‘అక్కడ తాకకూడదు’ అంటూ హెచ్చరిస్తుంది. ఇలా శరీరంలో ఏ స్పర్శ తప్పో.. ఏ స్పర్శ భద్రమో.. ఆద్యను టచ్ చేస్తూ తెలుసుకోవచ్చన్నమాట. భద్రమైన చోట కూడా తాకడం నచ్చకపోతే ఐ మే నాట్ లైక్ అని చెప్పచ్చని చెబుతుంది. అంతేకాదు ఆపదలో ఉన్నప్పుడు ఏం చేయాలో కూడా చెబుతుంది.హెల్ప్‌లైన్ నంబర్లను వల్లె వేస్తుంది. సైబర్ క్రైమ్ గురించి, డ్రగ్స్ హాని గురించీ హెచ్చరిస్తుంది.‘సంస్కార్ టాయ్’ లో బాయ్ వర్షన్ కూడా ఉంది. పేరు ఆదిత్య. అబ్బాయిలకూ అవన్నీ చెబుతుంది. అదనంగా ఆడపిల్లలతో ఎలా మెసలుకోవాలో కూడా చెబుతుంది. అంతేకాదు చూపు, వినికిడి లోపాలున్న పిల్లలకూ సంస్కార్ టాయ్ ఉంది. చూపు లోపం ఉన్నవారికి వైబ్రేట్ అవుతూ టీచ్ చేస్తే, వినికిడి లోపం ఉన్న వాళ్లకు రెడ్, గ్రీన్, ఆరెంజ్ లైట్స్‌తో బోధిస్తుంది. గణేశ్ ఈ బొమ్మను రూపొందించిన (2021) నాటి నుంచి నేటి వరకు తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది, ఉత్తరాది కలుపుకుని మొత్తం అయిదు రాష్ట్రాల్లో, 65 వేల మంది విద్యార్థులకు భద్రత మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు. కొన్ని స్కూల్స్‌కి ఉచితం గానే సేవలందించాడు. త్వరలోనే ఎల్ఎల్ఎమ్ మాడ్యూల్స్‌తో అప్డేట్ అవుతూ ‘సంస్కార్ 2.0’పేరుతో హ్యుమనాయిడ్ రోబోను తయారు చేస్తున్నాడు. ఇది పిల్లలతో ఇంటరాక్ట్ అవుతుంది. ‘చిన్నప్పటి నుంచీ నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్వెన్షన్స్ అంటే ఇష్టం. దీనికి సంబంధించి నాకు ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏమీ లేదు. యూట్యూబ్ చూసే నేర్చుకున్నాను. ఇన్నోవేటివ్ మైండ్‌సెట్ ఉన్నవాళ్లకు ఓ ΄్లాట్‌ఫామ్ తయారు చేయాలన్నదే నా లక్ష్యం. అందుకే ‘సంస్కార్ ఎలక్ట్రానిక్స్’ అనే స్టార్టప్ పెట్టాను. సామాజిక బాధ్యతే నా ప్రధాన ఆశయం! ఆసక్తి ఉన్న విద్యార్థులకి ఫ్రీగానే ట్రైనింగ్ ఇస్తున్నాం. సంస్కార్ టాయ్ తయారు చేయడానికి సైకాలజిస్ట్స్, సైకియాట్రిస్ట్స్, పిల్లల హక్కులు – భద్రత కోసం పనిచేస్తున్న ఎన్జీవోలు వంటి వాళ్లందరినీ కలిసి, రీసెర్చ్ చేసి ఒక కాన్సెప్ట్‌ను తయారు చేసుకున్నాం. మళ్లీ దాన్ని వాళ్లందరికీ చూపించి.. ఓకే అనుకున్నాకే టాయ్‌ని డెవలప్ చేశాం’ అని సంస్కార్ టాయ్ వెనకున్న తన శ్రమను వివరించాడు గణేశ్.సంస్కార్ టాయ్ఆవిష్కర్త: యాకర గణేశ్, వయసు: 25 ఏళ్లు, ఊరు: వరంగల్ జిల్లా, నందనం గ్రామం, తెలంగాణ!తల్లిదండ్రులు: స్వరూప, చంద్రయ్య. వ్యవసాయ కూలీలు. ఇంకా.. తెలంగాణ, వికారాబాద్‌కు చెందిన సానియా అంజుమ్.. ఆడపిల్లల భద్రతకు ‘షీ (ఫర్ అజ్)’ అనే వినూత్న ఆలోచన చేసింది. పీరియడ్స్ టైమ్‌లో ఆడపిల్లల అవసరాలను తీర్చే అన్ని ఎక్విప్మెంట్స్తో ప్రతి స్కూల్లో ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేయాలనేదే‘ షీ’ కాన్సెప్ట్. మంచిచెడులను గైడ్ చేయడానికి, ధైర్యం కోల్పోకుండా అమ్మాయిలను మోటివేట్ చేయడానికి కొంతమంది స్టూడెంట్స్, టీచర్స్‌తో కలిపిన ఒక బృందం, అలాగే క్రమం తప్పకుండా గైనకాలజిస్ట్ విజిట్స్‌ను ఏర్పాటుచేయాలనేది ‘షీ’ ఉద్దేశం! హైదరాబాద్‌కు చెందిన హరీష్ గాడీ అనే అబ్బాయి.. ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ బ్యాంగిల్‌ని తయారుచేశాడు. ఇది మామూలు గాజునే పోలి ఉంటుంది. దీన్ని వేసుకుంటే.. దాడి చేసిన వాళ్లకు ఆ గాజు తగిలి షాక్‌నిస్తుంది. అంతేకాదు అందులో ఫీడ్ అయి ఉన్న నంబర్లకు మీరున్న లొకేషన్ కూడా వెళ్తుంది. దీన్ని కనిపెట్టినందుకు హరీష్‌కి ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్ (2019) లో గోల్డ్ మెడల్ వచ్చింది. ఆదిలాబాద్‌కు చెందిన ఎ. సాయి తేజస్వి ‘గర్ల్ సేఫ్టీ డివైస్’ను కనిపెట్టింది. చాలా తేలికగా ఉండే ఈ పరికరాన్ని కాలికి కట్టుకొని స్టార్ట్ బటన్ నొక్కేయాలి. ఎమర్జెన్సీ టైమ్‌లో యాక్టివేట్ అయ్యి మిమ్మల్ని టచ్ చేసిన వాళ్లకు షాక్‌నిస్తుంది. దాంతో దుండగులు మిమ్మల్ని ముట్టుకునే సాహసం చేయరు. సికింద్రాబాద్‌కు చెందిన వైష్ణవి చౌధరీ, మనోజ్ఞ సిద్ధాంతపు, నక్షత్ర పసుమర్తి.. ఈ ముగ్గురూ కలిసి ‘మహిళా సురక్షా బ్యాండ్’ను తయారుచేశారు. ఇది కూడా ఎవరైనా మీ మీద దాడికి పాల్పడితే వాళ్లకు షాక్‌నిస్తుంది. పెద్దగా డేంజర్ అలారమ్‌ని మోగిస్తుంది. మీరు ఆపదలో ఉన్న సందేశంతోపాటు మీ లొకేషన్‌నీ అందులో ఫీడైన నంబర్లకు షేర్ చేస్తుంది. ఈ డివైస్ చూడ్డానికి స్టయిలిష్‌గానూ ఉంటుంది. ఇలా అమ్మాయిల భద్రత కోసం యువత తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. మహిళల సాధికారతకు మద్దతునిస్తోంది. బాలికలకు మన దగ్గరున్న న్యాయపరమైన హక్కులు→ గర్భస్థ పిండం ఆడ, మగ అని తెలుసుకోవడం నేరం. తెలుసుకుని ఆడ శిశువును గర్భంలోనే చంపేయడం మరింత నేరం. → అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు చదువుకునే హక్కుంది. ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, 2009.. ఆరు నుంచి పద్నాలుగేళ్ల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య హక్కును కల్పిస్తోంది. ఇది పిల్లలందరికీ వర్తిస్తున్నా.. బాలికా విద్యనూ ప్రోత్సహిస్తోంది. → ఆడపిల్లలు సహా పిల్లలందరికీ సురక్షిత వాతావరణంలో పెరిగే హక్కుంది. → గృహ హింస చట్టం మహిళలకే కాదు బాలికలకూ వర్తిస్తుంది. ఆడపిల్లల మీద కుటుంబ సభ్యులు ఎలాంటి శారీరక, భావోద్వేగ, లైంగిక, ఆర్థిక వేధింపులు, హింసకు పాల్పడినా అది నేరమే! → ‘స్త్రీ ధన్’ పేరుతో అమ్మాయిలకు స్థిర, చరాస్తుల్లో హక్కుంటుంది. అంతేకాదు వారసత్వంగా వచ్చే ఆస్తిలోనూ అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు హక్కు ఉంటుంది. → బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం.. పద్దెనిమిదేళ్లు నిండని అమ్మాయిలకు పెళ్లి చేయడం నేరం. ∙ ఇంటా.. బయటా.. ఎక్కడైనా అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేయడం, లైంగిక దాడితోపాటు వారి మీద అసభ్యపదజాలాన్ని ఉపయోగించడం, అసభ్యకరమైన సంజ్ఞలు చేయడం, అసభ్యకరమైన చిత్రాలు చూపించడం, ప్రైవేట్ పార్ట్స్ తాకడం వంటివన్నీ నేరాలే! ఇలాంటి వాటిని అరికట్టేందుకు పిల్లలందరి (బాలికలు సహా) కోసం పోక్సో అనే ప్రత్యేక చట్టమే ఉంది.విమెన్ సేఫ్టీ హెయిర్ రబ్బర్ బ్యాండ్ఆవిష్కర్త: ఎస్. పూజ, చదువు: బీటెక్ సెకండియర్, ఊరు: కరీంనగర్ జిల్లా, మానకొండూరు, తెలంగాణ. తల్లిదండ్రులు: సుమిత్ర (గృహిణి), రమేశ్ (బైక్ మెకానిక్). వయసుతో సంబంధం లేకుండా స్త్రీల మీద జరుగుతున్న దాడులు, వాళ్లకు భద్రత, రక్షణ లేకపోవడం వల్ల చాలామంది అమ్మాయిలు చదువుకు దూరమవడం వంటివన్నీ వినీ, చూíసీ చలించిపోయింది పూజ. తనకు చేతనైనంతలో ఆ సమస్యకో పరిష్కారం కనిపెట్టాలనుకుంది. అదే ‘విమెన్ సేఫ్టీ హెయిర్ రబ్బర్ బ్యాండ్!’ ఇదెలా పనిచేస్తుందంటే.. జడకు మామూలు రబ్బర్ బ్యాండ్‌ని ఎలా పెట్టుకుంటారో దీన్నీ అలాగే పెట్టుకోవాలి. ఆపద ఎదురైనప్పుడు ఆ రబ్బర్ బ్యాండ్‌ను నొక్కితే చాలు.. వెంటనే పోలీస్ హార్న్ సౌండ్ వస్తుంది. ఆ శబ్దానికి భయపడి ఈవ్‌టీజర్స్, దుండగులు పారిపోతారు. ఒకవేళ వాళ్లు వెళ్లకుండా ఇంకా ఇబ్బంది పెడుతుంటే.. ఆ బ్యాండ్ ను మరొకసారి నొక్కాలి. అప్పుడు ఆ ప్రదేశానికి దగ్గరలో ఉన్న షీ టీమ్ ఆఫీస్‌కి ‘ఆపదలో ఉన్నాను.. రక్షించండి..’అన్న వాయిస్ మెసేజ్ వెళ్తుంది. అంతేకాదు, మీరున్న లైవ్ లొకేషన్‌నూ చూపిస్తుంది. వాటి ఆధారంగా షీ టీమ్ అలర్ట్ అయ్యి రక్షిస్తారు. ‘సమాజంలో అమ్మాయిలకు భద్రత, రక్షణ లేక వాళ్లు చాలా రంగాల్లోకి అడుగుపెట్టలేక పోతున్నారు. శక్తిసామర్థ్యాలున్నా రాణించలేకపోతున్నారు. ఆమె లక్ష్యానికి భద్రత, రక్షణలేములు ఆటంకాలు కాకూడదు అనిపించి ఈ హెయిర్ రబ్బర్ బ్యాండ్‌ను తయారు చేశాను’ అని చెబుతుంది పూజ.బాలికలకు మన దగ్గరున్న న్యాయపరమైన హక్కులు∙గర్భస్థ పిండం ఆడ, మగ అని తెలుసుకోవడం నేరం. తెలుసుకుని ఆడ శిశువును గర్భంలోనే చంపేయడం మరింత నేరం. ∙అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు చదువుకునే హక్కుంది. ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, 2009.. ఆరు నుంచి పద్నాలుగేళ్ల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య హక్కును కల్పిస్తోంది. ఇది పిల్లలందరికీ వర్తిస్తున్నా.. బాలికా విద్యనూప్రోత్సహిస్తోంది. ∙ ఆడపిల్లలు సహా పిల్లలందరికీ సురక్షిత వాతావరణంలో పెరిగే హక్కుంది. ∙ గృహ హింస చట్టం మహిళలకే కాదు బాలికలకూ వర్తిస్తుంది. ఆడపిల్లల మీద కుటుంబ సభ్యులు ఎలాంటి శారీరక, భావోద్వేగ, లైంగిక, ఆర్థిక వేధింపులు, హింసకు పాల్పడినా అది నేరమే! ∙ ‘స్త్రీ ధన్’ పేరుతో అమ్మాయిలకు స్థిర, చరాస్తుల్లో హక్కుంటుంది. అంతేకాదు వారసత్వంగా వచ్చే ఆస్తిలోనూ అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు హక్కు ఉంటుంది. ∙ బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం.. పద్దెనిమిదేళ్లు నిండని అమ్మాయిలకు పెళ్లి చేయడం నేరం. ∙ ఇంటా.. బయటా.. ఎక్కడైనా అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేయడం, లైంగిక దాడితోపాటు వారి మీద అసభ్యపదజాలాన్ని ఉపయోగించడం, అసభ్యకరమైన సంజ్ఞలు చేయడం, అసభ్యకరమైన చిత్రాలు చూపించడం, ప్రైవేట్ పార్ట్స్ తాకడం వంటివన్నీ నేరాలే! ఇలాంటి వాటిని అరికట్టేందుకు పిల్లలందరి (బాలికలు సహా) కోసం పోక్సో అనే ప్రత్యేక చట్టమే ఉంది.– సరస్వతి రమ -
దలైలామా భద్రతపై అలర్ట్.. పోలీసుల అదుపులో ‘చైనా మహిళ’
