స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షో.. తెలంగాణలో టెన్షన్‌కు క్రియేట్ చేసింది. మునవార్ షోను అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, మునావర్ షో విషయంలో అలర్ట్ అయిన పోలీసులు.. షోను గంట ముందే ప్రారంభించేలా ప్లాన్ చేశారు. దీంతో, శిల్పకళా వేదికలో మునావర్ షో సాయంత్రం 5 గంటలకే ప్రారంభమైంది.
శిల్పకళా వేదికలో మునావర్ షో ముగిసింది. దాదాపు గంటన్నరపాటు షో కొనసాగింది. ఇక, బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు విడతలవారీగా శిల్పకళా వేదిక వద్దకు తరలివస్తుండటంతో అక్కడ టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. దీంతో అక్కడ బందోబస్తు పోలీసులకు సవాల్‌గా మారింది. ఇప్పటి వరకు దాదాపు 50 మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు తెలిపారు.
ఇదిలా ఉండగా.. మునావర్ ఫరూఖీ కామెడీ షో కోసం.. దాదాపు 2083 మంది శిల్పకళావేదికలో టికెట్ బుక్ చేసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు అక్కడికి వస్తున్న నేపథ్యంలో దాదాపు 200 మంది పోలీసులు మఫ్టీలో గస్తీ కాస్తున్నారు. మునావర్ కామెడీ షోపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి స్పందించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ వల్లే మునావర్ షో చేస్తున్నారు. మా కార్యకర్తలను కొట్టి అరెస్ట్ చేశారు. పోలీసు స్టేషన్‌లో మా సైన్యాన్ని బంధించారు అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment