
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం దుర్గ్ పట్టణం నుంచి రాజధాని రాయ్‌పూర్ వరకు మెగా రోడ్ షో నిర్వహించారు. సుమారు 50 కి.మీ పాటు జరిగిన ఈ యాత్రలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ రహదారి–6 వెంట కదిలిన రాహుల్ కాన్వాయ్‌లో సుమారు 50 కార్లు, ఎస్‌యూవీలున్నాయి. రాయ్‌పూర్ సమీపంలోని తాటిబండ్‌లో రాహుల్ బస్సు దిగి కార్యకర్తలతో ముచ్చటించారు. యాత్ర గీతానగర్‌కు చేరుకున్న తరువాత రాహుల్..ఇటీవలే మృతిచెందిన ప్రముఖ పాత్రికేయుడు గోవింద్‌లాల్ వోరా కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాత్రి 8 గంటలకు రాయ్‌పూర్ విమానాశ్రయంలో రోడ్ షో ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు యాత్ర జరిగిన మార్గం వెంట బందోబస్తును పటిష్టం చేశారు.
రాజ్‌భవన్ ముట్టడికి వెళుతున్న ఖర్గే, ఆజాద్