పట్నా: బౌద్ధమత గురువు దలైలామా బిహార్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రం బుద్ధగయాలో పర్యటిస్తున్నారు. మూడురోజుల పాటు సాగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. దలైలామా పర్యటన వేళ భద్రతాపరమైన అలర్ట్ ప్రకటించారు పోలీసులు. దలైలామాపై గూఢచర్యానికి పాల్పడుతోందన్న అనుమానాలతో చైనాకు చెందిన ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆమెను తిరిగి చైనా పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దలైలామా పర్యటన వేళ చైనా మహిళ అనుమానాస్పద కదలికలపై గురువారం స్థానిక పోలీసులను అలర్ట్ చేశారు అధికారులు. ఆమె ఆనవాళ్లను సూచించే ఊహాచిత్రాన్ని విడుదల చేశారు. ఆమె పేరు సాంగ్ షియావోలాన్ అని పోలీసులు తెలిపారు. టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు హాని తలపెట్టేందుకు వచ్చినట్లు అనుమానిస్తున్నామని వెల్లడించారు. ‘గయాలో నివసిస్తున్న చైనా మహిళ గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందింది. ఆమె గత రెండేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో పోలీసులను అప్రమత్తం చేశాం. చైనా మహిళ కోసం తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చైనా మహిళ ఎక్కడ ఉందనే విషయంపై స్పష్టత లేదు. ఆమె చైనా గూఢచారి అనడాన్ని కొట్టిపారేయలేం.’ అని తెలిపారు గయా సీనియర్ ఎస్పీ హర్‌ప్రీత్ కౌర్. ఆమె ఊహాచిత్రాలు బుధవారం నుంచి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. చైనా మహిళ గురించి తెలిసిన వారు సమాచారం అందివ్వాలని పోలీసులు కోరుతున్నారు. చైనా గూఢచారి అయిన ఆ మహిళ బుద్ధగయాతో పాటు పలు ప్రాంతాల్లో ఏడాదికిపైగా నివసిస్తున్నట్లు తెలిసింది. అయితే, విదేశాంగ శాఖ వద్ద ఆమె గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. బుద్ధగయాకు గత వారు చేరుకున్నారు దలైలామా. కోవిడ్-19 కారణంగా బుద్ధ పర్యటక ప్రాంతమైన బుద్ధగయాను రెండేళ్ల తర్వాత సందర్శించారు. గయా అంతర్జాతీయ విమానాశ్రయానికి డిసెంబర్ 22న చేరుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్ త్యాగరాజన్, ఎస్పీ హర్‌ప్రీత్ కౌర్ ఘన స్వాగతం పలికారు. డిసెంబర్ 29-31 వరకు జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందులో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వేలాది మంది బౌద్ధ సన్యాసులు ఇప్పటికే బిహార్‌కు చేరుకున్నారు. ఇదీ చదవండి: బెంగాల్ కేబినెట్ మంత్రి ఆకస్మిక మృతి.. మమతా బెనర్జీ దిగ్భ్రాంతి -
మునావర్ కామెడీ షో: శిల్పకళా వేదిక వద్ద టెన్షన్.. టెన్షన్
స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షో.. తెలంగాణలో టెన్షన్‌కు క్రియేట్ చేసింది. మునవార్ షోను అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, మునావర్ షో విషయంలో అలర్ట్ అయిన పోలీసులు.. షోను గంట ముందే ప్రారంభించేలా ప్లాన్ చేశారు. దీంతో, శిల్పకళా వేదికలో మునావర్ షో సాయంత్రం 5 గంటలకే ప్రారంభమైంది. శిల్పకళా వేదికలో మునావర్ షో ముగిసింది. దాదాపు గంటన్నరపాటు షో కొనసాగింది. ఇక, బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు విడతలవారీగా శిల్పకళా వేదిక వద్దకు తరలివస్తుండటంతో అక్కడ టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. దీంతో అక్కడ బందోబస్తు పోలీసులకు సవాల్‌గా మారింది. ఇప్పటి వరకు దాదాపు 50 మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. మునావర్ ఫరూఖీ కామెడీ షో కోసం.. దాదాపు 2083 మంది శిల్పకళావేదికలో టికెట్ బుక్ చేసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు అక్కడికి వస్తున్న నేపథ్యంలో దాదాపు 200 మంది పోలీసులు మఫ్టీలో గస్తీ కాస్తున్నారు. మునావర్ కామెడీ షోపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి స్పందించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ వల్లే మునావర్ షో చేస్తున్నారు. మా కార్యకర్తలను కొట్టి అరెస్ట్ చేశారు. పోలీసు స్టేషన్లో మా సైన్యాన్ని బంధించారు అని అన్నారు. -
జో బైడెన్ ఇంటి వద్ద విమాన కలకలం.. వైట్ హౌస్ అలర్ట్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నివాసం వద్ద ఓ విమానం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై వైట్ హౌస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఒక చిన్న విమానం అమెరికా అధ్యక్షుడికి చెందిన రెహోబోత్ బీచ్ హోమ్ ప్రాంతం(వాషింగ్టన్కు 200 కి.మీ దూరం) గగనతలంలోకి ప్రవేశించింది. నో-ఫ్లై జోన్లోకి విమానం రావడంతో ఒక్కసారిగా భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. దీంతో, ముందు జాగ్రత్త చర్యగా అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలిపారు. అయితే, ప్రెసిడెంట్‌ను రక్షించే బాధ్యతను స్వీకరించిన సీక్రెట్ సర్వీస్ విమానం.. పొరపాటున సురక్షిత ప్రాంతంలోకి ప్రవేశించిందని చెప్పారు. సమాచారం అందించిన వెంటనే విమానం బయటకు వెళ్లినట్టు స్పష్టం చేశారు. కాగా, ప్రెసిడెంట్, ఆయన కుటుంబానికి ఎలాంటి ముప్పులేదని, ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని సర్వీస్ ప్రతినిధి ఆంథోనీ గుగ్లియెల్మీ చెప్పారు. President Biden and the First Lady were evacuated from their beach home in Rehoboth Beach, after a private plane entered restricted airspace, a White House official told pooler @DJJudd Officers shut down one side of the street downtown while Biden was in secure location pic.twitter.com/r4jbs4RyYb — Jasmine Wright (@JasJWright) June 4, 2022 -
గణతంత్ర వేడుకలకు ఉగ్రవాద ముప్పు?
-
గణతంత్ర వేడుకలపై ఉగ్ర కుట్ర.. ప్రధాని ప్రాణాలకు ప్రమాదం!
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల్ని భగ్నం చేయడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్టుగా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర ప్రతినిధులు లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఉగ్రమూకలతోనే ముప్పు పొంచి ఉందని, రద్దీ ప్రాంతాలు, ప్రముఖ కట్టడాలు, బహిరంగ ప్రదేశాల్లో దాడులు జరపడానికి ఉగ్ర సంస్థలు పన్నాగాలు పన్నుతున్నట్టుగా ఇంటెలిజెన్స్ అధికారులు తొమ్మిది పేజీల నివేదికని కేంద్రానికి పంపారు. డ్రోన్లతో దాడులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ఆ నివేదిక హెచ్చరించింది. దీంతో ఢిల్లీలో భద్రతని కట్టుదిట్టం చేశారు. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 15 వరకు హాట్ ఎయిర్ బెలూన్లు, పారాగ్లైడ్, యూఏవీలను రాజధాని పరిధిలో నిషేధించినట్టుగా మంగళవారం ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేశ్ ఆస్తానా చెప్పారు. డ్రోన్లను ఎదుర్కొనే సామర్థ్యమున్న వ్యవస్థలను రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. అదనపు భద్రత కోసం అత్యంత ఎల్తైన భవంతులపై పోలీసు సిబ్బందిని మోహరిస్తారు. వేడుకలపై కోవిడ్ ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 2 లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో భారీ ఆంక్షల మధ్య గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. ఈ ఏడాది 5,000–8,000 మందికి మాత్రమే వేడుకలకు అనుమతించాలని భావిస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రత్యేక అతిథులెవరూ లేకుండానే వేడుకలు నిర్వహించాలని యోచిస్తున్నట్టుగా రక్షణ శాఖ వెల్లడించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికే వేడుకలకి హాజరవడానికి అనుమతి ఉంటుంది. చిన్నారుల్ని వేడుకలకి దూరంగా ఉంచనున్నారు. ఈసారి పరేడ్‌ను అరగంట ఆలస్యంగా ప్రారంభించాలని నిర్ణయించారు. ఉదయం 10 గంటలకు బదులుగా 10.30కి వేడుకలు మొదలవుతాయి. రాజ్‌పథ్‌లో 10 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తారు. చదవండి: జంతువులపై ప్రేమ.. ప్రధాని వరకు తీసుకెళ్లింది శకటాల ఎంపిక నిపుణుల కమిటీదే : రాజ్‌నాథ్ తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ శకటాల ప్రదర్శనకు ఈ ఏడాది అనుమతి లభించకపోవడంపై వివాదం నెలకొంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీలు ఉద్దేశపూర్వకంగానే తమ రాష్ట్రాల శకటాలను తిరస్కరించారన్న ఆరోపణలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. శకటాల ఎంపికను నిపుణుల కమిటీ చేస్తుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు స్టాలిన్, మమతలకు లేఖ రాశారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 29 ప్రతిపాదనలు వస్తే 12 మాత్రమే ఆమోదం పొందాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక నేతాజీ సుభాష్ చంద్రబోస్ థీమ్‌పై శకటాన్ని రూపొందిస్తే తిరస్కరించారంటూ ఘాటుగా విమర్శించిన మమతకు బదులిస్తూ నేతాజీకి నివాళిగా ఆయన జయంతి జనవరి 23 నుంచి ఉత్సవాలు ప్రారంభిస్తున్నట్టు వివరించారు. చదవండి: ఈడీ దాడుల కలకలం.. పంజాబ్ సీఎం మేనల్లుడి ఇళ్లల్లో సోదాలు -
పండక్కి ఊరెళుతున్నారా?
‘అవును, మా ఇంట్లో అందరం కలిసి మా అమ్మమ్మగారి ఊరెళుతున్నాం. భలే ఆనందంగా ఉంది..’ అంటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్.. వంటి యాప్‌ల వేదికగా ఔత్సాహికులు చెబుతుంటారు. సన్నిహితులు, స్నేహితుల మధ్య తమ ఆనందాలను పంచుకోవాలనుకోవడం బాగానే ఉంటుంది. కానీ, ఈ విధానాల ద్వారా ‘ఫలానా వారి ఇంట్లో ఎవరూ లేరు’ అనే సందేశం పంపి, దొంగలకు మీ ఇంటి ‘కీ’ మీరే ఇచ్చినట్టవుతుంది. ఎంగేజ్మెంట్, విడాకులు, గర్భం దాల్చడం.. వంటివన్నీ సోషల్‌మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. చాలా మంది సోషల్ నెట్‌వర్క్‌లలో రిలేషన్షిప్ స్టేటస్‌లను ప్రకటించడం, అభిప్రాయాలను వ్యక్తపరచడం, తప్పులను అంగీకరించడం వరకే కాదు ‘స్వలింగ సంపర్కులం’ అంటూ లైంగిక గుర్తింపునూ ప్రకటిస్తున్నారు. అడ్డుకట్ట అవసరం పై వ్యక్తికరణలతో ఆన్లైన్ పరువు నష్టం, ట్రోలింగ్ భావప్రకటనా స్వేచ్ఛపై స్వల్ప, దీర్గకాలిక ప్రభావాలను చూపుతున్నాయి. ఆన్లైన్ దుర్వినియోగం మానసిక, శారీరక ఒత్తిడులను కలిగిస్తుంది. వ్యక్తిగత బ్రాండ్ గుర్తింపు. విశ్వసనీయత, ఆర్థికపరమైనవే కాకుండా ఇతర విపరిణామాలకూ దారితీసే అవకాశాలే ఎక్కువున్నాయి. ఇటీవలి కాలంలో పోస్ట్‌లకు ప్రత్యుత్తరాలు, వ్యాఖ్యల ద్వారా సాంకేతిక దుర్వినియోగం అమితంగా జరుగుతోంది. మన ప్రొఫైలింగ్‌పై మన అదుపు ఉండటం లేదు. భావవ్యక్తీకరణకు హద్దులే లేనట్టుగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు చూస్తుంటే ఈ ప్రవాహాలకు అడ్డుకట్ట వేయడం తప్పనిసరి అని స్పష్టం అవుతుంది. అతి అనర్థమే! మన రెజ్యూమ్ చూసి జాబ్ ఎలా ఇస్తారో.. ప్రస్తుత రోజుల్లో మీ సోషల్ ప్రొఫైలింగ్ చూసి కంపెనీల యాజమాన్యాలు ఉద్యోగులను ఎంచుకుంటున్నారనే విషయాన్నీ గుర్తుంచుకోవాలి. మనదైన సృజనను, ఉత్పత్తిని నలుగురితో పంచుకోవడానికి, ప్రోత్సాహం లభించడానికి సోషల్ మీడియా మంచి మార్గం. ప్రజలు కూడా మన గురించి సానుకూలంగా ఆలోచించేలా చేయడానికి ఇది గొప్ప మార్గంగా ఎంచుకుంటున్నారు. పాత స్నేహితులతో సన్నిహితంగా ఉండటానికి సరైన మార్గమైంది సోషల్ మీడియా. సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారో గమనించవచ్చు. సోషల్ మీడియాలో పరస్పర చర్యల ఆధారంగా వ్యక్తి ప్రతి ప్రవర్తనా అంశాన్ని డాక్యుమెంట్ చేస్తుంది. దీనివల్ల సాంకేతిక సంస్థలు గతంలో మీరు వాడిన మీ వ్యక్తిగత పదాలు, చర్యలు, సంభాషణలు, ఫొటోలను దొంగిలించి, ఆ పై వాటిని పబ్లిక్ చేసే అవకాశాలు లేకపోలేదు. వాటిని తిరిగి నలుగురిలో పంచి, అవమానించే సందర్భాలూ కూడా ఉంటాయి. ఈ రోజుల్లో క్లిక్‌ల ద్వారా డబ్బు సంపాదన ఓ మార్గమైంది. ఎన్ని ఎక్కువ క్లిక్‌లు వస్తే ప్రకటనల ఆదాయం అంత పెరుగుతుంది.. కాబట్టి ‘ఫేమస్’ జాబితాలో ఉండాలనుకొని అడ్డూ ఆపు లేకుండా భావ వ్యక్తీకరణ జరుగుతోంది. గోప్యత తప్పనిసరి సోషల్ మీడియాలో ఎక్కువ సమాచారాన్ని పంచుకోవడం వల్ల సైబర్‌స్టాకింగ్, లైవ్ లొకేషన్ డిస్క్లోజర్, సోషల్ ప్రొఫైలింగ్, ఫిషింగ్, ఐడెంటిటీ థెప్ట్, బ్లాక్‌మెయిలింగ్, వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడం,సెర్చ్ వారెంట్ లేకుండా ప్రభుత్వం వారిని తమ అధీనంలోకి తీసుకోవడం వంటివి .. ఇటీవల సమస్యలకు దారితీస్తుంది. ఈ–ప్లాట్‌ఫారమ్‌లను సరిగ్గా నిర్వహించకపోతే అవి మన జీవితాలను నాశనం చేస్తాయి. సోషల్ మీడియాను అధికంగా వినియోగించడం కారణంగా డిజిటల్, వ్యక్తిగత, ఆరోగ్య శ్రేయస్సు సమస్యలపై ఆందోళన పెరుగుతుంది. ఈ–ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారులను గందరగోళానికి గురి చేశాయి. సోషల్ మీడియా విధానం ఎలా ఉందంటే గోప్యతగా ఉండాల్సినదంతా బయటపెట్టాల్సిందే అన్నట్టుగా ఉంటోంది. వ్యక్తులను నిరోధించే మార్గం, ఇంటర్నెట్లో శాశ్వతంగా తొలగించేది లేదు. ఒకవేళ మీరు సెలబ్రిటీ లేదా వ్యాపారి లేదా రాజకీయ పార్టీ సభ్యుడు లేదా సామాజిక కార్యకర్త అయితే తప్ప మీ సోషల్ మీడియా ఖాతాలను ‘ప్రైవేట్’గా ఉంచడం తెలివైన పని. సోషల్ మీడియాలో మెరుగ్గా ఉండాలంటే.. ►Google రివర్స్ ఇమేజ్ చెక్ చేయండి. లేదా ఫొటో వెరిఫికేషన్ కోసం www.tineye.com ని ఉపయోగించండి. ►ఫొటో లేదా వీడియో ((https://www.invid-project.eu/tools-and-services/invid-verification-plugin/) బ్రౌజింగ్ కోసం ఇన్విడ్ టూల్ కిట్ ఎక్స్టెషన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ►సమాచారాన్ని పంచుకోవడం నియంత్రించడానికి కుకీలను బ్లాక్ చేయాలి. లేదంటే గోప్యతా సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయాలి. ►సోషల్‌మీడియాలో షేర్ చేసే వ్యక్తిగత సమాచారాన్ని పరిమితం చేయాలి. అజ్ఞాత లేదా ప్రైవేట్ మోడ్‌లో బ్రౌజ్ చేయాలి. ►అవసరమైతే వర్చువల్ ప్రైవేట్నెట్వర్క్ (VPN)ని ఉపయోగించాలి. ►వెబ్సైట్, రూటర్ యాడ్–బ్లాక్‌లను ఉపయోగించాలి. ►ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్తో మెసేజ్ అప్లికేషన్లను ఉపయోగించాలి. ►పెద్ద అక్షరం, ప్రత్యేక అక్షరాలతో సంక్లిష్టమైన పాస్‌వర్డ్‌ను ఉపయోగించాలి. ►రెండు కారకాల ప్రమాణీకరణ, సురక్షిత క్లౌడ్‌ను సెటప్ చేసుకోవాలి. ►మీరు క్లిక్ చేసే లింక్ విషయంలో జాగ్రత్త అవసరం.https:// (ప్యాడ్‌లాక్ సింబల్)మాత్రమే ఉపయోగించి వెబ్సైట్లను సెర్చ్ చేయండి. – ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఇతర యాప్స్‌ను సైన్ ఔట్ చేయండి. ►హానికరమైన దాడులను నిరోధించాలంటే ప్రతి లింక్‌నూ క్లిక్ చేయకుండా ఉండటమొక్కటే ఉత్తమ మార్గం. ►ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ మెసెంజర్లను ఉపయోగించవచ్చు. ►ఆన్లైన్లో సున్నితమైన సమాచారాన్ని అంటే ఆర్థిక, లాగిన్ ఆధారాలు మొదలైన వాటిని ఎప్పుడూ షేర్ చేయవద్దు. ►నిజ జీవితంలో మీకు తెలిసిన వ్యక్తులు, నమ్మకం కలిగిన వ్యక్తులతో మాత్రమే కనెక్ట్ అవ్వడం మంచిది. ►ఆన్లైన్–ఆఫ్‌లైన్ పరస్పర చర్యలు ఒకే విధంగా ఉండేలా జాగ్రత్తపడాలి. -
వేర్పాటువాద నాయకుడు గిలానీ మృతి, సంతాపదినంగా ప్రకటించిన పాక్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నాయకుడు, నిషే ధిత జమాత్-ఈ-ఇస్లామీ సభ్యుడు, హురియత్ కాన్ఫరెన్స్ మాజీ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ(92) మృతి చెందారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీనగర్‌లో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న గిలానీ గత ఏడాది రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 2008 నుంచి కూడా గిలానీ గృహనిర్బంధంలో ఉన్నారు. హురియత్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ పదవికి గతేడాది ఆయన రాజీనామా చేశారు. మొదట ఆయన జమాతే ఈ ఇస్లామి కశ్మీర్ సభ్యుడిగా ఉన్నారు. మరోవైపు గిలానీ మృతిపట్ల పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ నేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. కశ్మీర్లో భద్రత కట్టుదిట్టం గిలానీ మరణంతో కశ్మీర్ లోయలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించడంతోపాటు మొబైల్ సేవలను కూడా నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యగా శ్రీనగర్, ఇతర ప్రధాన నగరాల్లో భద్రతా దళాలను మోహరించాలని అధికారులు ఆదేశించారు. వాహనాల రాకపోకలకు అనుమతి లేదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు గిలానీ మృతిపై పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ట్విటర్ ద్వారా సంతాపం ప్రకటించారు. అంతేకాదు ప్రజల కోసం తన జీవితాన్ని ధారపోసిన గిలానీని భారత ప్రభుత్వం వేదించిందని ఆరోపించారు. ఆయనకు నివాళిగా ఈ రోజు పాక్ జెండాను అవనతం చేసి, అధికారిక సంతాప దినంగా పాటిస్తామని ఇమ్రాన్ ట్వీట్ చేశారు. Saddened by the news of Geelani sahab’s passing away. We may not have agreed on most things but I respect him for his steadfastness & standing by his beliefs. May Allah Ta’aala grant him jannat & condolences to his family & well wishers. — Mehbooba Mufti (@MehboobaMufti) September 1, 2021 We in Pakistan salute his courageous struggle & remember his words: "Hum Pakistani hain aur Pakistan Humara hai". The Pakistan flag will fly at half mast and we will observe a day of official mourning. — Imran Khan (@ImranKhanPTI) September 1, 2021 -
పార్లమెంట్.. హై అలర్ట్
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణం మంగళవారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్ర దాడుల నిరోధక వ్యవస్థ అలర్ట్ అయింది. ఒక ఎంపీ కారు పార్లమెంట్ ప్రాంగణంలోని సెక్యూరిటీ బ్యారియర్‌ను ప్రమాదవశాత్తూ గుద్దుకోవడంతో ఇంత హంగామా చోటు చేసుకుంది. ఉదయం 9 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి స్థానం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకర్‌కు చెందిన ఇన్నోవా కారు అనుకోకుండా సెక్యూరిటీ బ్యారియర్‌ను ఢీ కొంది. దీంతో సీఆర్పీఎఫ్ దళాలు ఎంపీల ప్రవేశ ద్వారాన్ని స్వాధీనంలోకి తీసుకున్నాయి. ‘కారు.. బూమ్ బ్యారియర్‌ను ఢీకొంది. దాంతో, ఆకస్మిక దాడులను ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన భద్రత వ్యవస్థ అప్రమత్తమైంది’ అని సెక్యూరిటీ అధికారి ఒకరు వివరించారు. కాగా, ఘటన జరిగినప్పుడు ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ కారులో ఉన్నారా, లేదా అనేది స్పష్టం కాలేదు. (చదవండి: రెండో రోజూ.. ‘షేమ్’ సీన్) -
పకడ్బందీగా కౌంటింగ్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్‌ను ఈ నెల 23వ తేదీన పకడ్బందీగా చేపట్టనున్నట్లు ఖమ్మం పార్లమెంటరీ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్‌తో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, వాటిలో ఖమ్మం మినహా మిగతా ఆరు నియోజకవర్గాల్లో ఈవీఎంల కౌంటింగ్ ఉదయం 8 గంటలకే ప్రారంభమవుతుందన్నారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనంతరం 8.30 గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశామని, ఖమ్మం నియోజకవర్గానికి 23 రౌండ్స్, పాలేరుకు 20, మధిర 19, వైరా 17, సత్తుపల్లి 20, కొత్తగూడెం 18, అశ్వారావుపేట నియోజకవర్గానికి 14 రౌండ్లుగా నిర్ణయించామని చెప్పారు. ఒక్కో టేబుల్‌కు అభ్యర్థికొకరు చొప్పున ఏజెంట్ కూడా లెక్కింపులో ఉంటారని, లెక్కింపు కోసం 127 మంది కౌంటింగ్ అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్వైజర్లు 128 మంది, మైక్రో అబ్జర్వర్లు 128 మంది ఉంటారని తెలిపారు. ఈవీఎంల కౌంటింగ్ అనంతరం ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి ఐదు వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కించనున్నట్లు వివరించారు. ఒక వేళ ఏమైనా తేడా వస్తే చివరిగా వీవీ ప్యాట్ల స్లిప్పుల ఓట్లనే పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1683 ఉండగా.. 830 మంది ఓట్లు వేశారని, సర్వీస్ ఓటర్లు 715కి 431మంది ఓట్లు వేశారని పేర్కొన్నారు. కాగా, కౌంటింగ్ కేంద్రంలో అభ్యర్థులు, ఏజెంట్లు, అధికారులకు సంబంధించిన ఫోన్ల అనుమతి లేదని స్పష్టం చేశారు. జిల్లాలో 15,13,094 మంది ఓటర్లు ఉండగా 11,38,130 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 75.22 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. ఓట్ల లెక్కింపు ఫలితాలను రౌండ్ల వారీగా తెలియజేస్తామని, అంతిమ ఫలితం మాత్రం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోని ఐదు వీవీ ప్యాట్ స్లిప్‌ల లెక్కింపు అనంతరం మాత్రమే ప్రకటించనున్నట్లు వివరించారు. సువిధ వెబ్ సర్వీస్ ద్వారా ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. అనంతరం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపును పటిష్టంగా చేపట్టనుండగా భారీ బందోబస్తును నిర్వహిస్తున్నామని, 400 మంది పోలీస్ సిబ్బంది కౌంటింగ్ కేంద్రం వద్ద బందోబస్తుగా ఉంటారని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రం ప్రాంగణాన్ని 6 సెక్టార్లుగా విభజించి మూడంచెల భద్రత కల్పించామని, కౌంటింగ్ కేంద్రంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ఫోన్లు, బ్లూటూత్స్, స్మార్ట్ చేతి గడియారాలు వంటి వస్తువులు అనుమతించబోమని సీపీ తెలిపారు. ఈ నెల 28వ తేదీ వరకు ఎలాంటి ఊరేగింపులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో షామియానాలు, మైకులు, వాహనాలను అనుమతించేది లేదని, కౌంటింగ్ కేంద్రంలో ప్రవేశించే వారు తప్పనిసరిగా గుర్తింపు కార్డు కలిగి ఉండాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను తప్పనిసరిగా పాటించి ప్రతిఒక్కరూ సహకరించాలని సీపీ కోరారు. -
ఈవీఎంలు జాగ్రత్త!
న్యూఢిల్లీ: రాజస్తాన్, తెలంగాణల్లో హోరాహోరీ పోరు ఉంటుందన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఈ రెండు రాష్ట్రాల పార్టీ నేతలు ఈవీఎంల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ‘మధ్యప్రదేశ్‌లో ఈవీఎంలు వింతగా ప్రవర్తిస్తున్నాయి. కొన్ని ఈవీఎంలు స్కూల్ బస్సును ఎత్తుకెళ్తే మరికొన్ని రెండు రోజులపాటు కనిపించకుండాపోయాయి. ఇంకాకొన్ని ఓ హోటల్లో తాగుతూ కనిపించాయి. మోదీ హయాంలో ఈవీఎంలకు అతీంద్రియ శక్తులుంటాయి’అంటూ వ్యంగ్యంగా ట్విట్టర్లో పేర్కొన్నారు. నవంబర్ 28వ తేదీన మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయిన 48 గంటల తర్వాత ఈవీఎంలు స్ట్రాంగ్‌రూంకు చేరాయన్న వార్తలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. అయితే, ఆ ఈవీఎంలు అదనంగా ఉంచినవే తప్ప పోలింగ్‌కు వాడినవి కాదని ఈసీ పేర్కొంది. స్ట్రాంగ్ రూంలలోని ఈవీఎంలకు తాము కల్పించిన మూడంచెల భద్రతపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసిందని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేశ్ సిన్హా తెలిపారు. -
ఛత్తీస్‌గఢ్‌లో రాహుల్ 50 కి.మీ. రోడ్ షో
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం దుర్గ్ పట్టణం నుంచి రాజధాని రాయ్‌పూర్ వరకు మెగా రోడ్ షో నిర్వహించారు. సుమారు 50 కి.మీ పాటు జరిగిన ఈ యాత్రలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ రహదారి–6 వెంట కదిలిన రాహుల్ కాన్వాయ్‌లో సుమారు 50 కార్లు, ఎస్‌యూవీలున్నాయి. రాయ్‌పూర్ సమీపంలోని తాటిబండ్లో రాహుల్ బస్సు దిగి కార్యకర్తలతో ముచ్చటించారు. యాత్ర గీతానగర్‌కు చేరుకున్న తరువాత రాహుల్..ఇటీవలే మృతిచెందిన ప్రముఖ పాత్రికేయుడు గోవింద్లాల్ వోరా కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాత్రి 8 గంటలకు రాయ్‌పూర్ విమానాశ్రయంలో రోడ్ షో ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు యాత్ర జరిగిన మార్గం వెంట బందోబస్తును పటిష్టం చేశారు. రాజ్‌భవన్ ముట్టడికి వెళుతున్న ఖర్గే, ఆజాద్ -
రేపే తీర్పు... మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ అత్యాచార ఆరోపణల కేసులో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు బుధవారం తీర్పు వెల్లడించనుంది. దీంతో జోధ్‌పూర్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆశారాం అనుచరులు విధ్వంసక చర్యలకు దిగుతారేమోనన్న అనుమానంతో ఈ నెల 30వ తారీకు వరకు 144 సెక్షన్‌ను అమలు చేశారు. 2013 సంవత్సరం నుంచి జైలు ఊచలు లెక్కిస్తున్న ఆశారాం బాపూపై మూడు అత్యాచార కేసులు నమోదై ఉన్నాయి. 2013 సంవత్సరం ఆగస్టులో పదహారేళ్ల అమ్మాయి జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో ఆశారామ్ తనపై లైంగిక దాడి చేశారంటూ ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ అమ్మాయికి పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానని మభ్యపెట్టిన ఆశారాం ఆమెపై అత్యాచారం జరిపినట్టు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైనప్పటికీ ఆశారాం బాపూ పోలీసుల ఎదుట హాజరు కాలేదు. అందరి కళ్లు గప్పి ఇండోర్‌లోని తన ఆశ్రమంలో దాక్కున్నాడు. నాన్‌బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసినప్పటికీ అతను బయటకి రాలేదు. అతనిని అరెస్ట్ చేయడం కూడా ఒక ప్రహసనంగానే మారింది. ఈ సందర్భంగా పోలీసులకు, ఆశారాం అనుచరులకు మధ్య తీవ్రమైన ఘర్షణలు కూడా జరిగాయి. చివరికి 2013 సెప్టెంబర్ 1న ఆశారాంను రాజస్థాన్ జోధ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసులో సాక్షులపైన ఆశారాం బాపూ ప్రైవేట్‌సైన్యం బెదిరింపులు, దాడులకు దిగింది. తన కండబలం ప్రదర్శించింది. ఆశారాంకు బెయిల్ ఇవ్వకపోతే చంపేస్తామంటూ కేసును విచారించిన న్యాయమూర్తిని కూడా బెదిరించారు. దీంతో సుప్రీంలో కూడా అతనికి బెయిల్ లభించలేదు. ఈ కేసులో ఆశారాంపై ఆరోపణలు రుజువైతే ఆయనకు గరిష్టంగా పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మరో రెండు అత్యాచార కేసులు ఆశారాం బాపూని అరెస్ట్ చేసి రెండు నెలలు తిరక్కుండానే సూరత్‌కు చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లు ఆశారాంతో పాటు ఆయన కుమారుడు నారాయణ సాయి కూడా అమ్మాయిల్ని లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. అహ్మదాబాద్ సమీపంలోని ఆశ్రమంలో 2001, 2006 సంవత్సరం మధ్య ఆశారాం తనపై చాలాసార్లు లైంగికంగా దాడులకు దిగాడని అక్క ఆరోపణలు చేస్తే, సూరత్ ఆశ్రమంలో నారాయణ సాయి తనను అత్యాచారం చేశాడంటూ చెల్లి కోర్టుకెక్కింది. దీంతో పోలీసులు నారాయణ సాయిని కూడా అదుపులోనికి తీసుకున్నారు. ఆశారాం ఎలా ఎదిగాడు ? 1941 సంవత్సరంలో ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న సిం«ద్ ప్రాంతంలో పుట్టిన ఆశారాం 15 ఏళ్ల వయసులోనే ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. కేవలం మూడో తరగతి మాత్రమే చదువుకున్న అతను ఆధ్యాత్మిక మార్గం పట్టాడు. గురు లీలాషాజీ మహరాజ్ దగ్గర శిష్యరికం చేశాడు. 1972 సంవత్సరంలో గుజరాత్‌లోని మొటెరా దగ్గర సబర్మతి తీరంలో చిన్న కుటీరాన్ని ఏర్పాడు చేశాడు. తనని తాను దేవుడిగా ప్రకటించుకుని ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఏడాదిలోనే ఆ కుటీరం కాస్త ఆశ్రమంగా మారిపోయింది. ఆధ్యాత్మిక గురువుగా దేశవిదేశాల్లో ప్రఖ్యాతి వహించాడు. ప్రస్తుతం ఆయనకి దేశవిదేశాల్లో 400 ఆశ్రమాలు 2 కోట్ల మంది శిష్యపరివారం ఉంది. పార్టీలకతీతంగా ఎందరో రాజకీయ వేత్తలు ఆయనకు పరమ వీర భక్తులు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నో ప్రభుత్వాలు ఆయన ఆశ్రమాలకు అయాచితంగా భూ కేటాయింపులు చేశాయి. ఆశారాం ఆస్తులు చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. ఏకంగా 10 వేల కోట్ల విలువైన ఆస్తుల్ని కూడబెట్టాడు. అతని ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగడుగునా వివాదాలే చోటు చోసుకున్నాయి. భూకబ్జా ఆరోపణలు, ఆశ్రమంలో అనుమానాస్పద మృతులు వంటివి ఎప్పట్నంచో ఉన్నాయి. అత్యాచార ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన ఆశ్రమం ఎన్ని అరాచకాలకు నెలవుగా మారిందో ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చాయి. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నేడు ‘భారత్ బంద్’
న్యూఢిల్లీ: విద్య, ఉద్యోగ రంగాల్లో కుల ఆధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని సంస్థలు మంగళవారం ‘భారత్ బంద్’ను నిర్వహించనున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్రాలను హోంశాఖ ఆదేశించింది. ఎక్కడైనా శాంతిభద్రతలకు భంగం వాటిల్లితే ఆ ప్రాంతానికి చెందిన కలెక్టర్, ఎస్పీలు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎస్సీ,ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ ఇటీవల దళిత సంఘాలు నిర్వహించిన భారత్ బంద్ హింసాత్మకంగా మారి 12 మంది మరణించడం తెల్సిందే. సోషల్‌మీడియాల్లో కొన్ని సంస్థలు కుల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చాయని హోంశాఖ ఉన్నతాధికారి చెప్పారు. -
ఉలిక్కి పడ్డ బుద్ధ గయ
పట్న : భారీ ఉగ్ర కుట్రను బిహార్ పోలీసులు భగ్నం చేశారు. అప్రమత్తమై బోధ్(బుద్ధ) గయలో మరో మారణ హోమం జరగకుండా నిలువరించగలిగారు. దలైలామ పర్యటన, రిపబ్లిక్ డే నేపథ్యంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు శుక్రవారం సాయంత్రం రెండు క్రూడ్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి.. తనిఖీలను విస్తృతం చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... బౌద్ధ గురువు దలైలామా ప్రస్తుతం భోద్ గయలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తనిఖీలు కొనసాగుతుండగా.. శుక్రవారం సాయంత్రం వంట గదిలో ఓ స్వల్ఫ పేలుడు సంభవించింది. తొలుత గ్యాస్ లీకేజీ అని భావించిన పోలీసులు.. తర్వాత ఫ్లాస్క్‌లో బాంబు అమర్చి పేలుడుకు పాల్పడినట్లు నిర్ధారించారు. వెంటనే బాంబ్ స్వ్కాడ్ రంగంలోకి దిగి ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో కాలచక్ర మైదానంలో రెండు శక్తివంతమైన బాంబులను స్వాధీనం చేసుకున్నారు. దలైలామా శుక్రవారం తన కార్యక్రమాలను ముగించుకుని వెళ్లిన కాసేపటికే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాగా, 2013 బుద్ధ గయలో వరుస పేలుళ్లు(9 చోట్ల) దేశం మొత్తాన్ని దిగ్ర్భాంతికి గురి చేశాయి. అయితే అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం మాత్రం సంభవించలేదు. ఈ ఘటన తర్వాత సీఆర్పీఎఫ్ సిబ్బందిని ఆలయ ప్రాంగణంలో మోహరించేందుకు కేంద్ర హోం శాఖ ప్రయత్నాలు చేసినా.. అవి సఫలం కాలేదు. దీంతో ఆలయ సిబ్బంది ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకుంది. ఇది కూడా చదవండి... బుద్ధ గయపై నెత్తుటిచారిక -
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
కోచి: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నెల 25న ముంబై నుంచి వచ్చే ఒక విమానాన్ని పేల్చేయడం లేదా వీలైతే ఆత్మాహుతి దాడి చేస్తారని కోచి విమానాశ్రయ అధికారులకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు విమానాశ్రయం డైరెక్టర్ ఏకేసీ నాయర్ చెప్పారు. శనివారం ముంబై నుంచి కోచి వచ్చే విమానం లేదా శుక్రవారం రాత్రి అహ్మదాబాద్-ముంబై సెక్టార్ విమానంపై దాడి చేయనున్నట్టు హెచ్చరికలు వచ్చాయి. గురువారం రాత్రి ఓ ఆగంతకుడు కోల్‌కతా విమానాశ్రయ అధికారికి ఫోన్ చేసి ఈ మేరకు బెదిరించాడు. ఆయన వెంటనే కోచి విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. సీఐఎస్ఎఫ్ డీఐజీ ఆనంద్ మోహన్ చెన్నై నుంచి కోచి చేరుకుని అత్యున్నత స్థాయి భద్రత సమావేశం నిర్వహించారు. కోచి విమానాశ్రయంలో భద్రత బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు.